Share News

6 PM TOP 10 NEWS: టాప్ టెన్ వార్తలు ఇవే..

ABN , Publish Date - Jan 01 , 2025 | 06:21 PM

6 PM TOP 10 NEWS: బుధవారం సాయంత్రం వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న కీలక పరిణామాల్లో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన టాప్ 10 వార్తలు మీకోసం.. ఆ వార్తలను ఇక్కడ చూడొచ్చు..

6 PM TOP 10 NEWS: టాప్ టెన్ వార్తలు ఇవే..
Top 10 News 6 PM

రైతులకు గుడ్ న్యూస్..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ భేటీలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆవన్నీ రైతుల సంక్షేమం కోసమే కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయాలు తీసుకుంది. అందుకు సంబంధించిన వివరాలను న్యూఢిల్లీలో విలేకర్ల సమావేశంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. దేశవ్యాప్తంగా రైతుల కోసం చేపట్టిన.. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని పొడిగించాలని కేబినెట్ తీర్మానం చేసిందని తెలిపారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..


హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్..

నూతన సంవత్సర కానుకగా మేడ్చల్, శామీర్ పేట్‌లకు మెట్రో పొడగించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించి డీపీఆర్‌ను సిద్ధం చేయవలసిందిగా సీఎం ఆదేశించినట్లు హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్యారడైజ్- మేడ్చల్(23 కిలోమీటర్లు), జేబీఎస్- శామీర్ పేట్ (22 కిలోమీటర్లు) మెట్రో కారిడార్లకు డీపీఆర్‌ల తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..


ఐసీసీ ర్యాంకింగ్స్.. బుమ్రా ఊహకందని ఫీట్..

భారత పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఏది పట్టుకున్నా బంగారం అయిపోతుంది. చేతికి బంతి ఇస్తే వికెట్ల వర్షం కురిపిస్తున్న ఈ ఫాస్ట్ బౌలర్.. సారథ్య పగ్గాలు ఇస్తే జట్టుకు భారీ విజయాలు అందిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వికెట్ల మీద వికెట్లు తీస్తూ ఆస్ట్రేలియా బ్యాటర్లకు ఓ రేంజ్‌లో పోయిస్తున్నాడు. ఖవాజా నుంచి స్మిత్ వరకు.. లబుషేన్ నుంచి మార్ష్ వరకు ఒక్కో బ్యాటర్‌ను టార్గెట్ చేసి మరీ ఔట్ చేస్తున్నాడు. ఈ సిరీస్‌లో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా ఉన్న బుమ్రా.. ఆరంభంలో పెర్త్ టెస్ట్‌లో కెప్టెన్సీ చేసి జట్టుకు భారీ విజయాన్ని అందించాడు. అలాంటోడు ఇప్పుడు మరో అరుదైన ఫీట్ నమోదు చేశాడు. అసలు బుమ్రా నెలకొల్పిన ఆ క్రేజీ రికార్డు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..


ఈ ఏడాది వారికి పండగే పండగ.. అస్సలు మిస్సవద్దు

చాలా మందికి టూర్‌లకు వెళ్లడం అంటే సరదా. ప్రతీరోజూ ఉద్యోగం ఒత్తిడిలో తలమొనకలైన వారు... కొద్ది రోజుల పాటు హ్యాపీగా లైఫ్‌ను ఎంజాయ్ చేయాలని భావిస్తుంటారు. అందుకోసం ఎక్కడికైనా లాంగ్ టూర్‌‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే అన్ని రోజులు సెలవులు తీసుకుంటే ఉద్యోగం చేసే చోట ఇబ్బందులు తప్పవు. అలాగే పిల్లలు కూడా స్కూళ్లకు డుమ్మా కొట్టడంతో చదువుల్లో వెనకబడే అవకాశం ఉంటుంది. అలాంటి వారికి ఈ ఏడాది లాంగ్ వీకెండ్‌లు బాగా కలిసొచ్చాయనే చెప్పుకోవచ్చు. 2025లో లాంగ్‌ వీకెండ్‌లు బాగానే ఉన్నాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..


‘గేమ్ చేంజ‌ర్‌’ సెన్సార్ పూర్తి.. సర్టిఫికేట్ ఏం వచ్చిందో తెలుసా..

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..


ఆసుపత్రి నుంచి వినోద్ కాంబ్లి డిశ్చార్జి

టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి (Vinod Kambli) ముంబై ఆసుపత్రి నుంచి బుధవారంనాడు డిశ్చార్చ్ అయ్యారు. కొద్దికాలంగా పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న కాంబ్లి గత డిసెంబర్ 21న ఆరోగ్యం క్షీణించడంతో థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చేరారు. చికిత్సానంతరం కోలుకోవడంతో న్యూఇయర్ తొలి రోజునే ఆయనను వైద్యులు డిశ్చార్జ్ చేశారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..


లాభాలతో స్వాగతం..

గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న దేశీయ సూచీలు నూతన సంవత్సరాన్ని లాభాలతో ప్రారంభించాయి. డిసెంబర్ వాహనాల సేల్స్‌లో పెరుగుదల నమోదు కావడంతో ఆటోమొబైల్ రంగం లాభాలు ఆర్జించింది. అలాగే ఈ సంవత్సరం బడ్జెట్‌పై కూడా మదుపర్లు ఆశావహంతో ఉన్నారు. దీంతో వరుస నష్టాలను ఎదుర్కొన్న దేశీయ సూచీలు బుధవారం లాభాల జో‌ష్‌ను కొనసాగించాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..


ఈ కొత్త సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉందంటే..

మేషరాశి వారికి ఈ ఏడాది ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. గృహనిర్మాణం, స్థలసేకరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు చదువుల కోసం వెళ్లేందుకు..

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..


ఫార్ములా ఈ రేస్‌ కేసుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి ఏసీబీ కేసులో అస్సలు పస లేదని.. తనకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందన్నారు కేటీఆర్. ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసు అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘పాపం.. నన్ను ఏదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తోంది. నాపై ఇది ఆరో ప్రయత్నం.. రేవంత్‌కు ఏమి దొరకటం లేదు’’ అంటూ సెటైర్ విసిరారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..


పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి నోటీసులు..

రేషన్ బియ్యం మాయం కేసులో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్‌పేట పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే పోలీసులు నోటీసులు ఇచ్చే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి తలుపులకు నోటీసులు అంటించి వెళ్లిపోయారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Jan 01 , 2025 | 06:38 PM