-
-
Home » Mukhyaamshalu » today Breaking Viral and trending Telangana Andhra Pradesh news to national and international on 7th nov 2025 vreddy
-
BREAKING: శంషాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన పలు విమానాలు ఆలస్యం
ABN , First Publish Date - Nov 07 , 2025 | 06:27 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 07, 2025 19:55 IST
రేపటి నుంచి తెరుచుకోనున్న ప్రైవేట్ విద్యాసంస్థలు
తెలంగాణ ప్రభుత్వంతో ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య చర్చలు సఫలం
రేపటి నుంచి తెరుచుకోనున్న ప్రైవేట్ విద్యాసంస్థలు
హైడ్రామా తర్వాత ఎట్టకేలకు చర్చలు సఫలం
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డితో ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య చర్చలు
రూ.1500 కోట్లలో ఇప్పటికే రూ.600 కోట్లు విడుదల చేశాం: భట్టి విక్రమార్క
వెంటనే మరో రూ.600 కోట్లు విడుదల చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
త్వరలో మరో రూ.300 కోట్లు విడుదల చేస్తాం: డిప్యూటీ సీఎం
భట్టి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కమిటీ ఏర్పాటు చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
కమిటీలో అధికారులు, యాజమాన్య ప్రతినిధులు: డిప్యూటీ సీఎం భట్టి
-
Nov 07, 2025 19:54 IST
శంషాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన పలు విమానాలు ఆలస్యం
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సాంకేతికలోపంతో విమాన సర్వీస్‌లు ఆలస్యం
చెన్నై నుంచి శంషాబాద్ రావాల్సిన రెండు విమానాలు ఆలస్యం
విమాన సర్వీస్‌ల ఆలస్యంతో ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల అవస్థలు
-
Nov 07, 2025 19:53 IST
ఎయిర్‌పోర్టుల్లో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాం: కేంద్రమంత్రి రామ్మోహన్
ATCలో సాంకేతికలోపం వల్లే అంతరాయం: రామ్మోహన్
సాంకేతిక సమస్య వెనుక బయటివ్యక్తుల ప్రమేయం లేదు: రామ్మోహన్
అయినా లోతైన దర్యాప్తు జరుపుతున్నాం: కేంద్రమంత్రి రామ్మోహన్
ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూస్తాం: రామ్మోహన్
సకాలంలో విమానాలు నడిచేలా చర్యలు చేపట్టాం: రామ్మోహన్
-
Nov 07, 2025 17:33 IST
ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్
ఏదిపడితే అది చేస్తే ఊరుకోవాలా?: సీఎం రేవంత్
ప్రైవేట్ విద్యాసంస్థలు సేవ చేయడం లేదు.. వ్యాపారం చేస్తున్నాయి: సీఎం రేవంత్
ఫీజురీయింబర్స్‌మెంట్‌పై బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు: సీఎం రేవంత్
కాలేజీలను బంద్ చేయించిన వారితో చర్చలు ఎలా ఉంటాయి?: సీఎం రేవంత్
తమాషాలు చేస్తే.. తాట తీస్తా: సీఎం రేవంత్
విడతల వారీగా నిధులు విడుదల చేస్తాం: సీఎం రేవంత్
విద్య అనేది సేవ.. వ్యాపారం కాదు: సీఎం రేవంత్
విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించం: సీఎం రేవంత్
-
Nov 07, 2025 17:03 IST
ఢిల్లీ ఎయిర్‌పోర్టు ATC సిస్టమ్‌లో సాంకేతిక లోపం
విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం
ఆలస్యంగా నడుస్తున్న 350కి పైగా విమానాలు
