-
-
Home » Mukhyaamshalu » INSTANT BREAKING NEWS FROM ABN across world on 24th august VR
-
BREAKING: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
ABN , First Publish Date - Aug 24 , 2025 | 06:14 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Aug 24, 2025 13:42 IST
హైదరాబాద్: మగ్దూం భవన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు
సురవరం సుధాకర్‌రెడ్డి పార్థివదేహానికి సీఎం చంద్రబాబు నివాళి
-
Aug 24, 2025 13:02 IST
తిరుపతి: గ్రూప్ థియేటర్స్ దగ్గర లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్య
మృతులు కర్ణాటకకు చెందిన వెంకటరాజు, అనూషగా గుర్తింపు
పెళ్లికి పెద్దలు అంగీకరించడం లేదన్న మనస్తాపంతో ఆత్మహత్య
మృతదేహాలు తిరుపతి రుయా ఆస్పత్రికి తరలింపు
-
Aug 24, 2025 12:41 IST
రాజస్థాన్‌లో భారీ వర్షాలు, ఇద్దరు మృతి
కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం
కోట, బూంది, సవాయ్ మాధోపూర్..
టోంక్‌లలోని పలు ప్రాంతాల్లో నీటమునిగిన ఇళ్లు
-
Aug 24, 2025 12:04 IST
సురవరం సుధాకర్ రెడ్డికి నివాళులు అర్పించిన ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధ కృష్ణ
-
Aug 24, 2025 11:52 IST
హైదరాబాద్: స్వాతి హత్య కేసులో సంచలన విషయాలు
స్వాతిని చంపేందుకే వికారాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చిన మహేందర్
స్వాతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేందర్‌రెడ్డి
గర్భవతి అయినప్పటి నుంచి మహేందర్‌కి పెరిగిన అనుమానం
అనుమానంతోనే స్వాతిని కిరాతకంగా చంపిన మహేందర్ రెడ్డి
స్వాతి శరీర భాగాలను ముక్కలుగా చేసి మూసీలో పడేసిన మహేందర్
-
Aug 24, 2025 11:33 IST
హైదరాబాద్: మగ్దూం భవన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి
సురవరం సుధాకర్‌రెడ్డి పార్థివదేహానికి సీఎం రేవంత్ నివాళి
నివాళులర్పించి మంత్రి సీతక్క, కేటీఆర్, వామపక్ష నేతలు
పేదలు, బహుజనుల కోసం పోరాడిన నేత సురవరం: సీఎం రేవంత్
రాజీపడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత సురవరం
విద్యార్థి నేత నుంచి జాతీయ స్థాయి నేతగా ఎదిగారు: రేవంత్‌రెడ్డి
పాలమూరు జిల్లా బిడ్డ జాతీయ నేతగా ఎదగటం గర్వకారణం: రేవంత్‌రెడ్డి
అధికారం ఉన్నా.. లేకున్నా తన సిద్ధాంతాలను ఎప్పుడూ వీడలేదు: రేవంత్
-
Aug 24, 2025 11:00 IST
అనంతపురంలో టెన్షన్ వాతావరణం
గుత్తి దగ్గర నేషనల్ హైవేపై భారీగా ఎన్టీఆర్ ఫ్యాన్స్
జూనియర్ ఎన్టీఆర్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్
MLA దగ్గుబాటి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్
జూనియార్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Aug 24, 2025 10:51 IST
యానాం నియోజకవర్గంకు సంబంధించి సముద్రం నుండి ఐలాండ్ నెంబర్ 3 మీదుగా వెళ్ళిన గ్యాస్ పైప్ లైన్ లీకైన సంఘటన ప్రాంతాన్ని పరిశీలించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక మల్లాడి కృష్ణారావు,ఈ పైపులు సంఘటన వల్ల కిలోమీటర్ మేరా కాలిపోయిన మడ అడవులు పరిశీలించిన కృష్ణారావు
-
Aug 24, 2025 10:19 IST
యాదగిరిగుట్టలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి 4 గంటల సమయం
-
Aug 24, 2025 09:32 IST
నిజామాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
ఘర్షణకు దిగిన సీనియర్, జూనియర్ మెడికోలు
MBBS నాలుగో సంవత్సరం చదువుతున్న రాహుల్‌ను వేధించిన సీనియర్లు
ఎదురుతిరిగాడని రాహుల్ పై దాడి చేసిన సీనియర్లు, తీవ్రగాయాలు
కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన విద్యార్థి రాహుల్
ర్యాగింగ్ విషయం బయటపడకుండా కాలేజీ యాజమాన్యం దాచే ప్రయత్నం
-
Aug 24, 2025 09:32 IST
గాజాపై ఇజ్రాయెల్ ఐడీఎఫ్ దాడులు, 33 మంది మృతి
ఖానా యూనిస్‌లో ఆశ్రమం పొందుతున్న 17 మంది మృతి
-
Aug 24, 2025 08:07 IST
హైదరాబాద్: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం
KBR పార్క్ ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లి గోడను ఢీకొన్న కారు
కారులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Aug 24, 2025 07:58 IST
హైదరాబాద్: నేడు సురవరం సుధాకర్‌రెడ్డి అంతిమయాత్ర
ప్రజల సందర్శనార్థం పార్టీఆఫీస్‌లో సురవరం భౌతికకాయం
మ.3 గంటలకు గాంధీ ఆస్పత్రి వరకు అంతిమయాత్ర
సురవరం పార్థివదేహాన్ని గాంధీ ఆస్పత్రికి అప్పగించనున్న కుటుంబసభ్యులు
-
Aug 24, 2025 07:31 IST
నేడు 1:1 నిష్పత్తిలో డీఎస్సీ మెరిట్ జాబితా అభ్యర్థులకు కాల్ లెటర్లు
రేపటి నుంచి మెరిట్ జాబితా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
అభ్యర్థులకు 2 నుంచి 3 రోజులు సమయం ఇవ్వనున్న విద్యాశాఖ
రిజర్వేషన్ల ఆధారంగా కటాఫ్ మార్కులపై నిర్ణయం
అభ్యర్థుల లాగిన్‌లో కాల్ లెటర్లు అందుబాటులో ఉంచనున్న విద్యాశాఖ
-
Aug 24, 2025 07:30 IST
నేటి నుంచి 2 రోజుల పాటు ఆలిండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్
ఢిల్లీ అసెంబ్లీ భవనంలో స్పీకర్ల సమావేశం
స్పీకర్ల సదస్సును ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ముగింపు కార్యక్రమానికి హాజరుకానున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
హాజరుకానున్న 32 మంది స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు,..
కౌన్సిల్ చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు
-
Aug 24, 2025 07:30 IST
నేడు, రేపు పలు రాష్ట్రాల్లో ఉపరాష్ట్రపతి అభ్యర్ధి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పర్యటన
నేడు చెన్నై, లక్నోలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పర్యటన
జస్టిస్ సుదర్శన్‌రెడ్డి వెంట కాంగ్రెస్ ఎంపీలు మల్లురవి, నజీర్ హుస్సేన్
నేడు చెన్నైలో డీఎంకే ఎంపీలను కలిసి మద్దతు కోరనున్న జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
రేపు లక్నో పర్యటనలో ఎస్పీ ఎంపీలతో పాటు..
పలు పార్టీల నేతలను కలిసి మద్దతు కోరనున్న జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
-
Aug 24, 2025 07:30 IST
అమెరికాకు అన్నిరకాల ఆర్టికల్స్, బుకింగ్స్ నిలిపివేసిన తపాలా శాఖ
రేపటి నుంచి తాత్కాలింగా నిలిపివేస్తున్నట్లు తపాలా శాఖ ప్రకటన
ఉత్తరాలు, ఫైల్స్, 100 డాలర్లలోపు విలువైన బహుమతులకు మినహాయింపు
-
Aug 24, 2025 07:29 IST
చిత్తూరు: కుప్పంలో ఈ నెల 29, 30 తేదీల్లో సీఎం చంద్రబాబు పర్యటన
చంద్రబాబుతో పాటు భువనేశ్వరి కుప్పంలో పర్యటన
ఈ నెల 30న కుప్పం మం. పరమసముద్రం చెరువు దగ్గర జలహారతి, సభ
పరమసముద్రం చెరువు దగ్గర సీఎం చంద్రబాబు బహిరంగసభ
-
Aug 24, 2025 06:27 IST
నేడు జమ్ముకశ్మీర్‌లో రాజ్‌నాథ్‌సింగ్ పర్యటన
కిష్ట్వార్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
వరద నష్టం అంచనా వేయనున్న రాజ్‌నాథ్‌సింగ్
బాధితులకు సహయక చర్యలపై ఆరా తీయనున్న రాజ్‌నాథ్
-
Aug 24, 2025 06:14 IST
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
ఒడిశా- బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రెండ్రోజులు వర్షాలు
కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం: వాతావరణ శాఖ