Share News

BMC Elections: ఈ మహోన్నత శిఖరం ఎవరికి దక్కేది?

ABN , Publish Date - Jun 29 , 2025 | 09:34 PM

భారతదేశంలోని అత్యంత ధనిక మున్సిపాల్ కార్పొరేషన్‌ను దక్కించుకోడానికి రంగం సిద్ధమవుతోంది. గెలుపు దిశగా ఎన్నికల కూటమిని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కొనసాగుతున్న సమావేశాలు పురుటినొప్పులు పడుతున్నాయ్.

BMC Elections: ఈ మహోన్నత శిఖరం ఎవరికి దక్కేది?
BMC Elections

ముంబై: రాబోయే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC Bruhan Mumbai Muncipal Corporation) ఎన్నికలకు మహారాష్ట్రలోని ఆయా పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. తమతో కలిసివచ్చే భావజాలమున్న పార్టీలతో పొత్తులకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇందులో భాగంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS), శివసేన (UBT Uddhav Balasaheb Thackeray) ఇప్పటికే ప్రాథమిక చర్చలు ప్రారంభించాయి.

BMC-Elections-7.jpgరెండు పార్టీల నాయకుల మధ్య ఇప్పటికే పలు రౌండ్ల సమావేశాలు జరిగాయి. శివసేన (UBT) ఎమ్మెల్యే వరుణ్ సర్దేశాయ్, సీనియర్ MNS నాయకుడు బాలా నందగావ్కర్ మధ్య ఎన్నికల్లో పోటీ చేయాడానికి సంబంధించి ఇంతవరకూ మూడు సమావేశాలు జరిగాయి. MNS ముంబై అధ్యక్షుడు సందీప్ దేశ్‌పాండే, వరుణ్ సర్దేశాయ్(UBT) గత నెలలో నాలుగు సార్లు సమావేశమయ్యారు.

BMC-Elections-2.jpgభారతదేశంలోని అత్యంత ధనిక మున్సిపాల్ కార్పొరేషన్‌ను దక్కించుకోడానికి ఎన్నికల కూటమిని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కొనసాగుతున్న ఈ సమావేశాలు బ్యాక్‌చానెల్ చర్చలలో భాగం. ప్రాదేశిక విభేదాలు, సీట్ల పంపకాల అడ్డంకులను తొలగించుకుని ముందుకు సాగడానికి ఇరుపార్టీలు ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి.

BMC-Elections.jpgముంబైలోని కీలకమైన నియోజకవర్గాలైన దాదర్, వర్లి, పరేల్, కలచౌకి, గిర్గావ్, భాండుప్, ఇంకా ములుండ్‌లలో రెండు పార్టీలు బాగా ప్రభావం చూపగల స్థానాలు కావడంతో సీట్ల పంపకాల చర్చల్లో ఇరు పార్టీలు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బలమైన ప్రాంతాలలో ఏ పార్టీ త్యాగం చేస్తుందనే విషయం ఇరుపార్టీలకు పెద్ద సవాలుగా పరిణమించింది.


2017 BMC ఎన్నికల ఫలితాలు ఆధారంగా సీట్ల విభజనకు శివసేన (UBT) పట్టుబడుతోంది. MNS అప్పటి ఎన్నికల్లో ఏడు సీట్లకు పరిమితమైతే, ఆ ఎన్నికల్లో శివసేన 84 సీట్లు గెలుచుకుంది. దీంతో మిగిలిన సీట్లుకు మాత్రమే చర్చలు జరపాలని శివసేన భావిస్తోంది.

BMC-Elections-5.jpgఅయితే, దీనిపై MNS సుముఖంగా లేదు. 2017 ఎన్నికల ఫలితాల పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరని.. అవి ప్రస్తుత రాజకీయ వాస్తవికతను ప్రతిబింబించడం లేదని MNS వాదిస్తోంది. ముఖ్యంగా శివసేన విభజన తర్వాత దాదాపు 50 మంది కార్పొరేటర్లు ఉద్ధవ్ థాకరే వర్గాన్ని విడిచిపెట్టడంతో ఆపార్టీ ఆ మేరకు బలహీన పడిందన్నది MNS వాదన. అందువల్ల, చర్చలను మిగిలిపోయిన నియోజకవర్గాలకు పరిమితం చేయకుండా, పూర్తి 227 సీట్ల స్పెక్ట్రంపై జరగాలని MNS ఒత్తిడి తెస్తోంది.

BMC-Elections-3.jpgఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఫలితం ఏంటన్నదానిపై రెండు పార్టీలు బహిరంగంగా నోరు విప్పడంలేదు. ఒక వేళ ఈ ఇరుపార్టీల సంభావ్య కూటమి ఖరారైతే, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పొలిటికల్ సీన్ తప్పకుండా మారుతుందని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

BMC-Elections-1.jpg


ఇవి కూడా చదవండి..

రెక్కలు మీవి, ఎగరడానికి పర్మిషన్ అడక్కండి.. ఖర్గే వ్యాఖ్యలపై శశిథరూర్

సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు

For National News And Telugu News

Updated Date - Jun 29 , 2025 | 09:51 PM