Share News

LOC Infiltration Alert: నియంత్రణ రేఖ వెంబడి 42 లాంచ్‌ ప్యాడ్స్‌

ABN , Publish Date - Apr 25 , 2025 | 03:10 AM

నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో 42 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ సిద్ధంగా ఉన్నాయి. వీటిలో శిక్షణ పొందిన 200 మంది ఉగ్రవాదులు భారత సరిహద్దు దాటేందుకు సన్నద్ధంగా ఉన్నారు

LOC Infiltration Alert: నియంత్రణ రేఖ వెంబడి 42  లాంచ్‌ ప్యాడ్స్‌

  • సరిహద్దు దాటేందుకు 200 మంది ఉగ్రవాదులు సిద్ధం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24: నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో 42 ఉగ్రవాద లాంచ్‌ ప్యాడ్స్‌ సిద్ధంగా ఉన్నాయని నిఘావర్గాల సమాచారం. ఇక్కడ శిక్షణ పొందిన 200మంది ఉగ్రవాదులు ఏ క్షణమైనా భారత సరిహద్దులోకి అక్రమంగా ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసింది. సరిహద్దు దాటించేందుకు పాకిస్థాన్‌ సైన్యం వీరికి సహకరిస్తోంది. శిక్షణ పొందుతున్న ఉగ్రవాదుల్లో 115 మంది పాక్‌ జాతీయులున్నట్లు సమాచారం. వీరుకాక జమ్మూకశ్మీర్‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌, జైష్‌ ఎ మహ్మద్‌, లష్కర్‌ ఎ తైబా తదితర ఉగ్రవాద సంస్థలకు చెందిన మొత్తం 60 మంది విదేశీ ఉగ్రవాదులు ఇప్పటికే చురుగ్గా ఉన్నారని నిఘావర్గాలు గుర్తించాయి. 17 మంది స్థానిక ఉగ్రవాదులు కూడా చురుగ్గా ఉన్నారని తెలిపాయి.


ఇవి కూడా చదవండి

Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..

Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్

Updated Date - Apr 25 , 2025 | 03:10 AM