-
-
Home » Mukhyaamshalu » USA New President Donald Trump Presidential Swearing in Ceremony live updates and latest news in Telugu
-
Trump inauguration live: అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం.. లైవ్ అప్‌డేట్స్
ABN , First Publish Date - Jan 20 , 2025 | 10:21 AM
Donald Trump Presidential Inauguration LIVE: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టారు.
Live News & Update
-
2025-01-20T23:38:24+05:30
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
శుభాకాంక్షలు.. మై డియర్ ఫ్రెండ్
ఇరు దేశాల ప్రయోజనాల కోసం మీతో కలిసి పనిచేసేందుకు ఉత్సుకతతో ఉన్నాను
ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన ప్రధాని
-
2025-01-20T23:11:18+05:30
ట్రంప్ ప్రసంగంలో ముఖ్యాంశాలు..
అమెరికా తిరోగమనం నేటితో ముగిసింది
అమెరికాను గొప్ప దేశంగా మార్చేందుకే దేవుడు నన్ను నాడు కాపాడాడు
ఈ రోజు అమెరికన్లకు విమోచన దినోత్సవం
అమెరికా దక్షిణ సరిహద్దుల వద్ద ఎమర్జెన్సీ ప్రకటిస్తాం
ఇకపై అమెరికాలో రెండే జెండర్స్.. స్త్రీలు, పురుషులు..
గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తాం
పనామా కెనాల్‌ను వెనక్కు తీసుకుంటాం
అమెరికాలో స్వర్ణ యుగం మొదలైంది
ఇకపై అమెరికా ప్రయోజనాలకే నా తొలి ప్రాధాన్యం
ప్రజలు గర్వించేలా, సుఖసంతోషాలతో విలసిల్లే దేశంగా అమెరికాను తీర్చిదిద్దుతాను.
ప్రపంచదేశాలన్నీ మనల్ని చూసి ఈర్ష్య పడేలా ఎదుగుదాము
-
2025-01-20T22:33:57+05:30
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ప్రమాణ స్వీకారం
ట్రంప్‌తో ప్రమాణస్వీకారం చేయించిన చీఫ్ జస్టిస్
అధ్యక్షుడిగా తొలి ప్రసంగం
-
2025-01-20T22:31:07+05:30
అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వ్యాన్స్ ప్రమాణస్వీకారం
-
2025-01-20T22:13:22+05:30
ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభం..
క్యాపిటల్ రొటుండాలో పోడియం వద్దకు విచ్చేసిన ట్రంప్
కార్యక్రమానికి భారత్ తరపున హాజరైన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్
-
2025-01-20T21:45:31+05:30
యూఎస్ క్యాపిటల్‌కు చేరుకున్న ట్రంప్, బైడెన్
-
2025-01-20T21:37:52+05:30
బైడెన్ దంపతులతో తేనీటి విందు అనంతరం డొనాల్డ్ ట్రంప్, తన సతీమణితో కలిసి అధ్యక్ష ప్రమాణస్వీకారం కోసం యూఎస్ క్యాపిటల్‌కు బయలుదేరారు.
-
2025-01-20T21:13:46+05:30
అధ్యక్షుడిగా బైడెన్ చివరి సెల్ఫీ
అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ తన సతీమణి జిల్‌తో కలిసి శ్వేత సౌధంలో చివరి సెల్ఫీ
లవ్యూ.. అమెరికా అంటూ దేశ ప్రజలకు చివరి సందేశం
అంతకుముందు ట్రంప్, మెలానియా దంపతలకు బైడెన్ దంపతుల తేనీటి విందు
బైడెన్ దంపతులతో కలిసి యూఎస్ క్యాపిటల్‌కు వెళ్లనున్న ట్రంప్
-
2025-01-20T20:29:43+05:30
మరి కొద్ది గంటల్లో డోనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం.. పతాకస్థాయికి సందడి
భారత్ కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ప్రమాణస్వీకారం
చలి కారణంగా క్యాపిటల్ భవనంలోనే ప్రమాణస్వీకార కార్యక్రమం
కుటుంబసమేతంగా ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్‌కు చేరుకున్న ట్రంప్
భారీ సంఖ్యలో నగరానికి ట్రంప్ మద్దతుదారుల రాక
ప్రమాణస్వీకారోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులు హాజరు కానున్న వైనం
-
2025-01-20T13:56:05+05:30
100 ఉత్తర్వులపై ఒకేసారి సంతకం
ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ దాదాపు 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేయనున్నారు. ఇది మాత్రమే కాదు, బైడెన్ పరిపాలన సమయంలో తీసుకున్న అనేక నిర్ణయాలను కూడా ఆయన రద్దు చేయనున్నారు.
-
2025-01-20T13:03:48+05:30
ట్రంప్ కాయిన్‌కు ఫుల్ డిమాండ్
ఆదివారం డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త క్రిప్టోకరెన్సీ $TRUMPకి ఫుల్ డిమాండ్ పెరిగింది. దీంతో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన సహచరుల వద్ద ఉన్న మొత్తం ఈ కొత్త క్రిప్టోకరెన్సీ విలువ ఇప్పుడు $38 బిలియన్లు దాటేసింది. ట్రంప్ కాయిన్ అధికారిక సైట్ 200 మిలియన్ మీమ్ నాణేలను జారీ చేసినట్లు తెలిపింది. రాబోయే మూడు సంవత్సరాలలో అదనంగా 800 మిలియన్లు జారీ చేయనున్నారు. మీమ్ నాణేలకు ఆర్థిక లేదా లావాదేవీ విలువలు లేవు. ఊహాజనిత వ్యాపారానికి మార్గంగా మాత్రమే చూస్తారు.
-
2025-01-20T12:52:28+05:30
డొనాల్డ్ ట్రంప్‌కి ఎంత జీతం వస్తుంది..
ఈరోజు ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయనకు సంవత్సరానికి $4,00,000 జీతం లభిస్తుంది. అంటే ఇండియా కరెన్సీ ప్రకారం చూస్తే రూ. 3,46,18,200 లభిస్తాయి.
-
2025-01-20T12:41:57+05:30
డొనాల్డ్ ట్రంప్‌కి బైడెన్ లేఖ, ఎందుకు..
చివరిసారిగా పదవీ విరమణ చేసే ముందు జో బైడెన్.. అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కి ఒక లేఖ రాయాలని యోచిస్తున్నట్లు ఓ నివేదిక తెలిపింది. నాలుగు సంవత్సరాల క్రితం, ట్రంప్ తన విజయాన్ని అంగీకరించడానికి నిరాకరించిన తర్వాత బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానప్పుడు, ట్రంప్ ఓవల్ కార్యాలయంలోని రిజల్యూట్ డెస్క్‌పై ఒక లేఖను ఉంచారు. అది ఒక అధ్యక్ష సంప్రదాయంగా కొనసాగుతుందని బైడెన్ అన్నారు.
-
2025-01-20T12:24:36+05:30
ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మిచెల్ ఒబామా డుమ్మా..
ఓ నివేదిక ప్రకారం మాజీ అధ్యక్షులలో బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. మాజీ ప్రథమ మహిళలు లారా బుష్, హిల్లరీ క్లింటన్ కూడా రానున్నారు. అయితే మిచెల్ ఒబామా హాజరు కావడం లేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఒబామా కార్యాలయం ధృవీకరించింది. కానీ దీని వెనుక ఉన్న కారణాలు మాత్రం వెల్లడించలేదు.
-
2025-01-20T12:05:15+05:30
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు స్పెషల్ పిక్..
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా వారి ఫ్యామిలీ చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
-
2025-01-20T12:05:14+05:30
పుతిన్‌తో మాట్లాడనున్న ట్రంప్
ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత రష్యా అధ్యక్షుడైన పుతిన్‌తో చర్చను ఏర్పాటు చేయాలని ట్రంప్ ఆదేశించారు. ఉక్రెయిన్ కాల్పుల విరమణ గురించి ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
-
2025-01-20T12:05:13+05:30
డోనాల్డ్ ట్రంప్‌కి 'ఇండియాస్పోరా' శుభాకాంక్షలు
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు, ప్రపంచ భారతీయ సమాజానికి చెందిన లాభాపేక్షలేని సంస్థ ఇండియాస్పోరా సోమవారం డోనాల్డ్ ట్రంప్‌ను అభినందించింది. కొత్త పరిపాలనలో అమెరికా-భారత్ సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇండియాస్పోరా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంఆర్ రంగస్వామి మాట్లాడుతూ, “ఇండియాస్పోరా, ఇండియన్-అమెరికన్ సమాజం తరపున, అమెరికా 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో కొత్త రాజకీయ వాతావరణం అమెరికా-భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.
-
2025-01-20T11:30:32+05:30
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రపంచంలో అత్యంత బిలియనీర్లు
ఈ కార్యక్రమానికి ప్రపంచంలో అత్యంత ధనవంతులైన ముగ్గురు టెక్ దిగ్గజాలు హాజరుకానున్నారు. వారిలో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్ ఉన్నారు. వీరితోపాటు భారత సంతతికి చెందిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా కలరు. దీంతోపాటు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిల్లా, ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, జర్మనీ ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (AfD) పార్టీకి చెందిన టినో శ్రుపాల, బ్రిటన్ పాపులిస్ట్ పార్టీ నాయకుడు నిగెల్ ఫరాజ్ పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నారు. భారత పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ సహా ఇంకా పలువురు ప్రముఖులు ఉన్నారు.
-
2025-01-20T10:31:27+05:30
ఈసారి వేదిక..
సోమవారం అంటే జనవరి 20వ తేదీన జరగనుంది. ఆ రోజు వాతావరణం అత్యంత శీతలంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో ఈ వేదికను క్యాపిటల్ రోటుండా లోపల ఏర్పాటు చేశారు. దాదాపు 40 ఏళ్ల క్రితం అంటే.. 1985లో నాటి దేశాధ్యక్షుడిగా ఎన్నికైన రోనాల్డ్ రీగన్ సైతం క్యాపిటల్ స్టెప్స్ మీద కాకుండా క్యాపిటల్ రోటుండా వేదికగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం విధితమే. 40 ఏళ్ల అనంతరం డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం క్యాపిటల్ రోటుండాలో నిర్వహించనున్నారు.
-
2025-01-20T10:21:35+05:30
భారత ప్రతినిధిగా విదేశాంగమంత్రి జై శంకర్
అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. వివిధ దేశాల అధినేతలు, వ్యాపారవేత్తలు, ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. భారత ప్రతినిధిగా విదేశాంగమంత్రి జై శంకర్ పాల్గొంటున్నారు.
-
2025-01-20T10:21:34+05:30
మొదటిసారిగా రోజంతా
అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ (Donald Trump) ఈరోజు అంటే జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జనవరి 19న తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు బ్లెయిర్ హౌస్‌లో రాత్రి గడపడం ద్వారా ఆయన ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఇది పెన్సిల్వేనియా అవెన్యూలో ఉన్న అధ్యక్షుడి అధికారిక అతిథి నివాసం. ఆదివారం (భారత కాలమానం ప్రకారం సోమవారం) ఆయన మొదటిసారిగా వాషింగ్టన్‌లో రోజంతా గడిపారు. ఈ సమయంలో ట్రంప్ ఎయిర్లింగ్టన్ జాతీయ శ్మశానవాటికలో మాజీ సైనికుల సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచారు. ఆయన క్యాపిటల్ వన్ ప్రాంతంలో జరిగే ర్యాలీలో కూడా ప్రసంగించారు.