Pahalgam Incident: నాన్న ఎక్కడమ్మా

ABN , First Publish Date - 2025-04-25T05:23:43+05:30 IST

పహల్గాం ఉగ్రదాడిలో తండ్రిని కోల్పోయిన మూడేళ్ల బాబు, అర్ధరాత్రి తల్లి వద్ద "నాన్న ఎక్కడ?" అని అడగగా, తల్లి కన్నీళ్ళతో సమాధానం చెప్పలేక బాధపడింది.

Pahalgam Incident: నాన్న ఎక్కడమ్మా

  • తల్లికి మూడేళ్ల బాలుడి ప్రశ్న

  • బిడ్డకు ఏమీ చెప్పలేక ఏడ్చిన మాతృమూర్తి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24: ఆ భయానక దృశ్యాన్ని కళ్లారా చూశాడు కాబోలు.. తల్లి పొత్తిళ్లలో ఆదమరిచి నిద్రపోయిన ఆ మూడేళ్ల బాలుడు అర్ధరాత్రి ఉన్నట్టుండి నిద్రలేచాడు. బాబు ఒళ్లు కంపిస్తోంది. భయం కళ్లలోనూ కనిపిస్తోంది... రెండు చేతులతో తల్లి చేతులను గట్టిగా పట్టుకొని.. ‘నాన్న ఎక్కడమ్మా?’ అని వణుకుతున్న గొంతుతో ప్రశ్నించాడు. బిడ్డకు సమాధానం చెప్పలేక ఆ తల్లి కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేసింది! పెహల్గాం ఉగ్రదాడిలో తన తండ్రి బితాన్‌ అధికారిని కోల్పోయిన మూడేళ్ల బిడ్డ గురించే ఇదంతా! మా కుటుంబాన్ని ఉగ్రవాదులు ఛిద్రం చేశారని సోహిని అధికారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అర్ధరాత్రి నిద్రలేచి నాన్న ఎక్కడ? అని అడిగిన నా బిడ్డకు.. ‘మీ నాన్న ఎప్పటికీ తిరిగిరాడు’ అనే చేదు నిజాన్ని ఎలా చెప్పగలను? అని సోహిని వాపోయింది. మూడేళ్ల బాబు చూస్తుండగానే.. తన భర్తను ఉగ్రవాదులు కాల్చి చంపారని ఆమె చెప్పింది.


ఇవి కూడా చదవండి

Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..

Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్

Updated Date - 2025-04-25T05:23:44+05:30 IST