విమానాల ఆలస్యంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పెరిగిన రద్దీ
ఇప్పటికే షెడ్యూల్ చేసిన విమానాలన్నీ రద్దు
ముంబై ఎయిర్‌పోర్టులోనూ కుప్పకూలిన ATC వ్యవస్థ
ముంబై ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల అవస్థలు
-
Nov 07, 2025 17:03 IST
జూబ్లీహిల్స్ ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలి: సీఎం రేవంత్
మేము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటు వేయండి: సీఎం రేవంత్
పదేళ్లలో జూబ్లీహిల్స్‌కు బీఆర్‌ఎస్, బీజేపీ ఏం చేశాయి?: సీఎం రేవంత్
కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి పథంలో సాగింది: సీఎం రేవంత్
ఎవరి హయాంలో హైదరాబాద్ అభివృద్ధి జరిగిందో ఆలోచించండి: రేవంత్
2014 నుంచి హైదరాబాద్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: సీఎం రేవంత్
-
Nov 07, 2025 16:42 IST
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
తమ వద్ద ఉన్న అణ్వాయుధాలతో ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేయగలం: ట్రంప్
అణు నిరాయుధీకరణ అనేది గొప్ప విషయం: ట్రంప్
ప్రపంచంలో శాంతి ఉండాలని నేను కోరుకుంటున్నా: ట్రంప్
ప్రపంచంలో చాలా దేశాలు అణ్వాయుధాలు పరీక్షిస్తున్నాయి: ట్రంప్
-
Nov 07, 2025 16:41 IST
అమెరికా వీసా.. వారికి షాక్..
అమెరికా వీసా జారీలో ట్రంప్ యంత్రాంగం కొత్త మార్గదర్శకాలు
అమెరికాలో నివాసం ఉండాలనుకునే విదేశీయులకు.. డయాబెటిస్, ఒబెసిటీ ఉంటే ఇకపై అమెరికా వీసా నిరాకరణ
ఎంబసీలు, కాన్సులేట్ కార్యాలయాలకు అమెరికా సర్కార్ ఆదేశాలు
-
Nov 07, 2025 14:01 IST
ఏపీఐఐసీ బోర్డు డైరెక్టర్లను నియమించిన ఏపీ ప్రభుత్వం
పలు జిల్లాల నుచి 15 మంది బోర్డు డైరెక్టర్లుగా నియామకం
రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్న APIIC బోర్డు డైరెక్టర్లు
-
Nov 07, 2025 12:45 IST
క్రికెటర్ శ్రీచరణికి భారీ నజరానా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
క్రికెటర్ శ్రీచరణికి గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం
శ్రీచరణికి రూ.2.5కోట్లు, కడపలో ఇంటి స్థలం ఇవ్వనున్న ప్రభుత్వం
-
Nov 07, 2025 12:15 IST
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విక్కీ కౌశల్
-
Nov 07, 2025 12:14 IST
వందేమాతరం గీతం ఒక స్వప్నం, ఒక సంకల్పం: ప్రధాని మోదీ
వందేమాతరం శబ్దం ఆత్మవిశ్వాసం నింపుతుంది: మోదీ
వందేమాతరం సామూహిక గీతాలాపన అద్భుత అనుభవం: మోదీ
వందేమాతరం స్మారకోత్సవాలు దేశ ప్రజలకు ప్రేరణ ఇస్తాయి
వందేమాతరం స్మారక స్టాంపు, నాణెం విడుదల చేశాం: మోదీ
-
Nov 07, 2025 12:14 IST
బీజేపీ, ఈసీపై మరోసారి రాహుల్‌గాంధీ విమర్శలు
ఓట్ల చోరీపై ఇప్పటివరకు బీజేపీ, ఈసీ స్పందించలేదు: రాహుల్
ఓట్ల చోరీతోనే మోదీ ప్రధాని అయ్యారు: రాహుల్‌గాంధీ
ఓట్ల చోరీపై మా దగ్గర చాలా సమాచారం ఉంది: రాహుల్
హరియాణాలో హోల్‌సేల్‌గా ఓట్ల చోరీ జరిగింది: రాహుల్
బిహార్‌లో కూడా ఇదే ఘటన పునరావృతం కాబోతోంది: రాహుల్
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, గుజరాత్‌లోనూ ఇదే జరిగింది
ఓట్ల చోరీపై బీజేపీ ఆత్మరక్షణలో పడిందే తప్ప వ్యతిరేకించట్లేదు
బీజేపీ, ఈసీ కలిసి రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయి: రాహుల్
-
Nov 07, 2025 12:13 IST
మర్రి జనార్దన్ ఇంట్లోకి సివిల్ పోలీసులు వెళ్లలేదు: వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్
ఫ్లయింగ్ స్క్వాడ్, CISF పోలీసులు మాత్రమే వెళ్లారు
మర్రి జనార్దన్ నివాసంలో ఎలాంటి నగదు దొరకలేదు: డీసీపీ శ్రీనివాస్
ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సమాచారంతో తనిఖీలు
పోలీసులు డబ్బు సంచులు పెట్టారనేది అవాస్తవం: డీసీపీ శ్రీనివాస్
-
Nov 07, 2025 12:11 IST
హైదరాబాద్: ఉపఎన్నికలో బీజేపీ ఘోరంగా ఓడిపోతుంది: పొన్నం
అందుకే BRSకు BJP సపోర్టు చేస్తోంది: మంత్రి పొన్నం
ఉపఎన్నికలో బీజేపీకి అసలు డిపాజిట్ వస్తుందా?: మంత్రి పొన్నం
11న జరిగే ఎన్నికలో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే: పొన్నం
ఈసీ సోదాలతో ప్రభుత్వానికి సంబంధం లేదు: మంత్రి పొన్నం
కోడ్ లేని ఏరియాలో సమాచారం ఉంటే ఈసీ సోదాలు చేస్తుంది: పొన్నం
-
Nov 07, 2025 11:11 IST
వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
రహదారులపైకి కుక్కలు, పశువులు రాకుండా చర్యలు తీసుకోవాలి
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి: సుప్రీంకోర్టు
డ్రైవ్ అమలుపై 8 వారాల్లో స్టేటస్ రిపోర్టు అందజేయాలి: సుప్రీంకోర్టు
స్కూల్స్, బస్టాండ్, రైల్వేస్టేషన్, ఆస్పత్రుల్లోకి..
కుక్కలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి: సుప్రీంకోర్టు
వీధి కుక్కల నిర్వహణపై అమికస్ క్యూరీ నివేదికను అమలు చేయాలి
నివేదిక అమలుపై అఫిడవిట్ దాఖలు చేయకుంటే చర్యలు తప్పవు: సుప్రీం
-
Nov 07, 2025 10:30 IST
ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి
శ్రీచరణిని అభినందించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
-
Nov 07, 2025 10:29 IST
ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్‌కు మంత్రి నిమ్మల
గండిపడిన తీగలేరు కాలువను పరిశీలించిన మంత్రి నిమ్మల
తుఫాన్‌తో రైతులు నష్టపోయారని మంత్రి దృష్టికి తెచ్చిన అధికారులు
తక్షణమే రైతుల సమస్యల పరిష్కరించాలని కలెక్టర్‌కు మంత్రి ఆదేశం
-
Nov 07, 2025 10:29 IST
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నివాసంలో తనిఖీలు
మోతీనగర్‌లోని నివాసంలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు
జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ ఉంచినట్టు ఆరోపణ
-
Nov 07, 2025 10:06 IST
అక్రమాస్తుల కేసులో CBI కోర్టులో మెమో దాఖలు చేసిన వైఎస్ జగన్
ఈనెల 14లోపు వ్యక్తిగతంగా హాజరుకావాలని గతంలో జగన్‌కు కోర్టు ఆదేశం
కోర్టు గడువు సమీపిస్తుండటంతో మోమో దాఖలు చేసిన వైఎస్ జగన్
వ్యక్తిగత హాజరు మినహాయించాలని పిటిషన్‌లో పేర్కొన్న జగన్
-
Nov 07, 2025 10:06 IST
వరంగల్: ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
గన్ కల్చర్‌పై దృష్టి సారించిన పోలీసులు
రౌడీషీటర్ సూరి మూకను మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్న పోలీసులు
సూరి గ్యాంగ్‌పై ABN వరుస కథనాల తర్వాత కూపీ లాగిన పోలీసులు
రౌడీషీటర్ సూరిపై హైదరాబాద్‌లో 39 కేసులు, 3 పీడీ యాక్ట్‌లు
