Afghan Boy Airplane Stunt: విమానం ల్యాండింగ్ గేర్ బాక్సులో అఫ్ఘాన్ బాలుడి సాహసం
ABN , Publish Date - Sep 23 , 2025 | 06:45 AM
సరదా కొద్దీ విమానం కింది భాగంలో టైర్ల వద్ద ఉండే ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో దాక్కొన్న ఓ 13 ఏళ్ల అఫ్ఘానిస్థాన్ పెద్ద సాహసమే చేశాడు. అందులో రెండు గంటల పాటు...
కాబూల్ నుంచి ఢిల్లీ రాక.. సరదాకేనని వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: సరదా కొద్దీ విమానం కింది భాగంలో టైర్ల వద్ద ఉండే ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో దాక్కొన్న ఓ 13 ఏళ్ల అఫ్ఘానిస్థాన్ పెద్ద సాహసమే చేశాడు. అందులో రెండు గంటల పాటు కూర్చొని కాబూల్ నుంచి ఢిల్లీ చేరుకున్నాడు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఇక్కడి విమానాశ్రయంలో దిగాడని, తిరిగి రాత్రి అదే విమానంలో తిప్పి పంపామని సోమవారం అధికారులు తెలిపారు. కందూజ్ పట్టణానికి చెందిన ఆ బాలుడు ఎలాగోలాగ కాబూల్ విమానాశ్రయం లోపలికి వెళ్లి ఢిల్లీ బయలుదేరే కేఏఎం విమానం వద్దకు చేరుకున్నాడు. టైర్ల మీదుగా ఎక్కి గేర్ కంపార్టుమెంటులోకి కూర్చొన్నాడు. అది ఢిల్లీలో ల్యాండ్ అయిన తరువాత కిందికి తిగి అక్కడ తచ్చాడుతుండగా భద్రత సిబ్బంది పట్టుకొని విచారించారు. సరదా కోసం ఎక్కానని చెప్పాడు. అనంతరం క్షుణ్ణంగా తనిఖీలు చేయగా అక్కడ ఎర్ర రంగులో ఉన్న చిన్న స్పీకర్ కనిపించింది. ఎలాంటి విద్రోహ చర్యలు లేవని ధువ్రీకరించిన తరువాతే విమానం ఎగిరేందుకు అనుమతి ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News