Amritsar Hooch Tragedy: పెను విషాదం.. 14 మంది మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం
ABN , Publish Date - May 13 , 2025 | 02:05 PM
Amritsar Hooch Tragedy: మద్యం తాగిన కొద్దిసేపటికే వారంతా అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని దగ్గరలోని అమృత్‌సర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 14 మంది చనిపోయారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి 14 మంది చనిపోయారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సోమవారం అమృత్‌సర్ మజితా బ్లాక్‌లోని భంగాలి కలన్, తారీవాల్, సంఘ, మరారి కలన్ గ్రామాలకు చెందిన కొంతమంది ప్రజలు మద్యం తాగిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యారు. వారిని దగ్గరలోని అమృత్‌సర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 14 మంది చనిపోయారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
సమాచారం అందుకున్న అమృత్‌సర్ డిప్యూటీ కమిషనర్ సాక్షి శాన్వే ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ మజితా బ్లాక్‌లో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నిన్న రాత్రి మాకు సమాచారం వచ్చింది. నిన్న మద్యం తాగి 5 గ్రామాలకు చెందిన ప్రజలు అస్వస్థతకు గురైనట్లు మాకు సమాచారం అందింది. వెంటనే మేము మెడికల్ టీమ్స్‌ను గ్రామాలకు పంపాము. మెడికల్ టీమ్స్ బాధిత గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఆరోగ్యం గురించి విచారిస్తున్నాయి.
అనారోగ్య లక్షణాలు ఉన్నా లేకపోయినా.. మద్యం తాగిన వారిని ఆస్పత్రికి తీసుకెళుతున్నాము. అలా చేయటం వల్ల వారి ప్రాణాలను కాపాడవచ్చని భావిస్తున్నాము. ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందిస్తోంది. మరణాల సంఖ్య ఇక పెరగకూడదని దేవుడ్ని ప్రార్థిస్తున్నాము’ అని అన్నారు. ఇక, పరిస్థతి విషమంగా ఉన్న ఆరుగురిని రక్షించడానికి డాక్టర్లు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. మద్యం తాగి 14 మంది చనిపోయిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
Bangladesh Islamist Terrorists: హిందువులకు బంగ్లాదేశ్ ఇస్లామిస్ట్ ఉగ్రవాదుల బెదిరింపులు
Viral Video: యువతిపై బీరు ప్రాంక్.. యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..