Indian Air Force: హెచ్‌ఏఎల్ మీద నమ్మకం లేదు!
ABN , Publish Date - Feb 12 , 2025 | 04:21 AM
వాయుసేనకు యుద్ధవిమానాలను, హెలికాప్టర్లను అందించే ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ హెచ్‌ఏఎల్ రూపొందించిన హెచ్‌జేటీ-36 యాషాస్ విమానాన్ని ఇటీవల ఆయన తనిఖీ చేశారు.

ఆ సంస్థ మిషన్‌మోడ్‌తో పని చేయటం లేదు
11 తేజస్ ఎంకే1ఏలు సిద్ధం చేస్తామన్నారు
ఒక్కటీ కాలేదు.. సాఫ్ట్‌వేర్ మార్పులతో సరిపోదు
పనితీరులో సమూల మార్పు రావాలి
వాయుసేన అధిపతి అమర్‌ప్రీత్‌సింగ్ వ్యాఖ్యలు
బెంగళూరు, ఫిబ్రవరి 11: ‘ప్రస్తుతానికైతే నాకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్)’ మీద నమ్మకం లేదు. సంస్థలో సందర్భానికి తగిన పనితీరు, వేగం (మిషన్ మోడ్) కనిపించటం లేదు’... ఈ మాటలు అన్నది ఎవరో సాధారణ వ్యక్తి కాదు.. ఏకంగా, వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్‌సింగ్ చేసిన వ్యాఖ్య ఇది. వాయుసేనకు యుద్ధవిమానాలను, హెలికాప్టర్లను అందించే ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ హెచ్‌ఏఎల్ రూపొందించిన హెచ్‌జేటీ-36 యాషాస్ విమానాన్ని ఇటీవల ఆయన తనిఖీ చేశారు. ఆ విమానం కాక్‌పిట్‌లో కూర్చున్నారు. ఆయనతోపాటు హెచ్‌ఏఎల్ చైర్మన్ డీకే సునిల్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా.. హెచ్‌ఏఎల్‌పై అమర్‌ప్రీత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘మా అవసరాలు ఏమిటో, మా ఆందోళనలు ఏమిటో మీకు తెలియజేస్తుంటాం.
ఆ ఆందోళనలను దూరం చేసి మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపే బాధ్యత మీదే. కానీ, ప్రస్తుతానికైతే నాకు హెచ్‌ఏఎల్ మీద నమ్మకం లేదు’ అని తెలిపారు. అమర్‌ప్రీత్ మాట్లాడుతున్న వీడియోను డిఫెన్స్‌న్యూస్ పోర్టల్ ‘నేషనల్ డిఫెన్స్’ తన యూట్యూబ్ చానల్‌లో పెట్టటంతో ఈ వివరాలు బయటకొచ్చాయి. ‘హెచ్‌ఏఎల్ మనందరి సంస్థ. అందరమూ ఇక్కడ పని చేసిన వాళ్లమే. నేను ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చినప్పుడు 11 తేజస్ ఎంకే1ఏ విమానాలు సిద్ధంగా ఉంటాయని హామీ ఇచ్చారు. కానీ ఒక్కటి కూడా సిద్ధం కాలేదు’ అని నిలదీశారు. హెచ్‌ఏఎల్ ఉన్నతాధికారులు స్పందిస్తూ.. ‘మీరు చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం’ అని తెలిపారు. అమర్‌ప్రీత్‌సింగ్ మళ్లీ మాట్లాడుతూ, తన మాటలు తప్పని నిరూపిస్తే తనకంటే సంతోషించే వాళ్లుండరని స్పష్టం చేశారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రభుత్వానికి రుణ మంజూరు పత్రాలు అందజేసిన హడ్కో ప్రతినిధులు
Also Read: కేటీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే..
Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం
Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి
Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు
Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు
For National News And Telugu News