-
-
Home » Mukhyaamshalu » Telangana Andhra Pradesh Breaking Viral and trending national and international on 10th nov 2025 vreddy
-
BREAKING: ఢిల్లీలో పేలుడు.. కీలక వివరాలు చెప్పిన సీపీ..
ABN , First Publish Date - Nov 10 , 2025 | 07:26 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 10, 2025 21:13 IST
పేలుడు ధాటికి దూరంలో ఉన్న ఆటోలు ధ్వంసం
50 మీటర్ల దూరం వరకు పేలుడు ప్రభావం
తమ జీవితంలో ఇంతటి పేలుడు చూడలేదన్న ప్రత్యక్ష సాక్షులు
ఉగ్ర కుట్రను తోసిపుచ్చలేమన్న ఉన్నతాధికారులు
పేలుడు ఘటనా స్థలంలో CRPF, NIA, NSG బృందాలు
దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించిన కేంద్ర హోంశాఖ
-
Nov 10, 2025 21:12 IST
ఢిల్లీలో పేలుడుపై కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా ఆరా
ఢిల్లీ సీపీ, ఐబీ చీఫ్‌తో ఫోన్‌లో మాట్లాడిన అమిత్ షా
పేలుడుపై దర్యాప్తునకు ఆదేశించిన అమిత్ షా
NSG, NIA, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులతో దర్యాప్తు
-
Nov 10, 2025 21:00 IST
కీలక వివరాలు చెప్పిన సీపీ..
ఎర్రకోట సమీపంలో రెడ్ లైట్ సిగ్నల్ పడడంతో ఆగిన కారు: ఢిల్లీ సీపీ
కారు ఆగి.. ఆగగానే ఒక్కసారిగా పేలుడు: ఢిల్లీ సీపీ
పేలుడు ధాటికి సమీపంలోని పలు వాహనాలు దగ్ధం: ఢిల్లీ సీపీ
పేలుడు ధాటికి ధ్వంసమైన పలు వాహనాలు: ఢిల్లీ సీపీ
-
Nov 10, 2025 20:48 IST
ఢిల్లీ పేలుడు ఘటనలో ఒకరు అరెస్ట్
అనుమానితుడిని ప్రశ్నిస్తున్న పోలీసులు
నడుస్తున్న కారులో పేలుడు జరిగినట్టు అనుమానం
-
Nov 10, 2025 20:10 IST
ఢిల్లీ: ఎర్రకోట దగ్గర భారీ పేలుడు, 8 మంది మృతి
మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ చేసిన కారులో పేలుడు
పేలుడు ధాటికి పూర్తిగా ధ్వంసమైన పలు కార్లు, బైక్‌లు
8 మంది మృతి, పేలుడు ధాటికి చిద్రమైన మృతదేహాలు
LNJP ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న 24 మంది బాధితులు
గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమం
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
-
Nov 10, 2025 17:48 IST
ఏపీ కేబినెట్ తీర్మానాలివే..
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
క్వాంటమ్ కంప్యూటింగ్ విధానానికి ఆమోదం.
ఏపీ నైబర్‌హుడ్ పాలసీకి కేబినెట్ ఆమోదం.
రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం.
ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్ స్టేషన్లు.
విశాఖలో ఐటీ కంపెనీల కోసం రోడ్ల విస్తరణకు నిర్ణయం.
విశాఖలో టెక్నోసాఫ్ట్ ఐటీ క్యాంపస్‌కు 2 ఎకరాలు కేటాయింపు.
విశాఖలో ఫ్లూయెంట్ గ్రిడ్ ఐటీ క్యాంపస్‌కు 3.3 ఎకరాలు.
డ్రోన్ సిటీ భూ కేటాయింపు పాలసీకి కేబినెట్ ఆమోదం.
-
Nov 10, 2025 13:08 IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి
రేపు ఉ.7 నుంచి సా.6 గంటల వరకు పోలింగ్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు
ఉపఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు
జూబ్లీహిల్స్‌లో 407 పోలింగ్ కేంద్రాలు
226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తింపు
కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో ఎన్నికల సామగ్రి పంపిణీ
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్
పోలింగ్ సరళిపై డ్రోన్ల ద్వారా నిఘా
-
Nov 10, 2025 13:07 IST
భారత్ చుట్టూ ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు పాక్ కుట్రలు
అప్రమత్తమైన భారత్ నిఘా వర్గాలు
నేపాల్, బంగ్లాదేశ్‌లో పాక్ ఉగ్ర స్థావరాలు, ట్రైనింగ్ సెంటర్లు
-
Nov 10, 2025 13:06 IST
ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై TTD వేటు
తిరుమలలో మాంసాహారం తిన్న ఇద్దరు సిబ్బంది
వీడియో వైరల్ కావడంతో ఇద్దరిపై వేటు
ఇద్దరిపై పీఎస్‌లో ఫిర్యాదుచేసిన TTD విజిలెన్స్ అధికారులు
-
Nov 10, 2025 12:27 IST
భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు
ఫరీదాబాద్‌లో రెండు AK-47లు, 350 కిలోల RDX స్వాధీనం
అనంతనాగ్‌లో డాక్టర్ లాకర్ నుంచి AK-47 రైఫిల్ స్వాధీనం
డాక్టర్ ఇచ్చిన సమాచారంతో మరో వైద్యుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
రెండో డాక్టర్ ఇచ్చిన సమాచారంతో ఫరీదాబాద్‌లో ఆయుధాలు స్వాధీనం
-
Nov 10, 2025 12:25 IST
ఉండవల్లి క్యాంపు ఆఫీస్‌లో పలువురు మంత్రులతో లోకేష్ భేటీ
యువతకు 20 లక్షల ఉద్యోగాల హామీ త్వరగా నెరవేర్చాలి: లోకేష్
తొలిసారి గెలిచిన MLAలకు సీనియర్ నేతలతో అవగాహన కల్పించాలి
విశాఖ CII సదస్సును విజయవంతం చేయాలి: మంత్రి లోకేష్
-
Nov 10, 2025 12:25 IST
కేఏ పాల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారంటూ కేఏ పాల్ పిటిషన్
హైకోర్టును ఆశ్రయించాలని కేఏ పాల్‌కు సుప్రీంకోర్టు సూచన
మీడియాలో ప్రచారం కోసం పిటిషన్ దాఖలు చేశారని..
కేఏ పాల్‌పై సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం
-
Nov 10, 2025 11:13 IST
సుప్రీంకోర్టులో పిన్నెల్లి బ్రదర్స్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
రెండు వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ప్రభుత్వం నుంచి సూచనల కోసం వాయిదా కోరిన..
రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాది సిద్ధార్థ లూత్రా
ఈ కేసులో ఇప్పటికే పిన్నెల్లి సోదరులకు అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చిన సుప్రీంకోర్టు
-
Nov 10, 2025 11:13 IST
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ
సుమారు 70 అంశాలు ఎజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం
రూ.లక్ష కోట్ల పెట్టుబడులకు ఆమోదo తెలపనున్న కేబినెట్
'మొoథా' తుఫాన్ ప్రభావంపై చర్చ
CRDAకి NAFBiD రూ.7,500 కోట్ల రుణం తీసుకునేందుకు ఆమోదం
మొత్తంగా CRDAకు రూ.9 వేల కోట్ల రుణానికి ఆమోదం
ఈ 14,15 తేదీల్లో విశాఖ CII పెట్టుబడుల సదస్సుపై చర్చ
క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025-30కి ఆమోదం
ప్రతిపాదిత డ్రోన్ సిటీలో భూమి కేటాయింపు పాలసీకి ఆమోదం
సింగపూర్ ప్రభుత్వంతో విశాఖ పార్టనర్‌షిప్ సమిట్‌లో ఒప్పందాలపై చర్చ
డిజిటల్ గవర్నెన్స్, సుస్థిర పట్టణ పరిపాలన, రియల్-టైమ్ గవర్నెన్స్,..
సుస్థిర ఆర్థికాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి ఒప్పందాలను..
సింగపూర్‌తో కుదుర్చుకోనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
-
Nov 10, 2025 10:35 IST
ఈ నెల 14న సుప్రీంకోర్టులో తెలంగాణలో పార్టీ ఫిరాయింపు MLAల కేసు విచారణ
MLAల అనర్హత పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టును గడువు కోరిన స్పీకర్ ఆఫీస్
అనర్హత పిటిషన్లపై విచారణకు మరింత గడువు కోరిన తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి
సుప్రీంకోర్టులో అక్టోబర్ 25న పిటిషన్ వేసిన తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి
తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి పిటిషన్‌పై విచారణ జరపనున్న సుప్రీంకోర్టు
పార్టీ ఫిరాయింపు MLAల విచారణకు అక్టోబర్ 31తో గడువు ముగియడంతో..
మరింత సమయం కోరుతూ పిటిషన్
-
Nov 10, 2025 10:31 IST
ప్రజాకవి అందెశ్రీ మృతి పట్ల మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
"మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు" అనే పాటతో పాటు..
ఎన్నో ఉద్యమ గీతాలు రాసిన ప్రజాకవి అందెశ్రీ: మంత్రి లోకేష్
సాహిత్యానికి అందెశ్రీ అందించిన సేవలు చిరస్మరణీయం: మంత్రి లోకేష్
-
Nov 10, 2025 09:57 IST
సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్
హాజరైన మంత్రులు, TPCC చీఫ్ మహేష్ గౌడ్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై చర్చ
-
Nov 10, 2025 09:57 IST
రచయిత అందెశ్రీ మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటు
అందెశ్రీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం చంద్రబాబు
-
Nov 10, 2025 09:34 IST
ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం,కాలుష్యానికి తోడు పొగ మంచు
ఢిల్లీలో పెరిగిన కాలుష్యం ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 326 పాయింట్లుగా నమోదు
ఆనంద్ విహార్ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 379 పాయింట్లుగా నమోదు
బారపుల్హ బ్రిడ్జి దగ్గర 310 పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదు
-
Nov 10, 2025 09:34 IST
కడప: వివేకా హత్య కేసుకు సంబంధించి పులివెందుల్లో..
తప్పుడు కేసులు పెట్టిన ఘటనపై ప్రభుత్వం సీరియస్
తప్పుడు కేసులు మరోసారి విచారణకు ప్రభుత్వం ఆదేశం
విచారణాధికారిగా కడప ASP ప్రకాష్ బాబు నియామకం
సునీత రాజశేఖర్‌రెడ్డి దంపతులు, అప్పటి విచారణాధికారి రామ్ సింగ్‌పై..
తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసులు
తప్పుడు కేసులు నమోదు చేసిన..
రిటైర్డ్ DSP రాజేశ్వర్ రెడ్డి, ASI రామకృష్ణారెడ్డిపై ఇప్పటికే కేసులు నమోదు
-
Nov 10, 2025 09:24 IST
నేడు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ
మ.3 గంటలకు వైజాగ్ ఎకనమిక్ రీజియన్‌పై సమీక్ష
సా.4 గంటలకు RTGSపై సీఎం చంద్రబాబు సమీక్ష
-
Nov 10, 2025 09:23 IST
ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీకి అంత్యక్రియలు
అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
-
Nov 10, 2025 08:24 IST
తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించిన అందెశ్రీ
జయ జయహే తెలంగాణ గీతం రచించిన అందెశ్రీ
2006లో 'గంగ' సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం
2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్
2015లో దాశరథి సాహితి పురస్కారం అందుకున్న అందెశ్రీ
2015లో రావూరి భరద్వాజ సాహితి పురస్కారం
-
Nov 10, 2025 08:11 IST
హైదరాబాద్: ప్రముఖ రచయిత అందెశ్రీ (64) కన్నుమూత
ఇంట్లో కుప్పకూలిన కవి అందెశ్రీ
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అందెశ్రీ మృతి
అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లన్న
1960లో నల్లగొండ జిల్లాలో జన్మించిన అందెశ్రీ
-
Nov 10, 2025 07:46 IST
విజయవాడ: మాచవరం పోలీసుల అదుపులో వాంటెడ్ డ్రగ్ మేకర్ మడ్డి
మడ్డిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
నిందితుడు మడ్డి అసలు పేరు మధుసూదన్ రెడ్డి
బెంగళూరులో యువతకు డ్రగ్స్ విక్రయిస్తున్న మధుసూదన్‌రెడ్డి
బెంగళూరులో డ్రాప్ పాయింట్ల దగ్గర యువతకు డ్రగ్స్ సరఫరా
మడ్డి స్వస్థలం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె
సెప్టెంబర్‌లో బెంగళూరు నుంచి డ్రగ్స్‌తో విశాఖ వెళ్లూ..
విజయవాడలో పట్టుబడ్డ ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు
విద్యార్థులు శ్రీవాత్సవ్, హవి అరెస్టుతో అజ్ఞాతంలోకి మడ్డి
మడ్డి కదలికలపై నిఘా పెట్టి బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Nov 10, 2025 07:46 IST
నేడు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం
SIPB ఆమోదించిన పెట్టుబడులపై చర్చించనున్న కేబినెట్
జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అంశంపై చర్చించే అవకాశం
రూ.1,01,899 కోట్ల పెట్టుబడుల స్థాపనకు SIPBలో ఆమోదం
3 మెగా సిటీలు, 15 ఇండస్ట్రియల్ జోన్ల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్
-
Nov 10, 2025 07:35 IST
తమిళనాడు, ఏపీకి మరో తుఫాన్ ముప్పు
ఈ నెల 19న అల్పపీడనం
ఈ నెల 25 నాటికి బలపడనున్న అల్పపీడనం
దక్షిణ కోస్తాపై ప్రభావం చూపే అవకాశం
-
Nov 10, 2025 07:35 IST
నేటినుంచి ఈ నెల 26 వరకు TGPSC గ్రూప్-3 ధ్రువపత్రాలు పరిశీలన
నాంపల్లి తెలుగు వర్సిటీలో గ్రూప్-3 ధ్రువపత్రాలు పరిశీలన: TGPSC
-
Nov 10, 2025 07:35 IST
నేడు మంత్రిగా అజరుద్దీన్ బాధ్యతల స్వీకరణ
మైనార్టీ సంక్షేమం, ప్రభుత్వ రంగ శాఖల మంత్రిగా..
సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్న అజరుద్దీన్
-
Nov 10, 2025 07:34 IST
కైరో: ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో మెరిసిన అనీష్ బన్వాల్
25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్‌లో రజతం సాధించిన అనీష్ బన్వాల్
ఆదివారం ఫైనల్‌లో 28 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన అనీష్
-
Nov 10, 2025 07:34 IST
రంజీ ట్రోఫీలో మేఘాలయ క్రికెటర్ సూపర్ రికార్డ్
11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన ఆకాశ్ చౌదరి
ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి...
వరుసగా 8 సిక్సర్లు బాది రికార్డు సృష్టించిన ఆకాశ్
-
Nov 10, 2025 07:33 IST
నేడు ఏపీకి కేంద్ర బృందం
తుఫాన్ ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
రెండురోజుల పర్యటనలో పంటనష్టం అంచనా వేయనున్న బృందం
-
Nov 10, 2025 07:26 IST
దేశవ్యాప్తంగా పెరిగిన చలితీవ్రత
ఢిల్లీలో కాలుష్యంతో పాటు చలిగాలులు
తెలుగు రాష్ట్రాలపై పెరిగిన చలి
హైదరాబాద్‌లో చలిగాలుల తీవ్రత
-
Nov 10, 2025 07:26 IST
ఫిలిప్పీన్స్‌ను వణికిస్తున్న ఫుంగ్-వాంగ్ సూపర్ టైఫూన్
సురక్షిత ప్రాంతాలకు 10 లక్షల మంది తరలింపు
మొత్తంగా 3 కోట్ల మందిపై ప్రభావం చూపే అవకాశం
ఇప్పటికే ఇద్దరు మృతి
-
Nov 10, 2025 07:26 IST
రష్యాపై ఉక్రెయిన్ ప్రతిదాడులు
రష్యాలోని రెండు నగరాల్లో కరెంట్ బంద్
-
Nov 10, 2025 07:26 IST
అమెరికాలో 40వ రోజుకు చేరిన ప్రభుత్వ షట్‌డౌన్
అధికార, విపక్షాల మధ్య బిల్లులపై కుదరని ఆమోదం
షట్‌డౌన్ కారణంగా ఎయిర్‌పోర్టు సిబ్బందికి అందని వేతనాలు
ఇప్పటివరకు 1400కు పైగా విమాన సర్వీసులు రద్దు