Share News

Plane Crash: గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఎందుకు లండన్‌ వెళ్లాలనుకున్నారు

ABN , Publish Date - Jun 12 , 2025 | 06:14 PM

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అసలు ఎందుకు లండన్‌ వెళ్లాలనుకున్నారు అనేది అందరి మదిలోని ప్రశ్న. రూపానీ తన భార్య అంజలిబెన్ రూపానీని తిరిగి తీసుకురావడానికి బయల్దేరారు.

Plane Crash: గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఎందుకు లండన్‌ వెళ్లాలనుకున్నారు
Former Gujarat CM Vijay Rupani

ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అసలు ఎందుకు లండన్‌ వెళ్లాలనుకున్నారు అనేది అందరి మదిలోని ప్రశ్న. రూపానీ తన భార్య అంజలిబెన్ రూపానీని తిరిగి తీసుకురావడానికి లండన్‌కు వెళుతున్నారని ఆయన కుటుంబానికి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. రూపానీ భార్య ఆరు నెలలుగా అక్కడే ఉంటున్నట్లు తెలుస్తోంది. రూపానీ బిజినెస్ క్లాస్ విభాగంలో 2-Dలో కూర్చున్నట్లు విమాన రికార్డులు నిర్ధారించాయి.


లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న 242 మందిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన ప్రయాణీకుల జాబితాలో ఉండటం.. ప్రమాదం నేపథ్యంలో గుజరాత్ వాసుల్లో తీవ్ర ఉత్సుకత, ఆందోళనను రేకెత్తించింది. కాగా, విమాన ప్రమాదంలో పెద్దసంఖ్యలో ప్రయాణికులు మృతి చెందడంపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ విచారం వ్యక్తం చేశారు.

Vijay Rupani 1.jpg


ఈ ఘోర దుర్ఘటన నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం ఈరోజు సాయంత్రం తలపెట్టిన ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ కార్యక్రమాన్ని రేపు (శుక్రవారం) నిర్వహించాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, విమాన ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర సీనియర్ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తిపై సీఎం చంద్రబాబు ట్వీట్

మామా అన్నాడని దాడి.. కావాలిలో వైసీపీ నేత దాష్టీకం

Read latest AP News And Telugu News

Updated Date - Jun 12 , 2025 | 06:14 PM