గత నెల 5న ముగిసిన సూరి హైదరాబాద్ నగర బహిష్కరణ
సూరి గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు
బిహార్ నుంచి సూరి గ్యాంగ్ ఆయుధాలు దిగుమతి చేసుకున్నట్టు గుర్తింపు
-
Nov 07, 2025 10:06 IST
నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్‌మార్కెట్లు
సెన్సెక్స్ 560, నిఫ్టీ 160 పాయింట్లకు పైగా నష్టం
-
Nov 07, 2025 08:41 IST
హైదరాబాద్: ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల సభకు నో పర్మిషన్
నేడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్న FATHI
బండ్లగూడ అరోరా కాలేజీలో సభ ఏర్పాటుకు నిర్ణయం
-
Nov 07, 2025 08:41 IST
నేటి నుంచి ఆపరేషన్‌లోకి నిసార్ ఉపగ్రహం
ప్రతి 12 రోజులకు ఒకసారి భూమిని స్కాన్ చేసి..
హిమ ప్రాంతాల డేటాను ఇవ్వనున్న నిసార్ ఉపగ్రహం
-
Nov 07, 2025 08:40 IST
కాళేశ్వరం పునరుద్ధరణపై L&Tకి తెలంగాణ సర్కార్ వార్నింగ్
పునరుద్ధరణపై వారం రోజుల్లోగా సానుకూలంగా స్పందించాలని డెడ్ లైన్
లేదంటే L&Tని బ్లాక్ లిస్ట్‌లో పడతామని ప్రభుత్వం హెచ్చరిక
రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద డిపాజిట్లు, పెండింగ్ బిల్లులు జప్తు చేస్తామన్న ప్రభుత్వం
-
Nov 07, 2025 08:13 IST
దక్షిణ మధ్య రైల్వే నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు
చర్లపల్లి, నర్సాపూర్, మచిలీపట్నం నుంచి ప్రత్యేక రైళ్లు
జనవరి వరకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే
నేటి నుంచి ముందస్తు టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం
-
Nov 07, 2025 06:46 IST
అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్
ఉ.9-9:30 గంటలకు వరకు నేషనల్ ఉమెన్ క్రికెట్ టీమ్‌తో భేటీ
చంద్రబాబుతో క్రికెటర్ శ్రీచరణితో సమావేశం
సచివాలయంలో SIPB భేటీలో పాల్గొననున్న చంద్రబాబు
అనంతరం సీఆర్డీఏ అథార్టీ భేటీలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
అనంతరం ఎన్జీరంగా వర్సిటీకి సీఎం చంద్రబాబు
ఎన్జీరంగా 125 జయంతి వేడుకలకు హాజరు
ఎన్జీరంగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్న చంద్రబాబు
-
Nov 07, 2025 06:46 IST
హైదరాబాద్: పాతబస్తీలో అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు
మిషన్ చబుత్రా పేరుతో బండ్లగూడ పరిధిలో పోలీసుల తనిఖీలు
అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
స్మశానాలు, ఖాళీ ప్రదేశాల్లో పోలీసుల సోదాలు
అర్ధరాత్రి గుంపులుగా తిరుగుతున్న ఆకతాయిలపై చర్యలు
-
Nov 07, 2025 06:45 IST
మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు
భారత్‌కు చేరిన 12 మంది తెలంగాణ, 11 మంది ఏపీ వాసులు
సైబర్ మోసాలతో మయన్మార్‌లో బందీలైన భారతీయులు
-
Nov 07, 2025 06:41 IST
రేపటి నుంచి ఆఫ్రికాలో రాష్ట్రపతి ముర్ము పర్యటన
ఈనెల 11 వరకు అంగోలాలో పర్యటించనున్న రాష్ట్రపతి
అనంతరం బోట్స్‌వానాలో పర్యటించనున్న ముర్ము
-
Nov 07, 2025 06:41 IST
చరిత్ర సృష్టించిన శీతల్
సాధారణ ఆర్చర్లతో కలిసి ఆసియాకప్ పోటీలకు ఎంపిక
జెడ్డాలో ఆసియాకప్ స్టేజ్-3లో పోటీ పడే భారత జట్టులో చోటు
రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో అద్భుత నైపుణ్యంతో...
పారా క్రీడల్లో ప్రపంచ స్థాయికి ఎదిగిన శీతల్ దేవి
-
Nov 07, 2025 06:40 IST
అమెరికాలో విమాన సర్వీసులపై షట్‌డౌన్ ఎఫెక్ట్
నేటి నుంచి 1,800 విమానాలు రద్దు
విమాన రాకపోకల్లో తీవ్రజాప్యం
-
Nov 07, 2025 06:40 IST
బిహార్‌లో రికార్డు స్థాయిలో పోలింగ్
చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం
తొలిదశలో 65 శాతం ఓటింగ్ నమోదు
ఈనెల 11న బిహార్ రెండోదశ అసెంబ్లీ ఎన్నికలు
రెండో దశలో 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్
ఈనెల 14న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
-
Nov 07, 2025 06:40 IST
ఈ నెల 12న నియోజకవర్గాల్లో వైసీపీ ర్యాలీలు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా..
ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం వైసీపీ నిరసన ర్యాలీలు
-
Nov 07, 2025 06:39 IST
హైదరాబాద్‌లో 4 రోజుల పాటు వైన్స్ బంద్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఆంక్షలు
నవంబర్ 9 నుంచి 12 వరకు వైన్స్ బంద్
-
Nov 07, 2025 06:27 IST
వందేమాతరానికి నేటితో 150 ఏళ్లు
ఉదయం 9:50కు దేశవ్యాప్తంగా జాతీయ గేయాలాపన
ఏడాది పొడవునా వేడుకలు.. ప్రారంభిస్తామన్న ప్రధాని మోదీ
-
Nov 07, 2025 06:27 IST
వచ్చే ఏడాది భారత్ పర్యటన: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
భారత ప్రధాని మోదీ నాకు మంచి మిత్రుడు: ట్రంప్
భారత్‌తో వాణిజ్య చర్చలు అద్భుతంగా సాగుతున్నాయి: ట్రంప్
త్వరలో భారత్-అమెరికా చర్చలు కొలిక్కివస్తాయి: ట్రంప్
రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోళ్లను భారీగా తగ్గించింది: ట్రంప్
-
Nov 07, 2025 06:27 IST
తిరువూరు ఎంపీ, ఎమ్మెల్యే మధ్య రచ్చకెక్కిన విభేదాలు
నేడు తిరువూరులో MLA కొలికపూడి ఆధ్వర్యంలో ప్రజాదర్బార్
ఎంపీ చిన్ని ఫొటో లేకుండా కొలికపూడి ప్రజాదర్బార్ పోస్టర్
ఫొటో లేకపోవడంపై మండిపడుతున్న ఎంపీ చిన్ని అభిమానులు
-
Nov 07, 2025 06:27 IST
ఏపీలో ద్రోణి ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో వర్షాలు: వాతావరణశాఖ
కోనసీమ, ప.గో., తిరుపతి జిల్లాల్లో..
అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు