Acid Rain Spike: భారత్‌లో పెరుగుతున్న ఆమ్ల వర్షాలు
ABN , Publish Date - Apr 13 , 2025 | 03:24 AM
భారత్‌లో వర్షపు నీటిలో ఆమ్లత్వం పెరుగుతున్నట్టు 34 ఏళ్ల అధ్యయనంలో వెల్లడైంది. విశాఖ, ప్రయాగ్‌రాజ్, పుణే వంటి నగరాల్లో పరిస్థితి అధిక ఆందోళన కలిగిస్తోంది

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: వర్షపు నీటిలో ఆమ్లత్వం పెరుగుతున్న ధోరణి భారత్‌లో ఆందోళన రేపుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఐఎండీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ (ఐఐటీఎం) 34 ఏళ్లపాటు దేశవ్యాప్తంగా నిర్వహించిన సుదీర్ఘ అధ్యయనంలో భారత్‌లోని అనేక ప్రాంతాల్లో వర్షపు నీరు మరింత ఆమ్లంగా మారుతోందని గుర్తించారు. విశాఖపట్నం, ప్రయాగ్‌రాజ్, మోహన్‌బరిలో ఈ ఆమ్ల వర్షాలు అధికంగా నమోదవుతున్నాయని, పుణెలో కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని కనుగొన్నారు. నీటిలో పీహెచ్ స్థాయిలు తగ్గి, ఆమ్లత్వం పెరగడానికి పరిశ్రమలు, వాహనాలు, వ్యవసాయ కాలుష్యం కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆమ్ల వర్షాలతో తక్షణమే ముంచుకొచ్చే ముప్పేమీ లేకపోయినప్పటికీ.. భవిష్యత్తులో అనేక సమస్యలకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Kollu Ravindra: కులాలు, మతాల మధ్య చిచ్చుపెడితే.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్..
South Central Railway: గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..