-
-
Home » Mukhyaamshalu » Telangana ap news to national and international news on 3rd nov 2025 know here vreddy
-
BREAKING: గ్రూప్-1 వివాదంపై ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ
ABN , First Publish Date - Nov 03 , 2025 | 06:31 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 03, 2025 21:36 IST
ఘోరం.. మరో బస్సు ప్రమాదం..
ఏలూరు: లింగపాలెం జూబ్లీనగర్ దగ్గర ప్రైవేట్ బస్సు బోల్తా
ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
ధర్మాజీగూడెం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం
ప్రమాద సమయంలో బస్సులో 16 మంది ప్రయాణికులు
మద్యం మత్తులో బస్సు నడిపిన డ్రైవర్ ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయకచర్యలు
-
Nov 03, 2025 20:37 IST
గ్రూప్-1 వివాదంపై ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ
గ్రూప్-1 జవాబు పత్రాలను హాయ్‌ల్యాండ్‌కు.. తరలించాలనే నిర్ణయం ఎవరిదని ప్రశ్నించిన హైకోర్టు
జవాబు పత్రాలను హాయ్‌ల్యాండ్ నుంచి.. తిరిగి APPSCకి ఎప్పుడు తరలించారని హైకోర్టు ప్రశ్న
బిల్లుల చెల్లింపు వివరాలు తమముందు ఉంచాలన్న హైకోర్టు
జవాబు పత్రాలను సీల్డ్ కవర్‌లో అందజేయాలని APPSCకి ఆదేశం
తదుపరి విచారణ ఈనెల 11కి వాయిదా
-
Nov 03, 2025 20:37 IST
నిర్మల్: లోకేశ్వరం మండలం వటోలిలో విషాదం
పురుగులమందు తాగి యువతి అఖిల ఆత్మహత్య
యువకుడు నరేష్ వేధింపులే ఆత్మహత్యకు కారణమని.. పోలీసులకు అఖిల కుటుంబ సభ్యులు ఫిర్యాదు
మనస్తాపంతో గోదావరిలో దూకి నరేష్ ఆత్మహత్య
-
Nov 03, 2025 20:37 IST
అమరావతి: MSMEలపై ఉన్నతాధికారులతో మంత్రి కొండపల్లి సమీక్ష
MSME పార్కుల్లో మౌలిక వసతులపై దృష్టి సారించాలి: మంత్రి కొండపల్లి
పారిశ్రామిక రంగంలో పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: మంత్రి కొండపల్లి
తగిన కార్యాచరణ, భవిష్యత్ ప్రణాళికలతో ముందుకెళ్లాలి: మంత్రి కొండపల్లి
-
Nov 03, 2025 20:37 IST
జూబ్లీహిల్స్‌లో బీజేపీకి 10 వేల ఓట్ల కంటే ఎక్కువ రావు: మంత్రి పొన్నం
తెలంగాణలో బీజేపీ వ్యవస్థను బీఆర్‌ఎస్‌కు అప్పగించేశారు: పొన్నం
పదేళ్లుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కిషన్‌రెడ్డి ఏం చేశారు?: పొన్నం
-
Nov 03, 2025 18:53 IST
చేవెళ్ల బస్సు ప్రమాదంపై విచారణ వేగవంతం
కండక్టర్ రాధ ఫిర్యాదుతో చేవెళ్ల పోలీసులు కేసు నమోదు
టిప్పర్ డ్రైవర్ ఆకాష్‌పై 106(1) BNS కింద కేసు నమోదు
-
Nov 03, 2025 18:53 IST
కూటమి ప్రభుత్వం నేరపూరిత స్వభావంతో పనిచేస్తోంది: సజ్జల
తప్పు చేసేవారిని కాపాడేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది: సజ్జల
జోగి రమేష్‌పై అక్రమ కేసు బనాయించి అరెస్టు చేశారు: సజ్జల
వారే తప్పులు చేసి ఎదుటివారిపై కేసులు పెడుతున్నారు: సజ్జల
జోగి రమేష్‌పై ప్రభుత్వం పెట్టిన కేసు కోర్టుల్లో నిలవదు: సజ్జల
కూటమి ప్రభుత్వం నేర స్వభావంతో పనిచేస్తోంది: సజ్జల
తప్పు చేసేవారిని కాపాడేలా ప్రభుత్వం తయారైంది: సజ్జల
జోగి రమేష్‌పై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారు: సజ్జల
వారే తప్పు చేసి ఎదుటి వారిపై కేసులు పెడుతున్నారు: సజ్జల
జోగి రమేష్‌పై పెట్టిన కేసు కోర్టుల్లో నిలవదు: సజ్జల
ఇలాంటి ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం: సజ్జల
పొలిటికల్ గవర్నెన్స్‌తో దుష్పరిణామాలు పెరిగాయి: సజ్జల
తిరుమల లడ్డూ ప్రసాదంలోనూ విష ప్రచారం చేశారు: సజ్జల
పల్నాడులో టీడీపీ వర్గాల గొడవల్లో ఇద్దరి హత్య జరిగితే.. వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులుపై కేసులు పెట్టారు: సజ్జల
సోషల్ మీడియా కార్యకర్త సవీంద్రపై గంజాయి కేసు పెట్టారు: సజ్జల
ఇష్టానుసారం అక్రమ కేసులు పెట్టి వేధింపులకు దిగారు: సజ్జల
మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు: సజ్జల
తుని ఘటనలో నిందితుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు: సజ్జల
ఆ బాలికను కాపాడిన వ్యక్తిపై కేసు పెట్టారు: సజ్జల
ఏపీ వ్యవస్థల్లో విచ్చలవిడితనం పెరిగిపోయింది: సజ్జల
-
Nov 03, 2025 18:53 IST
ఇష్టం లేని పెళ్లి.. ఇంటికి నిప్పు..
సంగారెడ్డి: కుమార్తె ప్రేమ వివాహం నచ్చక యువకుడి ఇంటికి నిప్పు
ఝరాసంగం మండలం కక్కర్‌వాడలో యువకుడి తండ్రిపై దాడి చేసి.. ఇంటికి నిప్పు పెట్టిన యువతి తండ్రి, సోదరుడు
యువకుడు నగేష్ ఫిర్యాదుతో ఇద్దరు నిందితులపై కేసు నమోదు
-
Nov 03, 2025 18:53 IST
స్వర్ణపురి కాలనీలో విషాదం..
సంగారెడ్డి: అమీన్‌పూర్ హెచ్‌ఎంటీ స్వర్ణపురి కాలనీలో విషాదం
స్విమ్మింగ్ పూల్‌లో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులకు అస్వస్థత
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రజ్ఞ(9), ఆద్విక(8) మృతి
-
Nov 03, 2025 18:49 IST
కులమతాల పేరుతో వైసీపీ విద్వేషాలు రెచ్చగొడుతోంది: మంత్రి లోకేష్
గూగుల్ పెట్టుబడులపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు: లోకేష్
డేటా సెంటర్‌తో విశాఖలో చెట్లు పెరగవని దుష్ప్రచారం చేశారు: లోకేష్
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధే ముఖ్యం రాష్ట్రాభివృద్ధి కోసం వైసీపీ ముందుకొస్తే కలిసి ముందుకెళ్తాం: లోకేష్
-
Nov 03, 2025 18:49 IST
లండన్‌లో పారిశ్రామిక దిగ్గజాలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
హిందుజా గ్రూప్ భారత్ చైర్మన్ అశోక్ హిందుజాతో చంద్రబాబు సమావేశం
ఏపీలో పెట్టుబడుల అవకాశాలను వివరించిన సీఎం చంద్రబాబు
హిందూజా గ్రూప్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
ఏపీలో దశలవారీగా రూ.20 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని హిందూజా గ్రూప్ నిర్ణయం
విశాఖ హిందుజా పవర్ ప్లాంట్ సామర్ధ్యాన్ని.. మరో 1,600 మెగావాట్లకు పెంచేందుకు ఒప్పందం
రాయలసీమలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు అంశంపై ఒప్పందం
కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్
ఏపీలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్ ఏర్పాటుపై కుదిరిన ఒప్పందం
ఏపీలో గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ ఎకో సిస్టం అభివృద్ధికి సహకరించనున్న హిందూజా గ్రూప్
-
Nov 03, 2025 15:23 IST
AIపై ఎక్స్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
కుంకీల నుంచి AI వరకు మానవ-వన్యప్రాణి మధ్య.. సంఘర్షణ నియంత్రణకు దారిచూపుతున్న ఏపీ: ఎక్స్‌లో పవన్‌కల్యాణ్
మానవ-వన్యప్రాణి సంఘర్షణను నియంత్రించేందుకు.. సరికొత్త సాంకేతిక వ్యవస్థ తీసుకొచ్చిన ఏపీ: పవన్‌కల్యాణ్
AI, మిషన్ లెర్నింగ్ విధానంతో పనిచేసే సరికొత్త వ్యవస్థ.. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో మోహరింపు: పవన్‌కల్యాణ్
-
Nov 03, 2025 15:22 IST
రాజస్థాన్‌లో మరో ఘోర ప్రమాదం
లోహామండిలో బోల్తాపడిన ట్రాలీ
10 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు
హర్మదలో సికర్ రోడ్డు దగ్గర ప్రమాదం
-
Nov 03, 2025 13:44 IST
లండన్‌లో పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్న ఏపీ సీఎం చంద్రబాబు
ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ అఫైర్స్, హిందుజా గ్రూప్‌తో సీఎం సమావేశం
రోల్స్ రాయస్ గ్రూప్, ఎస్రామ్, ఎమ్రామ్, శామ్కో కంపెనీతో సీఎం సమావేశం
లండన్‌లో పారిశ్రామికవేత్తలతో ఏపీ సీఎం రౌండ్ టేబుల్ సమావేశం
సీఎం చంద్రబాబుతో సాయంత్రం భేటీ కానున్న లండన్‌లో భారత హైకమిషనర్ విక్రమ్
-
Nov 03, 2025 13:44 IST
MSME పార్కుల పురోగతిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్ష
MSME పార్కులలో మౌలిక సదుపాయాలు వేగంగా కల్పించాలి: మంత్రి శ్రీనివాస్
తొలి దశలో ఏర్పాటయ్యే MSME పార్కుల పురోగతిపై కొండపల్లి శ్రీనివాస్ చర్చ
ప్రతి నియోజకవర్గంలో మలివిడత పార్కులు ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష
పరిశ్రమలకు అనుమతుల జారీలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి ఆదేశం
-
Nov 03, 2025 13:44 IST
భారత్ టెక్ హౌస్‌గా ఎదిగేందుకు ప్రైవేట్ పెట్టుబడులు ప్రోత్సహిస్తున్నాం: ప్రధాని మోదీ
దేశంలో ఆధునిక ఆవిష్కరణలు మరింత పెంచడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నాం
గతంతో పోలిస్తే దేశంలో పరిశోధన, అభివృద్ధి వ్యయం రెట్టింపు చేశాం: మోదీ
-
Nov 03, 2025 13:13 IST
నకిలీ మద్యం కేసులో జోగి రమేష్, జోగి రాము అరెస్టుపై బెయిల్ పిటిషన్
మరోవైపు జోగి బ్రదర్స్‌ను కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్
-
Nov 03, 2025 13:12 IST
వరంగల్: 6నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటిస్తూ మావోయిస్టుల లేఖ
భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో లేఖ
మరో 6నెలల పాటు కాల్పుల విరమణ కొనసాగిస్తున్నాం
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం: మావోయిస్టు పార్టీ
-
Nov 03, 2025 13:12 IST
చేవెళ్ల బస్సు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం: సీపీ
నిర్మాణ పనుల కోసం కంకర లోడ్‌తో టిప్పర్ వెళ్తోంది: సీపీ అవినాష్
టిప్పర్ ఓనర్ వివరాలు సేకరిస్తున్నాం: సీపీ అవినాష్ మహంతి
ప్రమాదం సమగ్ర దర్యాప్తు చేస్తాం: సీపీ అవినాష్ మహంతి
-
Nov 03, 2025 11:52 IST
చేవెళ్ల ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాలకు కొనసాగుతోన్న పోస్టుమార్టం
పోస్టుమార్టం నిర్వహిస్తున్న తాండూరు, వికారాబాద్, గాంధీ, ఉస్మానియా వైద్యులు
ఇప్పటివరకు మూడు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
నాగమణి మృతదేహాన్ని కర్ణాటకలోని భానూర్‌కు తరలింపు
నజీర్ అహ్మద్ మృతదేహాన్ని తాండూరుకు తరలింపు
తారిబాయి మృతదేహాన్ని గంగారం తండాకు తరలింపు
-
Nov 03, 2025 11:52 IST
తాండూరుకు చెందిన కుటుంబంలో తీవ్ర విషాదం
ఒకే కుటుంబంలోని ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
మృతులు అనూష, సాయిప్రియ, నందిని
-
Nov 03, 2025 11:46 IST
చేవెళ్ల బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
చేవెళ్ల బస్సు ప్రమాదం కలచివేసింది: సీఎం రేవంత్‌రెడ్డి
మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం: రేవంత్
ఆర్టీసీ అందించే ఇన్సూరెన్స్‌తో పాటు..
బాధితులకు భరోసా ఇచ్చే అన్ని చర్యలు తీసుకుంటాం: రేవంత్
-
Nov 03, 2025 11:30 IST
చేవెళ్ల ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం: మోదీ
క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారం: మోదీ
-
Nov 03, 2025 11:30 IST
చేవెళ్ల బస్సు ప్రమాద మృతుల వివరాలు
దస్తగిరి బాబా (బస్సు డ్రైవర్), తారిబాయ్ (45), కల్పన (45),..
బచ్చన్ నాగమణి (55), ఏమావత్ తాలీబామ్, మల్లగండ్ల హనుమంతు,..
గుర్రాల అభిత (21), గోగుల గుణమ్మ, షేక్ ఖలీద్ హుస్సేన్, తబస్సుమ్ జహాన్
-
Nov 03, 2025 11:28 IST
చేవెళ్ల బస్సు ప్రమాదానికి కారణాలు
ఓవర్ లోడ్‌తో వస్తున్న టిప్పర్
అతివేగంగా ప్రయాణించిన టిప్పర్
రోడ్డుపై గుంతలు, అక్కడే మలుపు
ఢీకొట్టాక బస్సుపై పడిన టిప్పర్
కంకరపై టార్పాలిన్ కప్పకపోవడం
కంకర మొత్తం ప్రయాణికులపై పడడం
డ్రైవర్ సైడ్ 6 వరుసల్లో సీట్లను చీల్చేసిన టిప్పర్
54 మందికి గానూ 70 మంది ఎక్కడంతో పెరిగిన మృతులు
-
Nov 03, 2025 11:14 IST
ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారు: మంత్రి పొన్నం
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా: పొన్నం
క్షతగాత్రులకు రూ.2లక్షల చొప్పున పరిహారం: మంత్రి పొన్నం
ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడటం సరికాదు: పొన్నం
ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించాం: మంత్రి పొన్నం
చేవెళ్లలోనే అన్ని మృతదేహాలకు పోస్ట్‌మార్టం: పొన్నం
-
Nov 03, 2025 11:04 IST
బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారు: మంత్రి పొన్నం ప్రభాకర్
మృతదేహాలకు పోస్టుమార్టం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతుంది
-
Nov 03, 2025 11:01 IST
కాసేపట్లో చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనాస్థలికి సీఎం రేవంత్‌రెడ్డి
-
Nov 03, 2025 11:01 IST
చేవెళ్ల బస్సు ప్రమాద మృతులందరికీ ఒకేచోట పోస్టుమార్టం
మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తున్న అధికారులు
ఉస్మానియా, గాంధీ ఫోరెన్సిక్ వైద్యులు పోస్టుమార్టంలో పాల్గొనాలని ఆదేశం
పోస్టుమార్టం నిర్వహించేందుకు గాంధీ నుంచి ఉస్మానియాకు వైద్యుల బృందం
క్షతగాత్రుల కోసం గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు
-
Nov 03, 2025 10:49 IST
చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాజకీయ నాయకులను నిలదీసిన మృతుల కుటుంబ సభ్యులు
ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేను నిలదీసిన మృతుల కుటుంబ సభ్యులు
మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి రోహిత్ రెడ్డి లకు నిరసన సెగ
MLA కాలే యాదయ్య పై రాళ్ళ తో దాడికి యత్నం
-
Nov 03, 2025 09:53 IST
NH 163 అప్పా జంక్షన్ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రోడ్డు నిర్మాణం ప్రతిపాదన
చెట్లు ఎక్కువగా ఉండటంతో గ్రీన్ ట్రైబ్యునల్ అనుమతుల జాప్యంతో నిర్మాణాలకు బ్రేక్
ఇప్పటివరకు ఖానాపూర్ రోడ్డుపై పలు ప్రమాదాల్లో 200 మంది మృతి, 600 మందికి గాయాలు
-
Nov 03, 2025 09:52 IST
చేవెళ్ల బస్సు ప్రమాదంపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు
కంట్రోల్ రూమ్ నెం: 99129 19545, 94408 54433
-
Nov 03, 2025 09:52 IST
చేవెళ్ల బస్సు ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి: కేసీఆర్
-
Nov 03, 2025 08:49 IST
సహాయక చర్యల్లో పాల్గొన్న చేవెళ్ల సీఐ కాళ్లపైకి ఎక్కిన జేసీబీ
సీఐ భూపాల్ శ్రీధర్‌ను చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలింపు
-
Nov 03, 2025 08:48 IST
చేవెళ్ల బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్
వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం
ఎప్పటికప్పుడు పూర్తి వివరాలు తెలియజేయాలని సీఎం ఆదేశం
-
Nov 03, 2025 08:15 IST
రంగారెడ్డి: చేవెళ్ల మండలం ఖానాపూర్ గేట్ దగ్గర రోడ్డుప్రమాదం
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్, ఇద్దరు డ్రైవర్లు మృతి
టిప్పర్ కింద ఇరుకున్న బస్సు, పలువురికి తీవ్రగాయాలు
టిప్పర్‌లోని కంకర పడటంతో బస్సులో కూరుకుపోయిన ప్రయాణికులు
ఘటనాస్థలిలో జేసీబీతో కొనసాగుతోన్న సహాయక చర్యలు
ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు
చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
ప్రమాదానికి గురైన తాండూరు డిపో బస్సు
-
Nov 03, 2025 08:15 IST
నకిలీ మద్యం కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు
నకిలీ మద్యం కేసులో జనార్దన్‌తో జోగి సోదరులకు పరిచయం: రిమాండ్ రిపోర్ట్
ఇబ్రహీంపట్నంలోని స్వర్ణబార్ 2006-19 వరకు బాగా నడిచింది: రిమాండ్ రిపోర్ట్
బార్ లైసెన్స్ జోగి బంధువు బొర్రా అనిల్ కుమార్ పేరుపై ఉంది: రిమాండ్ రిపోర్ట్
2017లో జోగి సోదరుల సహాయంతో ఇబ్రహీంపట్నంలో లిక్కర్ సిండికేట్ ఏర్పాటు
అద్దేపల్లి బ్రదర్స్ నుంచి జోగి బ్రదర్స్‌కు లావాదేవీలు జరిగినట్టు గుర్తింపు
జోగి బ్రదర్స్‌కు జనార్దన్ డబ్బు అందించినట్టు మురళీకృష్ణ స్టేట్‌మెంట్‌లో వెల్లడి
ములకలుచెరువులో మద్యం తయారీ ప్రారంభించాలని రమేష్ సూచించారు
నకిలీ మద్యంతో రాష్ట్రానికి రూ.9కోట్ల నష్టం జరిగింది: రిమాండ్ రిపోర్ట్
సెప్టెంబర్ 23న రమేష్ ఇంటికి జనార్దన్ వెళ్లి కుట్రపై చర్చలు జరిపారు: రిమాండ్ రిపోర్ట్
ప్రణాళిక అమలు చేస్తే రూ.కోట్లు అద్దేపల్లి బ్రదర్స్‌కు ఇస్తానని రమేష్ హామీ ఇచ్చారు
జోగి రమేష్ హామీతోనే జనార్దన్ ఆఫ్రికాకు వెళ్లారు: రిమాండ్ రిపోర్ట్
అక్టోబర్ 3న ములకలచెరువు నకిలీ మద్యంపై సమాచారం ఇచ్చారు: రిమాండ్ రిపోర్ట్
ఫలితం రాకపోవడంతో ఇబ్రహీంపట్నం మద్యం తయారీపై సమాచారం ఇచ్చారు
కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది: రిమాండ్ రిపోర్ట్
-
Nov 03, 2025 08:14 IST
బాపట్ల: కర్లపాలెం మం. సత్యవతిపేట దగ్గర ఘోర రోడ్డుప్రమాదం
కారును ఢీకొట్టిన లారీ, నలుగురు మృతి, మరో ఇద్దరికి గాయాలు
మృతులంతా బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ బంధువులు
ఎమ్మెల్యే కుమారుడి సంగీత్‌కు వెళ్లి వస్తుండగా ఘటన
మృతులు: బలరామరాజు(65), లక్ష్మి(60), పుష్పవతి(60), శ్రీనివాసరాజు(54)
-
Nov 03, 2025 08:14 IST
కోల్‌కతాలో మరో గ్యాంగ్ రేప్
ఇంటి నుంచి ట్యూషన్‌కు వెళ్లిన మైనర్‌పై అత్యాచారం
ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
-
Nov 03, 2025 08:13 IST
నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
SLBC కోసం ఏరియల్ ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వే
టన్నెల్‌ను పరిశీలించనున్న రేవంత్, ఉత్తమ్, జూపల్లి
NGRI ఆధ్వర్యంలో హెలికాప్టర్-బోర్న్ VTEM సర్వే
200 కిలోమీటర్ల మేర హెలికాప్టర్ ఫ్లైయింగ్ షెడ్యూల్
భూమి అడుగున 1000 మీటర్ల లోతు వరకు డేటా సేకరణ
టన్నెల్ భద్రతకు సైన్స్ ఆధారిత మానిటరింగ్
-
Nov 03, 2025 07:16 IST
నాగర్‌కర్నూల్: నేడు సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన
అచ్చంపేట మండలం మన్నేవారిపల్లిలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
ఎన్జీఆర్ఐ బృందం SLBC టన్నెల్ పూర్తిచేసే ఇతర మార్గాల కోసం ఏరియల్ సర్వే
మధ్యాహ్నం ఒంటిగంటకు హెలికాప్టర్‌లో రానున్న సీఎం, మంత్రులు ఉత్తమ్, జూపల్లి
-
Nov 03, 2025 07:15 IST
బ్రిటన్ కేంబ్రిడ్జ్‌షైర్‌లో అర్థరాత్రి దారుణ ఘటన
రైలులో పది మంది ప్రయాణికులపై కత్తులతో దాడి
రైలు బోగీ మొత్తం రక్తసిక్తం, బాధితులకు ఆస్పత్రిలో చికిత్స
దాడికి పాల్పడిన ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
లండన్‌లోని డాన్‌కస్టర్ నుంచి కింగ్స్ క్రాస్‌కో వెళ్తున్న రైలులో
-
Nov 03, 2025 07:15 IST
తెలంగాణ: నేటి నుంచి ప్రైవేట్ కాలేజీలు బంద్
బకాయిలపై సీఎంవో అధికారులతో చర్చలు విఫలం
రూ.150 కోట్లు ఇస్తామన్నా అంకీకరించని యాజమాన్యాలు
రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి 1,840 ఉన్నత విద్యాసంస్థలు
జేఎన్‌టీయూ ఫార్మసీ సెమిస్టర్, ఇంజినీరింగ్ ఇంటర్నల్, బీఈడీ పరీక్షలు వాయి
-
Nov 03, 2025 07:15 IST
హైదరాబాద్: రసవత్తరంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక
ప్రత్యర్థి బలంగా ఉన్న బస్తీలపై పార్టీల ఫోకస్
మోహరించిన ప్రధాన పార్టీల పదాతి దళాలు
కీలకంగా రహ్మత్‌నగర్, ఎర్రగడ్డ, షేక్‌పేట
-
Nov 03, 2025 07:15 IST
లండన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు
వ్యక్తిగత పర్యటనలో భాగంగా లండన్‌కు చంద్రబాబు దంపతులు
IOD సంస్థ నుంచి 2 ప్రతిష్టాత్మక అవార్డులు అందుకోనున్న భువనేశ్వరి
సోమవారం వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీలు
-
Nov 03, 2025 07:14 IST
బాపట్ల: కర్లపాలెం మం. సత్యవతిపేట దగ్గర ఘోర రోడ్డుప్రమాదం
కారును ఢీకొట్టిన లారీ, నలుగురు మృతి, మరో ఇద్దరికి గాయాలు
మృతులంతా కర్లపాలెం వాసులు, ఎమ్మెల్యే నరేంద్రవర్మ బంధువులు
ఎమ్మెల్యే కుమారుడి సంగీత్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ప్రమాదం
మృతులు: బేతాళం బలరామరాజు(65), బేతాళం లక్ష్మి(60)
మృతులు: గాదిరాజు పుష్పవతి(60), ముదుచారి శ్రీనివాసరాజు(54)
-
Nov 03, 2025 07:14 IST
విజయవాడ: జోగి రమేష్, జోగి రాముకు రిమాండ్
నకిలీ మద్యం కేసులో ఇరువురికి ఈనెల 13 వరకు రిమాండ్
విజయవాడ జిల్లా జైలుకు తరలించిన అధికారులు
కేసులో A18 జోగి రమేష్, A19గా జోగి రాము
నకిలీ మద్యం కేసులో 23కు చేరిన నిందితుల సంఖ్య
ఇప్పటివరకు 18 మంది నిందితులు అరెస్ట్
-
Nov 03, 2025 07:14 IST
భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది: ప్రధాని మోదీ
భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది: సీఎం చంద్రబాబు
భారత మహిళల జట్టు సరికొత్త అధ్యాయం లిఖించింది: సీఎం రేవంత్ రెడ్డి
-
Nov 03, 2025 06:31 IST
ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీ భారత్ కైవసం
ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం
52 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై భారత్ గెలుపు
భారత్ 298/7, దక్షిణాఫ్రికా 246 ఆలౌట్
తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత ఉమెన్స్ టీమ్
-
Nov 03, 2025 06:31 IST
తెలంగాణ: నేటి నుంచి ప్రైవేట్ కాలేజీలు బంద్
బకాయిలపై సీఎంవో అధికారులతో చర్చలు విఫలం
రూ.150 కోట్లు ఇస్తామన్నా అంకీకరించని యాజమాన్యాలు