-
-
Home » Mukhyaamshalu » Wednesday 23rd July 2025 Live Updates and Breaking News Top news and Major Events Across India siva
-
Breaking News: దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలి: సీఎం రేవంత్
ABN , First Publish Date - Jul 23 , 2025 | 09:20 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Jul 23, 2025 18:03 IST
ఉపరాష్ట్రపతి పదవి తెలంగాణ వ్యక్తికి ఇవ్వాలి: సీఎం రేవంత్
దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలి: సీఎం రేవంత్
దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తేనే బీసీలకు న్యాయం: రేవంత్
తెలుగు రాష్ట్రాలకు సరైన గౌరవం దక్కుతుంది: సీఎం రేవంత్
దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే..
నేను ఇండియా కూటమితో మాట్లాడతా: సీఎం రేవంత్
ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఇస్తే దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలని కోరతా: సీఎం రేవంత్
-
Jul 23, 2025 18:03 IST
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నేతలు వితండవాదం చేస్తున్నారు: సీఎం రేవంత్
టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు వాదన వింతగా ఉంది: సీఎం రేవంత్
మీరిచ్చిన హామీని మీరే అమలు చేసుకోవాలంటున్నారు: సీఎం రేవంత్
కాంగ్రెస్, బీజేపీకి వేర్వేరు రాజ్యాంగాలు ఉంటాయా?: సీఎం రేవంత్
బీజేపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు: సీఎం రేవంత్
బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు సాకులు వెతుకుతున్నారు: సీఎం రేవంత్
తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు తొలగించాలని కుట్ర చేస్తున్నారు: రేవంత్
గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి
గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో..
ముస్లిం రిజర్వేషన్లు తొలగించాక తెలంగాణ గురించి మాట్లాడాలి: రేవంత్
ఇలాగే మాట్లాడితే తెలంగాణలో బీజేపీని ప్రజలు తుడిచిపెట్టేస్తారు: రేవంత్
బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు బీజేపీ సహా అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు ఇచ్చాయి: రేవంత్
రాజ్యాంగానికి లోబడే రిజర్వేషన్లు పెంచాలంటున్నాం: సీఎం రేవంత్
-
Jul 23, 2025 18:03 IST
బీసీ కులగణన విజయవంతంగా నిర్వహించాం: సీఎం రేవంత్
బీసీ కులగణనలో దేశానికే తెలంగాణ ఆదర్శం: సీఎం రేవంత్
సర్వేలో 3.55 కోట్ల మంది వివరాలు సేకరించాం: సీఎం రేవంత్
వందేళ్లుగా వాయిదా పడిన కులగణనను నెలలోనే పూర్తి చేశాం
అసెంబ్లీ 2 తీర్మానాలు చేసి పార్లమెంట్‌కు పంపాం: సీఎం రేవంత్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు రూపొందించాం
స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి పంపాం
కానీ బిల్లులను కేంద్రం ఆమోదించకుండా జాప్యం చేస్తోంది: రేవంత్
రేపు రాహుల్, ఖర్గేను కలిసి కులగణన, రిజర్వేషన్లపై చర్చిస్తాం: రేవంత్
రాహుల్ గాంధీ ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం: సీఎం రేవంత్
మిగతా పక్షాలను కలిపి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం: సీఎం రేవంత్
కేంద్రం మెడలు వంచైనా సరే బీసీ రిజర్వేషన్లు సాధిస్తాం: సీఎం రేవంత్
ఉభయసభల్లోని కాంగ్రెస్ ఎంపీలకు రిజర్వేషన్లపై వివరిస్తాం: రేవంత్
సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం
బీసీ రిజర్వేషన్లను కేంద్రం ఆమోదిస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలకు న్యాయం: సీఎం రేవంత్
-
Jul 23, 2025 18:03 IST
హాజరుకాలేను: బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారణకు హాజరుకాలేనన్న బండి సంజయ్
పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున విచారణకు రాలేనని తెలిపిన బండి
ఈనెల 28 విచారణకు హాజరవుతానని సిట్‌కు తెలిపిన బండి సంజయ్
-
Jul 23, 2025 16:16 IST
ఉగ్రవాదులు అరెస్టు..
గుజరాత్: నలుగురు అల్‌ఖైదా ఉగ్రవాదులు అరెస్టు
ఉగ్రవాదులను అరెస్టు చేసిన గుజరాత్ ATS పోలీసులు
గుజరాత్‌లో ఇద్దరు, ఢిల్లీలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు
-
Jul 23, 2025 13:22 IST
ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం
ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహణకు సీఈసీ ప్రకటన
నెలరోజుల్లో ఎన్నిక ప్రక్రియ పూర్తిచేసేలా ప్రణాళిక
-
Jul 23, 2025 12:20 IST
నిజామాబాద్: ఉత్తర తెలంగాణలో నూతన రైల్వే లైన్ మంజూరు
ఆర్మూర్ మీదుగా పటాన్‌చెరు-ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్‌కు ఆమోదం
ఎంపీ అర్వింద్‌కు లేఖ ద్వారా తెలియజేసిన రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్
ఆర్మూర్ మీదుగా పటాన్‌చెరు-ఆదిలాబాద్ మధ్య...
కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు పలుమార్లు ఎంపీ అర్వింద్ వినతులు
ప్రాజెక్టు సంబంధిత డీపీఆర్ తయారీ తర్వాత తదుపరి చర్యలు
-
Jul 23, 2025 12:18 IST
తెలంగాణకు భారీ వర్ష సూచన
మరో 3 గంటల్లో పలు జిల్లాలకు వర్ష సూచన
వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు IMD అలర్ట్
పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్‌లు జారీ
-
Jul 23, 2025 11:14 IST
పార్లమెంటు ఉభయసభలు వాయిదా
లోక్‌సభ వాయిదా
రాజ్యసభ వాయిదా
-
Jul 23, 2025 11:05 IST
ఢిల్లీ: మూడోరోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మూడో రోజూ అదే పరిస్థితి
బిహార్ ఓటర్ల జాబితాల సవరణపై చర్చకు కాంగ్రెస్ డిమాండ్
రాజ్యసభ, లోక్‌సభలో వాయిదా తీర్మానాలు ఇచ్చిన విపక్షాలు
-
Jul 23, 2025 09:50 IST
రాజధాని రైతులకు గుడ్ న్యూస్..
అమరావతి: రాజధాని అమరావతి రైతులకు కౌలు జమ చేసిన ప్రభుత్వం.
ఈ రోజు ఉదయం నుంచి రైతుల అకౌంట్లలో జమ అవుతున్న కౌలు.
బ్యాంక్ లు వారీగా జమ అవుతున్న కౌలు.
వైసీపీ ప్రభుత్వం రాజధాని రైతులపై కక్ష్యతో నిలిపివేసిన రెండు ఏళ్ల కౌలును అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించిన కూటమి ప్రభుత్వం.
మళ్ళీ ఈ ఏడాది కౌలును కూడా ఈ రోజు ఉదయం నుంచి రైతుల అకౌంట్లలో జమ చేస్తున్న ప్రభుత్వం.
-
Jul 23, 2025 09:20 IST
నంద్యాల: భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన భార్య.
నంద్యాల నూనెపల్లె రమనయయ్య, పల్నాడు జిల్లా పిడుగురాల్లకు చెందిన రవనమ్మతో వివాహం.
కుటుంబ గొడవలతో పుట్టింటికి వెళ్ళిన రవనమ్మ.
భార్యను తీసుకురావడానికి పిడుగురాల్లకు వెళ్లిన రమనయ్య.
తమ్ముడితో కలసి భర్త రమనయ్య (50)పై దాడి చేసి చంపిన భార్య.
డెడ్ బాడీని కారులో తీసుకొచ్చి నూనెపల్లెలోని ఇంటి దగ్గర పడేసి పరార్.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.