Share News

Ujjwala Scheme: 25 లక్షల కొత్త ఉజ్వల కనెక్షన్లు

ABN , Publish Date - Sep 23 , 2025 | 06:39 AM

నవరాత్రుల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకం కింద మరో 25 లక్షల కొత్త ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను...

Ujjwala Scheme: 25 లక్షల కొత్త ఉజ్వల కనెక్షన్లు

  • నవరాత్రుల సందర్భంగా పంపిణీ

  • కేంద్ర మంత్రి హర్దీప్‌ పూరీ వెల్లడి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: నవరాత్రుల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకం కింద మరో 25 లక్షల కొత్త ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను పంపిణీ చేయనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ ప్రకటించారు. సోమవారం తన ‘ఎక్స్‌’ ఖాతాలో ఒక పోస్టును షేర్‌ చేస్తూ.. దీని ద్వారా మొత్తం ‘ఉజ్వల’ కుటుంబాల సంఖ్య 10.60 కోట్లకు చేరుకుంటుందని వెల్లడించారు. ప్రభుత్వం ప్రతి కొత్త ఎల్పీజీ కనెక్షన్‌పై రూ.2,050 ఖర్చు చేయనుందని తెలిపారు. శుభప్రదమైన నవరాత్రుల సందర్భంగా ఇస్తున్న 25 లక్షల కొత్త ఉచిత పీఎం ఉజ్వల కనెక్షన్లు.. ప్రధాని నరేంద్ర మోదీ దుర్గాదేవిలాగే మహిళలను గౌరవిస్తారనే దానికి మరో ఉదాహరణగా పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ

ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 23 , 2025 | 06:39 AM