Ranveer Allahbadia: రణ్‌వీర్ తరఫున వాదిస్తున్న లాయర్ ఎవరో తెలుసా?
ABN , Publish Date - Feb 15 , 2025 | 08:14 PM
సుప్రీంకోర్టు మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ కుమారుడు అభినవ్ కాగా, ఆయన తాతగారు వైవి చంద్రచూడ్ సైతం సుదీర్ఘకాలం చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. అభినవ్ విద్యావేత్తగా, రచయితగా పేరు తెచ్చుకున్నారు.

న్యూఢిల్లీ: 'ఇండియాస్ గాట్ లాటెండ్' షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే అంతకంటే ఆసక్తికరమైన మరో అంశం కూడా వెలుగు చూసింది. ఆయన తరఫున అభినవ్ చంద్రచూడ్ లాయర్‌గా వ్యవహరిస్తున్నారు. అభినవ్ మరెవరో కాదు, ఇటీవల సుప్రీంకోర్టు సీజేఐగా బాధ్యతల నుంచి పదవీ విరమణ చేసిన జస్టిస్ డీవై చంద్రచూడ్ కుమారుడు కావడం విశేషం.
Maha Kumbh: కుంభమేళాను పొడిగించండి.. యోగి సర్కార్‌ను కోరిన అఖిలేష్
సమయ్ రైనా 'ఇండియాస్ గాట్ లాటెండ్' షోలో పాల్గొన్న ఓ వ్యక్తిని తల్లిదండ్రులు, శృంగారంపై రణ్‌వీర్ ప్రశ్నించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై వివిధ రాష్ట్రాల్లో ఆయనపై ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. అయితే వెంటనే ఆయన తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ దర్యాప్తులో భాగంగా మహారాష్ట్ర ఖార్ పోలీసుల ముందు హాజరయ్యారు. ఇదే సమయంలో తనపై వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్ఐఆర్‌లను ఒకేచోట క్లబ్ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును రణ్‌వీర్ ఆశ్రయించారు. ఈ కేసులో ఆయన తరఫు న్యాయవాదిగా అభినవ్ చంద్రచూడ్ వాదించనున్నారు.
అభినవ్ వివరాలివే..
మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ కుమారుడు అభినవ్ కాగా, ఆయన తాతగారు వైవి చంద్రచూడ్ సైతం సుదీర్ఘకాలం చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. అభినవ్ విద్యావేత్తగా, రచయితగా పేరు తెచ్చుకున్నారు. ముంబై ప్రభుత్వ న్యాయకళాశాలలో 2008లో పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత అమెరికాలోని హార్డార్డ్ విశ్వవిద్యాలలో ఎల్ఎల్ఎం చేశారు. అంతర్జాతీయ న్యాయ సంస్థల్లో ప్రాక్టీస్ చేశారు. పలు పుస్తకాలు కూడా రచించారు. రిపబ్లిక్ ఆఫ్ రొటోరిక్: ఫ్రీ స్పీచ్ అండ్ ది కన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా (2017), సుప్రీం విష్పర్స్: కన్వర్షేషన్స్ విత్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 1980-1989(2018) వంటి రచనలు చేశారు. ఆసక్తికరంగా, అభినవ్ ఇంతవరకూ సుప్రీంకోర్టులో ఏ కేసు వాదించలేదని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి...
US Deportation Flights: భారత్‌కు మరో వలసదారుల విమానం.. ఏయే రాష్ట్రాల వారు ఉన్నారంటే..
Special Vande Bharat Train: నేటి నుంచి ప్రయాగ్‌రాజ్‌కి ప్రత్యేక వందే భారత్ రైలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.