-
-
Home » Mukhyaamshalu » Telangana ap news to national and international news know here vreddy
-
BREAKING: తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ల బదిలీ
ABN , First Publish Date - Oct 31 , 2025 | 06:35 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Oct 31, 2025 18:49 IST
వేటకొడవలితో విద్యార్థి హల్‌చల్..
కర్నూలు: రాయలసీమ వర్సిటీలో వేటకొడవలితో విద్యార్థి హల్‌చల్
మొబైల్ విషయంలో ఇంజనీరింగ్ విద్యార్థులు అజయ్, బాలాజీ ఘర్షణ
వేటకొడవలితో బాలాజీ రూమ్ దగ్గరికి వెళ్లి బెదిరించిన అజయ్
అజయ్‌ను అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిన వర్సిటీ అధికారులు
-
Oct 31, 2025 18:48 IST
తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ల బదిలీ
అభివృద్ధి సంక్షేమ పథకాల ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్
గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా.. అనితా రామచంద్రన్‌కు పూర్తి అదనపు బాధ్యతలు
రవాణాశాఖ కమిషనర్‌గా ఇలంబర్తి
సీఎస్ రామకృష్ణారావుకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలు
శ్రీధర్‌కు GAD కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు
యాస్మిన్ బాషాకు టీజీ ఆయిల్‌ఫెడ్ ఎండీగా బాధ్యతలు
జితేందర్‌కు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్‌గా బాధ్యతలు
సైదులుకు అభివృద్ధి, సంక్షేమ శాఖల ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు
-
Oct 31, 2025 18:48 IST
తుఫాన్ నష్టం ఎంతంటే..
మొంథా తుఫాన్ నష్టంపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ప్రాథమిక నివేదిక
కేంద్రాన్ని రూ.5,244 కోట్ల తక్షణ సాయం కోరిన ఏపీ ప్రభుత్వం
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు.. కేంద్ర బృందాలను పంపించాలని కోరిన ఏపీ ప్రభుత్వం
-
Oct 31, 2025 15:03 IST
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న సీఎం రేవంత్
హుస్నాబాద్, హన్మకొండ, వరంగల్‌లో ఏరియల్ సర్వే
హన్మకొండ కలెక్టరేట్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించిన సీఎం రేవంత్
వరదలపై హన్మకొండ కలెక్టరేట్‌లో సమీక్షించనున్న రేవంత్
-
Oct 31, 2025 15:02 IST
స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌తో ఏపీ ప్రభుత్వ చర్చలు సఫలం
సమ్మె విరమించిన స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్
అన్ని వైద్య సేవలను పునఃప్రారంభించాలని అసోసియేషన్ నిర్ణయం
నవంబర్ 15లోపు రూ.250 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం
బకాయిల పరిష్కారానికి ఒకేసారి సెటిల్‌మెంట్ విధానానికి ఆమోదం
యూనివర్సల్ హెల్త్ స్కీమ్ రూపకల్పన, అమలు కోసం.. ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్‌తో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం నిర్ణయం
ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో తీసుకున్న నిర్ణయాలు.. ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయన్న అసోసియేషన్
సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన సీఎం చంద్రబాబు..
ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపిన అసోసియేషన్
-
Oct 31, 2025 15:02 IST
సత్యసాయి జిల్లాకు చంద్రబాబు..
రేపు సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
పెద్దన్నవారిపల్లిలో పెన్షన్లు పంపిణీ చేయనున్న చంద్రబాబు
రేపు రాత్రి లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు
-
Oct 31, 2025 09:43 IST
సెక్స్ స్కాంలో పేరు.. సోదరుడిని ఇంటి నుంచి గెంటేసిన బ్రిటన్ రాజు
ఎప్‌స్టైన్స్ సెక్స్ స్కాంలో బ్రిటన్ యువరాజు ఆండ్రూ పేరు
ఇటీవల తన రాయల్ టైటిల్ 'డ్యూక్ ఆఫ్ యార్క్'ను వదులుకున్న ఆండ్రూ
-
Oct 31, 2025 09:36 IST
కాల్పుల విరమణ కొనసాగింపునకు పాక్, ఆఫ్గాన్ అంగీకారం
తుర్కియే, ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇస్తాంబుల్‌లో చర్చలు
కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించాయని తుర్కియే ప్రకటన
-
Oct 31, 2025 09:13 IST
గుజరాత్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని
ఐక్యతా విగ్రహం దగ్గర నివాళులర్పించిన ప్రధాని మోదీ
ఏక్తా దివస్‌ను పురస్కరించుకుని పటేల్ విగ్రహానికి అంజలి ఘటించిన మోదీ
హెలికాప్టర్ నుంచి వల్లభాయ్ పటేల్ విగ్రహంపై పూలవర్షం
-
Oct 31, 2025 09:13 IST
అనకాపల్లి జిల్లాలో నేడు హోం మంత్రి అనిత పర్యటన
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో హోం మంత్రి అనిత పర్యటన
పాయకరావుపేట, యలమంచిలి నియోజకవర్గాల్లో హోం మంత్రి అనిత టూర్
-
Oct 31, 2025 09:13 IST
మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ అంశం సీరియస్‌గా తీసుకున్నాం: సీపీ సజ్జనార్
డీప్ ఫేక్ కేసులో సైబర్ నేరస్తుల మూలాలపై ఫోకస్: సీపీ సజ్జనార్
సైబర్ నేరాల పట్ల ఎవరూ ఆందోళన పడవద్దు: సీపీ సజ్జనార్
డిజిటల్ అరెస్ట్, పెట్టుబడుల పేరుతో ఇతర సైబర్ మోసాలకు ప్రజలు గురవుతున్నారు
పిల్లలు రూ.5 వేలు, పెద్దలు రూ.10 వేల కోసం..
పిల్లలు, పెద్దలు.. సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్స్ ఇస్తున్నారు: సీపీ సజ్జనార్
మ్యూల్ ఖాతాలు ఇచ్చేవారు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది: సీపీ సజ్జనార్
-
Oct 31, 2025 07:59 IST
కడప: భారతి సిమెంట్ మేనేజర్ భార్గవ్‌రెడ్డిపై కేసు నమోదు
జగన్ హయాంలో భూముల అంశంలో మోసం చేసిన భార్గవ్‌రెడ్డి
కడపకు చెందిన మహబూబ్‌ఖాన్ దగ్గర రూ.60 లక్షలు అడ్వాన్స్ తీసుకున్న భార్గవ్‌రెడ్డి
భూమి లేదని తెలిసిన తర్వాత అడ్వాన్స్ ఇవ్వమని అడిగితే మొహం చాటేసిన భార్గవ్‌రెడ్డి
కోర్టు ఆదేశాలతో భార్గవ్‌రెడ్డిపై కేసు నమోదు చేసిన సీకే దిన్నె పోలీసులు
-
Oct 31, 2025 07:59 IST
కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర విషయాలు
ప్రమాద సమయంలో కార్గో క్యాబిన్‌లో పడుకున్న రెండో డ్రైవర్ శివనారాయణ
భారీ శబ్ధంతో లేచి డ్రైవర్ లక్మయ్య దగ్గరకు వెళ్లా: డ్రైవర్ శివనారాయణ
ఎంత ప్రయత్నించినా మంటలు ఆపలేక పోయాం: డ్రైవర్ శివనారాయణ
ఇద్దరం కలసి బస్సు అద్దాలు పగలగొట్టి..
కొంతమంది ప్రయాణికులను రక్షించాం: డ్రైవర్ శివనారాయణ
-
Oct 31, 2025 07:59 IST
వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రత్యేక నాణెం, స్టాంపు విడుదల
ఢిల్లీ: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రముఖుల నివాళులు
ఏక్తా దివస్ సందర్భంగా నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఢిల్లీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి రాష్ట్రపతి నివాళులు
-
Oct 31, 2025 07:58 IST
అమరావతి: నేడు టీడీపీ ఆఫీస్‌కు సీఎం చంద్రబాబు
మ.3 గంటలకు పార్టీ కార్యాలయానికి చంద్రబాబు
ప్రజా విజ్ఞప్తులు స్వీకరించి కార్యకర్తలను కలవనున్న చంద్రబాబు
-
Oct 31, 2025 07:58 IST
రష్యా నుంచి చమురును భారత్ తగ్గిస్తోంది: ట్రంప్
రష్యా నుంచి చమురును చైనా కొనుగోలు చేస్తోంది: ట్రంప్
జిన్‌పింగ్‌తో చమురు గురించి చర్చించలేదు: ట్రంప్
-
Oct 31, 2025 07:58 IST
చైనా, అమెరికా మధ్య ముగిసిన వాణిజ్య యుద్ధం
చైనాపై సుంకాల తగ్గింపునకు ట్రంప్ అంగీకారం
జిన్‌పింగ్‌తో భేటీ తర్వాత ట్రంప్ నిర్ణయం
ఏప్రిల్‌లో చైనాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన
ట్రంప్ పర్యటన తర్వాత అమెరికాకు జిన్‌పింగ్
-
Oct 31, 2025 07:57 IST
అమరావతి, గన్నవరంలో మెగా రైల్ టెర్మినల్స్
8 ప్లాట్‌ఫామ్స్‌తో అమరావతి టెర్మినల్ నిర్మాణం
రైళ్ల నిర్వహణకు పిట్ లైన్స్ నిర్మించేలా ప్రణాళిక
ఏపీని 300 ఎకరాలు కోరిన రైల్వే శాఖ
-
Oct 31, 2025 07:57 IST
నేడు భారత్ Vs ఆస్ట్రేలియా రెండో టీ20
మ.1:45 గంటలకు మెల్‌బోర్న్ వేదికగా మ్యాచ్
-
Oct 31, 2025 07:56 IST
ఖమ్మం: సీపీఎం నేత దారుణ హత్య
మాజీ సర్పంచ్ అప్పారావును హత్య చేసిన దుండగులు
ఉదయం ఇంట్లో వాకింగ్ చేస్తుండగా గొంతు కోసి హత్య
చింతకాని మండలం పాతర్లపాడులో ఘటన
-
Oct 31, 2025 07:56 IST
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠ
3 నెలలలోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశం
నేటితో ముగియనున్న సుప్రీంకోర్టు గడువు
ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలు
నలుగురు ఎమ్మెల్యేలను మాత్రమే విచారించిన స్పీకర్
మిగతా ఎమ్మెల్యేల విచారణకు సమయం కావాలని కోరే అవకాశం
-
Oct 31, 2025 07:56 IST
నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో BRS ఎన్నికల ప్రచారం
మాట-ముచ్చట కార్యక్రమం ద్వారా BRS ప్రచారం
BRS శ్రేణుల బైక్ ర్యాలీలో పాల్గొననున్న కేటీఆర్
-
Oct 31, 2025 06:35 IST
నేడు వరంగల్, హుస్నాబాద్‌లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే
తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం రేవంత్
-
Oct 31, 2025 06:35 IST
నేడు తెలంగాణ కేబినెట్ విస్తరణ
మ.12.15 గంటలకు మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తర