Maharashtra: జైల్లో ఉరేసుకున్న మైనర్ బాలిక హత్యాచార నిందితుడు
ABN , Publish Date - Apr 13 , 2025 | 04:08 PM
థానే జిల్లా కల్యాణ్‌లో 12 ఏళ్ల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి హత్యాచారానికి పాల్పడిన ఘటన అప్పట్లో సంచలనమైంది. కోల్సేవాడి ప్రాంతం నుంచి మాయమైన బాలిక ఆ తర్వాత బాప్‌గావ్ గ్రామంలో మృతదేహమై కనిపించింది. నిందితులకు కఠిన శిక్ష విధించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి.

ముంబై: మహారాష్ట్రలోని థానే జిల్లా కల్యాణ్‌లో 2024 డిసెంబర్‌లో మైనర్ బాలికపై హత్యాచారం ఘటన సంచలన సృష్టించింది. ఈ ఘటనలో నిందితుడైన విశాల్ గావ్లి ఆదివారంనాడు ఆత్మహత్య చేసుకున్నాడు. నవీ ముంబైలోని తలోజా సెంట్రల్ జైలులో ఉన్న విశాల్ గావ్లి తెల్లవారు జామున 3.30 గంటలకు జైలు టాయిలెట్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు.
మనుషులా.. రాక్షసులా.. మద్యం తాగించి.. ఆపై
కాగా, ఈ ఘటనను ఖర్ఘర్ పోలీసు స్టేషన్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. జైలు టాయిలెట్‌లో టవల్‌తో ఊరేసుకుని నిందితుడు చనిపోవడాన్ని జైలు అధికారులు గుర్తించినట్టు చెప్పారు. స్థానిక పోలీసులకు సమాచారం అందిచండతో వెటనే పంచనామా నిర్వహించారు. మృతికి కారణాలపై నిర్ధారించేందుకు పోస్ట్‌మార్టం కోసం జేజీ ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు వివరించారు.
కల్యాణ్ అత్యాచారం కేసు
థానే జిల్లా కల్యాణ్‌లో 12 ఏళ్ల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి హత్యాచారానికి పాల్పడిన ఘటన అప్పట్లో సంచలనమైంది. కోల్సేవాడి ప్రాంతం నుంచి మాయమైన బాలిక ఆ తర్వాత బాప్‌గావ్ గ్రామంలో మృతదేహమై కనిపించింది. నిందితులకు కఠిన శిక్ష విధించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. దీనిపై విచారణ జరిపిన పోలీసులు 35 ఏళ్ల గావ్లి, అతని భార్య సాక్షిని అరెస్టు చేశారు. సొమ్ముల కోసం కిడ్నాప్ చేసి, అత్యాచారం, అత్యకు పాల్పడ్డారని, సాక్ష్యాలను మాయం చేశారని ఆరోపిస్తూ భారతీయ న్యాయ సంహిత, పోస్క్ చట్టం కింద వారిపై కేసులు పెట్టారు. నిందితుల జంటపై ఫిబ్రవరిలో 948 పేజీల ఛార్జిషీటును కల్యాణ్ పోలీసులు నమోదుచేశారు. బాలికపై విశాల్ గావ్లి అత్యాచారం జరిపి హత్య చేశాడని, బాలిక మృతదేహాన్ని బాప్‌గావ్‌లో పడేయడానికి సాక్షి సహకరించిందని పోలీసులు గతంలో ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి