Air India Boeing : ఇంధన స్విచ్‌ల్లో ఎలాంటి సమస్యలు లేవు
ABN , Publish Date - Jul 23 , 2025 | 03:05 AM
బోయింగ్ 787, 737 విమానాల ఇంధన నియంత్రణ స్విచ్ ఎఫ్‌సీఎస్ లాకింగ్ వ్యవస్థల్లో ఎటువంటి ..
బోయింగ్ విమానాల తనిఖీ పూర్తి: ఎయిరిండియా
న్యూఢిల్లీ, జూలై 22: బోయింగ్ 787, 737 విమానాల ఇంధన నియంత్రణ స్విచ్ (ఎఫ్‌సీఎస్) లాకింగ్ వ్యవస్థల్లో ఎటువంటి సమస్యలు లేవని ఎయిరిండియా తెలిపింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తమ వద్ద ఉన్న అన్ని బోయింగ్‌ల్లో ఈ నెల 12న చేపట్టిన తనిఖీలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్దేశించిన గడువులోపు పూర్తి చేసినట్లు పేర్కొంది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానంలోని రెండు ఇంధన స్విచ్‌లు ‘రన్’ నుంచి ‘కటాఫ్’ మోడ్‌కు మారడంతో ఇంధన సరఫరా నిలిచిపోయి, ప్రమాదానికి కారణమైనట్లు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ఇటీవల విడుదల చేసిన ప్రాథమిక నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో బోయింగ్‌లతో పాటు దేశవ్యాప్తంగా నడుస్తున్న అన్ని విమానాల ఇంధన స్విచ్ వ్యవస్థలను తనిఖీ చేయాలని, అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలని ఈ నెల ప్రారంభంలో విమానయాన సంస్థలను డీజీసీఏ ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి