-
-
Home » Mukhyaamshalu » Latest Breaking News Watch Live Updates of Todays Top Stories of Saturday 22nd February 2025 in Telugu News Siva
-
Breaking News: సంచలనం.. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో 17 ఫోల్డర్లు..
ABN , First Publish Date - Feb 22 , 2025 | 07:56 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2025-02-22T12:51:02+05:30
సంచలనం.. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో 17 ఫోల్డర్లు..
మూడు రోజుల పాటు మస్తాన్ సాయిని విచారించిన పోలీసులు.
హార్డ్ డిస్క్, డ్రగ్స్, పార్టీస్, సాఫ్ట్ వేర్ అన్నింటి గురించి ప్రశ్నించిన పోలీసులు.
డ్రగ్స్‌పై నోరు మెదపని మస్తాన్ సాయి.
ఎక్కడి నుండి డ్రగ్స్ వచ్చాయి, ఎవరెవరికి డ్రగ్స్ ఇచ్చారు అనే ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వని మస్తాన్ సాయి.
హార్డ్ డిస్క్‌ల గురించి పోలీసులకు వివరణ ఇచ్చిన మస్తాన్.
హార్డ్ డిస్క్‌లో మొత్తం 17 ఫోల్డర్లు.
17 ఫోల్డర్లను మస్తాన్ సాయి ముందు ఓపెన్ చేసిన పోలీసులు.
హార్డ్ డిస్క్ మొత్తంలో 6 గురు అమ్మాయిలకు సంబంధించిన విడియోలు గుర్తించిన పోలీసులు.
వీటిలో ఎక్కువగా వాట్సాప్ విడియో కాల్ స్క్రీన్ రికార్డింగ్స్ గుర్తింపు.
లావణ్యతో పాటు, మస్తాన్ గర్ల్ ఫ్రెండ్స్, తన భార్యకు సంబంధించిన వీడియోలు గుర్తింపు.
కొన్ని నార్మల్ వీడియోస్, మరికొన్ని ప్రైవేట్ వీడియోస్ గుర్తింపు.
2,500కి పైగా ఫోటోలు, 505 పైగా విడియోలు, 734 ఆడియో రికార్డింగ్స్ గుర్తింపు.
ఎక్కువగా లావణ్యకు సంబంధించిన ఫైల్స్ ఉన్నట్టు గుర్తింపు.
ఇద్దరికి సంబంధించిన ప్రైవేట్ వీడియోలు వాళ్ళకి తెలీకుండా రికార్డు చేసినట్టు ఒప్పుకున్న మస్తాన్ సాయి.
లావణ్య ఫోన్ నుండి 734 ఆడియో కాల్ రికార్డింగ్స్‌ను quick share ద్వారా వచ్చినట్టు గుర్తింపు.
పోడ్ కాస్ట్ ఫోల్డర్‌లో ఫోన్ హ్యాక్‌కు సంబంధించిన సాఫ్ట్వేర్ గుర్తింపు.
-
2025-02-22T12:25:21+05:30
నేను ఆ పని చేయలే.. ఆ ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే రియాక్షన్ ఇదీ..
కడప : భూకబ్జాలపై స్పందించిన రాజంపేట వైసీపీ ఎమ్మల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి.
నేను నాకుటుంబం ఎలాంటి భూములు ఆక్రమించలేదు.
ఆక్రమించినట్లు గుర్తిస్తే ఆ భూములు ప్రభుత్వం తీసుకోవచ్చు.
మా గ్రామంలో నేను నాకుటుంబం ఇళ్ళు కట్టుకున్నాం.
అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఇచ్చిన నోటీసులు నాకు అందలేదు.
నేను ఎలాంటి విచారణకు హాజరు కాను.
నాపై ఆరోపణలు ఇప్పటివి కావు కడప పర్యటన వచ్చినప్పుడు నారా లోకేష్ కూడా ఆరోపించాడు.
నేను భూముల ఆక్రమించి ఉంటే తీసుకోమని ఏనాడో చెప్పాను.
-
2025-02-22T12:21:38+05:30
రైతులకు అండగా కూటమి ప్రభుత్వం..
నెల్లూరు : పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ కామెంట్స్..
రాజకీయాల్లో నిబద్దత అంకిత భావంతో పని చేసే నాయకుడు ఆనం.
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంది.
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 33లక్షలు మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. ఇది ఒక రికార్డు.
గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం లేదు. గిట్టుబాటు ధర అడిగితే కేసులు దౌర్జన్యం.
గతంలో అనేకమంది రైతులకు బకాయిలు చెల్లించలేదు.
కుటమి ప్రభుత్వంలో చెల్లించాం.
రూ. 33 వేల కోట్ల డబ్బులు గత ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో స్వాహా చేశారు. ఖరీదు అయిన కార్లు కొన్నారు.
రైతులు పడుతున్న కష్టాలు గురించి ఆలోచించే నాయకుడు కావాలి.
మిల్లర్లకు పాత బకాయిలు రూ.10 కోట్లు కూటమి ప్రభుత్వం ఇచ్చింది.
మిల్లర్లు సహకరించి రైతుకు సహకరించండి.
తేమ శాతం పేరుతో బస్తాకు 5 కేజీలకు మించి మిల్లర్లు తరుగు తీస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
ప్రతి పాఠశాలలో సన్న బియ్యం విద్యార్థులకు మిడ్డే మీల్స్‌లో అందిస్తాం. ఈ కార్యక్రమాన్ని రైతులు చేత ప్రారంభిస్తాం.
రైతు పక్షాన నిలబడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.
50వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తాం. ఎవరు ఆందోళన చెందవద్దు.
కొనుగోలు కేంద్రాలు వద్ద గంటలు గంటలు నిలబడాల్సిన అవసరం లేదు.
టార్ఫాలిన్ 50శాతం సబ్సిడీతో అందిస్తాం.
-
2025-02-22T11:30:05+05:30
శ్రీశైలం ఎడమగట్టు కెనాల్ టన్నెల్‌లో ప్రమాదం.
14వ కి.మీ దగ్గర మూడు మీటర్ల మేర కూలిన పైకప్పు.
టన్నల్ బోర్ మెషిన్‌తో పని జరుగుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.
పలువురు కార్మికులకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు.
ఘటనపై వివరాలు సేకరిస్తున్న ఇరిగేషన్ అధికారులు.
-
2025-02-22T11:27:43+05:30
సూసైడ్ చేసుకున్న 8వ తరగతి విద్యార్థి..
ఉప్పల్ పిఎస్ పరిధి న్యూ భరత్ నగర్ సాగర్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్ధి సంగారెడ్డి స్కూలు నాలుగు అంతస్తుల బిల్డింగ్ టెర్రర్ నుండి దూకి ఆత్మహత్య.
బిల్డింగ్ పై నుండి విద్యార్థి పడటంతో స్థానికంగా ఉండే ప్రైవేట్ హాస్పిటల్ కి తరలింపు, అప్పటికే విద్యార్థిని మరణించినట్లు తెలిపిన వైద్యులు.
హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించిన స్కూల్ యాజమాన్యం.
విద్యార్థి సంగారెడ్డి, బోడుప్పల్ ద్వారకానగర్‌కి చెందిన వ్యక్తి తండ్రి పేరు ధర్మారెడ్డి.
విద్యార్థి సంగారెడ్డి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
స్కూల్ వద్దకు చేరుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
పనిచేయని సీసీటీవీ కెమెరా, పలు అనుమానాలకు దారి.
ధర్మారెడ్డి సంగీత దంపతులకు ఇద్దరు కుమారులు.
పెద్ద కుమారుడు బీటెక్ చదువుతున్నాడు. రెండో కుమారుడు సంగారెడ్డి సాగర్ గ్రామర్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు.
పిటి సార్ ఆంజనేయులు వేధింపుల కారణంగానే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.
-
2025-02-22T10:28:38+05:30
హైదరాబాద్‌లో ఘోరం..
చందానగర్ పోలిస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య.
చందానగర్ గోపి నగర్‌లో నివాసం ఉంటున్న నసీర్.
నిన్న రాత్రి మాట్లాడేది ఉందని తిసుకోపోయన స్నేహితులు.
అర్ధరాత్రి 12 గంటల సమయంలో కోండాపుర్ ఏరియా హస్పటల్ నసిర్‌ను హస్పటల్‌కు తేచ్చిన స్నేహితులు.
అప్పటికే మృతి చెందినట్లు గుర్తించిన వైద్యులు.
మృతుడు నసిర్ ఒంటిపై గాయాలు.
స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నా చందానగర్ పోలీసులు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలింపు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న చందానగర్ పోలీసులు.
-
2025-02-22T09:42:31+05:30
వైసీపీ ఎమ్మెల్యేకు బిగుస్తున్న ఉచ్చు.. చర్యలు తప్పవా..

అన్నమయ్య జిల్లా : రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకే పాటి అమరనాథ్ రెడ్డి మెడకు బిగుస్తున్న భూకబ్జాల ఉచ్చు.
ఎమ్మెల్యేతో పాటు ముగ్గురు కుటుంబ సభ్యులకు నోటీసు ఇచ్చిన జాయింట్ కలెక్టర్.
నేడు కలెక్టరేట్‌లో జేసీ ఎదుట విచారణకు హాజరు కానున్న ఎమ్మెల్యే అమర్‌నాధ్ రెడ్డి, కుటుంబ సభ్యులు.
ఎమ్మెల్యే వందల ఎకరాలు భూకబ్జాలకుపాల్పడ్డాడని సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన రాజంపేట టీడిపి నేతలు.
ఎమ్మెల్యే భూకబ్జాలపై విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు.
-
2025-02-22T08:32:22+05:30
నేడు బీసీ నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.

ఉదయం 11 గంటలకి ప్రజా భవన్‌లో సమావేశం.
సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్, గ్రంధాలయ కమిటీ ఛైర్మన్ లు, బీసీ నాయకులకు ఆహ్వానం.
కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు, కులగణన సర్వేకు చట్టబద్ధత, అసెంబ్లీ తీర్మానం, కేంద్రం పై ఒత్తిడి, అన్ని పార్టీలకు లేఖలు, మార్చి 10న ఢిల్లీలో కార్యక్రమం పై చర్చ.
కులగననను దేశానికి రోల్ మోడల్ గా చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం.
బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ చిత్తశుద్ధిని నేతలకు వివరించి క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడంపై దిశా నిర్దేశం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.
-
2025-02-22T07:56:37+05:30
గ్రూప్ 2 పరీక్షపై బిగ్ అప్‌డేట్..
అమరావతి: గ్రూప్ 2 పరీక్షపై మంత్రి నారా లోకేష్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు.
ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన.. గ్రూప్ 2 పరీక్ష వాయిదాపై న్యాయ బృందంతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తామన్నారు.
గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన, వారి ఆవేదనలను అర్థం చేసుకున్నామన్నారు.
గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి నాకు చాలా విజ్ఞప్తులు వస్తున్నాయి.
వారి ఆందోళన, ఆవేదనను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను అని ఎక్స్‌లో పేర్కొన్నారు.