Brain Eating Amoeba : కేరళలో మెదడు తినే అమీబా, తొమ్మిదేళ్ల బాలిక మృతి, మరో ముగ్గురికి సోకిన వైనం
ABN , Publish Date - Aug 18 , 2025 | 05:07 PM
కేరళ కోజికోడ్ జిల్లాలో మెదడు తినే అమీబా కేసులు దడ పుట్టిస్తున్నాయి. కొత్తగా మూడు అరుదైన PAM కేసులు నమోదయ్యాయి. తొమ్మిదేళ్ల బాలిక ఇప్పటికే చనిపోగా, మూడు నెలల శిశువుతో సహా మరో ఇద్దరు ప్రాణాల కోసం పోరాడుతున్నారు.
కోజికోడ్(కేరళ) ఆగస్టు 18: కేరళ కోజికోడ్ జిల్లాలో మెదడు తినే అమీబా కేసులు దడ పుట్టిస్తున్నాయి. కొత్తగా మూడు అరుదైన ప్రాథమిక అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) కేసులు నమోదైన నేపథ్యంలో కేరళ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తొమ్మిదేళ్ల బాలిక ఈ వైరస్ కారణంగా ఇప్పటికే మరణించింది. మూడు నెలల శిశువుతో సహా మరో ఇద్దరు దీని బారినపడి ఇప్పుడు ప్రాణాల కోసం పోరాడుతున్నారు.
అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనేది 'మెదడు తినే అమీబా'. ఇది నేగ్లేరియా ఫౌలేరి అనే వైరస్ వల్ల వస్తుంది. ఇది నీరు, నేలలో స్వేచ్ఛగా జీవించే ఒక అమీబా. ఇది ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు ప్రజలకు సోకుతుంది. ఈ ఏడాది ఇప్పటి వరకూ కేరళలో ఎనిమిది ధృవీకరించిన కేసులు, రెండు మరణాలు సంభవించాయి. ఇటీవల ఆగస్టు 14న కోజికోడ్‌లోని తమరస్సేరిలో ఒక కేసు నమోదైంది.
భారతదేశంలో మొదటి PAM కేసు 1971లో నమోదైంది. కేరళలో మొదటి కేసు 2016లో నమోదైంది. 2016 నుండి 2023 వరకు కేరళ రాష్ట్రంలో కేవలం ఎనిమిది కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే, గతేడాది కేరళలో 36 పాజిటివ్ కేసులు, తొమ్మిది మరణాలు సంభవించాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి మరణాలు 97 శాతం ఉంటే, కేరళ దానిని 25 శాతానికి తగ్గించగలిగింది. భారతదేశంలో జూలై 2024 వరకు నమోదైన అన్ని కేసుల్లో రోగి మరణానికి దారితీశాయి. తర్వాత కోజికోడ్ జిల్లాలో 14 ఏళ్ల బాలుడు ఈ వ్యాధి నుండి బయటపడిన మొదటి భారతీయుడు అయ్యాడు. అతను ప్రపంచంలో PAM నుండి బయటపడిన వారిలో 11వవాడు.
ఈ వార్తలు కూడా చదవండి
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా లోకేశ్ ఢిల్లీ పర్యటన..
వైఎస్ జగన్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్..
Read Latest AP News And Telugu News