Share News

మనుషులా.. రాక్షసులా.. మద్యం తాగించి.. ఆపై

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:43 PM

మంచి మాటలతో నమ్మించి అమాయకురాలిని బుట్టలో వేసుకున్నారు. వారి మనసులోని చెడు ఆలోచనలను గ్రహించలేని మహిళ.. రాక్షసుల చేతిలో చిక్కి.. దారుణంగా మృతి చెందింది. ఆ వివరాలు..

మనుషులా.. రాక్షసులా.. మద్యం తాగించి.. ఆపై
UP Woman

లక్నో: మనుషుల్లో మానవత్వం రోజురోజుకు కొరవడుతుంది. జాలి, దయ అనే గుణాలు లేకుండా అత్యంత కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. తాము అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఆఖరికి హత్యలు కూడా చేస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. అమాయకురాలైన మహిళను మంచి మాటలతో నమ్మించి.. మాట్లాడాలని పిలిపించారు. ఆ తర్వాత మహిళ చేత బలవంతంగా మద్యం తాపించి.. అత్యంత కిరాతకంగా ఆమెని హత్య చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.


అంజలి అనే 25 సంవత్సరాల యువతి ఐదు రోజుల క్రితం మిస్సైంది. కుటుంబ సభ్యులు ఆమె కనిపించడం లేదని పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నేడు ఆదివారం నాడు అంజలి కుటుంబ సభ్యులకు భారీ షాక్ తగిలింది. తమ బిడ్డ ఎక్కడో చోట క్షేమంగా ఉంటుందని భావించిన తల్లిదండ్రులకు.. ఆమె మృతదేహం లభ్యం కావడంతో కుప్ప కూలిపోయారు. గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఓ ప్రాపర్టీ డీలర్, అతడి భాగస్వామి ఇద్దరు కలిసి అంజలిని అత్యంత దారుణంగా హత్య చేశారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ప్రాపర్టీ లావాదేవీకి సంబంధించి.. మృతురాలు అంజలికి.. ప్రాపర్టీ డీలర్ శివేంద్ర యాదవ్(26), అతడి భాగస్వామి గౌరవ్(19) తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో నిందితులు ల్యాండ్ కోసం అంజలి దగ్గర నుంచి 6 లక్షల రూపాయలు తీసుకున్నారు. అందుకు సంబంధించని డాక్యుమెంట్స్ ఇస్తామని చెప్పి.. ఐదు రోజుల క్రితం అంజలిని పిలిపించారు.

వారి మాటలు నమ్మిన అంజలి నిందితులు చెప్పిన దగ్గరకు వెళ్లింది. ఈ క్రమంలో నిందితులు అంజలిని మాటల్లో పెట్టి ఆమెతో మద్యం తాగించారు. ఆ తర్వాత కత్తితో అత్యంత దారుణంగా హత్య చేశారు. అక్కడితో ఆగక.. శివేంద్ర యాదవ్ తన భార్య, తండ్రికి వీడియో కాల్ చేసి అంజలి మృతదేహాన్ని చూపించాడు. ఆ తర్వాత అంజలి డెడ్ బాడీని కాల్చారు. అనంతరం సగం కాలిని మృతదేహాన్ని నదిలో పడేశారు. ఆమె స్కూటీని కూడా తగులబెట్టారు.


ఇక శివేంద్ర కాల్ చేసిన రోజు బయటకు వెళ్లిన అంజలి ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు అంజలి కాలిపోయిన స్కూటీని గుర్తించారు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఐదు రోజుల తర్వాత సగం కాలిపోయి కుళ్లిన స్థితిలో ఉన్న అంజలి డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు. దీని గురించి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు శివేంద్ర యాదవ్, అతడి భాగస్వామిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇది కూడా చదవండి:

Bank Holidays: వచ్చే వారం 4 రోజులు బ్యాంకులు బంద్..పనులుంటే ముందే ప్లాన్ చేసుకోండి..

Viral Video: పాపం పసివాడు.. అన్నను కాపాడుకోవడం కోసం

Updated Date - Apr 13 , 2025 | 01:50 PM