-
-
Home » Mukhyaamshalu » Telangana Andhra Pradesh Breaking Viral trending national and international 11th nov 2025 kjr
-
BREAKING: సీఐడీ విచారణకు బిగ్‌బాస్ ఫెమ్ సిరి హనుమంతు..
ABN , First Publish Date - Nov 11 , 2025 | 06:47 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 11, 2025 17:32 IST
సీఐడీ విచారణకు బిగ్‌బాస్ ఫెమ్ సిరి హనుమంతు..
సిరి హనుమంతుని విచారిస్తున్న సీఐడీ.
బెట్టింగ్ యాప్స్ ద్వారా భారీగా పారితోషికం తీసుకున్న సిరి హనుమంతు.
బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చిన నగదుతో మూడు బ్యూటీ ట్రీట్‌మెంట్ హాస్పిటల్‌ను నిర్మించిందని ఆరోపణలు.
గోవిందా 365 అనే బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసిన సిరి హనుమంతు.
గోవిందా 365 యాప్ ద్వారా ఎంత గెలుచుకున్నా సరే రూపాయి కూడా టాక్స్ ఉండదు.
జీరో పర్సెంట్ టాక్స్.. అంటూ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినట్లు CID ఆధారాలు.
కొనసాగుతున్న సిరి హనుమంతు CID విచారణ.
-
Nov 11, 2025 16:58 IST
హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో CID విచారణ
ముగిసిన విజయ్ దేవరకొండ CID విచారణ
విజయ్ దేవరకొండను గంటన్నరపాటు ప్రశ్నించిన CID
విజయ్ దేవరకొండ స్టేట్‌మెంట్ రికార్డు చేసిన సీఐడీ
నేను ప్రమోట్ చేసిన A23 గేమింగ్ యాప్ తెలంగాణలో ఓపెన్ అవ్వదు: విజయ్
ఇకపై ఎలాంటి గేమింగ్, బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయను: విజయ్
-
Nov 11, 2025 15:44 IST
ఫరీదాబాద్ పేలుడు పదార్థాల కేసులో కొనసాగుతున్న అరెస్టులు
మరో మహిళా డాక్టర్ షాహిన్ అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
అల్ ఫలాహ్ వర్సిటీలో అసోసియేట్‌గా పనిచేస్తున్న డాక్టర్ షహీనా
జైష్-ఏ-మహ్మద్ ఉగ్రవాద సంస్థ..
ఉమెన్ వింగ్ కమాండర్‌గా ఉన్న డాక్టర్ షహీనా
డాక్టర్ ముజమిల్ షకీల్ దగ్గర అసోసియేట్‌గా షహీనా
ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
-
Nov 11, 2025 14:38 IST
తెలంగాణ సాధనలో అందెశ్రీ పాత్ర మరువలేం: సీఎం రేవంత్‌రెడ్డి
అందెశ్రీ ప్రతి పాట ప్రజాజీవితం నుంచి పుట్టుకొచ్చింది: రేవంత్
జయజయహే తెలంగాణ పాటను పాఠ్య పుస్తకాల్లో పెడతాం..
వచ్చే కేబినెట్‌లో చర్చిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
అందెశ్రీకి పద్మశ్రీ కోసం కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సహకరించాలి
అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం: రేవంత్
అందెశ్రీ స్మృతివనం ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
అందెశ్రీ రచనలు పుస్తక రూపంలో తెస్తాం: సీఎం రేవంత్
-
Nov 11, 2025 13:38 IST
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్
పలువురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం
నేషనల్ పార్క్ ప్రాంతంలో కొనసాగుతోన్న ఎదురుకాల్పులు
కీలక మావోయిస్టు నేతను భద్రతా బలగాలు చుట్టుముట్టినట్టు సమాచారం
-
Nov 11, 2025 12:47 IST
కవి అందెశ్రీ పాడె మోసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
-
Nov 11, 2025 12:31 IST
ఢిల్లీ పేలుడు ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం: ప్రధాని మోదీ
ఘటనకు బాధ్యులైన వారిని వదిలే ప్రసక్తే లేదు: ప్రధాని మోదీ
కుట్ర కోణంపై ఏజెన్సీల దర్యాప్తు మొదలైంది: ప్రధాని మోదీ
ఢిల్లీ పేలుడు ఘటనలో ఉగ్ర కుట్ర మూలాలను ఛేదిస్తాం: మోదీ
-
Nov 11, 2025 11:54 IST
ఢిల్లీ దాడికి పాల్పడ్డవారికి రాజ్‌నాథ్‌సింగ్ హెచ్చరిక
దాడి చేసినవారిని ఉపేక్షించం: రాజ్‌నాథ్‌సింగ్
కుట్ర దారులను చట్టం ముందు నిలబెడతాం: రాజ్‌నాథ్‌సింగ్
-
Nov 11, 2025 11:53 IST
ఢిల్లీ పేలుడు ఘటనలో 12కు చేరిన మృతులు
పేలుడు ధాటికి 17 మందికి గాయాలు, LNJP ఆస్పత్రిలో చికిత్స
-
Nov 11, 2025 11:50 IST
హైదరాబాద్: ఉగ్రవాది డాక్టర్ మొయినుద్దీన్ నుంచి కీలక సమాచారం
రాజేంద్రనగర్‌లో డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్‌ను అరెస్టు చేసిన గుజరాత్ ATS
భారీ మొత్తంలో విష ప్రయోగం చేసి చంపాలని కుట్ర చేసినట్టు గుర్తింపు
రెసిన్ విషం తయారు చేస్తున్న డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్
సయ్యద్ నుంచి రెసిన్‌కు సంబంధించిన పదార్థాలు స్వాధీనం
దేవాలయాలు, వాటర్ ట్యాంక్‌లో రెసిన్ కలిపి విష ప్రయోగం చేయాలని కుట్ర
పాక్ నుంచి వచ్చిన హైండ్లర్ ఆదేశాలతో రెసిన్‌ను తయారు చేస్తున్న మొయినుద్దీన్
చైనాలో MBBS చేసి హైదరాబాద్ వచ్చిన డాక్టర్ మొయినుద్దీన్
ఆన్‌లైన్ ద్వారా ట్రీట్‌మెంట్ చేస్తున్న డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్
ఇప్పటికే మొయినుద్దీన్‌తో పాటు నలుగురిని అరెస్ట్ చేసిన గుజరాత్ ATS
-
Nov 11, 2025 11:38 IST
దేశవ్యాప్తంగా 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక
తెలంగాణ జూబ్లీహిల్స్‌తో పాటు జమూకశ్మీర్‌లో 2, రాజస్థాన్,..
జార్ఖండ్, పంజాబ్, మిజోరం, ఒడిశాలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక
ఉ.11గంటల వరకు జూబ్లీహిల్స్‌లో 20.76 శాతం పోలింగ్ నమోదు
ఉ.9గంటల వరకు బిహార్‌లో 31.38 శాతం పోలింగ్ నమోదు
ఉ.9గంటల వరకు జార్ఖండ్-34.32%, మిజోరం-34.38%, ఒడిశా-32.51% పోలింగ్
ఉ.9గంటల వరకు పంజాబ్-23.35%, రాజస్థాన్-28.74% పోలింగ్ నమోదు
-
Nov 11, 2025 11:32 IST
సత్యసాయి బాబా శతజయంతి వేడుకలకు ఏర్పాట్లు
ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు అనగాని, ఆనం, సత్యకుమార్
ఈ నెల 19న పుట్టపర్తికి రానున్న ప్రధాని మోదీ
-
Nov 11, 2025 11:32 IST
గుంటూరులో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పర్యటన
గుంటూరు: ర్యాలీలో పాల్గొన్న కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
నల్లపాడు లయోలా స్కూల్లో పైలాన్ ఆవిష్కరించిన కేంద్ర మంత్రులు
పురాతన చెరువును అత్యాధునికంగా పునరుద్ధరించారు: కేంద్రమంత్రి శివరాజ్ సింగ్
-
Nov 11, 2025 11:31 IST
రాష్ట్రవ్యాప్తంగా 50 MSME పార్కులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
MSME పార్కుల ఏర్పాటు రెండో దశలో 329 ఎకరాల్లో ప్రారంభం
329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
587 ఎకరాల్లో మరో 35 పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
-
Nov 11, 2025 10:01 IST
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ హై అలర్ట్
ఢిల్లీ బాంబ్ పేలుడు తో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
విమానాశ్రయం పరిసరాల్లో బాంబ్ డిటెక్షన్ టీం (BD టీం) , CISF ముమ్మర తనిఖీలు
విమానాశ్రయ ప్రాంగణంలో మరియు పరిసరాల్లో బాంబ్ అండ్ డాగ్స్ తో తనిఖీలు
వాహనాలు, ప్రయాణికుల బాగ్స్ ను తనిఖీ చేస్తున్న పోలీసులు
-
Nov 11, 2025 08:29 IST
అందెశ్రీ అంత్యక్రియలకు.. సీఎం
కాసేపట్లో ఘట్కేసర్‌కు బయలుదేరనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం
అందెశ్రీ పార్దీవ దేహానికి నివాళులు అర్పించి అంతిమ యాత్రలో పాల్గొననున్న సీఎం.
-
Nov 11, 2025 08:24 IST
మహిళపై కత్తితో దాడి..
గుంటూరు జిల్లా కాకుమానులో మహిళపై కత్తితో దాడి..
మెడలో గొలుసు ఇవ్వాలని కత్తితో బెదిరింపు..
గొలుసు ఇవ్వకపోవడంతో మెడపై కత్తితో పొడిచిన దుండగులు..
స్థానికులు కేకలు వేయడంతో పారిపోయిన దుండగుడు
మహిళను ఆసుపత్రికి తరలించిన స్దానికులు.
-
Nov 11, 2025 08:12 IST
బాలిక ఆచూకీ లభ్యం
అమలాపురంలో నిన్న మిస్సింగ్ అయిన బాలిక ఆచూకీ లభ్యం
పి..గన్నవరం మండలం ఎర్రం శెట్టి వారి పాలెం వద్ద పాపను గుర్తించిన భవాని స్వాములు
అమలాపురంలో ఒక ప్రైవేట్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న బాలిక
నిన్న సాయంత్రం మేనమామ వరస అయిన ఒక వ్యక్తి పాపను తీసుకెళ్లిన వైనం
తొలుత కాకినాడ తీసుకు వెళ్లిన కిడ్నాపర్ తిరిగి తన స్వగ్రామం అయిన పి గన్నవరం రాక
రాత్రి 10 13 నిమిషాలకు సీసీ పుటేజీలో గుర్తింపు
పాపను తీసుకుని 20 ఎకరాల అరటితోటలోకి వెళ్లి దాక్కున్న కిడ్నాపర్
అమలాపురం పట్టణ సీఐ వీరబాబు ఆధ్వర్యంలో రాత్రంతా పాప కోసం గాలింపు
ఉదయం పాపని బెల్లంపూడి వైపు నడిపించుకుంటూ తీసుకు వెళ్తుండగా గుర్తు పట్టిన భవానీలు
తండ్రి కముజు రమణకు పాపను అప్పగించిన పట్టణ పోలీస్
పరారీలో నిందితుడు..
-
Nov 11, 2025 08:10 IST
కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
కృష్ణా జిల్లా ఉయ్యూరు- మచిలీపట్నం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.
గండిగుంట సమీపంలో ప్రమాదం.. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి.
కుందేరు గ్రామానికి చెందిన యువకులుగా గుర్తింపు.
మృతులు చింతయ్య(17), రాకేష్ బాబు(24), ప్రిన్స్ (24)
ఒకరికి తీవ్ర గాయాలు ఆస్పత్రి తరలింపు..
కారు అదుపు తప్పడంతో ప్రమాదం..
అతివేగమే ప్రమాదానికి కారణం అంటున్న స్థానికులు..
పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి మృతదేహాల తరలింపు.
-
Nov 11, 2025 07:45 IST
అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం
ఢిల్లీ: 9:30 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం
రెడ్ ఫోర్ట్ కారు బ్లాస్ట్ ఘటనపై అధికారులతో చర్చ
-
Nov 11, 2025 07:44 IST
సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్...
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజక వర్గంలో ఈ రోజు సీఎం చంద్రబాబు పర్యటన.
పీసీ పల్లి మండలం లింగన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.
ఉదయం 9.30 గంటలకు ఉండవల్లి నుండి హెలికాప్టర్ లో బయలుదేరనున్న సీఎం చంద్రబాబు.
10.15 గంటలకు పీసీ పల్లి మండలం లింగన్నపాలెం చేరుకోనున్న సీఎం చంద్రబాబు.
10.35 నుండి 12.15 వరకు ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.
12.30కి హెలికాప్టర్‌లో ఉండవల్లి బయలుదేరి వెళ్లనున్న సీఎం చంద్రబాబు.
-
Nov 11, 2025 07:25 IST
ఈరోజు అందెశ్రీ అంత్యక్రియలు
ఘట్కేసర్ NFC నగర్ లో అందెశ్రీ అంత్యక్రియలు
అందెశ్రీ అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
అందెశ్రీ ఆప్తులు, అభిమానులతో కలిసి అంతిమ యాత్రలో పాల్గొననున్న సీఎం
9.30 గంటలకు ఘట్కేసర్ వెళ్లనున్న సీఎం రేవంత్
-
Nov 11, 2025 06:59 IST
నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
పీసీపల్లి మండలం లింగన్నపాలెంలో MSME పార్క్ ప్రారంభించనున్న సీఎం