Share News

Dowry Horror Archana Survives: ఇంటి పైకప్పు ఎక్కిన భార్య.. కిందకు దూకమంటూ భర్త సవాల్..

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:20 PM

ఆమె అతడి నుంచి తప్పించుకుని ఇంటి పైకప్పు మీదకు ఎక్కింది. వేధింపులు ఆపకపోతే దూకేస్తానని బెదిరించింది. ఆ భర్త ఆమె బెదిరింపులకు భయపడలేదు.

Dowry Horror Archana Survives: ఇంటి పైకప్పు ఎక్కిన భార్య.. కిందకు దూకమంటూ భర్త సవాల్..
Dowry Horror Archana Survives

21వ శతాబ్దంలోనూ ఆడవాళ్లపై అరాచకాలు ఆగటం లేదు. కొందరు భర్తలు అదనపు కట్నం కోసం భార్యలను హింసిస్తున్నారు. ప్రాణాలు కూడా తీస్తున్నారు. తాజాగా, ఓ మహిళ భర్త వేధింపులు తట్టుకోలేక ఇంటి మీద నుంచి కిందకు దూకేసింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆలీఘర్‌లోని డకౌలీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అదనపు కట్నం కోసం తన భార్యను నిత్యం వేధింపులకు గురిచేస్తూ ఉన్నాడు. రోజు రోజుకు అతడి వేధింపులు పెరుగుతూ పోయాయి. కొద్దిరోజుల క్రితం ఆ మహిళపై భర్త దాడి చేశాడు.


ఆమె అతడి నుంచి తప్పించుకుని రెండో అంతస్తులోని ఇంటి పైకప్పు మీదకు ఎక్కింది. వేధింపులు ఆపకపోతే దూకేస్తానని బెదిరించింది. ఆ భర్త ఆమె బెదిరింపులకు భయపడలేదు. దమ్ముంటే దూకమంటూ సవాల్ విసిరాడు. ఆమెను బాగా రెచ్చగొట్టాడు. దీంతో ఆ మహిళ పైకప్పు మీద నుంచి కిందకు దూకేసింది. తీవ్రంగా గాయపడింది. శరీరంలో పలుచోట్ల ఎముకలు విరిగాయి. నొప్పితో ఆమె గిలగిల్లాడసాగింది. అయితే, తీవ్రంగా గాయపడ్డ భార్యపై జాలిపడాల్సింది పోయి ఆ భర్త రెచ్చిపోయాడు. నేలపై పడ్డ ఆమెపై దాడి చేశాడు. పొరిగింటి వారు అక్కడికి చేరుకుని అతడి‌ని ఆపారు. గాయపడ్డ మహిళను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.


ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆస్పత్రికి వెళ్లారు. బాధితురాలి నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియాలో సంఘటనకు సంబంధించి ఓ వీడియో వైరల్ అయింది. దర్యాప్తులో భాగంగా ఆ వీడియోను కూడా పరిశీలించనున్నారు. బాధితురాలి భర్తను, ఇతర కుటుంబసభ్యుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీడియో ఆధారం ఉండటంతో భర్తకు కఠిన జైలు శిక్షపడే అవకాశం కనిపిస్తోంది.


ఇవి కూడా చదవండి

టీడీపీ కార్యకర్తలపై వేట కొడవళ్లతో దాడి చేసిన వైసీపీ సైకోలు..

బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

Updated Date - Sep 04 , 2025 | 01:20 PM