-
-
Home » Mukhyaamshalu » Telangana ap news to national and international news on 2nd nov 2025 know here vreddy
-
BREAKING: లారీని ఢీకొన్న టెంపో వాహనం, 18 మంది మృతి
ABN , First Publish Date - Nov 02 , 2025 | 06:49 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 02, 2025 21:14 IST
రాజస్థాన్: మటోడా దగ్గర ఘోర రోడ్డుప్రమాదం
లారీని ఢీకొన్న టెంపో వాహనం, 18 మంది మృతి
మృతులు జోథ్‌పూర్‌లోని సుర్‌సాగర్ వాసులు
ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలు
-
Nov 02, 2025 21:14 IST
సిద్దిపేట: దుబ్బాకలో భారీ వర్షం
అకాల వర్షానికి మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం
ధాన్యంపై కప్పడానికి కవర్లు కూడా లేకపోవడంతో రైతుల ఆవేదన
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్
-
Nov 02, 2025 21:14 IST
పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం ..
హైదరాబాద్: పటాన్‌చెరు పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
మూతపడిన రసాయన పరిశ్రమలో భారీగా ఎగసిపడుతున్న మంటలు
మంటలను అదుపుచేస్తున్న ఫైర్ సిబ్బంది
-
Nov 02, 2025 17:28 IST
రాకెట్ ప్రయోగం..
శ్రీహరికోట: LVM3-M5 రాకెట్ ప్రయోగం
ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్తున్న LVM3-M5 రాకెట్
-
Nov 02, 2025 13:27 IST
తప్పులు చేయడం, సమర్ధించుకోవడం వైసీపీ DNAలోనే ఉంది: బుద్దా వెంకన్న
జనార్దన్‌రావు ఇచ్చిన సమాచారంతో జోగి రమేష్‌ను అరెస్టు చేశారు: బుద్దా వెంకన్న
ఇప్పుడు జోగి రమేష్ విచారణలో జగన్ పేరు చెబుతాడు: బుద్దా వెంకన్న
జగన్‌కు కూడా నకిలీ మద్యం కేసులో పాత్ర ఉంది: బుద్దా వెంకన్న
లిక్కర్ స్కాం కేసులో డబ్బు తాడేపల్లి ప్యాలెస్‌కు చేరినట్లు నిర్ధారించారు
ఇప్పుడు నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ వెనుక జగన్ ఉన్నాడు
ఈ నకిలీ మద్యం అంశాన్ని గత ప్రభుత్వంలో ఎందుకు బయట పెట్టలేదు
-
Nov 02, 2025 12:54 IST
ముందు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం తప్పేది: మంత్రి ఆనం
మృతుల కుటుంబాల బాధ్యత ప్రభుత్వం తీసుకుంది: మంత్రి ఆనం
ఘటన తర్వాత వెంటనే ప్రభుత్వం స్పందించింది: మంత్రి ఆనం
7 అడుగుల ఎత్తు నుంచి భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు: ఆనం
-
Nov 02, 2025 12:54 IST
హైడ్రా చర్యలు.. పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు మరోలా ఉంది: కేటీఆర్
హైడ్రాపై భట్టి విక్రమార్క PPT పేరుతో 15 మంది బిల్డర్ల పేర్లు చెప్పారు: కేటీఆర్
కానీ ఇప్పటివరకూ ఒక్కరిపై చర్యలు లేవు: కేటీఆర్
హైడ్రా చేసేది మంచే అయితే వారిపై చర్యలు ఎందుకు లేవు?: కేటీఆర్
-
Nov 02, 2025 12:54 IST
విజయవాడ: నకిలీ మద్యం కేసులో ఆరేపల్లి రాముని ప్రశ్నించిన సిట్
జోగి రమేష్ అనుచరుడు రాముని 4 గంటలు ప్రశ్నించిన సిట్
నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఏమిటని ప్రశ్నించారు
నాకు తెలియదు..మద్యంతో సంబంధం లేదని చెప్పా: రాము
జనార్దన్‌రావుతో నాకు ఎటువంటి లావాదేవీలు లేవు: రాము
జోగి రమేష్‌కు కూడా జనార్దన్‌రావుతో పరిచయం ఉంది: రాము
విచారణకు అందుబాటులో ఉండాలని,..
అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పి సిట్ అధికారులు చెప్పారు: రాము
-
Nov 02, 2025 11:47 IST
జోగి రమేష్ అరెస్ట్ను ఖండించిన వైఎస్ జగన్
డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే జోగి రమేష్ను అరెస్ట్
ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికే అక్రమ అరెస్ట్
కల్తీ మద్యం కేసులో పట్టుబడ్డవారిలో అంతా టీడీపీ వాళ్లే
మీ జేబులో ఉన్న సిట్ మీరు ఏం చెప్తే అది చేస్తుంది: వైఎస్ జగన్
-
Nov 02, 2025 11:42 IST
భారత్‌పై మరోసారి పాకిస్థాన్ మాటల యుద్ధం
ఘర్షణలతో తమను బిజీగా ఉంచాలనేది భారత్ వ్యూహం: పాక్ మంత్రి అసిఫ్
తూర్పు, పశ్చిమ సరిహద్దుల ఘర్షణల్లో తాము నిమగ్నమయ్యేలా భారత్ యత్నం
భారత్ తమపై పరోక్ష యుద్ధం చేస్తోంది: పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్
-
Nov 02, 2025 10:45 IST
రేపు ఢిల్లీలో ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ (ESTIC) కాంక్లేవ్
టెక్నాలజీ ఇన్నోవేషన్ (ESTIC) కాంక్లేవ్‌ను ప్రారంభించనున్న మోదీ
రీసెర్చ్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ (RDI) స్కీం కింద..
పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మోదీ
-
Nov 02, 2025 08:45 IST
రేపు కర్నూలు రానున్న కేంద్ర రవాణా శాఖ అధికారుల బృందం
అగ్ని ప్రమాదంలో దగ్ధమైన వి. కావేరీ ట్రావెల్స్ బస్సును పరిశీలించి ప్రమాదంపై దర్యాప్తు చేయనున్న కేంద్ర అధికారుల బృందం
-
Nov 02, 2025 08:23 IST
నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్టు
జోగి రమేష్ కి సెర్చ్ వారెంట్ అందచేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు
ఆయన ఇంట్లో తనిఖీలు చేసేందుకు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామ శివ పేరుతో నోటీసులు
నకిలీ మద్యం కేసులో తనిఖీలు చేస్తున్నట్లు చెప్పిన అధికారులు
నివాసం నుంచి బయటకు వచ్చిన జోగి రమేష్
తనిఖీలు అనంతరం జోగి రమేష్ ను అరెస్టు చేసిన పోలీసులు
-
Nov 02, 2025 08:22 IST
విజయవాడ: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి సిట్ అధికారులు
కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ను అరెస్ట్ చేసే అవకాశం
జోగి రమేష్ ఇంటికి చేరుకున్న ఎక్సైజ్ అధికారులు
జోగి రమేష్‌తో పాటు సోదరుడు రాము ఇంటికి పోలీసులు
కల్తీమద్యం కేసులో జనార్దనరావు స్టేట్‌మెంట్ ఆధారంగా విచారణ
జోగి రమేశ్ ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రాము అరెస్ట్
-
Nov 02, 2025 08:19 IST
ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడికి టీడీపీ క్రమశిక్షణ కమిటీ పిలుపు
ఈనెల 4న ఉదయం కొలికపూడి, అదేరోజు సాయంత్రం చిన్ని విచారణ
4న ఉ.11కి రావాలంటూ కొలికపూడికి టీడీపీ క్రమశిక్షణ కమిటీ పిలుపు
4న సాయంత్రం 4 గంటలకు రావాలంటూ కేశినేని చిన్నికి పిలుపు
-
Nov 02, 2025 08:19 IST
శ్రీహరికోటలో బాహుబలి రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్
సాయంత్రం 5:26 గంటలకు LVM3-M5 రాకెట్ ప్రయోగం
జీశాట్-7R కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగం
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన జీశాట్-7R
పదేళ్ల పాటు ఇంటర్నెట్ సేవలు అందించనున్న ఉపగ్రహం
-
Nov 02, 2025 08:19 IST
ఉత్తరాఖండ్‌లో నేటి నుంచి రాష్ట్రపతి ముర్ము పర్యటన
హరిద్వార్‌లోని పతంజలి యూనివర్సిటీలో..
రెండో స్నాతకోత్సవానికి హాజరుకానున్న రాష్ట్రపతి ముర్ము
3న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రసంగించనున్న రాష్ట్రపతి
-
Nov 02, 2025 08:18 IST
హైదరాబాద్: రేపటి నుంచి ప్రైవేటు కాలేజీల బంద్‌కు పిలుపు
కాలేజీల బంద్‌కు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య పిలుపు
ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్
-
Nov 02, 2025 08:18 IST
ఏపీలో 21 మంది IPS అధికారుల బదిలీ
ఏపీ ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా అశోక్‌కుమార్
విజయవాడ ట్రాఫిక్ డీసీపీగా షేక్ బేగం
విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీగా మణికంఠ చందోలు
ఎన్టీఆర్ కమిషనరేట్ లా&ఆర్డర్ డీసీపీగా కృష్ణకాంత్
సైబర్ క్రైమ్ సీఐడీ ఎస్సీగా అదిరాజ్ సింగ్ రాణా
ఇంటెలిజెన్స్ ఎస్పీగా కె. శ్రీనివాసరావు
-
Nov 02, 2025 08:18 IST
సీఐడీ మహిళల భద్రత సెల్-2 ఎస్పీగా వి. రత్న
ఐదో బెటాలియన్ కమాండెంట్‌గా రవిశంకర్‌రెడ్డి
సీఐడీ ఎస్పీగా ఆర్. గంగాధర్‌రావు
ఏఐజీ ఆర్గనైజేషన్‌గా డీజీపీ ఆఫీస్‌లో పనసారెడ్డికి పోస్టింగ్
ప్లానింగ్, కో అర్డినేషన్ ఏఐజీగా వెంకటరత్నం
NTR కమిషనరేట్ రూరల్ డీసీపీగా లక్ష్మినారాయణ
-
Nov 02, 2025 08:17 IST
CID నుంచి సైబర్ క్రైమ్ కమిషనర్‌గా కృష్ణప్రసాద్
ఈగల్ యూనిట్ ఎస్పీగా కేఎం మహేశ్వర్‌రాజు
ఇంటెలిజెన్స్ సీఎం ఎస్డీ ఎస్పీగా జగదీష్
చింతూరు అడిషనల్ ఎస్పీగా పంకజ్‌కుమార్ మీనా
సత్యసాయి జిల్లా అడిషనల్ ఎస్పీగా అంకిత మహావీర్
జంగారెడ్డిగూడెం ASPగా సుష్మిత, చింతూరు ASPగా హేమంత్ బొద్దు
పార్వతీపురం ASPగా మనీషా వంగలరెడ్డి నియామకం
-
Nov 02, 2025 08:17 IST
నేడు ICC ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్
నవీ ముంబైలో మ.3 నుంచి IND Vs SA ఫైనల్ మ్యాచ్
ఇప్పటివరకు టైటిల్ సాధించని భారత్, సౌతాఫ్రికా
-
Nov 02, 2025 08:17 IST
శ్రీవారిని దర్శించుకున్న నారా రోహిత్ దంపతులు, తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి, తమిళనాడు మంత్రి రామచంద్రన్
కైశిక ద్వాదశి సందర్భంగా తిరు వీధుల్లో తిరుచ్చి వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చిన ఉగ్ర శ్రీనివాస
-
Nov 02, 2025 08:17 IST
జోగి రమేశ్ ఇంటికి చేరుకున్న వైసీపీ కార్యకర్తలు
పోలీసులతో వైసీపీ శ్రేణుల వాగ్వాదం
-
Nov 02, 2025 06:49 IST
వికారాబాద్: కుల్కచర్లలో దారుణం
భార్య, కుమార్తె, వదినను గొంతుకోసి చంపిన యాదయ్య
మరో కూతురిని కూడా చంపే ప్రయత్నం చేసిన యాదయ్య
హత్యల తర్వాత గొంతుకోసుకుని వేపూరి యాదయ్య ఆత్మహత్య
మృతులు అలివేలు(32), హనుమమ్మ(40) శ్రావణి(10), యాదయ్య(38)
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిగి పోలీసులు
-
Nov 02, 2025 06:49 IST
విజయవాడ: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి పోలీసులు
కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ను అరెస్ట్ చేసే అవకాశం
జోగి రమేష్ ఇంటికి చేరుకున్న ఎక్సైజ్ అధికారులు
జోగి రమేశ్తో పాటు సోదరుడు రాము ఇంటికి పోలీసులు