Share News

Air India Plane Crash: విమానం కుడివైపు ఇంజన్‌కు మార్చిలో మరమ్మతు చేశారు

ABN , Publish Date - Jun 14 , 2025 | 08:43 PM

ఇంజన్ మాన్యుఫ్యాక్చరర్స్ ప్రోటాకాల్ ప్రకారం ఏప్రిల్ 2025లో ఎడమవైపు ఇంజన్‌ను కూడా తనిఖీ చేశారని, ఇంజన్‌లో కానీ, విమానంలో కానీ ఎలాంటి సమస్యలు లేవని అధికారులు చెప్పారు.

Air India Plane Crash: విమానం కుడివైపు ఇంజన్‌కు మార్చిలో మరమ్మతు చేశారు

అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లో జూన్ 12న ఘోర విమాన ప్రమాదానికి దారితీసిన కారణాలపై ప్రస్తుతం విశ్లేషణ జరుగుతోంది. బ్లాక్ బాక్స్ ఆధారంగా సమాచారాన్ని వెలికితీసే ప్రయత్నం జరుగుతోంది. డ్రీమ్‌లైనర్ విమానాల్లో భద్రతా తనిఖీలు కూడా మొదలయ్యాయి. కాగా, ప్రమాదానికి గురైన విమానంలోని కుడి వైపు ఇంజన్‌కు గత మార్చిలోనే మరమ్మతు చేసి తిరిగి అమర్చినట్టు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.


ఇంజన్ మాన్యుఫ్యాక్చరర్స్ ప్రోటాకాల్ ప్రకారం ఏప్రిల్ 2025లో ఎడమవైపు ఇంజన్‌ను కూడా తనిఖీ చేశారని, ఇంజన్‌లో కానీ, విమానంలో కానీ ఎలాంటి సమస్యలు లేవని అధికారులు చెప్పారు. 2023 జూన్‌లో సమగ్ర మెయింటెనెన్స్ తనిఖీలు జరిగాయని, తదుపరి తనిఖీలు ఈ ఏడాది డిసెంబర్‌లో జరగాల్సి ఉన్నాయని తెలిపారు.


తొమ్మిది విమానాల్లో తనిఖీలు పూర్తి

డ్రీమ్‌లైనర్ విమానాల్లో విస్తృత భద్రతా తనిఖీలు చేపట్టాలని పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు వన్‌టైమ్ భద్రతా తనిఖీల కింద 9 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్లలో భద్రతా తనిఖీలు పూర్తి చేసినట్టు ఎయిరిండియా శనివారంనాడు తెలిపింది. తక్కిన 24 విమానాల్లోనూ త్వరలోనే భద్రతా తనిఖీలు పూర్తి చేస్తామని పేర్కొంది. బోయింగ్ 787 విమానాలు భారత్‌కు తిరిగి రాగానే తనిఖీలు చేస్తున్నామని, ఈ తనిఖీల్లో కొన్నింటికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నందున సుదీర్ఘ ప్రయాణ మార్గాల్లో నడిచే విమానాల రాకపోకల్లో జాప్యం జరగవచ్చని తెలిపింది.ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రయాణిలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది. ఎయిరిండియా వద్ద ప్రస్తుతం 33 బోయింగ్ 787-8/9 విమానాలు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

అధిక ఉష్ణోగ్రతల మధ్య డీఎన్‌ఏ గుర్తింపు ఆలస్యం.. బాధిత కుటుంబాల ఆందోళన..

నో పవర్.. నో థ్రస్ట్.. గోయింగ్ డౌన్.. ప్రమాదానికి ముందు పైలెట్ చివరి మాటలు ఇవే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 14 , 2025 | 08:44 PM