Share News

MLA Harmeet Singh Escapes: ఎమ్మెల్యే అరెస్టు కోసం వెళ్తే... పోలీసులపై అనుచరుల కాల్పులు

ABN , Publish Date - Sep 03 , 2025 | 03:22 AM

పంజాబ్‌లో అధికార ఆప్‌ ఎమ్మెల్యే హర్మీత్‌ సింగ్‌ పోలీసు కస్టడీ నుంచి సినీపక్కీలో పరారయ్యారు. హర్మీత్‌ తనను మోసం చేశారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది...

MLA Harmeet Singh Escapes: ఎమ్మెల్యే అరెస్టు కోసం వెళ్తే... పోలీసులపై అనుచరుల కాల్పులు

  • అదే అదనుగా పారిపోయిన ఆప్‌ ఎమ్మెల్యే హర్మీత్‌ సింగ్‌

పటియాలా, సెప్టెంబరు 2: పంజాబ్‌లో అధికార ఆప్‌ ఎమ్మెల్యే హర్మీత్‌ సింగ్‌ పోలీసు కస్టడీ నుంచి సినీపక్కీలో పరారయ్యారు. హర్మీత్‌ తనను మోసం చేశారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అత్యాచారం, మోసం, నేరపూరిత కుట్ర ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మంగళవారం హరియాణాలోని కర్నాల్‌ జిల్లా డబ్రిలో ఉన్న హర్మీత్‌ ఇంటికి వెళ్లారు. ఆయన్ని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించేందుకు సిద్ధమవగా.. కొందరు అల్లరిమూకలు, గ్రామస్థులు కాల్పులు జరపడంతో పాటు రాళ్లు రువ్వారు. ఇదే అదనుగా ఎమ్మెల్యే పారిపోయారని, హర్మీత్‌ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. భార్యతో విడాకులు తీసుకున్నట్లు నమ్మించి, ఎమ్మెల్యే తనతో సంబంధం కొనసాగించారని, విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటే తన వీడియోలు బయటపెడతానంటూ బెదిరించారని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..!

ఏపీ మహేష్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఈడీ

For More National News And Telugu News

Updated Date - Sep 03 , 2025 | 03:22 AM