Kabul-Delhi flight stowaway: విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో దాక్కుని భారత్ వచ్చిన అప్ఘాన్ బాలుడు
ABN , Publish Date - Sep 23 , 2025 | 07:18 PM
విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో దాక్కుని భారత్‌కు చేరుకున్న ఓ అప్ఘాన్ బాలుడిని అధికారులు తిరిగి మరో విమానంలో పంపించేశారు.
ఇంటర్నెట్ డెస్క్: విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో దాక్కుని భారత్‌కు చేరుకున్న ఓ అప్ఘాన్ బాలుడిని అధికారులు తిరిగి మరో విమానంలో వెనక్కు పంపించారు. ఆదివారం ఢిల్లీలో ఈ ఘటన జరిగింది.
కామ్ ఎయిర్ ప్లేన్‌లోని లాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో ఆ బాలుడు అప్ఘానిస్థాన్ నుంచి ఇక్కడకు వచ్చాడు. అతడిని కుందుజ్ ప్రాంతానికి చెందిన వాడిగా అధికారులు గుర్తించారు. టిక్కెట్, ఇతర అనుమతులేవీ లేకుండా అక్రమంగా భారత్‌కు వచ్చాడని అన్నారు (Afghan teen landing gear survival).
ఉదయం 11.10 గంటల సమయంలో విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండయ్యాక అధికారులు బాలుడిని గుర్తించారు. విమానానికి సమీపంలో తచ్చాడుతూ తిరుగుతున్న అతడు సిబ్బంది కంట పడ్డాడు. అతడిని చూడగానే ఒకింత ఆశ్చర్యపోయిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత కామ్ ఎయిర్ సిబ్బంది కూడా విమానంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో చిన్న ఆడియో స్పీకర్ కనిపించింది.
ప్రయాణ సమయంలో తాను ఈ కంపార్ట్‌మెంట్‌లోనే దాక్కున్నట్టు బాలుడు సెక్యూరిటీకి చెప్పారు. ల్యాండింగ్ గేర్‌లో అత్యంత కఠిన వాతావరణ పరిస్థితులు ఉంటాయని అధికారులు తెలిపారు. జర్నీ సమయంలో అక్కడ గాలి పీడనం, ఉష్ణోగ్రతల్లో తీవ్ర మార్పులు ఉంటాయని, వీటిని తట్టుకుని బాలుడు ప్రాణాలతో ఉన్నాడంటే అద్భుతమేనని కామెంట్ చేశారు (Kabul-Delhi flight stowaway).
అతడిని ప్రశ్నించిన అనంతరం అధికారులు మరో విమానంలో వెనక్కు పంపించేశారు. కామ్ ఎయిర్‌కు చెందిన ఆర్‌క్యూ-4402 విమానంలో అతడు తిరుగు ప్రయాణమయ్యాడు.
ఇవి కూడా చదవండి:
జనాభా శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్టు.. నెం.2, 3 స్థానాల్లో తెలంగాణ, ఏపీ
జమ్ము సరిహద్దులో పాకిస్తాన్ డ్రోన్ కదలికలు..బీఎస్ఎఫ్ గాలింపు చర్యలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి