-
-
Home » Mukhyaamshalu » INSTANT BREAKING NEWS FROM ABN across world on 20th august VR
-
BREAKING: సాదా బైనామాలపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం రిప్లయ్
ABN , First Publish Date - Aug 20 , 2025 | 06:16 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Aug 20, 2025 21:19 IST
సాదా బైనామాలపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం రిప్లయ్
12ఏళ్ల పాటు భూమి స్వాధీనంలో ఉండి.. ప్రభుత్వం నిర్దేశించినట్టుగా..
రాతపూర్వక ఒప్పందం ఉంటే సాదా బైనామాలు చెల్లుతాయన్న ఏజీ.
2020లో సాదా బైనామాలను ఆపాలన్న.. మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేయాలని కోరిన ఏజీ.
ఏజీ కౌంటర్‌కు రిప్లయ్ ఇచ్చేందుకు గడువు కోరిన పిటిషనర్లు.
తదుపరి విచారణ ఈనెల 26కు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు.
-
Aug 20, 2025 20:30 IST
ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాకిచ్చిన కేటీఆర్
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో కవితకు చెక్
TBGKS అధ్యక్షుడిగా మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ నియామకం
-
Aug 20, 2025 20:21 IST
ఏపీ సచివాలయానికి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్
జూ.ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో ప్రచారం
వివరణ ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు దగ్గరకు వచ్చిన దగ్గుపాటి ప్రసాద్
ఈ అంశంపై నిన్న పల్లాతో సమావేశమైన అనంతపురం టీడీపీ నేత ప్రభాకర్‌చౌదరి
దగ్గుపాటి ప్రసాద్ వివాదంపై సీరియస్‌గా ఉన్న టీడీపీ అధిష్టానం
-
Aug 20, 2025 19:09 IST
ఏపీలో పలువురు పీపీలు, ఏపీపీలపై ప్రభుత్వం చర్యలు
నిబంధనలు ఉల్లంఘించిన 17 మంది న్యాయవాదులపై వేటు.
పలు కోర్టుల్లో పనిచేసే ఇద్దరు పీపీలు, 15మంది ఏపీపీలు తొలగింపు.
పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ సిఫార్సుతో ఏపీ ప్రభుత్వం చర్యలు.
-
Aug 20, 2025 13:04 IST
మేడారంలో శాశ్వత నిర్మాణాల పనులకు రూ.150 కోట్లు మంజూరు
మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు నిధులు మంజూరు
రూ.150 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
వచ్చే ఏడాది జనవరిలో మేడారం మహాజాతర నిర్వహణ
-
Aug 20, 2025 12:20 IST
తెలంగాణ: మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీకి నోటిఫికేషన్
దరఖాస్తుల ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంపు
2025 డిసెంబర్ నుంచి 2027 నవంబర్ వరకు రెండేళ్ల కోసం లైసెన్సులు జారీ
నవంబర్‌తో ముగియనున్న ప్రస్తుత మద్యం దుకాణాల లైసెన్సుల గడువు
6 స్లాబుల ద్వారా లైసెన్సులు జారీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడి
మద్యం దుకాణాల కేటాయింపులో కూడా రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం
గౌడ్లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు
-
Aug 20, 2025 11:29 IST
NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు
ప్రధాని మోదీ, బీజేపీ, NDA నేతల సమక్షంలో సీపీ రాధాకృష్ణన్ నామినేషన్
సీపీ రాధాకృష్ణన్‌తో పాటు మొత్తం 20 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పణ
-
Aug 20, 2025 11:28 IST
మంత్రి లోకేష్ కృషితో ఏపీ విద్యా శాఖకు కేంద్రం నిధులు మంజూరు
సమగ్ర శిక్షాకు గతంలో కంటే అదనంగా రూ.432.19 కోట్లు నిధులు మంజూరు
ఐసీటీ ల్యాబ్‌లు, స్మార్ట్ క్లాసెస్‌కు రూ.167.46 కోట్ల అదనపు నిధులు మంజూరు
ఆదివాసీ విద్యార్థులకు వసతి గృహాల కోసం రూ.11 కోట్లు మంజూరు
జన జాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం కింద రూ.210.5 కోట్లు మంజూరు
-
Aug 20, 2025 11:06 IST
హైదరాబాద్‌లో 6 కంపెనీల్లో కొనసాగుతోన్న ఐటీ సోదాలు
DSRకు చెందిన పలు కంపెనీల్లో ఐటీ సోదాలు
లిక్కర్ స్కామ్‌లో శ్రీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్, శ్రీనివాస ఇన్ఫ్రాలో కొనసాగుతోన్న సోదాలు
భారీ ఎత్తున ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్న ఐటీ
కంపెనీల ఆస్తులతో పాటు వ్యక్తిగత ఆస్తులు గుర్తించిన అధికారులు
భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు
కంపెనీల సంబంధించిన ఎండీల బ్యాంకు లాకర్లు గుర్తింపు
ఎండీల బ్యాంకు లాకర్‌ను నేడు తెరవనున్న అధికారులు
మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి ఇంట్లో కొనసాగుతోన్న సోదాలు
భారీగా వ్యక్తిగత ఆస్తులతో పాటు కంపెనీ ఆస్తులు గుర్తింపు
రంజిత్‌రెడ్డితోపాటు కుటుంబసభ్యుల బ్యాంకు లాకర్లు గుర్తింపు
-
Aug 20, 2025 11:01 IST
ధర్మవరం: ఉగ్రవాది నూర్ మహ్మద్ కేసులో కీలక పరిణామం
కస్టడీ కోరుతూ ధర్మవరం కోర్టులో పోలీసుల పిటిషన్
ఇప్పటికే నూర్ మహ్మద్ సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు
విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన ధర్మవరం పోలీసులు
కీలకం కానున్న ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక
లోతుగా దర్యాప్తు చేసేందుకు కస్టడీకి తీసుకోవాలని కోర్టులో పోలీసుల పిటిషన్
నేడు కస్టడీ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం
-
Aug 20, 2025 11:00 IST
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి జైలు నుంచి విడుదల
నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విడుదల
-
Aug 20, 2025 10:59 IST
అమరావతి: టీటీడీపై అసత్య ప్రచారం
సాక్షి మీడియాపై టీటీడీ చైర్మన్ పరువు నష్టం దావా
తిరుమలపై సాక్షిలో అసత్య ప్రచారం చేస్తున్నారని లీగల్ నోటీసులు
సాక్షి మీడియా తక్షణమే టీటీడీకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి: టీటీడీ చైర్మన్
టీటీడీకి రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నోటీసులు
-
Aug 20, 2025 10:58 IST
పంజాగుట్ట ఫ్లైఓవర్ పై నుండి ద్విచక్ర వాహనం కిందపడిన ఘటనలో ఒకరు మృతి
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
మృతుడు క్షతగాత్రులు బేగంపేటకు చెందిన వారిగా గుర్తింపు
ఈ ఘటనలో బేగంపేట బాలం రాయికి చెందిన భరత్ అక్కడికక్కడే మృతి
వేణు, శ్రీనివాసులకు తీవ్ర గాయాలు ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు
భోజనం చేసేందుకు అర్థరాత్రి ఒంటిగంట సమయంలో పంజాగుట్ట ఫ్లైఓవర్ పై నుండి వెళ్తుండగా ఘటన
అతివేగం కారణంగా అదుపుతప్పిన బండి.. రైలింగ్ను ఢీ కొట్టి ఫ్లై ఓవర్ పై నుండి కింద పడ్డ ద్విచక్ర వాహనం
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట పోలీసులు
-
Aug 20, 2025 10:58 IST
ఫలించిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల యూరియా పోరాటం
తెలంగాణ రాష్ట్రానికి ఈ వారంలో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కు కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ ఆమోదం
కర్ణాటక నుంచి 10800 మెట్రిక్ టన్నుల యూరియా షిప్ మెంట్ ప్రారంభం
ఈ వారంలో మరో మూడు షిప్ మెంట్ ల ద్వారా యూరియా సరఫరాకు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు ఆదేశాలు
యూరియా కొరత పై పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేసి తెలంగాణ రైతాంగం యూరియా కష్టాల పై దేశానికి తెలిసేలా చేసిన ఎంపీలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అభినందనలు
ప్రతిపక్ష పార్టీ రాజకీయ స్వార్థం కోసం చేసే కుట్రల పట్ల రైతాంగం ఆలోచన చేయాలి
తెలంగాణ కు కేటాయించిన యూరియా సకాలంలో సరఫరా చేయకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష కారణంగానే రైతులకు ఇబ్బందులు
తెలంగాణ రైతాంగం శ్రేయస్సు కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతాంగం కు ఎల్లపుడు ప్రభుత్వం అండగా ఉంటుంది.
-
Aug 20, 2025 09:45 IST
వేములవాడ ప్రధాన రహదారి రోడ్డు విస్తరణ పనుల్లో మట్టిని అక్రమంగా తరలిస్తున్న లారీ బోల్తా
ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణాపాయం
విస్తరణ పనుల మట్టిని కలెక్టరేట్లోనే పోయాలన్న జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న కాంట్రాక్టర్
ప్రశ్నించిన మీడియాపై దాడికి యత్నించిన కాంట్రాక్టర్
-
Aug 20, 2025 09:45 IST
నేడు సచివాలయం దగ్గర రాజీవ్‌గాంధీ విగ్రహానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు
గచ్చిబౌలిలో రిజిస్ట్రార్, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సీఎం శంకుస్థాపన
నియో పోలీస్ కోకాపేట దగ్గర ఎగ్జిట్ రోడ్డును ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
-
Aug 20, 2025 09:44 IST
అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
తెలంగాణలో 5 రోజులు భారీ వర్షాలు
మహబూబాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్
-
Aug 20, 2025 09:41 IST
సీఎం చంద్రబాబుతో కడప టిడిపి నేతలు భేటీ వాయిదా
నందమూరి జై కృష్ణ సతీమణి పద్మజ మృతితో హైదరాబాద్ వెళ్ళిన చంద్రబాబు లోకేష్ లు
పులివెందుల ఒంటిమిట్ట జడ్పీ టిసిల ఘనవిజయం నేపద్యం లో..కడప తమ్ముళ్ళను కలిసేం దుకు రమ్మన్న చంద్రబాబు
-
Aug 20, 2025 09:38 IST
17వ రోజుకు చేరిన సినీ కార్మికుల సమ్మె
నేడు నిర్మాతలతో భేటీ కానున్న ఫిల్మ్ చాంబర్ అధ్యక్ష, కార్యదర్శులు
సాయంత్రం ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులతో ఫెడరేషన్ నేతల భేటీ
-
Aug 20, 2025 08:27 IST
నేడు నింగిలోకి రష్యా బయాన్-M నెంబర్-2 ఉపగ్రహం
జీవులపై రేడియేషన్ ప్రభావంపై ప్రయోగం
ఎలుకలు, ఈగలు, సూక్మజీవులను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్న శాటిలైట్
అంతరిక్ష వాతావరణంపై సమాచారం సేకరిస్తున్న రష్యా
-
Aug 20, 2025 08:10 IST
నేడు గచ్చిబౌలికి సీఎం రేవంత్‌రెడ్డి
ఇంటిగ్రేటెడ్ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌కు శంకుస్థాపన
నేడు కోకాపేట నియోపోలిస్ ORR టోల్‌ప్లాజా ప్రారంభం
టోల్‌ప్లాజాను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
-
Aug 20, 2025 07:51 IST
ప్రధాని, సీఎంలు, మంత్రుల తొలగింపునకు లీగల్ ఫ్రేమ్‌వర్క్
నేడు లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఆర్టికల్ 75, 164, 239AA సవరణకు కేంద్రం బిల్లు
నెల రోజులు కస్టడీలో ఉన్న మంత్రులు పదవీచ్యుతులు చేసేలా చట్టం రూపకల్పన
జమ్మూకశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్‌లో కొత్త క్లాజ్ (4A) ప్రతిపాదన
సీఎం సలహా లేకపోయినా ఆటోమేటిక్‌గా పదవి రద్దు
ప్రజల విశ్వాసం, రాజ్యాంగ నైతికత పరిరక్షణ లక్ష్యంగా కేంద్రం చర్యలు
-
Aug 20, 2025 07:30 IST
నేడు లోక్‌సభలో 3 కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం
నేడు జమ్మూకశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం
యూటీల సవరణ బిల్లు, 130 రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం
3 బిల్లులను సంయుక్త పార్లమెంటరీ సంఘానికి సిఫార్సు చేయనున్న కేంద్రం
-
Aug 20, 2025 06:54 IST
నేడు పార్లమెంట్ ముందుకు ఆన్‌లైన్ బెట్టింగ్ బిల్లు
ఆన్‌లైన్ బెట్టింగ్, ప్రకటనలను నిషేధించేలా బిల్లు రూపకల్పన
-
Aug 20, 2025 06:53 IST
నేడు నామినేషన్ వేయనున్న ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్
సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయనున్న ఎన్డీఏ నేతలు
సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న ఎన్డీయే నేతలు
-
Aug 20, 2025 06:53 IST
నేడు విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి పరిచయ కార్యక్రమం
సుదర్శన్‌రెడ్డిని ఇండి కూటమి ఎంపీలకు పరిచయం చేయనున్న కాంగ్రెస్
మధ్యాహ్నం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో పరిచయ కార్యక్రమం
రేపు మధ్యాహ్నం నామినేషన్ వేయనున్న జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
-
Aug 20, 2025 06:18 IST
అమరావతిలో రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌కు నేడు శ్రీకారం
రాష్ట్ర ఆర్థికావృద్ధిలో ప్రతి కుటుంబానికి భాగస్వామ్యం కల్పించే లక్ష్యంతో ఇన్నోవేషన్ హబ్
ప్రపంచ అవసరాలు తీర్చే స్టార్టప్‌ల కేంద్రంగా రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ సిద్ధం
-
Aug 20, 2025 06:16 IST
భారత్ -చైనా సంబంధాల్లో కీలక పురోగతి
సరిహద్దు సమస్య పరిష్కారం దిశగా భారత్-చైనా అడుగులు
సరిహద్దు పరిష్కారానికి నిపుణుల బృందం ఏర్పాటుకు భారత్-చైనా అంగీకారం
మోదీ, అజిత్ దోవల్‌తో చైనా విదేశాంగ మంత్రి భేటీ తర్వాత కీలక ప్రకటన
ప్రత్యక్ష విమాన సంబంధాల పునరుద్ధరణకు అంగీకరించిన భారత్-చైనా
వాణిజ్యం, పెట్టుబడుల పునరుద్ధరణ నిర్ణయాలను ప్రకటించిన భారత్-చైనా
వాణిజ్యం, పర్యాటక, వ్యాపార వీసాలపై భారత్-చైనా మధ్య కుదిరిన అవగాహన
2026 నుంచి కైలాస మనస సరోవర యాత్ర విస్తరించాలని భారత్-చైనా నిర్ణయం
అత్యవసర పరిస్థితుల్లో హైడ్రోలాజికల్ సమాచారం పంచుకోవాలని ఇరుదేశాలు నిర్ణయం