-
-
Home » Mukhyaamshalu » Telangana ap news to national international news know here vreddy
-
BREAKING: ఏపీలో ధాన్యం రైతులకు శుభవార్త
ABN , First Publish Date - Nov 01 , 2025 | 06:24 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 01, 2025 21:08 IST
అమరావతి: ఏపీలో ధాన్యం రైతులకు శుభవార్త
సోమవారం నుంచి ధాన్యం కొనుగోళ్లు
రైతుల వివరాల నమోదుకు 7337359375 వాట్సాప్ నంబర్‌కు...
“Hi” అనే సందేశం పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచన
2025-26 ఖరీఫ్‌లో 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు నిర్ణయం
ఏపీవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు: మంత్రి నాదెండ్ల
ఏపీ వ్యాప్తంగా 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు: నాదెండ్ల
ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 24 నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమయ్యేలా చర్యలు: నాదెండ్ల
-
Nov 01, 2025 18:33 IST
యువత దేశాభివృద్ధికి కార్యోన్ముఖులు కావాలి: వెంకయ్యనాయుడు
మాతృభాష, భారతీయ సంస్కృతికి ప్రాధాన్యం ఇవ్వాలి: వెంకయ్య
వ్యక్తిత్వం మెరుగుదలకు యోగి వేమన బోధనలు మార్గదర్శకాలు: వెంకయ్యనాయుడు
జీవిత సత్యాల అవగాహనతో ఉన్నతమైన వ్యక్తిత్వం: వెంకయ్యనాయుడు
-
Nov 01, 2025 18:33 IST
ఎస్‌ఐ ఆత్మహత్యాయత్నం
వరంగల్: ఖానాపూర్‌లో స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ ఆత్మహత్యాయత్నం
ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హాసిఫ్(57) మృతి
ఖానాపూర్ స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న హాసిఫ్
-
Nov 01, 2025 16:35 IST
కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన విచారకరం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
బాధిత కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలిపారు: కిషన్ రెడ్డి
మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు: కిషన్ రెడ్డి
క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు: కిషన్ రెడ్డి
-
Nov 01, 2025 16:35 IST
కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది: బండి సంజయ్
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం సాయం అందించాలి: బండి సంజయ్
తొక్కిసలాట దుర్ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలి: బండి సంజయ్
-
Nov 01, 2025 16:35 IST
కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి ముందుకు సాగడం లేదు: కవిత
నిధులు తేకుండా బండి సంజయ్ ఏం చేస్తున్నారు?: కల్వకుంట్ల కవిత
కరీంనగర్‌లో గ్రానైట్ గుట్టలన్నీ కరిగిపోతున్నాయి: కల్వకుంట్ల కవిత
అనుమతి తీసుకున్న దానికంటే ఎక్కువ గుట్టలు తవ్వేస్తున్నారు: కవిత
కొందరి పేరు చెప్పడానికి బంధం అడ్డొస్తుంది: కల్వకుంట్ల కవిత
-
Nov 01, 2025 13:58 IST
కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ
బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని
మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటన
-
Nov 01, 2025 13:33 IST
కాశీబుగ్గ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది: మంత్రి లోకేష్
మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి: లోకేష్
-
Nov 01, 2025 13:32 IST
కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై దేవాదాయశాఖ మంత్రి ఆనం వివరణ
ఘటన జరిగిన ఆలయం ప్రభుత్వ ఆధీనంలో లేదు: ABNతో మంత్రి ఆనం
ఇది పూర్తిగా ప్రైవేట్ ఆలయం: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
భక్తులు వేలాదిగా వచ్చినా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదు
2వేల మంది కూడా పట్టని ఆలయంలోకి 30వేల మందిని అనుమతించారు
ఘటనకు నిర్వాహకుల వైఫల్యమే కారణం: ABNతో మంత్రి ఆనం
ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం: ఆనం
-
Nov 01, 2025 12:42 IST
శ్రీకాకుళం కాశీబుగ్గ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం
తొక్కిసలాట ఘటన కలచివేసింది: ఎక్స్‌లో సీఎం చంద్రబాబు
మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి: చంద్రబాబు
-
Nov 01, 2025 12:30 IST
అమరావతి: ఆర్సెలార్ మిట్టల్‌కు కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం
అనకాపల్లిలో దేశంలోనే దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధమైన ఆర్సెలార్ మిట్టల్
14 నెలల్లోనే భూమి, ప్రధాన అనుమతులు మంజూరు
ఏపీ ప్రభుత్వం వేగానికి ఎంతో ఆకర్షితులయ్యాం: ఆర్సెలార్ మిట్టల్ ఎండీ
-
Nov 01, 2025 12:12 IST
శ్రీకాకుళం: కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట
4మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు
ఏకాదశి కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులు
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
-
Nov 01, 2025 11:57 IST
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
రూ.47 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్న DRI అధికారులు
కాఫీ పౌడర్‌లో డ్రగ్స్ కలిపి తరలించేందుకు యత్నం
సౌతాఫ్రికా నుంచి ముంబైకు డ్రగ్స్ తెచ్చిన ఐదుగురు సభ్యుల ముఠా
-
Nov 01, 2025 11:56 IST
తెలంగాణ ఆగ్రో కార్పొరేషన్‌లో మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీలు
సమయ పాలన పాటించని సిబ్బందిపై మంత్రి తుమ్మల ఆగ్రహం
-
Nov 01, 2025 10:18 IST
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
బాంబు బెదిరింపుతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ అధికారులు
ముంబై ఎయిర్‌పోర్ట్‌కు విమానం మళ్లింపు
జెడ్డా నుంచి శంషాబాద్ వెళ్లాల్సిన విమానం
బెదిరింపు మెయిల్‌పై పోలీసులకు ఫిర్యాదు
-
Nov 01, 2025 10:18 IST
అరకు, పాడేరు బస్సుల పునరుద్ధరణ
తుఫాన్ కారణంగా ఈ రెండు రూట్లో బస్సులను సోమవారం నుంచి రద్దు చేశారు..
తుఫాను తీవ్రత, వర్షాలు తగ్గడంతో బస్సులను పునరుద్ధరినించి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు
-
Nov 01, 2025 10:18 IST
హైదరాబాద్: మియాపూర్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
సర్వే నెంబర్ 100లో భారీ భవనం నిర్మాణంపై ఫిర్యాదులు
అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్న హైడ్రా, GHMC సిబ్బంది
-
Nov 01, 2025 10:17 IST
ఢిల్లీలో కొనసాగుతోన్న వాయుకాలుష్యం
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో సగటున 245 పాయింట్లు
BS 6 నిబంధనలు పాటించని వాణిజ్య వాహనాలపై నిషేధం
ఢిల్లీ ఎన్సీఆర్‌లో గ్రాప్-2 అమలు, నిర్మాణ పనులపై ఆంక్షలు
బొగ్గు, కట్టెల వాడకం, డీజిల్ జనరేటర్ సెట్లపై నిషేధం
-
Nov 01, 2025 09:49 IST
బిహార్: జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్‌కిషోర్ కీలక వ్యాఖ్యలు
అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోం: ప్రశాంత్‌కిషోర్
బీఎస్పీకి 150 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి: ప్రశాంత్‌కిషోర్
ప్రజలు తిరస్కరిస్తే 10 కంటే తక్కువ సీట్లు సాధిస్తాం: ప్రశాంత్‌కిషోర్
-
Nov 01, 2025 08:43 IST
ఎమ్మిగనూరు మండలం కోటెకల్ దగ్గర రోడ్డు ప్రమాదం
ఆటో-లారీ ఢీ, ఒకరు మృతి, 10 మంది కూలీలకు గాయాలు
ఆదోని మండలం కపటి నుంచి ఎమ్మిగనూరు వపంతుండగా ఘటన
-
Nov 01, 2025 08:42 IST
విజయవాడ: కి'లేడీ' నిడిగుంట అరుణ బెదిరింపులు
కోర్టు బయట ఫిర్యాదు చేసిన వ్యక్తిపై అరుణ అరుపులతో హడావుడి
వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని..
రమేష్ నుంచి రెండు విడతలుగా రూ.24.50 లక్షలు వసూలు
అరుణ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో రమేష్ ఫిర్యాదు
అరుణను పీటీ వారెంట్‌పై విజయవాడ కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
బయటకి వచ్చాక నీ సంగతి చూస్తా అని రమేష్‌ను బెదిరించిన అరుణ
-
Nov 01, 2025 08:42 IST
నేడు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్‌రెడ్డి
నేడు బోరబండ, ఎర్రగడ్డలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం
-
Nov 01, 2025 08:41 IST
గద్వాల: ధర్మవరం బీసీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్
రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థులకు అస్వస్థత
40 మంది విద్యార్థులకు వాంతులు, ఆస్పత్రికి తరలింపు
-
Nov 01, 2025 07:51 IST
నేడు LVM3-M5 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్
రేపు సా.5:26కు రాకెట్ ప్రయోగం
CMS-03 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్న ఇస్రో
-
Nov 01, 2025 07:51 IST
నేడు జూబ్లీహిల్స్‌లో ఏపీ మంత్రి సత్యకుమార్ ప్రచారం
బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా ఏపీ మంత్రి సత్యకుమార్
బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి తరఫున ప్రచారం చేయనున్న సత్యకుమార్
-
Nov 01, 2025 07:51 IST
హైదరాబాద్: నేటి నుంచి పీజీ ఈసెట్ చివరి విడత కౌన్సెలింగ్
నవంబర్ 13, 15 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన
-
Nov 01, 2025 07:50 IST
కర్నూలు బస్సు ప్రమాదంలో కీలకంగా మారిన రవాణాశాఖ కమిటీ నివేదిక
బస్సు ప్రమాదంపై నలుగురు సభ్యులతో సమగ్ర దర్యాప్తు
నిబంధనలు ఉల్లంఘించి ఏసీ స్లీపర్ బస్సుగా మార్చిన వి.కావేరి ట్రావెల్స్
బస్సులో అగ్నిమాపక యంత్రాలు లేవని గుర్తించిన కమిటీ సభ్యులు
నేడు దర్యాప్తు అధికారికి నివేదిక ఇవ్వనున్న ఆర్టీఏ కమిటీ సభ్యులు
-
Nov 01, 2025 06:24 IST
నేడు సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
పెద్దన్నవారిపల్లిలో పెన్షన్లు పంపిణీ చేయనున్న చంద్రబాబు
రాత్రి లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు
-
Nov 01, 2025 06:24 IST
నేడు ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాని మోదీ పర్యటన
ఛత్తీస్‌గఢ్ రజత్ మహోత్సవంలో పాల్గొననున్న మోదీ
ఛత్తీస్‌గఢ్ విధానసభ కొత్త భవనం,..
వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ
బ్రహ్మకుమారీస్ శాంతి శిఖర్‌ను ప్రారంభించనున్న మోదీ
-
Nov 01, 2025 06:24 IST
ఈనెల 6న పాకిస్తాన్-అఫ్ఘనిస్తాన్ మధ్య చర్చలు
అఫ్ఘనిస్తాన్‌తో ఘర్షణలు పెంచుకునే ఉద్దేశం లేదన్న పాక్
రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు రంగంలోకి తుర్కియే, ఖతార్ దేశాలు