-
-
Home » Mukhyaamshalu » INSTANT BREAKING NEWS FROM ABN on 14th august IS HERE VR
-
BREAKING: ఓట్ చోర్.. గద్దె చోడ్ పేరుతో కాంగ్రెస్ ఆందోళనలు
ABN , First Publish Date - Aug 14 , 2025 | 06:13 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Aug 14, 2025 12:57 IST
సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు రూ.కోటి విడుదల: మంత్రి పొంగులేటి
ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి: పొంగులేటి
వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు మంత్రి ఆదేశం
-
Aug 14, 2025 12:55 IST
కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది: పేర్ని నాని
ప్లాన్ ప్రకారమే పులివెందుల ZPTC ఉప ఎన్నిక తెచ్చారు: పేర్ని నాని
పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఎన్నికలు నిర్వహించారు: పేర్ని నాని
ఇతర ప్రాంతాల టీడీపీ నేతలు పులివెందులలో ఓట్లు వేశారు: పేర్ని నాని
పులివెందులలో 90 శాతం దొంగ ఓట్లు వేశారు: మాజీమంత్రి పేర్ని నాని
టీడీపీ అరాచకాలకు అధికారులు వంతపాడారు: మాజీమంత్రి పేర్ని నాని
-
Aug 14, 2025 12:48 IST
జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలంటూ..
దాఖలైన పిటిషన్‌ను విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు
రాష్ట్ర హోదా కల్పించే ముందు స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలన్న సీజేఐ
పహల్గామ్ ఘటనను ఎవరూ విస్మరించలేరన్న సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్
-
Aug 14, 2025 12:26 IST
వీధి కుక్కల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ
వీధికుక్కలను తొలగించాలనే ఆదేశాలను..
స్టే చేయాలన్న పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
అత్యవసర స్టే అవసరమా అనేది పరిశీలిస్తున్న ధర్మాసనం
తీర్పును విమర్శించే డాగ్ లవర్స్ అఫిడవిట్ ఫైల్ చేయాలన్న సుప్రీంకోర్టు
-
Aug 14, 2025 11:57 IST
సుప్రీంకోర్టులో BRS ఎమ్మెల్యే కోవా లక్ష్మీకి ఊరట
కాంగ్రెస్ నేత అజ్మీరా శ్యామ్ వేసిన పిటిషన్‌పై తీర్పు
కోవా లక్ష్మీ ఎన్నికల అఫిడవిట్‌లో..
తప్పుడు సమాచారం ఇచ్చారని అజ్మీర్ శ్యామ్ పిటిషన్
-
Aug 14, 2025 11:47 IST
పులివెందులలో రిగ్గింగ్ జరిగింది: ఎంపీ అవినాష్‌రెడ్డి
దొంగ ఓట్లతో గెలవడం కూడా గెలుపేనా?: అవినాష్
త్వరలో టీడీపీకి గుణపాఠం చెబుతాం: అవినాష్‌రెడ్డి
దొంగ ఓట్లతో కాదు.. నిజమైన ఓట్లతో గెలుస్తాం: అవినాష్‌రెడ్డి
-
Aug 14, 2025 11:23 IST
పులివెందులలో న్యాయం, ధర్మం గెలిచింది: టీడీపీ నేత లతారెడ్డి
ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: లతారెడ్డి
-
Aug 14, 2025 11:17 IST
పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా పోలింగ్ జరిగింది: మంత్రి సవిత
అభివృద్ధి కోసమే ప్రజలు ఈ తరహా తీర్పు ఇచ్చారు: సవిత
వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందుల కోటను బద్దలు కొడతాం: సవిత
-
Aug 14, 2025 10:00 IST
పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ
భారత్ దేశ భయానక విభజన స్మృతి దినం జరుపుకొంటోంది: మోదీ
ఆ విషాదకరమైన అధ్యాయంలో ప్రజలు అనుభవించిన బాధ ఉందన్న మోదీ
-
Aug 14, 2025 09:19 IST
హైదరాబాద్‌లోకి చొరబడ్డ బంగ్లాదేశ్ వాసులు
హైదరాబాద్, సైబరాబాద్ శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న బంగ్లాదేశ్ వాసులు
బంగ్లాదేశ్ వాసులను గుర్తించిన పోలీసులు
