Share News

Rescue Operations: ధరాలీలో 28మంది కేరళ పర్యాటకులు గల్లంతు

ABN , Publish Date - Aug 07 , 2025 | 04:14 AM

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో మంగళవారం కురిసిన కుంభవృష్టి, ఆకస్మిక వరదల్లో కేరళకు చెంది

Rescue Operations: ధరాలీలో 28మంది కేరళ పర్యాటకులు గల్లంతు

ఉత్తరకాశీ, ఆగస్టు 6: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో మంగళవారం కురిసిన కుంభవృష్టి, ఆకస్మిక వరదల్లో కేరళకు చెందిన 28మంది పర్యాటకులు గల్లంతయ్యారు. వారు మంగళవారం ఉదయం 8.30గంటలకు ధరాలీ నుంచి గంగోత్రికి బయల్దేరినట్లు చెప్పారని, ఆ మార్గంలోనే కొండచరియలు విరిగిపడ్డాయని, ఆ తర్వాత ఈ పర్యాటకుల నుంచి ఎలాంటి సమాచారం లేదని గల్లంతైనవారిలో ఒకరి బంధువు మీడియాతో చెప్పారు. మరోవైపు, ధరాలీలో వరదలో, బురదలో చిక్కుకుపోయినవారిని కాపాడటానికి సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 190మందిని కాపాడినట్లు ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామీ వెల్లడించారు. ఒకరి మృతదేహాన్ని వెలికితీసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, గంగోత్రిలో చిక్కుక్ను యాత్రికులను నెలాంగ్‌ లోయ మార్గం నుంచి పంపించేందు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ధామీ వెల్లడించారు. తర్వలోనే యాత్రికులందరినీ స్వస్థలాలకు పంపిస్తామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఊటీలో పర్యాటక ప్రాంతాల మూసివేత.. కారణం ఏంటంటే..

అమిత్‌షాపై పరువునష్టం వ్యాఖ్యలు.. రాహుల్‌కు బెయిల్

Read Latest Telangana News and National News

Updated Date - Aug 07 , 2025 | 04:14 AM