Amit Shah: జోహో మెయిల్‌కు మారిన అమిత్‌షా.. ఐడీ ఇదే
ABN , Publish Date - Oct 08 , 2025 | 09:14 PM
హోమ్‌గ్రోన్ సాఫ్ట్‌వేర్ ఫ్లాట్‌ఫామ్ 'జోహో'లో అమిత్‌షా చేరడంపై జోహో సహ వ్యవస్థాపడు శ్రీధర్ వెంబు వెంటనే స్పందించారు. అమిత్‌షాకు కృతజ్ఞతలు తెలిపారు. ఇరవై ఏళ్లుగా జోహో కోసం కఠోర శ్రమ చేసిన ఇంజనీర్లగా ఈ క్షణాలను అంకితం చేస్తున్నానని అన్నారు.
న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah) బుధవారం నాడు 'జోహో' (Zoho) మెయిల్‌లోకి మారిపోయారు. ఇటీవల కాలంలో అమెరికా టారిఫ్ ఒత్తిళ్ల నేపథ్యంలో 'స్వదేశీ' నినాదం ఊపందుకోవడంతో పలువురు కేంద్ర మంత్రులు సైతం జోహో సేవలను వినియోగించుకుంటున్నారు. తాజాగా తాను జోహో మెయిల్‌కు మారినట్టు అమిత్‌షా సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.
'హలో.. నేను జోహో మెయిల్‌కు మారాను. నా మెయిల్ అడ్రస్‌లో మార్పును గమనించండి. amitshah.bjp@ http://zohomail.in. నా కొత్త మెయిల్ అడ్రస్. ఇక నుంచి మెయిల్స్ అనీ ఈ కొత్త అడ్రెస్‌కే పంపాలి' అని అమిత్‌షా తన పోస్టులో తెలిపారు. అమిత్‌షా తన పోస్ట్ చివర్లో ట్రంప్ తరహాలో స్వైప్ చేస్తూ కనిపించడం ఆసక్తికరం.
హోమ్‌గ్రోన్ సాఫ్ట్‌వేర్ ఫ్లాట్‌ఫామ్ 'జోహో'లో అమిత్‌షా చేరడంపై జోహో సహ వ్యవస్థాపడు శ్రీధర్ వెంబు (Sridhar Vembu) వెంటనే స్పందించారు. అమిత్‌షాకు కృతజ్ఞతలు తెలిపారు. ఇరవై ఏళ్లుగా జోహో కోసం కఠోర శ్రమ చేసిన ఇంజనీర్లగా ఈ క్షణాలను అంకితం చేస్తున్నానని అన్నారు. కాగా, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గత నెలలో జోహోకు మారుతున్నట్టు ప్రకటించారు. జోహో రూపొందించిన మెసేజింగ్ యాప్‌ను వాడాలని పిలుపునిచ్చారు. నిజానికి, జోహో మెయిల్, దాని అధికారిక టూల్స్ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే అనుసంధానిస్తున్నారు. అధికారిక పనుల కోసం మైక్రోసాఫ్ట్ ఆఫీస్, గూగుల్ వర్క్‌స్పేస్‌కు బదులుగా జోహో ఫ్లాట్‌ఫామ్స్‌ను వాడాలని అధికారుల విద్యాశాఖ ఆదేశాలు కూడా ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
26/11 తర్వాత పాక్‌పై ఎందుకు దాడి చేయలేదో కాంగ్రెస్ చెప్పాలి: మోదీ
నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీ
Read Latest Telangana News and National News