TDP Workers Attacked: టీడీపీ కార్యకర్తలపై వేట కొడవళ్లతో దాడి చేసిన వైసీపీ సైకోలు..
ABN , Publish Date - Sep 04 , 2025 | 11:13 AM
సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డిల ఫొటోలను స్టేటస్‌గా పెట్టుకున్నారు టీడీపీ కార్యకర్తలు. దీన్ని వైసీపీ మూకలు సహించలేకపోయాయి.
కర్నూలు: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆదోని ప్రాంతానికి కొందరు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో తమ అభిమాన నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డిల ఫొటోలను స్టేటస్‌గా పెట్టుకున్నారు.
వైసీపీ సైకోలు దీన్ని సహించలేకపోయారు. స్టేటస్ పెట్టుకున్న టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఏకంగా వేట కొడవళ్లతో ఇష్టారీతిగా దాడి చేశారు. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్తలు వెంకన్న, నర్సిరెడ్డి, నాగిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆదోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రెండు రోజుల క్రితం కదిరిలోనూ..
వైసీపీ మూకలు తరచుగా టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం శ్రీ సత్యసాయి జిల్లాలోనూ రెచ్చిపోయారు. టీడీపీకి చెందిన ఐదుగురిపై కత్తులు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. గాయపడ్డ వారిని స్థానికులు దగ్గరిలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
టేకాఫ్ అవుతుండగా ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొట్టిన పక్షి
యువతికి వింత అనుభవం.. సీటు పక్కన కూర్చున్న వ్యక్తి..