-
-
Home » Mukhyaamshalu » Today Breaking News Maha Kumbh 2025 PM Modi Holy dip Latest Telugu News Updates Tuesday 05 th February 2025
-
Breaking News: ఆ నాయకులపై చర్యలు.. టీపీసీసీ చీఫ్ క్లారిటీ
ABN , First Publish Date - Feb 05 , 2025 | 10:46 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2025-02-05T15:29:08+05:30
ఆ నాయకులపై చర్యలు.. టీపీసీసీ చీఫ్ క్లారిటీ
ఎంత చిన్నవాడైనా, పెద్ద వాడైనా పార్టీ క్రమశిక్షణకి లోబడి ఉండాలి
పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు
ప్రతిపక్షాల ట్రాప్‌లో పడొద్దు
కులగణన సర్వేను నీరుగార్జే యత్నం చేస్తున్నారు
కులగణన సర్వే పారదర్శకంగా జరిగింది
సర్వేలో ఎలాంటి అనుమానాలకు తావులేదు
సర్వేతో వాస్తవాలు బయటకొచ్చాయి
-
2025-02-05T12:47:48+05:30
వర్గీకరణలో కుట్ర.. మందకృష్ణ సంచలన వ్యాఖ్యలు
ఎస్సీ వర్గీకరణలో కొన్ని లోపాలున్నాయి
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలి
జనాభాకు తగినట్లు రిజర్వేషన్లు ఇవ్వండి
మాదిగల జనాభా ప్రకారం రిజర్వేషన్ల వాటా రాలేదు
రెండు శాతం తక్కువ వచ్చింది
11 శాతం ఉండాల్సింది.. 9శాతంగా ఉంది
లోపాలను వెంటనే సరిచేయాలి
-
2025-02-05T12:09:29+05:30
ఉత్తరాంధ్ర వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
విశాఖపట్నం రైల్వే డివిజన్, విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని నిర్ణయించిన కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ.
వాల్తేర్ డివిజన్ పేరు విశాఖపట్నం డివిజన్‌గా మార్పు.
విశాఖ డివిజన్ పరిధి కూడా మారుస్తూ తాజా ఉత్తర్వులు.
కూటమి ప్రభుత్వం విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని తాజా ఉత్తర్వులు.
సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు.
రాయగడ రైల్వే డివిజన్ పరిధిని కూడా ఖరారు చేస్తూ ఉత్తర్వులు
విశాఖ డివిజన్‌లో 410 కిలోమీటర్ల పరిధిని చేర్చిన రైల్వే అధికారులు
కొండపల్లి-మొటుమర్రి సెక్షన్‌ను సికింద్రాబాద్ డివిజన్ నుంచి విజయవాడ డివిజన్‌గా మార్చిన రైల్వే మంత్రిత్వ శాఖ.
-
2025-02-05T12:01:06+05:30
త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించాక గంగా నదికి హారతి ఇచ్చారు మోడీ.
మహా కుంభ్‌కు తరలివచ్చిన అశేష ప్రజానీకానికి అభివాదం చేశారు మోడీ.
గంగా హారతి తర్వాత త్రివేణి సంగమం నుంచి ప్రయాగ్‌రాజ్‌కు మోడీ తిరుగు ప్రయాణమయ్యారు.
-
2025-02-05T11:33:32+05:30
గంగా మాతకు ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించాక.. మోడీ ప్రత్యేక పూజలు చేశారు.
-
2025-02-05T11:26:25+05:30
మహా కుంభమేళాలో మోడీ పవిత్ర స్నానం ఆచరించారు.
చేతితో రుద్రాక్ష మాలతో త్రివేణి సంగమంలో మునకలు వేశారు ప్రధాని.
-
2025-02-05T11:18:26+05:30
పుణ్యస్నానం ఆచరించేందుకు సంఘం ఘాట్‌కు బోటులో బయల్దేరారు మోడీ.
కుంభమేళాకు వచ్చిన మోడీని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. ఆయనతో పాటు బోటులో కూర్చొని సంగం ఘాట్‌కు బయల్దేరారు.
మోడీతో పాటు యోగి ఆదిత్యనాథ్ కూడా పవిత్ర స్నానం ఆచరించనున్నారు.
ఆల్రెడీ మహా కుంభ్‌లో ఒకమారు పుణ్య స్నానం ఆచరించిన యోగి ఆదిత్యనాథ్.. మరోమారు ప్రధానితో కలసి త్రివేణి సంగమంలో మునక వేయనున్నారు.
-
2025-02-05T11:06:24+05:30
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పొద్దున 7 గంటలకు పోలింగ్ మొదలైంది. తొలి గంటల్లోనే రాష్ట్రప్రతి ద్రౌపదీ ముర్ముతో పాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.
బుధవారం సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఓటింగ్‌లో 1.56 కోట్ల మంది ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
రాష్ట్రపతి ముర్ముతో పాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్, మరో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.
-
2025-02-05T10:58:20+05:30
ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళాకు విచ్చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు ఆయన ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు.
ఉదయం 10 గంటలకు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్న మోడీ.. అక్కడి నుంచి అరైల్ ఘాట్‌కు పయనం అయ్యారు. ఆ ఘాట్ నుంచి బోటు మీద కుంభమేళా జరిగే ప్రాంతానికి ఆయన చేరుకుంటారు.
కుంభమేళా జరిగే ప్రాంతంలో మోడీ కేవలం గంట సేపు మాత్రమే ఉండనున్నారు. పుణ్యస్నానం ఆచరించాక, ప్రార్థనలు చేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు.