-
-
Home » Mukhyaamshalu » Telangana Andhra Pradesh national and international telugu Viral trending Breaking news 23rd nov vreddy
-
BREAKING: ముగిసిన ఐ బొమ్మ రవి నాలుగో రోజు విచారణ
ABN , First Publish Date - Nov 23 , 2025 | 07:11 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 23, 2025 20:53 IST
హైదరాబాద్: ముగిసిన ఐ బొమ్మ రవి నాలుగో రోజు విచారణ
పైరసీ నెట్‌వర్క్ గురించి నోరు విప్పని ఇమంది రవి
పైరసీపై పొంతన లేని సమాధానాలు చెబుతున్న ఐ బొమ్మ రవి
పైరసీతో సంపాందించిన డబ్బుతో లగ్జరీ లైఫ్ గడిపిన రవి
ప్రతీ 15-20 రోజులకు ఒక్కో దేశం చొప్పున ఇమంది రవి టూర్
నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయ్‌లాండ్, దుబాయ్ పర్యటనలు
కరేబియన్ దేశమైన సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పౌరసత్వం కొనుగోలు
-
Nov 23, 2025 18:31 IST
ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
సీజేఐ ప్రమాణస్వీకారంలో పాల్గొననున్న రేవంత్‌రెడ్డి
-
Nov 23, 2025 17:33 IST
అల్లూరి జిల్లా: అనంతగిరి మం. జీనబాడులో విషాదం
రైవాడ డ్యామ్‌లో పడవ బోల్తా, ముగ్గురు మృతి
గల్లంతైన ఇద్దరిలో ఒకరి మృతదేహం గుర్తింపు
రైవాడ డ్యామ్‌లో కొనసాగుతున్న గాలింపు చర్యలు
-
Nov 23, 2025 16:20 IST
ఎర్రకోట దగ్గర పేలుడు కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
హర్యానాలోని ఫరీదాబాద్‌లో ATS తనిఖీలు
దబువాలోని ఓ ప్రార్థనామందిరంలో సోదాలు చేసిన ATS
రెండు సంచుల్లో అనుమానాస్పద పౌడర్ స్వాధీనం
పౌడర్‌ను పరీక్షల కోసం FSLకి పంపిన అధికారులు
-
Nov 23, 2025 15:45 IST
గువాహటి టెస్టు: తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 489 ఆలౌట్
భారత్ బౌలింగ్: కుల్దీప్ 4, బుమ్రా, సిరాజ్, జడేజా తలో 2 వికెట్లు
దక్షిణాఫ్రికా బ్యాటింగ్: ముత్తుసామి 109, యున్‌సేన్ 93, స్టబ్స్ 49 పరుగులు
-
Nov 23, 2025 15:04 IST
ఒంగోలులో మైనింగ్ కార్యాలయ భవనానికి మంత్రి కొల్లు శంకుస్థాపన
ఏపీ మైనింగ్ రంగాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: మంత్రి కొల్లు
వైసీపీ పాలనలో మైనింగ్ రంగాన్ని నాశనం చేశారు: కొల్లు రవీంద్ర
క్రిటికల్ మినరల్స్ కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర
-
Nov 23, 2025 15:04 IST
నేడు కొలిక్కిరానున్న తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ
ఇవాళ పూర్తికానున్న సర్పంచ్‌లు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ
రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్లు ఖరారు
సర్పంచ్, వార్డు సభ్యుల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేనషన్లు రొటేషన్ పద్ధతిలో ఖరారు
రిజర్వేషన్ల ఖరారుపై రేపు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనున్న ప్రభుత్వం
పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ
ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు నివేదించనున్న ప్రభుత్వం, ఎస్‌ఈసీ
రేపు లేదా ఎల్లుండి పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం
-
Nov 23, 2025 13:32 IST
అన్నమయ్య: మదనపల్లి మెడికల్ కాలేజీ దగ్గర ఉద్రిక్తత
పోటాపోటీ సవాళ్లతో మెడికల్ కాలేజీ దగ్గరకు వచ్చిన టీడీపీ, వైసీపీ నేతలు
తంబళ్లపల్లె వైసీపీ నేతలను అడ్డుకున్న మదనపల్లి టీడీపీ నాయకులు
వైసీపీ హయాంలో అవినీతిపై టీడీపీ నే శ్రీరామ్ చినబాబు ఆరోపణలు
మెడికల్ కాలేజీ ఉద్యోగాలను పెద్దిరెడ్డి అమ్ముకున్నారని విమర్శలు
ఇరువర్గాలను అడ్డుకున్న పోలీసులు, పరిస్థితి ఉద్రిక్తం
-
Nov 23, 2025 12:49 IST
తమిళనాడు: కాంచీపురం జిల్లాలో విజయ్ పర్యటన
కాంచీపురం జిల్లా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం
ప్రజలందరికీ సొంతిల్లు ఉండాలన్నదే మా లక్ష్యం: విజయ్
శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉంటాం: విజయ్
-
Nov 23, 2025 12:48 IST
అనంతపురంలో వైసీపీ నేత సత్యనారాయణరెడ్డి హల్‌చల్
ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ధ్వంసం చేయించిన వైసీపీ నేత సత్యనారాయణ
ఆస్పత్రిలో భాగస్వాములుగా ఉన్న శ్రీనివాసులు, రాఘవేంద్రరెడ్డి,..
లాయర్ శ్రీలత, వైసీపీ నేత, లాయర్ సత్యనారాయణరెడ్డి
ఆస్పత్రిని తనకు అప్పగించాలని 30 మంది రౌడీమూకలతో దాడి
ఆస్పత్రిలోని సీసీ కెమెరాలు, ఫర్నిచర్, అద్దాలు, లిఫ్ట్ ధ్వంసం
వైసీపీ రౌడీల దాడిలో రూ.3కోట్ల నష్టం వచ్చిందని బాధితురాలు ఆవేదన
-
Nov 23, 2025 10:57 IST
సత్యసాయిబాబా స్ఫూర్తి అందరిలో కనిపిస్తోంది: తెలంగాణ సీఎం రేవంత్
సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారు: సీఎం రేవంత్‌రెడ్డి
ప్రేమతో ఏదైనా సాధించవచ్చని సత్యసాయిబాబా నిరూపించారు: రేవంత్
సత్యసాయిబాబా ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత
ప్రభుత్వాలు కూడా చేయలేని పనులు సత్యసాయి ట్రస్ట్ నెరవేర్చింది: రేవంత్
-
Nov 23, 2025 10:16 IST
నేడు కొలిక్కిరానున్న తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ
ఇవాళ పూర్తికానున్న సర్పంచ్‌లు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ
రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్లు ఖరారు
సర్పంచ్, వార్డు సభ్యుల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేనషన్లు రొటేషన్ పద్ధతిలో ఖరారు
రిజర్వేషన్ల ఖరారుపై రేపు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనున్న ప్రభుత్వం
పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ
ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు నివేదించనున్న ప్రభుత్వం, ఎస్‌ఈసీ
రేపు లేదా ఎల్లుండి పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం
-
Nov 23, 2025 10:15 IST
ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో వాయు కాలుష్యం
ఢిల్లీలో AQI సగటున 380 పాయింట్లు నమోదు
వాజిపూర్‌లో అత్యధికంగా AQI 447 పాయింట్లు
-
Nov 23, 2025 10:07 IST
తీరు మార్చుకోని పైరసీ వెబ్‌సైట్లు
మూవీరూల్జ్‌లో ఒక్కరోజులోనే కొత్త సినిమాలు ప్రత్యక్షం
శుక్రవారం రిలీజ్ అయిన ప్రేమంటే, 12A రైల్వే కాలనీ,..
రాజా వెడ్స్ రాంబాయి సినిమాలు మూవీరూల్జ్‌లో ప్రత్యక్షం
ఒక్కరోజులోనే మూవీరూల్జ్‌లో అన్ని సినిమాల ప్రింట్లు
క్యాం కార్డర్ ద్వారా రికార్డు చేసి ప్రింట్లు అప్‌లోడ్
మరోవైపు పోలీసుల అదుపులో ఐ బొమ్మ రవి
పైరసీపై లోతుగా దర్యాప్తు జరుగుతున్నా..
సవాల్‌గా కొత్త సినిమాల ప్రింట్లు అప్‌లోడ్ చేస్తున్న వైనం
-
Nov 23, 2025 08:16 IST
పల్నాడు: పాలువాయి జంక్షన్‌లో అగ్నిప్రమాదం
బయోడీజిల్ బంక్‌లో పేలిన డీజిల్ ట్యాంక్
భారీగా ఎగిసిపడుతున్న మంటలు
మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
మృతుడు గురజాలకు చెందిన రషీద్‌గా గుర్తింపు
-
Nov 23, 2025 08:16 IST
అల్లూరి: మావోయిస్టుల నిరసనలతో ఆర్టీసీ అలర్ట్
గిరిజన గ్రామాలకు సాయంత్రం వరకు ఆర్టీసీ సర్వీసులు నిలిపివేత
రాజమండ్రి, కాకినాడ నుంచి భద్రాచలంకు సర్వీసులు నిలిపివేత
విశాఖ-సీలేరు వెళ్లే భద్రాచలం వెళ్లే బస్సులు నిలుపుదల
-
Nov 23, 2025 08:15 IST
శ్రీకాకుళం: కోటబొమ్మాళి మండలం ఎత్తురాల్లపాడు దగ్గర రోడ్డుప్రమాదం
లారీని ఢీకొట్టిన వ్యాన్, నలుగురు మృతి, ఆరుగురికి తీవ్రగయాలు
శ్రీశైలం వెళ్తుండగా ఘటన, మృతులు మధ్యప్రదేశ్ వాసులు
మృతులు బోరాసింగ్ పవర్, విజయ్ సింగ్ తోమర్, ఉషీర్ సింగ్, సంతోషిబాయ్
-
Nov 23, 2025 08:15 IST
విజయవాడ: ఈగల్ ఆధ్వర్యంలో డ్రగ్ వ్యతిరేక ర్యాలీ
పాల్గొన్న డీజీపీ హరీష్‌కుమార్, సీపీ రాజశేఖర్‌బాబు, ఈగల్ ఐజీ రవికృష్ణ
డ్రగ్స్‌తో యువత జీవితాలను బలి చేసుకుంటున్నారు: డీజీపీ
పోలీస్ పరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా.. ప్రజల సహకారం అవసరం
డ్రగ్స్ రవాణాను చాలా వరకు నివారించాం: డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా
ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించాం: డీజీపీ
డ్రగ్స్ రహిత ఏపీలో ప్రజలు భాగస్వామ్యం కావాలి: డీజీపీ హరీష్‌కుమార్
-
Nov 23, 2025 07:16 IST
పుట్టపర్తిలో ఏపీ సీఎం చంద్రబాబు
సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు
మధ్యాహ్నం ఒంటిగంటకు ఉండవల్లికి చంద్రబాబు తిరుగుపయనం
-
Nov 23, 2025 07:16 IST
హైదరాబాద్: నాచారంలో రోడ్డు ప్రమాదం, మహిళ మృతి
నాచారం హెచ్‌ఎంటీనగర్ కమాన్ వద్ద బైక్‌ను ఢీకొట్టిన ఏపీ ఆర్టీసీ బస్సు
బైక్‌పై వెళ్తున్న దంపతులను ఢీకొట్టిన ఏపీ ఆర్టీసీ బస్సు
భార్య అక్కడికక్కడే మృతి, భర్తకు తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు
-
Nov 23, 2025 07:16 IST
నేడు కొలిక్కిరానున్న తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ
ఇవాళ పూర్తికానున్న సర్పంచ్‌లు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ
రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్లు ఖరారు
సర్పంచ్, వార్డు సభ్యుల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేనషన్లు రొటేషన్ పద్ధతిలో ఖరారు
రిజర్వేషన్ల ఖరారుపై రేపు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనున్న ప్రభుత్వం
పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ
ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు నివేదించనున్న ప్రభుత్వం, ఎస్‌ఈసీ
రేపు లేదా ఎల్లుండి పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం
-
Nov 23, 2025 07:15 IST
నేడు పుట్టపర్తికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి
పుట్టపర్తిలోని సాయికల్వంత్ హాల్‌లో ఉ.10 గంటలకు సత్యసాయి ఉత్సవాలు
సాయంత్రం ఫ్యూచర్ సిటీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు పరిశీలించనున్న సీఎం రేవంత్ రెడ్డి
-
Nov 23, 2025 07:15 IST
గాజాలో శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ భీకర దాడులు
గాజాలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు
ఇజ్రాయెల్ దాడుల్లో ఐదుగురు సీనియర్ హమాస్ సభ్యులు హతం
ఇజ్రాయెల్ దాడుల్లో 24 మంది పాలస్తీనా పౌరులు మృతి, 54 మందికి గాయాలు
హమాసే శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ ఆరోపణలు
-
Nov 23, 2025 07:11 IST
నర్వినియోగం, శుద్ధ ఇంధనం, సుస్థిరతలకు భారత్ కట్టుబడి ఉందన్న ప్రధాని
జీ20 ఓపెన్ శాటిలైట్ డేటా పార్టనర్‌షిప్ ఏర్పాటు చేయాలన్న ప్రధాని మోదీ
ఉమ్మడి ప్రకటనను ఆమోదించిన జీ20 శిఖరాగ్ర సదస్సు
అమెరికా అడ్డుపడినా ఒక తీర్మానాన్ని ఏకగ్రీవం చేసుకున్న జీ20 దేశాల నేతలు
సంఘటితత్వం, సమానత్వం, సుస్ధిరతలు సమ్మిళిత వృద్ధికి మూలస్తంభాలని తీర్మానం
-
Nov 23, 2025 07:11 IST
దక్షిణాఫ్రికా: జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ
సమ్మిళిత, సుస్థిర ఆర్థికాభివృద్ధి అంశంపై ప్రసంగించిన ప్రధాని మోదీ
ప్రపంచ అభివృద్ధే లక్ష్యంగా ఆరు కొత్త ప్రతిపాదనలు చేసిన ప్రధాని మోదీ
ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ విజ్ఞాన నిధి ఏర్పాటు చేయాలన్న ప్రధాని
గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటుకు ప్రతిపాదన చేసిన ప్రధాని మోదీ
ఉగ్రవాదులు, డ్రగ్స్ సంబంధాలకు అడ్డుకట్ట వేయాలని మోదీ పిలుపు
జీ20 దేశాలు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించిన ప్రధాని
ఆరోగ్య రక్షణకు ప్రతిస్పందన బృందం ఏర్పాటు కావాలని ఆకాంక్షించిన ప్రధాని