20 మంది బంగ్లాదేశ్ వాసులను BSFకి అప్పగించిన పోలీసులు
-
Aug 14, 2025 08:31 IST
లిక్కర్ స్కామ్ కేసులో సజ్జల శ్రీధర్ బెయిల్ పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ
వాదనలు వినిపించనున్న ఇరు వర్గాల న్యాయవాదులు
-
Aug 14, 2025 08:30 IST
హైదరాబాద్: మూసీకి భారీగా వరద ప్రవాహం
మూసీ పరివాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
హిమాయత్‌సాగర్ 4గేట్లు ఎత్తి 8వేల క్యూసెక్కుల నీరు విడుదల
మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన GHMC
-
Aug 14, 2025 08:04 IST
ఓట్ చోర్.. గద్దె చోడ్ పేరుతో కాంగ్రెస్ ఆందోళనలు
ఇవాళ రా.8గంటలు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్యాండిల్ ర్యాలీలు
పాల్గొననున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
-
Aug 14, 2025 07:59 IST
ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్రంప్ హెచ్చరిక
అలస్కాలో చర్చల తర్వాత పుతిన్ యుద్ధం ఆపాల్సిందేనన్న ట్రంప్
పుతిన్ యుద్ధం ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది: ట్రంప్
-
Aug 14, 2025 07:58 IST
భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, ఖమ్మం, వరంగల్, హనుమకొండ,..
జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
భారీ వర్షాలతో సూర్యాపేట, మంచిర్యాల జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
-
Aug 14, 2025 07:11 IST
తెలంగాణలో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్
మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్
భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం
9 జిల్లాలకు ఆరెంజ్, 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
-
Aug 14, 2025 07:06 IST
ఏపీలోని ప్రధాన పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక
విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం,..
నిజాంపట్నం పోర్టుల్లో మూడో నెంబర్ హెచ్చరిక జారీ
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
-
Aug 14, 2025 06:56 IST
అసోం: దుబ్రిలో భూ ప్రకంపనలు
రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 2.8గా నమోదు
-
Aug 14, 2025 06:47 IST
అమరావతి: నూతన బార్ పాలసీని ప్రకటించిన ఎక్సైజ్ శాఖ
ఏపీలో కొత్త బార్ పాలసీ సెప్టెంబరు 1 నుంచి అమలు
ఏపీలో ఉ.10 నుంచి రాత్రి 12 వరకు బార్లకు అనుమతి
నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ, గీత కులాలకు 84 బార్లు
840 బార్లకు ప్రస్తుతం నోటిఫికేషన్ జారీ చేసిన ఎక్సైజ్ శాఖ
-
Aug 14, 2025 06:26 IST
వికారాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు
పరిగి పరిసర ప్రాంతాల్లో 3 సెకన్ల పాటు భూ ప్రకంపనలు
రంగాపూర్, బసిపల్లి, న్యామత్‌నగర్‌లో భూ ప్రకంపనలు
-
Aug 14, 2025 06:16 IST
ఒంటిమిట్ట ZPTC కౌంటింగ్‌కు 10 టేబుళ్లు ఏర్పాటు
రెండు రౌండ్ల పూర్తికానున్న ఒంటిమిట్ట ZPTC కౌంటింగ్
ఒక్కో టేబుల్‌పై 1,000 ఓట్లు లెక్కించేలా ఏర్పాట్లు
మధ్యాహ్నానికి ఒంటిమిట్ట ZPTC ఓట్ల లెక్కింపు పూర్తి
-
Aug 14, 2025 06:13 IST
నేడు పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికల కౌంటింగ్
కడప పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్
పులివెందుల ZPTC కౌంటింగ్‌కు 10 టేబుళ్లు ఏర్పాటు
ఒకే రౌండ్‌లో పూర్తికానున్న పులివెందుల ZPTC కౌంటింగ్