-
-
Home » Mukhyaamshalu » Telangana Jubilee Hills By Election Polling and Bihar Election Live Updates 11th nov 2025 kjr
-
Election Live Updates: మాగంటి సునీత అరెస్టు
ABN , First Publish Date - Nov 11 , 2025 | 06:34 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 11, 2025 19:18 IST
జూబ్లీహిల్స్: మాగంటి సునీత అరెస్టు
ఎన్నికల సరళికి నిరసనగా సునీత ఆందోళన
-
Nov 11, 2025 19:16 IST
బీహార్, జూబ్లీహిల్స్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక చర్చా కార్యక్రమం..
-
Nov 11, 2025 19:13 IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ వైపే ఓటర్లు
పబ్లిక్ పల్స్: కాంగ్రెస్ 48.5%, BRS 41.8%, BJP 6.5% ఓట్లు
చాణక్య స్ట్రాటజీస్: కాంగ్రెస్ 46%, BRS 43%, BJP 6% ఓట్లు
నాగన్న సర్వే: కాంగ్రెస్ 47%, BRS 41%, BJP 8% ఓట్లు
ఆపరేషన్ చాణక్య: 8 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌దే విజయమని సర్వే
JANMINE సర్వే: కాంగ్రెస్ 42.5%, BRS 41.5%, BJP 11.5% ఓట్లు
HMR సర్వే: కాంగ్రెస్ 48.31%, BRS 43.18%, BJP 5.84% ఓట్లు
స్మార్ట్‌పోల్: కాంగ్రెస్ 48.2%, BRS 42.1%, BJP 7.6% ఓట్లు
-
Nov 11, 2025 19:01 IST
బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ ఇన్‌సైట్ సర్వే వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు..
-
Nov 11, 2025 18:52 IST
జూబ్లీహిల్స్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్..

-
Nov 11, 2025 18:34 IST
బిహార్(243) ఎగ్జిట్ పోల్స్‌లో NDAకే పట్టంకట్టిన ఓటర్లు
పీపుల్స్ పల్స్: NDA 130-159, MGB 75-101, ఇతరులు 2-13
ప్రజా పోల్ అనలిటిక్స్: NDA 186, MGB 50, ఇతరులు 7
ఆపరేషన్ చాణక్య: NDA 140-147, MGB 86-92, ఇతరులు 2-4
స్టడీ రిపోర్టు: NDA 74, MGB 160, ఇతరులు 9
-
Nov 11, 2025 18:32 IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ వైపే ఓటర్లు
చాణక్య స్ట్రాటజీస్: కాంగ్రెస్ 46%, BRS 43%, BJP 6% ఓట్లు
పీపుల్స్ పల్స్: కాంగ్రెస్ 48%, BRS 41%, BJP 6% ఓట్లు
నాగన్న సర్వే: కాంగ్రెస్ 47%, BRS 41%, BJP 8% ఓట్లు
ఆపరేషన్ చాణక్య: 8 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌దే విజయమని సర్వే
JANMINE సర్వే: కాంగ్రెస్‌కు 42.5%, BRS 41.5%, BJP 11.5% ఓట్లు
-
Nov 11, 2025 18:26 IST
ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్
ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం 6:00 వరకు కొనసాగిన పోలింగ్
2023 ఎన్నికలతో పోలిస్తే పెద్దగా నమోదు కానీ పోలింగ్ శాతం
-
Nov 11, 2025 18:04 IST
జూబ్లీహిల్స్: యూసుఫ్‌గూడ పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ
దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పరస్పరం ఇరుపార్టీల ఆరోపణ
కాంగ్రెస్ శ్రేణులు దొంగఓట్లు వేస్తున్నారంటూ మాగంటి సునీత ధర్నా
ఇరుపార్టీల కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు
-
Nov 11, 2025 17:19 IST
ధర్నాకు దిగిన మాగంటి సునీత..
కృష్ణానగర్ పోలింగ్ బూత్ దగ్గర ఫేక్ ఐడీలతో కాంగ్రెస్ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపించిన మాగంటి సునీత.
రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన సునీత, ఆమె కుటుంబ సభ్యులు.
సునీతతో పాటు నిరసనలో పాల్గొన్న బీఆర్ఎస్ కార్యకర్తలు.
అలర్ట్ అయిన పోలీసులు.. పలవురు బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
కృష్ణానగర్ పోలింగ్ బూత్‌లో ఇష్టానుసారంగా రిగ్గింగ్ జరుగుతోందని.. ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదంటూ సునీత ఆరోపించారు.
-
Nov 11, 2025 16:36 IST
మాగంటి సునీతపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
మాగంటి సునీత ప్రెస్‌మీట్‌పై కాంగ్రెస్ అభ్యంతరం
సునీత ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఫిర్యాదు
-
Nov 11, 2025 16:02 IST
పోలింగ్ కి మరో రెండు గంటలు మాత్రమే..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇంకా ఊపొందుకొని పోలింగ్ ప్రక్రియ..
పోలింగ్ మొదలై సుమారు 9 గంటలు గడుస్తున్నా పెరగని పోలింగ్ శాతం..
మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20 శాతం మాత్రమే నమోదైన పోలింగ్..
ఎన్నికల సంఘం ఆశించిన మేర పెరగని పోలింగ్ శాతం..
చివరి రెండు గంటల్లో పోలింగ్ పెరిగే అవకాశం..
6 గంటల లోపు పోలింగ్ స్టేషన్ వద్దకు చేరుకున్న వాళ్లకు ఓటు వేసే అవకాశం కల్పిస్తామంటున్న ఎన్నికల అధికారులు..
-
Nov 11, 2025 15:33 IST
జూబ్లీహిల్స్‌లో మ.3 గంటల వరకు 40.2 శాతం పోలింగ్ నమోదు
బిహార్‌లో మ.3 గంటల వరకు 60.4 శాతం పోలింగ్ నమోదు
-
Nov 11, 2025 15:31 IST
వెంగళరావు నగర్ పోలింగ్ బూత్ నెంబర్ 120 దగ్గర ఓట్లర్లకు డబ్బులు పంచుతున్న BRS నేతలు
-
Nov 11, 2025 14:48 IST
మధ్యాహ్నం వరకు జరిగిన పోలింగ్ శాతంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన
-
Nov 11, 2025 14:42 IST
బోరబండ డివిజన్ లో మంత్రి సీతక్క అనుచరుడు... ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ప్రచారం..


-
Nov 11, 2025 14:39 IST
ప్రజలను భయపెట్టి కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు వేయించుకుంటున్నారు: మాగంటి సునీత
-
Nov 11, 2025 14:03 IST
బీహార్ లో కొనసాగుతున్న రెండవ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
20 జిల్లాల్లో 122 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్
మధ్యాహ్నం 1గంట వరకు నమోదైన పోలింగ్ శాతం 47.62%
బీహార్ రెండో విడతలో భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు
-
Nov 11, 2025 13:37 IST
దేశవ్యాప్తంగా 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక
తెలంగాణ జూబ్లీహిల్స్‌తో పాటు జమూకశ్మీర్‌లో 2, రాజస్థాన్,..
జార్ఖండ్, పంజాబ్, మిజోరం, ఒడిశాలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక
మ.ఒంటి గంట వరకు జూబ్లీహిల్స్‌లో 31.94 శాతం పోలింగ్ నమోదు
మ.ఒంటి గంట వరకు బిహార్‌లో 47.62 శాతం పోలింగ్ నమోదు
మ.ఒంటి గంట వరకు జార్ఖండ్-54.08%, మిజోరం-56.35%, ఒడిశా-51.42% పోలింగ్
మ.ఒంటి గంట వరకు పంజాబ్-36.62%, రాజస్థాన్-47.77% పోలింగ్ నమోదు
-
Nov 11, 2025 13:12 IST
జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ఐపీఎస్
పోలింగ్ కేంద్రాల వద్ద గుమిగూడుతున్న వారిని గుర్తించి, వారినిఅక్కడి నుండి పంపించివేసిన డీసీపీ
పోలింగ్ కేంద్రాల వద్ద పలు ఫిర్యాదులు అందటంతో, వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
-
Nov 11, 2025 12:01 IST
ఎన్నికల పరిశీలకుడు ఓం ప్రకాష్ తిర్పతి IPS బృందావన్ కాలనీ టోలిచౌకిలోని MS క్రియేటివ్ స్కూల్‌లోని పోలింగ్ బూత్‌ను సందర్శించి పరిశీలించారు.

-
Nov 11, 2025 11:58 IST
ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక కథనాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
-
Nov 11, 2025 11:39 IST
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 20.76 పోలింగ్ నమోదు

-
Nov 11, 2025 11:37 IST
పోలింగ్ సరళిపై GHMC వెబ్ కాస్టింగ్
-
Nov 11, 2025 11:36 IST
బీహార్ లో కొనసాగుతున్న రెండవ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
20 జిల్లాల్లో 122 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్
ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం 31.38%
బీహార్ రెండో విడతలో భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు
-
Nov 11, 2025 11:29 IST
యువతకు వృద్దుడి సూటి ప్రశ్న
-
Nov 11, 2025 11:28 IST
బీహార్ ఎన్నికలపై ఎన్నికల సంఘం అప్డేట్
-
Nov 11, 2025 10:50 IST
BRS నేతల వ్యాఖ్యలు అర్ధరహితం: కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్
ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి: నవీన్ యాదవ్
-
Nov 11, 2025 10:50 IST
పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ ప్రచారం..!
-
Nov 11, 2025 10:49 IST
హైదరాబాద్: నాన్‌లోకల్ నాయకులపై ఈసీ ఆగ్రహం
MLC, MLAలు పోలింగ్ బూత్‌లకు రావడంపై సీరియస్
ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామంచంద్రనాయక్,..
MLC శంకర్‌నాయక్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశం
-
Nov 11, 2025 10:46 IST
జూబ్లీహిల్స్ లో నెమ్మదిగా సాగుతున్న పోలింగ్..
-
Nov 11, 2025 10:33 IST
కాంగ్రెస్ పార్టీ షేక్ పేట్ డివిజన్ అధ్యక్షుడు సత్యనారాయణ పోలీసులతో వాగ్వాదం..
-
Nov 11, 2025 10:27 IST
నాసర్ స్కూల్లో ఏర్పాటు చేసిన 217 కేంద్రoలో ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్
కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న నవీన్ యాదవ్

-
Nov 11, 2025 10:19 IST
బోరబండ పోలింగ్ బూత్ వద్ద హై టెన్షన్ ..!
-
Nov 11, 2025 10:18 IST
హై టెన్షన్..పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ ప్రచారం..
-
Nov 11, 2025 09:59 IST
జూబ్లీహిల్స్ బై పోల్..ఉదయం 9.30 నిమిషాల వరకు 10.02 పోలింగ్ శాతం నమోదు
-
Nov 11, 2025 09:59 IST
బీహార్ లో కొనసాగుతున్న రెండవ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
20 జిల్లాల్లో 122 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్
ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం 14.55%
-
Nov 11, 2025 09:42 IST
బీహార్ లో కొనసాగుతున్న రెండవ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
20 జిల్లాల్లో 122 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్
ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం 14.55%
-
Nov 11, 2025 09:35 IST
హైదరాబాద్ : మధుర నగర్ లోని పోలింగ్ బూత్ 132 లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న హైడ్రా కమిషనర్ రంగనాధ్.
-
Nov 11, 2025 09:35 IST
యూసఫ్ గూడ 217 కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయెల్
-
Nov 11, 2025 09:34 IST
ఎల్లారెడ్డి గూడలోని నాగార్జున కమ్యూనిటీ హాల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి.

-
Nov 11, 2025 09:29 IST
బోరబండలో కాంగ్రెస్ కార్పొరేటర్ ఫసియుద్దీన్, BRS నేతల మధ్య ఘర్షణ
స్థానికేతరులు ప్రచారం చేస్తున్నారంటూ బాబా ఫసియుద్దీన్ ఆగ్రహం
స్థానికేతరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Nov 11, 2025 08:39 IST
దేశంలో మొదటిసారి ఎన్నికల్లో డ్రోన్స్ ఉపయోగం..
జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు డ్రోన్లతో అనుసంధానం
పోలింగ్ బూత్‌ల వద్ద డ్రోన్లతో పర్యవేక్షణ
ప్రతి పోలింగ్ లొకేషన్‌కి ఒక డ్రోన్.. 139 పోలింగ్ లొకేషన్స్‌లో 139 డ్రోన్లు..
ఎప్పటికప్పుడు డ్రోన్ విజ్యువల్స్‌ను పర్యవేక్షిస్తున్న సిబ్బంది..
దేశంలో మొదటిసారి ఎన్నికల్లో డ్రోన్స్ ఉపయోగం..
డ్రోన్లు ఎగిరేయడానికి DGCA, లోకల్ పోలీసుల నుంచి పెర్మిషన్ తీసుకున్న ఎన్నికల అధికారులు.
-
Nov 11, 2025 08:37 IST
ఈవీఎంలో అభ్యర్థుల కలర్ ఫొటో
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మొదటిసారి అమల్లోకి వచ్చిన అంశాలు
మొదటిసారిగా ఈవీఎంలో అభ్యర్థుల కలర్ ఫొటో
మొదటిసారి డ్రోన్లతో సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తున్న అధికారులు
ప్రతీ పోలింగ్ స్టేషన్ వద్ద మొబైల్ డిపాజిట్ సెంటర్ ఏర్పాటు
ప్రతీ పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్ అసిస్టెన్స్ బూత్ ఏర్పాటు
మొదటిసారి పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పెంచిన అధికారులు
-
Nov 11, 2025 08:35 IST
యూసఫ్‌గూడ పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్


-
Nov 11, 2025 08:34 IST
యూసఫ్‌గూడలో పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్లు



-
Nov 11, 2025 08:19 IST
షేక్‌పేట్ డివిజన్‌లోని ఇంటర్నేషనల్ స్కూల్ బూత్ నెంబర్ 28లో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి

-
Nov 11, 2025 08:15 IST
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన రిటర్నింగ్ అధికారి
ఎర్రగడ్డలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన రిటర్నింగ్ అధికారి కర్ణన్
ఏజెంట్లు ఐడీ కార్డులు వేసుకోకపోవడంపై ఆర్వో కర్ణన్ అభ్యంతరం
పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది: రిటర్నింగ్ అధికారి కర్ణన్
పలు ప్రాంతాల్లో ఈవీఎంల సమస్య తలెత్తింది.. సెట్ చేశాం: కర్ణన్
-
Nov 11, 2025 08:15 IST
పోలింగ్ బూత్‌లో కరెంట్ కట్
శ్రీనగర్‌కాలనీ నాగార్జున కమ్యూనిటీ హాల్ పోలింగ్ బూత్‌లో కరెంట్ కట్
పవర్ కట్‌తో శ్రీనగర్‌కాలనీలో కాసేపు నిలిచిన పోలింగ్
కరెంట్ పునరుద్ధరించడంతో తిరిగి పోలింగ్ ప్రారంభం
-
Nov 11, 2025 08:14 IST
ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
సత్తుపల్లి ఎమ్మెల్యే భర్త దయానంద్‌పై ఆర్వోకు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
జూబ్లీహిల్స్ వెంగళరావునగర్ పోలింగ్ బూత్ దగ్గర..
ఓటర్లను దయానంద్ ప్రభావితం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపణ
-
Nov 11, 2025 07:32 IST
ఈవీఎంల మొరాయింపు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు
పలు పోలింగ్ బూత్‌లలో మొరాయించిన ఈవీఎంలు
షేక్‌పేట్ డివిజన్ పోలింగ్ బూత్-30లో ఈవీఎం మొరాయింపు
రహమత్‌నగర్‌లో పోలింగ్ బూత్-165, 166లో ఈవీఎం మొరాయింపు
నిలిచిపోయిన పోలింగ్, క్యూలైన్‌లో ఓటర్లు
శ్రీనగర్‌కాలనీ నాగార్జున కమ్యూనిటీహాల్‌లో పవర్ కట్
పోలింగ్ బూత్‌లో ఇబ్బంది పడుతున్న సిబ్బంది, ఓటర్లు
-
Nov 11, 2025 07:30 IST
ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
వెంగళరావు నగర్ గవర్నమెంట్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి తరలివస్తున్న ఓటర్లు
పోలింగ్ కేంద్రాల వద్ద ముడoచెల భద్రత
పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు
ఓటు హక్కు వినియోగించుకోనున్న 18 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్న 6859 యువ ఓటర్లు
-
Nov 11, 2025 07:24 IST
శ్రీ కృష్ణ దేవరాయ నగర్ కాలనీ స్టేడియంలో ఓటు హక్కును వినియోగించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత

-
Nov 11, 2025 07:22 IST
యూసఫగూడలో పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్లు..



-
Nov 11, 2025 07:02 IST
ఉదయం 7 గంటలకు ప్రారంభంకానున్న బీహార్ రెండో విడత ఎన్నికల పోలింగ్..
20 జిల్లాల పరిధిలోని 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్..
రెండో విడత పోలింగ్‌లో 3 కోట్ల 70 లక్షలకు పైగా ఓటర్లు..
122 అసెంబ్లీ స్థానాల బరిలో 1,302 మంది అభ్యర్థులు..
1.95 కోట్ల పురుష ఓటర్లు, 1.74 కోట్ల మంది మహిళల ఓటర్లు..
45,399 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు..
గ్రామీణ ప్రాంతాల్లో 40,073 బూత్ లు, పట్టణ ప్రాంతాల్లో 5326 బూత్ లు ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం..
రెండో విడత పోలింగ్ లో హేమా హేమీల భవితవ్యం తేలనుంది
మంత్రులు విజయేంద్రప్రసాద్ యాదవ్, లేసి సింగ్, రేణు దేవి, షీలా మండల్, జామాఖాన్ తదితరులు బరిలో ఉన్నారు.
-
Nov 11, 2025 06:38 IST
నేడు బిహార్ రెండో విడత ఎన్నికల పోలింగ్
20 జిల్లాల్లో మొత్తం 122 నియోజకవర్గాల్లో పోలింగ్
ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు పోలింగ్
మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
122 అసెంబ్లీ స్థానాలకు బరిలో 1,302 మంది అభ్యర్థులు
ఓటు హక్కు వినియోగించుకోనున్న 3.70 కోట్ల మంది
-
Nov 11, 2025 06:37 IST
నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్
ఉదయం 7 నుంచి సా.6 గంటల వరకు పోలింగ్
ఎన్నికల నిర్వహణకు 5 వేల మంది సిబ్బంది
139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
పోలింగ్‌కు 1,761 మంది పోలీసులతో భద్రత
800 మంది కేంద్ర బలగాలతో బందోబస్తు
తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్ల వినియోగం
డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేయనున్న అధికారులు
139 ప్రాంతాల్లో 139 డ్రోన్లు వినియోగం