Share News

Breaking News: తెలంగాణలో కులగణన సర్వే చేపట్టాలని పుష్‌ చేశా: రాహుల్‌ గాంధీ

ABN , First Publish Date - Jul 24 , 2025 | 11:39 AM

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: తెలంగాణలో కులగణన సర్వే చేపట్టాలని పుష్‌ చేశా: రాహుల్‌ గాంధీ

Live News & Update

  • Jul 24, 2025 18:59 IST

    ఛత్తీస్‌గఢ్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయిన 39 మంది మావోయిస్టులు

    • బీజాపూర్‌ జిల్లాలో ఐజీ ఎదుట లొంగిపోయిన 25 మంది మావోయిస్టులు

    • నారాయణపూర్‌, సుక్మా జిల్లాల్లో లొంగిపోయిన 14 మంది మావోయిస్టులు

    • లొంగిపోయిన వారిలో 8 మంది మహిళా మావోయిస్టులు

  • Jul 24, 2025 18:58 IST

    మాంచెస్టర్‌ టెస్టు: తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 358 పరుగులకు ఆలౌట్‌

    • భారత్‌ బ్యాటింగ్‌: సుదర్శన్‌ 61, జైస్వాల్‌ 58, పంత్‌ 54, రాహుల్‌ 46

    • శార్దూల్‌ ఠాకూర్‌ 41, వాషింగ్టన్‌ సుందర్‌ 27, రవీంద్ర జడేజా 20 పరుగులు

    • ఇంగ్లండ్‌ బౌలింగ్‌: బెన్‌ స్టోక్స్ 5, ఆర్చర్‌ 3, వోక్స్‌, డాసన్‌కు చెరో వికెట్‌

  • Jul 24, 2025 18:51 IST

    తెలంగాణలో కులగణన సర్వే చేపట్టాలని పుష్‌ చేశా: రాహుల్‌ గాంధీ

    • తెలంగాణలో కులగణనను స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు: రాహుల్‌

    • 55 ప్రశ్నలతో క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి కులగణన చేపట్టారు: రాహుల్‌

    • విజయవంతంగా కులగణన నిర్వహించడం అంత ఈజీ కాదు: రాహుల్‌

    • రేవంత్‌ సహా కాంగ్రెస్‌ నేతలు అంచనాలకు మించి రాణించారు: రాహుల్‌

    • దేశంలో సామాజిక న్యాయానికి ఇదో మైలురాయిగా నిలుస్తుంది: రాహుల్‌

    • దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిన అవసరం ఉంది: రాహుల్‌ గాంధీ

  • Jul 24, 2025 18:51 IST

    కాంగ్రెస్‌ ఒత్తిడితో దేశవ్యాప్త కులగణనకు కేంద్రం దిగివచ్చింది: రేవంత్‌

    • పుట్టుకతో మోదీ ఓబీసీ కాదు.. ఆయన లీగల్లీ కన్వర్టెడ్‌ ఓబీసీ: రేవంత్‌

    • ఓబీసీల కోసం మోదీ మనస్ఫూర్తిగా చేసిందేమీ లేదు: సీఎం రేవంత్‌

    • బీసీలపై ప్రధాని మోదీకి నిజమైన ప్రేమ లేదు: సీఎం రేవంత్‌

    • దేశం కోసం కాంగ్రెస్‌ మాత్రమే త్యాగాలు చేసింది: సీఎం రేవంత్‌

    • మొదట్లో జనగణనతో పాటు కులగణనకు కేంద్రం అంగీకరించలేదు: రేవంత్‌

    • రాహుల్‌ పోరాటం వల్లే కులగణనకు కేంద్రం దిగివచ్చింది: సీఎం రేవంత్‌

    • రాహుల్‌ పోరాటం వల్లే 3 రైతు చట్టాలను కేంద్రం రద్దు చేసింది: రేవంత్‌

  • Jul 24, 2025 18:51 IST

    ఢిల్లీ: కులగణనపై సీఎం రేవంత్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రెజేంటేషన్‌

    • దేశవ్యాప్త కాంగ్రెస్‌ ఎంపీలకు తెలంగాణ సీఎం రేవంత్‌ ప్రెజెంటేషన్‌

    • తెలంగాణ మోడల్‌ అంటే ఏంటో తెలిపేందుకే ఈ ప్రెజెంటేషన్‌: రేవంత్

    • భారత్‌ జోడో యాత్రలో కులగణనపై రాహుల్‌ హామీ ఇచ్చారు: రేవంత్‌

    • తెలంగాణలో అధికారంలోకి రాగానే కులగణన సర్వే చేశాం: రేవంత్‌

    • దేశానికి ఒక దశ దిశను చూపించేలా కులగణన సర్వే చేపట్టాం: రేవంత్‌

    • దాదాపు వందేళ్ల తర్వాత కులగణన ప్రక్రియ నిర్వహించాం: రేవంత్

  • Jul 24, 2025 18:16 IST

    ఛత్తీస్‌గఢ్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయిన 39 మంది మావోయిస్టులు

    • బీజాపూర్‌ జిల్లాలో ఐజీ ఎదుట లొంగిపోయిన 25 మంది మావోయిస్టులు

    • నారాయణపూర్‌, సుక్మా జిల్లాల్లో లొంగిపోయిన 14 మంది మావోయిస్టులు

    • లొంగిపోయిన వారిలో 8 మంది మహిళా మావోయిస్టులు

  • Jul 24, 2025 18:16 IST

    ఎన్నికల సమయంలో కులగణన చేస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు: భట్టి

    • రాహుల్‌ హామీ మేరకు తెలంగాణలో కులగణన చేపట్టాం: డిప్యూటీ సీఎం భట్టి

    • అందుకు తగ్గట్టుగానే ఎవరి జనాభా ఎంత అనేది తేల్చాం: భట్టి విక్రమార్క

    • తెలంగాణలో కులగణన ఓ చరిత్ర: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

    • కులగణనతో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది: డిప్యూటీ సీఎం భట్టి

    • దాదాపు 2 లక్షల మంది సిబ్బందితో 50 రోజుల్లో సర్వే నిర్వహించాం: భట్టి

    • తెలంగాణ మొత్తాన్ని బ్లాక్‌లుగా విభజించి సర్వే నిర్వహించాం: భట్టి విక్రమార్క

    • కులగణన సర్వేను తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది: భట్టి

  • Jul 24, 2025 18:16 IST

    ఢిల్లీ: కుల గణనపై ఇందిర భవన్‌లో పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌

    • దేశవ్యాప్త కాంగ్రెస్‌ ఎంపీలకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి ప్రెజెంటేషన్‌

    • సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేపై ప్రెజెంటేషన్‌

    • హాజరైన రాహుల్‌గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ, కాంగ్రెస్‌ ఎంపీలు

  • Jul 24, 2025 18:16 IST

    అమరావతి: మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఊరట

    • ఈనెల 31 వరకు తొందరపాటు చర్యలు వద్దని ఆదేశం

    • పామర్రు సభలో పేర్ని నాని వ్యాఖ్యలపై కేసులో విచారణ

    • అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టులో పేర్ని నాని పిటిషన్‌

  • Jul 24, 2025 17:24 IST

    అమరావతి: జులై 26 నుంచి సీఎం చంద్రబాబు సింగపూర్‌ పర్యటన

    • పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీలు

    • బ్రాండ్ ఏపీ ప్రమోషన్‌తో పరిశ్రమలు తెచ్చేందుకు 6 రోజుల పర్యటన

  • Jul 24, 2025 17:24 IST

    ఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీలకు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజెంటేషన్‌

    • తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వేపై సీఎం ప్రజెంటేషన్‌

    • సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుటుంబ సర్వే నిర్వహణపై ప్రజెంటేషన్‌

    • ఓబీసీ రిజర్వేషన్ల వ్యవహారం, తెలంగాణ ఆమోదించి పంపిన బిల్లుపై వివరణ

    • పార్లమెంటులో తదుపరి కార్యాచరణపై సీఎం రేవంత్‌ రెడ్డి దిశా నిర్దేశం

    • 42 శాతం రిజర్వేషన్ల అమలుకు తీసుకుంటున్న చర్యలపై ప్రజెంటేషన్‌

    • న్యాయపరమైన చిక్కులను పరిష్కరించే అంశాలపై ఎంపీలకు వివరణ

    • కులగణన సర్వే వివరాలు రాహుల్‌ గాంధీ, ఖర్గేకు ఉదయం వివరించిన సీఎం

  • Jul 24, 2025 17:23 IST

    ఎన్నికల్లో ధన ప్రవాహం నిరోధించాలంటూ సుప్రీంలో కేవీపీ పిటిషన్‌

    • ప్రచారం కోసమే పిటిషన్‌ వేశారంటూ కేవీపీపై మండిపడ్డ సుప్రీం CJI

    • కేవీపీ రామచంద్రరావు పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

  • Jul 24, 2025 17:22 IST

    ఛత్తీస్‌గఢ్‌: బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు

    • పోలీసుల ఎదుట లొంగిపోయిన 25 మంది మావోయిస్టులు

    • లొంగిపోయిన మావోయిస్టులపై రూ.1.15 కోట్ల రివార్డు

  • Jul 24, 2025 16:55 IST

    ఏపీలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్‌ ఆమోదం

    • పెట్టుబడులను వెంటనే గ్రౌండ్‌ చేయిస్తే లక్ష మందికి పైగా ఉద్యోగ అవకాశాలు: సీఎం చంద్రబాబు

    • ఐటీ, రెన్యువబబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్, డ్రోన్ ఆటోమొబైల్స్ రంగాల్లో పరిశ్రమలు వస్తున్నాయి: చంద్రబాబు

    • ఇల్లు లేని నిరుపేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో 2 సెంట్లు కార్యక్రమం వెంటనే చేపట్టాలి: చంద్రబాబు

    • గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలో అందరికంటే ముందుండాలి: చంద్రబాబు

    • గతంలో రాజధానిలో స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి కోసం సింగపూర్‌ కన్సార్టియం ఏపీకి వచ్చింది: సీఎం చంద్రబాబు

    • ప్రభుత్వం మారిన తర్వాత వారిని వెళ్లగొట్టారు: సీఎం చంద్రబాబు

    • గత వైసీపీ ప్రభుత్వంలో సింగపూర్‌ కన్సార్టియం వారిపైనా అవినీతి ముద్ర వేసి కేసులు పెట్టేందుకు యత్నించారు: చంద్రబాబు

    • సింగపూర్‌తో ఉన్న మంచి సంబంధాలను చెడగొట్టారు: చంద్రబాబు

    • ఏపీ అభివృద్ధి కోసం మళ్లీ సింగపూర్‌ ప్రభుత్వంతో మైత్రి పునరుద్ధరించుకోవాలి: చంద్రబాబు

    • వైసీపీ ఎన్ని తప్పుడు మెయిల్స్‌ పెట్టినా 9 వేల కోట్ల బాండ్స్‌ ద్వారా వచ్చాయి: చంద్రబాబు

    • తిరుపతి తొక్కిసలాటపై డీఎస్పీ, గో సంవరక్షణ అధికారిని బాధ్యుల్ని చేసిన కమిటీ

    • కమిటీ నివేదిక ఆధారంగా క్రిమినల్‌ చర్యలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

  • Jul 24, 2025 16:55 IST

    నాలుగు గంటలపాటు సాగిన ఏపీ మంత్రివర్గ సమావేశం

    • 40కి పైగా ఎజెండా అంశాలపై ఏపీ మంత్రివర్గం భేటీలో చర్చ

    • వెనుకబడిన ప్రాంతాల్లో ఎక్కువ పెట్టుబడులు వచ్చేలా చూడాలని నిర్ణయం

    • నాలా ఫీజు అంశంపై మరోసారి చర్చించాలని కేబినెట్‌ నిర్ణయం

    • విశాఖ, విజయవాడ మెట్రో రైల్‌ అంశాలపై చర్చ

    • అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణపై మంత్రివర్గంలో చర్చ

    • లేఅవుట్ల క్రమబద్ధీకరణపై కఠినంగా ఉండాలని కేబినెట్‌ నిర్ణయం

    • తిరుపతి తొక్కిసలాటపై నివేదిక మేరకు బాధ్యులపై చర్యలు: చంద్రబాబు

  • Jul 24, 2025 16:55 IST

    కేంద్ర హోంశాఖకు బీసీ రిజర్వేషన్ల పెంపు ఆర్డినెన్స్‌

    • న్యాయ సలహా కోసం ఆర్డినెన్స్‌ పంపిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

    • ఆర్డినెన్స్‌పై తెలంగాణ ఏజీతో చర్చల అనంతరం కేంద్ర హోంశాఖకు పంపిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

  • Jul 24, 2025 16:08 IST

    భారత్‌-బ్రిటన్‌ సంబంధాల్లో ఇవాళ చరిత్రాత్మక రోజు: ప్రధాని మోదీ

    • చాలా ఏళ్ల కృషి తర్వాత భారత్-బ్రిటన్‌ మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంపై సంతకాలు సంతోషకరం: మోదీ

    • AI, సైబర్‌ సెక్యూరిటీ అంశాల్లో కలిసి సాగుతాం: ప్రధాని మోదీ

    • బ్రిటన్‌, భారత్‌ భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం ప్రారంభం: మోదీ

    • 6 బ్రిటన్‌ వర్సిటీలు భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తున్నాయి: మోదీ

    • ఇరుదేశాల సేవల రంగం, ఆర్థిక, సాంకేతిక రంగాలకు ఊతం: మోదీ

    • ఒప్పందం ద్వారా సులభతర వాణిజ్య విధానానికి మరింత ఊతం: మోదీ

    • ఇరుదేశాల మధ్య ఉపాధి కల్పన అవకాశాలు విస్తృతం అవుతాయి: మోదీ

    • భారత్‌-బ్రిటన్‌ భాగస్వామ్యంలో విజన్‌-2035 లక్ష్యంగా సాగుతున్నాం: మోదీ

  • Jul 24, 2025 16:06 IST

    హైదరాబాద్‌: మియాపూర్‌లో విద్యార్థిని హన్సిక ఆత్మహత్య

    • భవనం పైనుంచి దూకిన పదోతరగతి విద్యార్థిని హన్సిక(14)

    • మియాపూర్ జనప్రియ అపార్ట్‌మెంట్స్‌లో ఘటన

    • అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తు నుంచి దూకిన హన్సిక

  • Jul 24, 2025 16:05 IST

    భారత్, ఇంగ్లండ్ మధ్య కీలక వాణిజ్య ఒప్పందం

    • ఇరుదేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

    • సంతకాలు చేసిన ఇరుదేశాధినేతలు

    • ప్రధాని మోదీ లండన్ పర్యటనలో కీలక పరిణామం

  • Jul 24, 2025 14:05 IST

    తెలంగాణలో సామాజిక న్యాయం 2.0 ఉద్యమాన్ని ప్రారంభించాం: ఖర్గే

    • బలహీన వర్గాల కోసమే కాంగ్రెస్‌ న్యాయ పోరాటం: ఖర్గే

    • రాహుల్‌ నాయకత్వంలో సామాజిక న్యాయం కోసం పోరాటం

    • తెలంగాణలో సామాజిక, ఆర్థిక సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే

    • తెలంగాణ బీసీ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తోంది: ఖర్గే

    • దేశ వ్యాప్తంగా కులగణన జరపాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది: ఖర్గే

  • Jul 24, 2025 13:01 IST

    ప్లేవర్డ్‌ మిల్క్‌పై 5 శాతం జీఎస్‌టీ ఖరారు చేసిన సుప్రీంకోర్టు

    • హెరిటేజ్‌ ఫుడ్స్‌కి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ కొట్టేసిన సుప్రీంకోర్టు.

    • ప్లేవర్డ్‌ మిల్క్‌పై 12 శాతం జీఎస్టీ విధింపుపై హైకోర్టుకు వెళ్లిన హెరిటేజ్‌ ఫుడ్స్‌.

    • ప్లేవర్డ్‌ మిల్క్‌ కూడా పాలు, క్రీమ్‌ కేటగిరిలోకి వస్తుందని తెలిపిన హైకోర్టు.

    • ప్లేవర్డ్‌ మిల్క్‌పై 5 శాతమే జీఎస్టీ విధించాలని ఏపీ హైకోర్టు తీర్పు.

    • ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం.

    • కేంద్రం పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు.

  • Jul 24, 2025 12:48 IST

    ఖర్గే, రాహుల్‌తో ముగిసిన సీఎం రేవంత్ సమావేశం

    రెండు గంటలపాటు కొనసాగిన సమావేశం

    కులగణన సర్వే చేసిన విధానాన్ని వివరించిన సీఎం రేవంత్

    తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రాజకీయ, కుల, సర్వేపై..

    వివరాలు వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి

    42 శాతం రిజర్వేషన్ల అమలపై కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించిన ఖర్గే, రాహుల్‌

  • Jul 24, 2025 11:43 IST

    ములుగు జిల్లాలో జలపాతాల సందర్శనకు బ్రేక్‌

    • ఈనెల 26 వరకు బొగత, ముత్యంధార, కొంగర..

    • మామిడికొద్ది, కృష్ణాపురం జలపాతాల మూసివేత

  • Jul 24, 2025 11:42 IST

    ఆగస్టు 27 నుంచి హైదరాబాద్‌లో గణేష్‌ ఉత్సవాలు

    • సెప్టెంబర్‌ 6న హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనోత్సవం

  • Jul 24, 2025 11:42 IST

    భద్రాద్రి: మణుగూరులో సింగరేణికి భారీ నష్టం

    • ఓపెన్ కాస్ట్ గనుల్లో మూడు షిఫ్ట్‌ల్లో 36000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

    • మణుగూరు ఏరియాలోనే రూ.12 కోట్లు నష్టం

    • 2.40 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు అంతరాయం

  • Jul 24, 2025 11:40 IST

    నాగార్జునసాగర్ కుడి కాలువకు నీటిని విడుదల చేసిన ఏపీ ఇరిగేషన్ అధికారులు

    • 500 నుంచి 3 వేల క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల

    • కేఆర్ఎంబీ కి ఫిర్యాదు చేస్తామన్న సాగర్ ఇరిగేషన్ అధికారులు

  • Jul 24, 2025 11:39 IST

    Breaking News: మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమైన సీఎం రేవంత్‌

    • మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమైన సీఎం రేవంత్‌

    • రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధిపై వివరిస్తున్న సీఎం

    • రాష్ట్రంలో రాజకీయ కుల సర్వే తీరును వివరిస్తున్న సీఎం

    • శాసనసభ ఆమోదించిన బిల్లులపై వివరిస్తున్న సీఎం రేవంత్‌