Bangladesh Islamist Terrorists: హిందువులకు బంగ్లాదేశ్ ఇస్లామిస్ట్ ఉగ్రవాదుల బెదిరింపులు
ABN , Publish Date - May 13 , 2025 | 01:36 PM
Bangladesh Islamist Terrorists: బంగ్లాదేశ్‌కు చెందిన ఓ ఇస్లామిస్ట్ ఉగ్రవాది హిందువులపై నీఛమైన కామెంట్లు చేశాడు. మూత్రం, పేడ, తాబేళ్లు హిందువులకు ఇష్టమైన ఆహారం అంటూ అవమానకరంగా మాట్లాడాడు. చాలా దారుణంగా హిందువులపై కామెంట్లు చేశాడు.
బంగ్లాదేశ్‌కు చెందిన ఇస్లామిస్ట్ ఉగ్రవాదులు హిందువులపై బెదిరింపులకు దిగుతున్నారు. ద్వేషపూరితమైన కామెంట్లు చేస్తున్నారు. తాజాగా, బంగ్లాదేశ్‌కు చెందిన ఓ ఇస్లామిస్ట్ ఉగ్రవాది హిందువులపై నీఛమైన కామెంట్లు చేశాడు. మూత్రం, పేడ, తాబేళ్లు హిందువులకు ఇష్టమైన ఆహారం అంటూ అవమానకరంగా మాట్లాడాడు. ఆ ఉగ్రవాది తన ప్రసంగంలో.. ‘ హిందువులు శారీరకంగా చాలా బలహీనమైన వాళ్లు. వారికి వారి మతం పట్ల ఎంతటి నమ్మకం ఉందో నాకు తెలుసు. ఈ విషయాలన్నీ మీకు తెలియకపోతే.. మీరు ముస్లిం కమాండర్ కాలేరు.
అర్థమైందా.. బంగ్లాదేశ్ ప్రభుత్వం నాకు పర్మిషన్ ఇస్తే.. సూసైడ్ బాంబర్స్‌ను కోల్‌కతా పంపిస్తాను. కోల్‌కతాను స్వాధీనం చేసుకుంటాం. తాలిబన్లు అమెరికా, రష్యాలను ఓడించడానికి చాలా ఏళ్ల నుంచి పోరాడుతూనే ఉన్నారు. తాలిబన్లు తమ శరీరాలకు బాంబులను చుట్టుకుని.. బైకులపై ఆర్మీ క్యాంపులపైకి వెళ్లారు. వారి శరీరాలకు ఉన్న బాంబులు పేలినపుడు 300 మంది దాకా అమెరికన్లు చనిపోయారు’ అని అన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
Viral Video: యువతిపై బీరు ప్రాంక్.. యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..
Terrorists Trapped: జుమ్మూలో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదుల హతం