Share News

Breaking News: నేటి తాజా వార్తలు..

ABN , First Publish Date - Feb 14 , 2025 | 12:42 PM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: నేటి తాజా వార్తలు..
Breaking News

Live News & Update

  • 2025-02-14T18:04:53+05:30

    దారుణం.. కన్న కుమారుడినే ముక్కలు ముక్కలుగా నరికిన తల్లి..

    • ప్రకాశం: కంభం పట్టణం తెలుగు వీధిలో దారుణం

    • కన్న కుమారుడినే ఓ కసాయి తల్లి హత్య చేయించిన ఉదంతం కలకలం రేపుతోంది

    • కదం శ్యామ్(35)ని ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేయించిన తల్లి సాలమ్మ

    • ఆటో డ్రైవర్ మోహన్‌తో కలిసి దారుణానికి ఒడికట్టిన సాలమ్మ

    • హత్య అనంతరం మేదర్ బజార్ సమీపంలోని పంట కాలువలో శరీర భాగాలను పడేసిన నిందితులు

    • శ్యామ్‌ను చంపేసిన తర్వాత మూడు గోనె సంచుల్లో శరీర భాగాలను పెట్టి పడవేసిన తల్లి సాలమ్మ

    • తన తమ్ముడిని హత్య చేయించారని పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్యామ్ సోదరుడు సుబ్రహ్మణ్యం

    • సుబ్రహ్మణం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

    • ఆస్తి వివాదం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు

    • తల్లి సాలమ్మను, ఆటో డ్రైవర్ మోహన్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

  • 2025-02-14T15:27:42+05:30

    మతప్రచారం చేస్తున్న ప్రిన్సిపల్.. ఆగ్రహించిన గ్రామస్థులు..

    • ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎంపీపీ స్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడు మత ప్రచారాలు

    • పాఠశాలకు చెందిన హాజరుపట్టిక, మిడ్ డే మిల్స్, ఇతర పుస్తకాలలో ఓ మతానికి చెందిన వ్యాఖ్యలు రాస్తున్న ప్రిన్సిపల్

    • ఓ వర్గం దేవుళ్లని కించపరుస్తూ పాఠాలు బోధిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయుడిపై పెద్దఎత్తున వస్తున్న ఆరోపణలు

    • మధ్యాహ్న భోజనం బాగోవడం లేదని హెచ్‌ఏంకి ఫిర్యాదు చేస్తే కొడుతున్నారంటూ విద్యార్థులు ఆవేదన

    • ఆడపిల్లలతోనూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటూ ప్రిన్సిపల్‌పై విద్యార్థినిల తల్లిదండ్రులు మండిపాటు

    • మతపరమైన అంశాలు పిల్లలకి బోధిస్తున్నారంటూ తోటి ఉపాధ్యాయులు సైతం చెప్తున్న వైనం

    • పాఠశాలలో తమకు కనీసం ఫ్యాన్‌లు కూడా వేయడం లేదని ఆరోపిస్తున్న చిన్నారులు

    • విషయం తెలుసుకుని పెద్దఎత్తున పాఠశాల వద్దకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు

    • దీంతో పాఠశాలకు సెలవు పెట్టి అక్కడ్నుంచి వెళ్లిపోయిన ప్రధానోపాధ్యాయుడు

    • మండల విద్యాశాఖ అధికారికి చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్థుల ఆరోపణ

    • ప్రధానోపాధ్యాయుడికి ఎంఈవో సహకరిస్తున్నారని మండిపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు

    • గతంలోనూ ఇలానే జరిగిందని, ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రిన్సిపల్‌లో మార్పు రావడం లేదని ఆగ్రహం

  • 2025-02-14T14:56:42+05:30

    ఏసీబీ అధికారులకు చిక్కిన మరో అవినీతి తిమింగలం..

    • హైదరాబాద్: గచ్చిబౌలి ఏడీఈ కార్యాలయంపై దాడులు చేసిన ఏసీబీ అధికారులు

    • రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడిన గచ్చిబౌలి ఏడీఈ సతీశ్ రెడ్డి

    • ట్రాన్స్‌ఫార్మర్ ఇచ్చేందుకు రూ.75 వేలు డిమాండ్ చేసిన గచ్చిబౌలి సతీశ్ రెడ్డి

    • ముందుగా రూ.25 వేలు ఇచ్చిన బాధితుడు.. అనంతరం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు

    • మిగతా రూ.50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడిన ఏడీఈ సతీశ్ రెడ్డి

  • 2025-02-14T14:23:07+05:30

    కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై నేడు కీలక ప్రజెంటేషన్ కార్యక్రమం..

    • కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ సర్కార్

    • కులగణన, వర్గీకరణపై హైదరాబాద్ గాంధీ భవన్‌లో నేడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్

    • ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు కాంగ్రెస్ నేతలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్

    • టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నేతలకు అవగాహన కార్యక్రమాలు

    • ప్రభుత్వం చేసిన కులగణన సర్వేపై ప్రజెంటేషన్ ఇవ్వనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

    • అలాగే ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి దామోదర రాజనర్సింహ

    • లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బీసీలకు ఇవ్వాల్సిన 42 శాతం రిజర్వేషన్‌పై దిశానిర్దేశం

    • హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ

    • మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు సహా హాజరుకానున్న పార్టీ శ్రేణులు

  • 2025-02-14T14:06:57+05:30

    పోర్న్ చిత్రాల మాదిరిగా రాత్రిళ్లు ఉండాలంటూ నవవధువుకు వేధింపులు

    • విశాఖ: గోపాలపట్నం పరిధిలో కలకలం రేపుతున్న నవవధువు ఆత్మహత్య

    • నీలిచిత్రాల వీడియోల్లో ఉండే విధంగా తనతో ఉండాలని భార్యను వేధించిన భర్త

    • సంసార జీవితం విషయంలో భార్యాభర్తల మధ్య పలుమార్లు తలెత్తిన వివాదాలు

    • ఇదే విషయమై వైద్యుల వద్దకు వెళ్లి కౌన్సెలింగ్ తీసుకున్న భార్యాభర్తలు

    • అయినా భర్త తీరులో మార్పు రాకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన నవవధువు

    • భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బాధిత బంధువుల ఆరోపణ

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గోపాలపట్నం పోలీసులు

  • 2025-02-14T13:51:11+05:30

    యాసిడ్ దాడి బాధిత కుటుంబానికి వీడియో కాల్ చేసిన హోంమంత్రి..

    • అన్నమయ్య జిల్లా: గుర్రంకొండ మండలంలో యాసిడ్ దాడి ఘటనపై స్పందించిన ఏపీ హోంమంత్రి అనిత

    • పేరంపల్లికి చెందిన యువతిపై యాసిడ్ దాడిని తీవ్రంగా ఖండించిన హోంమంత్రి వంగలపూడి అనిత

    • సంబంధిత అధికారులను అడిగి బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన హోంమంత్రి

    • యువతి కుటుంబసభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడి ధైర్యం చెప్పిన హోంమంత్రి అనిత

    • మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించిన వంగలపూడి అనిత

    • యాసిడ్ దాడికి పాల్పడిన ఉన్మాదిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశం

  • 2025-02-14T13:34:44+05:30

    విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం..

    • తెలంగాణ విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహణ

    • ప్రతీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల స్థల సేకరణ, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం

    • వంద నియోజకవర్గాల్లో నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి

    • నియోజకవర్గాల్లో స్థలాల కేటాయింపులు పూర్తయిన స్కూళ్ల అనుమతుల పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశం

    • ప్రతిపాదిత స్థలాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించిన ముఖ్యమంత్రి

    • అనువైన స్థలం లేని చోట ప్రత్యామ్నాయ స్థలాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించిన రేవంత్ రెడ్డి

    • కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేసి వీలైనంత త్వరగా స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచన

    • రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి స్థలాల గుర్తింపు ప్రక్రియకు సంబంధించి వారం రోజుల్లో రిపోర్ట్ అందించాలని ఆదేశం

    • స్థల సేకరణ జరిగిన నియోజకవర్గాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం

    • రెండేళ్లలో 105 నియోజకవర్గాల్లో అన్ని రకాల మౌలిక వసతులతో వంద శాతం పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం

    • వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో ఆ స్థాయి ప్రమాణాలతో సరైన మౌలిక వసతులు కల్పించాలన్న ముఖ్యమంత్రి

    • ప్లే గ్రౌండ్, అకడమిక్ బ్లాక్, ఇతర సౌకర్యాలు సహా భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం

    • యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

  • 2025-02-14T13:11:36+05:30

    భారత్‌కు రానున్న మరో రెండు విమానాలు..

    • ఢిల్లీ: అమెరికా నుంచి ఇండియాకు శనివారం చేరుకోనున్న మరో రెండు విమానాలు

    • అక్రమ మార్గాల్లో అమెరికా వెళ్లిన భారతీయులతో రానున్న విమానాలు

    • ఇప్పటికే పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌కు చేరుకున్న మొదటి విమానం

    • మొదటి విమానంలో 104 మంది భారతీయులను తీసుకువచ్చిన అమెరికా అధికారులు

    • రానున్న రెండు విమానాల్లో దాదాపు 200 మంది భారతీయులు ఇండియాకు రాక

    • ఈనెల 15న చేరుకోనున్న 2వ విమానం, 16న చేరుకోనున్న 3వ విమానం

  • 2025-02-14T12:57:29+05:30

    వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం..

    • విజయవాడ: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు కేసులో కీలక పరిణామం

    • వల్లభనేని వంశీ ఆయనతోపాటు అరెస్ట్ అయిన మరో ఇరువురిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్

    • మరోవైపు బెయిల్ పిటిషన్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్న వంశీ తరఫు న్యాయవాదులు

    • ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఉన్న వల్లభనేని వంశీని విడిపించేందుకు ప్రయత్నాలు

    • ఈ కేసులో మరికొందరు కీలక నిందితులు అరెస్ట్ కావాల్సి ఉందని చెబుతున్న పోలీసులు

    • గన్నవరం టీడీపీ కార్యాలయం విధ్వంసం కేసు ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్‌లో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు

    • కోర్టు కాంప్లెక్స్ వద్దకు సత్యవర్ధన్‌ను తీసుకువచ్చిన వాహనం, అందులో వచ్చిన వారి వివరాలు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా సేకరించిన పోలీసులు

    • సత్యవర్ధన్‌ను విజయవాడలో ఎక్కడెక్కడ తిప్పారనే అంశంపైనా సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు

    • వంశీ అనుచరులే ఆ రోజున సత్యవర్ధన్‌ను తీసుకువచ్చారని నిర్ధారణకు వచ్చిన పోలీసులు

    • ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులు ఉండటంతో మిగతా వారి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు

    • గన్నవరం, విజయవాడలో వంశీ అనుచరులపై నిఘాపెట్టిన నగర పోలీసులు

    • తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని ఇప్పటికే ప్రకటించిన విజయవాడ సీపీ రాజశేఖరబాబు

  • 2025-02-14T12:42:43+05:30

    ప్రేమోన్మాది దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు..

    • అన్నమయ్య జిల్లా: పీలేరులో యువతిపై ప్రేమోన్మాది దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు

    • నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశం

    • గుర్రంకొండ మండలం పేరంపల్లిలో యాసిడ్ దాడిపై సీఎం తీవ్ర ఆగ్రహం

    • బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచన

    • యువతికి, ఆమె కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా