Saif Ali khan : వెన్నెముకలో కత్తిపోటు.. సైఫ్ అలీ ఖాన్ ప్రమాదం నుండి..
ABN , Publish Date - Jan 16 , 2025 | 01:53 PM
నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై కత్తి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన మొంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే, తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు.

Mumbai: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై ఓ దుండగుడు కత్తి దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన మొంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే, తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
సైఫ్ అలీ ఖాన్ సేఫ్..
నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దుండగుడు చేసిన కత్తి దాడిలో అతని వెన్నెముక ద్రవం లీక్ అయిందని తెలిపారు. అంతేకాకుండా, ఎడమ చేతిపై రెండు లోతైన గాయాలు, మెడపై కూడా గాయాలు అయ్యాయని చెప్పారు. వెన్నెముక గాయాన్ని సరిచేసి, అతని చేతికి, మెడకు ప్లాస్టిక్ సర్జరీలు చేశామని డాక్టర్ నితిన్ డాంగే పేర్కొన్నారు. ప్రస్తుతం నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని, కోలుకుంటున్నాడని తెలిపారు.
కాగా, గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు సైఫ్ అలీ ఖాన్‌పై కత్తి దాడి జరిగింది. సైఫ్, అతడి కుటుంబం నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అది గమనించిన సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా దుండగుడు కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ ఘర్షణలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు. వెన్నెముకకు బలమైన గాయం అయింది. అంతేకాకుండా, చేతికి, మెడకి కూడా గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసుపై ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు.