-
-
Home » Mukhyaamshalu » latest News across the world on 8th september 2025 VREDDY
-
BREAKING: ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
ABN , First Publish Date - Sep 08 , 2025 | 06:26 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Sep 08, 2025 21:04 IST
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఢిల్లీకి సీఎం రేవంత్
రేపు పలువురు కేంద్రమంత్రులతో భేటీకానున్న సీఎం రేవంత్
-
Sep 08, 2025 21:04 IST
రేపు పార్లమెంట్ భవన్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నిక
రేపు ఉదయం 10 నుంచి సా.5 గంటల వరకు పోలింగ్
NDA అభ్యర్థి రాధాకృష్ణన్‌కు 439 మంది ఎంపీల మద్దతు
ఇండీ కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి 324 మంది MPల మద్దతు
ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్‌ఎస్, బీజేడీ దూరం
రేపు సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు
-
Sep 08, 2025 18:18 IST
ఏపీకి కేంద్రం నుంచి 17,293 మెట్రిక్ టన్నుల యూరియా
కాకినాడ పోర్టులో యూరియా దిగుమతికి కేంద్రం జీఓ
అత్యవసరంగా యూరియా కోసం ఎదురుచూస్తున్న జిల్లాలకు..
యుద్ధప్రాతిపదికన పంపాలని అధికారులకు మంత్రి అచ్చెన్న ఆదేశం
రైతులకు ఎక్కడా యూరియా సమస్య లేకుండా చూడాలని ఆదేశాలు
యూరియా బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నవారిపై కఠినచర్యలకు ఆదేశం
-
Sep 08, 2025 18:18 IST
ఢిల్లీలో పార్టీ ఎంపీలతో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ
రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీకి లోకేష్
టీడీపీ ఎంపీల ఓటింగ్‌ను పర్యవేక్షించనున్న మంత్రి లోకేష్
-
Sep 08, 2025 18:18 IST
రద్దయిన నోట్లు పట్టివేత
హైదరాబాద్: నారాయణగూడలో భారీగా రద్దయిన నోట్లు పట్టివేత
నలుగురిని అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు
రెండు కోట్ల విలువైన రద్దయిన 500, 1000 నోట్లు స్వాధీనం
-
Sep 08, 2025 18:18 IST
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం
బీసీ రిజర్వేషన్లు తేలాకే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం
కోర్టును ఆశ్రయించి గడువు కోరే యోచనలో సర్కార్
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు
-
Sep 08, 2025 18:18 IST
అల్లూరి: అరకు కాఫీ పంటలో బెర్రీబోరర్ తెగులుపై ప్రభుత్వం భరోసా
సీఎం చంద్రబాబు వాయిస్‌తో ఏజెన్సీ వాసులు, రైతులకు IVRS కాల్స్
తెగులు పట్టిన కాఫీకి కిలో రూ.50 చొప్పున చెల్లిస్తామని,..
ఎకరాకు రూ.20 వేల వరకు పరిహారం ఇప్పిస్తామని చంద్రబాబు హామీ
-
Sep 08, 2025 18:18 IST
పదేళ్లలో మూసీ ప్రక్షాళనపై కేసీఆర్ ఎందుకు ఆలోచించలేదు?: సీఎం రేవంత్
మూసీ ప్రక్షాళనతో కాంగ్రెస్‌కు మంచిపేరు వస్తుందనే వారి భయం: రేవంత్
మూడు నెలల్లో ప్రపంచ నగరాల్లో హైదరాబాద్‌ను మేటిగా తీర్చిదిద్దుతాం
కాంగ్రెస్ సీఎంల ప్రణాళికల వల్లే హైదరాబాద్ ఈ స్థాయికి చేరుకుంది: రేవంత్
కడుపులో విషం పెట్టుకుని ప్రాజెక్టులు ఆపకండి: సీఎం రేవంత్‌రెడ్డి
కలిసిరండి.. హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేసుకుందాం: సీఎం రేవంత్‌రెడ్డి
ఎవరెన్ని కుట్రలు చేసినా మా ప్రభుత్వం తిప్పికొడుతుంది: సీఎం రేవంత్‌రెడ్డి
-
Sep 08, 2025 18:18 IST
కొందరు తాటిచెట్టులా పెరిగినా బుద్ధి మాత్రం పెరగలేదు: సీఎం రేవంత్‌రెడ్డి
మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలు తీసుకురావట్లేదు: సీఎం రేవంత్‌రెడ్డి
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే హైదరాబాద్‌కు గోదావరి జలాలు: రేవంత్
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్: సీఎం రేవంత్‌రెడ్డి
ప్రాణహిత-చేవెళ్లతో రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం: సీఎం రేవంత్
త్వరలో మహారాష్ట్ర వెళ్లి అక్కడి సీఎంతో మాట్లాడతా: సీఎం రేవంత్‌రెడ్డి
తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణంపై చర్చలు జరుపుతా: సీఎం రేవంత్
-
Sep 08, 2025 18:18 IST
నల్గొండ ప్రజల కోరిక మేరకే మూసీ ప్రక్షాళన: సీఎం రేవంత్‌రెడ్డి
మూసీ ప్రక్షాళనపై ఎవరు అడ్డంపడ్డా ముందుకెళ్తున్నాం: సీఎం రేవంత్
మూసీ కాలుష్యం నుంచి నల్గొండ ప్రజలకు విముక్తి కల్పిస్తాం: రేవంత్
మూసీలో హైదరాబాద్ డ్రైనేజీ కలవకుండా చర్యలు: సీఎం రేవంత్‌రెడ్డి
మూసీ పునరుజ్జీవంతో హైదరాబాద్‌కు తాగునీరు..
నల్గొండ ఫ్లోరైడ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది: సీఎం రేవంత్‌రెడ్డి
-
Sep 08, 2025 18:18 IST
హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చేందుకే ఈ ప్రాజెక్టు: సీఎం రేవంత్
ప్రపంచ దేశాల్లోనే హైదరాబాద్‌కు గొప్ప పేరు: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌లో ప్రతిఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు: రేవంత్
ఏడా 3 శాతం జనాభా హైదరాబాద్‌కు వలస వస్తోంది: సీఎం రేవంత్
తాగునీటి అవసరాలు అంతకంతకూ పెరుగుతున్నాయి: సీఎం రేవంత్
వేసవి వచ్చిందంటే సచివాలయం ఎదుట నిరసనలు ఉండేవి: రేవంత్
పీజేఆర్ పోరాటంతోనే హైదరాబాద్‌కు మంజీరా జలాలు: సీఎం రేవంత్
హైదరాబాద్‌కు దాహార్తి తీర్చించి కాంగ్రెస్ ప్రభుత్వాలే: సీఎం రేవంత్
-
Sep 08, 2025 15:32 IST
ఏపీలో పలువురు IASల బదిలీలు
టీటీడీ ఈఓ శ్యామలరావు బదిలీ
శ్యామలరావు స్థానంలో అనిల్‌కుమార్ సింఘాల్ నియామకం
గతంలో టీటీడీ ఈఓగా పనిచేసిన అనిల్‌కుమార్ సింఘాల్
-
Sep 08, 2025 15:32 IST
డిక్లరేషన్ల అమలులో కాంగ్రెస్ విఫలం: టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు: రాంచందర్‌రావు
బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డుపడుతోందనడం సరికాదు: రాంచందర్‌రావు
మీకు చేతకాకపోతే చెప్పండి.. 42% రిజర్వేషన్లు మేమిస్తాం: రాంచందర్‌రావు
కాంగ్రెస్ పాలన వల్లే తెలంగాణ నష్టపోతోంది: రాంచందర్‌రావు
కామారెడ్డిలో కాంగ్రెస్ నిర్వహించేది బీసీ ద్రోహసభ: రాంచందర్‌రావు
-
Sep 08, 2025 14:01 IST
హైదరాబాద్: రాష్ట్రస్థాయి బ్యాంకర్ల భేటీలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి
తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్: భట్టి విక్రమార్క
స్వయం ఉపాధి పథకాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలివ్వాలి
ఆస్తుల తాకట్టు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయాలని రైతులను ఒత్తిడి చేయొద్దు: భట్టి
రైతుల పక్షాన రుణమాఫీ, రైతు భరోసా పేరుతో బ్యాంకులకు..
ప్రభుత్వం రూ.30వేల కోట్లు జమ చేసింది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
-
Sep 08, 2025 13:52 IST
కర్నూలు: కుమారుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై షర్మిల క్లారిటీ
అవసరమైనప్పుడు నా కుమారుడు రాజకీయాల్లోకి వస్తాడు: షర్మిల
మామ జగన్‌కు పోటీగా అల్లుడు రాజకీయ ఆరంగ్రేటం అంటూ పొలిటికల్ వర్గాల్లో చర్చ
-
Sep 08, 2025 13:46 IST
నేపాల్ రాజధాని ఖాట్మండులో తీవ్ర ఉద్రిక్తత
నేపాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఆందోళనలు
ఖాట్మండుతో పాటు 10 నగరాల్లో యువత నిరసనలు
నేపాల్ పార్లమెంట్‌లోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు
నిరసనకారులపై భాష్పవాయు ప్రయోగం, ఖాట్మండులో కర్ఫ్యూ
సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో నిరసనలు
ఫేస్‌బుక్, వాట్సాప్‌తో పాటు 26 యాప్స్ నిషేధించిన నేపాల్
విరాట్‌నగర్, భరత్‌పూర్, పోఖ్రా నగరాల్లోనూ నిరసన
Gen-Z పేరుతో అవినీతి వ్యతిరేక ఉద్యమం
-
Sep 08, 2025 13:16 IST
ఢిల్లీ: వరద ప్రభావిత రాష్ట్రాల పర్యటనకు ప్రధాని మోదీ
వరద ప్రభావిత రాష్ట్రాల్లో ఏరియల్ సర్వే చేయనున్న ప్రధాని
రేపు పంజాబ్, హిమాచల్‌లో ప్రధాని మోదీ పర్యటన
హిమాచల్ సీఎం సుఖ్విందర్‌తో భేటీకానున్న ప్రధాని మోదీ
-
Sep 08, 2025 13:14 IST
తెలంగాణలో ఈనెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు స్కూళ్లకు దసరా సెలవులు
ఈనెల 23 నుంచి అక్టోబర్ 5 వరకు జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు
-
Sep 08, 2025 13:04 IST
హైదరాబాద్: మైత్రివనం hmda కార్యాలయం దగ్గర ఆందోళన
RRR రద్దు చేయాలని భూ నిర్వాసితుల నిరసన
ఆందోళనకారులు రోడ్డుపైకి రావడంతో భారీగా ట్రాఫిక్‌జామ్
అడ్డుకున్న పోలీసులతో RRR బాధితుల వాగ్వాదం
ఆందోళనకారులపై చేయి చేసుకున్న పోలీసులు
-
Sep 08, 2025 13:03 IST
హనుమకొండ: ఫిరాయింపులకు ఆజ్యం పోసింది కేసీఆరే: కూనంనేని
ఇప్పుడు తమవరకు వచ్చేసరికి మాట మార్చుతున్నారు: కూనంనేని
ఫిరాయింపులపై స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలు ఇవ్వలేవు
తెలంగాణలో ఫిరాయింపుల వ్యవహారం ఇలాగే కొనసాగేలా ఉంది
కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారింది
రూ.లక్ష కోట్లు తినలేదంటున్నారు.. మరి ఎంత తిన్నారో చెప్పండి?: కూనంనేని
-
Sep 08, 2025 12:37 IST
వాషింగ్టన్: వీసాదారులకు అమెరికా వార్నింగ్
సైడ్ ఇన్‌కమ్ ఉంటే బహిష్కరణేనని హెచ్చరిక
అనధికారిక ఉద్యోగం నుంచి ఆదాయం పొందినట్లు తెలిస్తే...
దేశం నుంచి బహిష్కరణకు చర్యలు: అమెరికా
-
Sep 08, 2025 12:16 IST
హైదరాబాద్: సినీ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్,
ఇటీవల అల్లు అరవింద్‌కు మాతృవియోగం,
అల్లు అరవింద్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మహేష్‌గౌడ్
-
Sep 08, 2025 12:15 IST
గుంటూరు: తురకపాలెంలో శాస్త్రవేత్తల బృందం పర్యటన
హైదరాబాద్ శ్రీబయోటెక్ నుంచి వచ్చిన ముగ్గురు శాస్త్రవేత్తలు
గ్రామంలో మట్టి నమూనాలు సేకరిస్తున్న శాస్త్రవేత్తల బృందం
ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న అధికారులు
-
Sep 08, 2025 11:59 IST
సాయంత్రం ఢిల్లీకి మంత్రి నారా లోకేష్
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో లోకేష్ ఢిల్లీకి పయనం
సా.5 గంటల తర్వాత టీడీపీ ఎంపీలతో భేటీ కానున్న నారా లోకేష్
-
Sep 08, 2025 11:58 IST
ఢిల్లీ: కాసేపట్లో టీడీపీ ఎంపీలతో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి భేటీ
ఉపరాష్ట్రపతి ఎన్నికలు, ఓటింగ్‌పై వివరించనున్న కేంద్రమంత్రి
మ.2:30కు ఎన్టీఏ ఎంపీల సమావేశం, సా.4గంటలకు పాల్గొననున్న మోదీ
సా.5గంటలకు టీడీపీ ఎంపీలతో మంత్రి లోకేష్ సమావేశం
రాత్రి టీడీపీ ఎంపీలకు విందు ఇవ్వనున్న మంత్రి లోకేష్
-
Sep 08, 2025 11:52 IST
కర్నూలు: ఉల్లి మార్కెట్‌కు తల్లి షర్మిలతో కలిసి రాజారెడ్డి
రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రచారం
విజయలక్ష్మి ఆశీస్సులు తీసుకుని మార్కెట్ యార్డుకు రాజారెడ్డి
-
Sep 08, 2025 11:43 IST
ఏలూరు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం
ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదని అధ్యాపకుడిపై దాడి
ఫ్యాకల్టీని కత్తులతో పొడిచి హాస్టల్‌లోకి వెళ్లిపోయిన ఎంటెక్ విద్యార్థి వినయ్
తీవ్రంగా గాయపడిన అధ్యాపకుడు గోపాల్‌రాజును ఆసుపత్రికి తరలింపు
-
Sep 08, 2025 11:42 IST
టీబీజేపీ చీఫ్ రాంచందర్ సోయి లేకుండా మాట్లాడుతున్నారు: పొన్నం
మీకు రాజకీయ విమర్శలు తప్ప.. రైతుల సమస్యలు పట్టవా?
యూరియా కోసం ఎప్పుడైనా కేంద్రాన్ని అడిగారా?: మంత్రి పొన్నం
బీజేపీ, BRS కుమ్మక్కై కుట్రలు చేస్తున్నాయి: మంత్రి పొన్నం
యూరియా పేరుతో రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారు
-
Sep 08, 2025 11:25 IST
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టు ఊరట
రేవంత్‌పై పరువునష్టం దావా కేసు విచారణకు సుప్రీం నిరాకరణ
సీఎం రేవంత్‌పై టీబీజేపీ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
-
Sep 08, 2025 11:19 IST
రాత్రి ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఢిల్లీకి రేవంత్
-
Sep 08, 2025 10:37 IST
అమెరికా సుంకాలను సమర్థించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
భారత్‌పై సుంకాలు మంచి ఐడియానే: జెలెన్‌స్కీ
ట్రంప్, పుతిన్ భేటీకి ఉక్రెయిన్‌ను ఆహ్వానించకపోవడం విచారకరం: జెలెన్‌స్కీ
-
Sep 08, 2025 10:20 IST
కర్నూలులో ఇద్దరు ఉల్లి రైతులపై కేసు నమోదు
ఉల్లికి మద్దతు ధర లేదని ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నం
రైతులను రెచ్చగొట్టారని పొలకల్‌కు చెందిన కృష్ణ, వెంకటేష్‌పై కేసు
రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
-
Sep 08, 2025 10:19 IST
హైదరాబాద్: పంజాగుట్ట పోలీసులకు నటి రంగ సుధ ఫిర్యాదు
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు
కొన్ని ఎక్స్ పేజీలతో పాటు రాధాకృష్ణ అనే వ్యక్తిపై ఫిర్యాదు
గతంలో రాధాకృష్ణతో రిలేషన్‌లో ఉన్న రంగ సుధ
తమ ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు ఆన్‌లైన్‌లో పెడతానని..
గతంలో రాధాకృష్ణ బెదిరించాడని ఫిర్యాదు చేసిన రంగ సుధ
-
Sep 08, 2025 10:09 IST
ఉగ్ర కుట్ర కేసులో NIA సోదాలు
జమ్మూకశ్మీర్‌తో పాటు 5 రాష్ట్రాల్లో తనిఖీలు
-
Sep 08, 2025 10:09 IST
జమ్మూకశ్మీర్: కుల్గాం జిల్లాలో ఎన్‌కౌంటర్
భద్రతాబలగాల కాల్పుల్లో ఉగ్రవాది హతం
ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ జవాన్‌కు గాయాలు
-
Sep 08, 2025 10:07 IST
భారతీయులకు అమెరికా మరో షాక్
నాన్-ఇమిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు..
ఇకపై మరో దేశంలో ఇంటర్వ్యూకు హాజరయ్యే అవకాశం లేదన్న అమెరికా
-
Sep 08, 2025 10:01 IST
BRS, బీజేపీ బంధం మరోసారి బయటపడిందన్న కాంగ్రెస్ నేతలు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో BRS, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం: కాంగ్రెస్
ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరం ఉండటం పరోక్షంగా బీజేపీకి మేలు చేయడమే
BRS, బీజేపీ అసలు స్వరూపం ఇదేనంటున్న కాంగ్రెస్ నేతలు
-
Sep 08, 2025 09:25 IST
ఉప రాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరం?
తెలంగాణకు NDA, ఇండి కూటమి ద్రోహం చేశాయంటున్న BRS
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయం
-
Sep 08, 2025 08:21 IST
నేడు మిథున్‌రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ
లిక్కర్ స్కామ్ కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి
-
Sep 08, 2025 08:19 IST
కర్నూలు: ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
వ్యవసాయ మార్కెట్ యార్డుకు నిన్న పోటెత్తిన ఉల్లి
ఉల్లి లోడ్ వాహనాలను లోపలకు పంపకపోవడంపై ABN కథనం
ABN ఆంధ్రజ్యోతి కథనానికి స్పందించిన ఏపీ ప్రభుత్వం
తెల్లవారుజాము నుంచి ఉల్లి లోడింగ్ చేస్తున్న యంత్రాంగం
కాసేపట్లో ఉల్లి వాహనాలను లోపలకు అనుమతిస్తామని ప్రకటన
-
Sep 08, 2025 07:28 IST
గుంటూరు: నేడు తురకపాలెంలో ICAR బృందం పర్యటన
మట్టి నమూనాలు సేకరించనున్న ICAR బృందం
ఇప్పటికే తురకపాలెంలో పర్యటించిన ఎయిమ్స్ బృందం
గ్రామస్తుల రక్త నమూనాలు సేకరించిన వైద్య సిబ్బంది
తురకపాలెం గ్రామానికి చెందిన నలుగురికి జీజీహెచ్‌లో చికిత్స
-
Sep 08, 2025 06:54 IST
ఏపీ లిక్కర్ కేసు దర్యాప్తులో తెరపైకి వైసీపీ నేతల పేర్లు
మద్యం రవాణా పేరుతో ముడుపులు మెక్కేసిన వైసీపీ నేతలు
చెవిరెడ్డి భాగస్వామి విజయానందరెడ్డి విచారణలో వెలుగులోకి కీలక అంశాలు
ఉత్తరాంధ్రకు చెందిన మాజీమంత్రి మేనల్లుడికి భారీగా ముడుపులు
గోదావరి, గుంటూరుకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులకు కూడా ముడుపులు
అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేకు ముడుపులు అందినట్టు సమాచారం
గుంటూరు, విజయవాడలో వైసీపీ ప్లీనరీ నిర్వహించినందుకు..
ఉత్తరాంధ్రకు చెందిన మాజీమంత్రి మేనల్లుడికి భారీగా మద్యం ముడుపులు
ఎన్నికల్లో నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన అభ్యర్థులకు..
రూ.200కోట్ల వరకు మద్యం సొమ్ము పంపిణీ చేసినట్టు సిట్ దగ్గర ఆధారాలు
-
Sep 08, 2025 06:31 IST
నేడు ఏలూరులో మంత్రులు నాదెండ్ల, పార్థసాథి పర్యటన
ఎరువుల సరఫరాపై అధికారులతో సమీక్షించనున్న మంత్రులు
-
Sep 08, 2025 06:31 IST
హైదరాబాద్: నేడు టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం
ఉ.11 గంటలకు మహేష్‌గౌడ్ అధ్యక్షతన సమావేశం
-
Sep 08, 2025 06:30 IST
నేడు మూసీ పునరుజ్జీవం పనులు ప్రారంభం
గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్‌కు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్
రూ.7,360 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్
రెండేళ్లలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని నిర్ణయం
మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్‌సాగర్..
హిమాయత్‌సాగర్ చెరువులను మంచినీటితో నింపేలా పథకం
-
Sep 08, 2025 06:29 IST
భారత్‌లో ముగిసిన సంపూర్ణ చంద్రగ్రహణం
రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి 1:31 వరకు గ్రహణం
రాత్రి 11 నుంచి 12:22 గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం
మొత్తం 82 నిమిషాల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం
చంద్రగ్రహాణాన్ని ఆసక్తిగా తిలకించిన ప్రజలు
-
Sep 08, 2025 06:28 IST
తిరుమల: గ్రహణ ఘడియలు ముగియడంతో తెరుచుకున్న ఆలయ ద్వారాలు
సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొల్పిన అర్చకులు
ఉ.7 గంటల నుంచి సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతి
-
Sep 08, 2025 06:26 IST
నేడు ఆలయాల్లో భక్తులకు దర్శనాలు ప్రారంభం
చంద్రగ్రహణం వల్ల రాష్ట్రంలోని అన్ని ఆలయాల తలుపులు మూసివేత