-
-
Home » Mukhyaamshalu » INSTANT BREAKING NEWS FROM ABN across globe on 16th august IS HERE VR
-
BREAKING: సీఎం చంద్రబాబుకు సూపర్ స్టార్ రజనీ కాంత్ ధన్యవాాదాలు..
ABN , First Publish Date - Aug 16 , 2025 | 06:14 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Aug 16, 2025 19:05 IST
ఏపీ సీఎంకు సూపర్ స్టార్ ధన్యవాాదాలు..
సినీ కెరీర్‌లో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న రజనీకాంత్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు
ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన రజనీకాంత్
మీ మాటలు నా హృదయాన్ని తాకాయి: రజనీకాంత్
మీ అభినందనలు నాకు ఆనందాన్నిచ్చాయి: రజనీకాంత్
ఈ శుభాకాంక్షలు నాలో స్పూర్తి నింపాయి: రజనీకాంత్
మీ వంటి వ్యక్తుల ప్రేమ, స్నేహంతో నేను సినీ పరిశ్రమలో ఉత్తమంగా రాణించేందుకు కృషిచేస్తా: రజనీకాంత్
-
Aug 16, 2025 19:03 IST
నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గర పర్యాటకుల నిరసన
నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్ గేట్ దగ్గర పర్యాటకుల నిరసన
CRPF సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపణ
పైరవీలతో వచ్చే కార్లను తనిఖీ చేయకుండా డ్యామ్‌పైకి పంపుతున్నారని ఆరోపణ
వందకు పైగా వాహనాలను డ్యామ్ పైకి పంపారని ఆరోపిస్తున్న పర్యాటకులు
-
Aug 16, 2025 19:03 IST
మూడో టీ20లో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా విజయం
సౌతాఫ్రికాపై 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపు
స్కోర్లు: సౌతాఫ్రికా 172/7, ఆస్ట్రేలియా 173/8
-
Aug 16, 2025 16:26 IST
రాబోయే 3గంటల్లో ఉత్తరాంధ్రకు వర్ష సూచన
ఏపీలో ఐదు జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్
ఉత్తరాంధ్ర పోర్టులో స్థానికంగా మూడో ప్రమాద హెచ్చరిక జారీ
మన్యం జిల్లాలో పొంగుతున్న వాగులు, లోతట్టు కాలనీల్లోకి చేరిన వరద
ఏలూరు: కొల్లేరుకు కొనసాగుతోన్న నీటి ఉధృతి
అల్పపీడనం ప్రభావంతో ఈనెల 19 వరకు తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్
నాగార్జునసాగర్‌కు కొనసాగుతోన్న వరద ప్రవాహం, 16 గేట్లు ఎత్తివేత
ఆదిలాబాద్‌ను ముంచెత్తిన వరద, జలదిగ్బంధంలో పలు కాలనీలు
కరీంనగర్: కడెం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో ఎల్లంపల్లికి భారీగా వరద
ఖమ్మం: బండిపాడు దగ్గర ఉప్పొంగిన బుగ్గ వాగు
గోవిందరాల-డోర్నకల్ మధ్య నిలిచిన రాకపోకలు
-
Aug 16, 2025 16:26 IST
సోమవారం ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భేటీ
రష్యాతో యుద్ధవిరమణ గురించి చర్చించనున్నట్టు జెలెన్‌స్కీ వెల్లడి
ట్రంప్, పుతిన్ భేటీపైనా చర్చించనున్నట్టు తెలిపిన జెలెన్‌స్కీ
-
Aug 16, 2025 16:26 IST
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: రేవంత్
వర్షాలు ఎక్కువగా ఉన్న జిల్లాలకు NDRF, SDRF బృందాలను పంపాలి
లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: రేవంత్
చెరువులు, రిజర్వాయర్లు, కుంటల దగ్గర ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలి: సీఎం రేవంత్‌రెడ్డి
-
Aug 16, 2025 16:24 IST
బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కూల్చివేసే కుట్ర జరిగింది: RS ప్రవీణ్‌కుమార్
మేడిగడ్డ బ్యారేజ్ కుంగితే పేలుళ్ల శబ్దాలు రావు: RS ప్రవీణ్‌కుమార్
పేలుళ్ల వెనుక రేవంత్, బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఉన్నారని అనుమానం
మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుకు కారణం బీజేపీ, కాంగ్రెస్: RS ప్రవీణ్
రేవంత్‌రెడ్డి, బండి సంజయ్, కిషన్‌రెడ్డితో పాటు వారి అనుచరుల ఫోన్ కాల్స్ డేటాను బయటకు తీయాలి: RS ప్రవీణ్
మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుపై సిట్ విచారణ జరపాలి: RS ప్రవీణ్
-
Aug 16, 2025 16:23 IST
సత్యసాయి: ధర్మవరంలో ఉగ్రవాది నూర్ అహ్మద్ అరెస్ట్
ఉగ్రవాది నూర్ అహ్మద్‌ను అరెస్ట్ చేసిన ధర్మవరం టూటౌన్ పోలీసులు
సెక్షన్ 152, 196(1), 196(2), BNS 13, 38, 39 కింద కేసు నమోదు
నూర్ అహ్మద్‌ను రాత్రి కదిరి కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు
నూర్ అహ్మద్‌పై ఉప యాక్ట్, దేశద్రోహం కింద కేసు నమోదు
నూర్‌ను ప్రశ్నిస్తోన్న ధర్మవరం పోలీసులు, IB అధికారులు
కేసు తీవ్రత దృష్ట్యా NIA రంగంలోకి దిగే అవకాశం
ఉగ్రవాద సంస్థలతో నూర్ అహ్మద్‌కు సంబంధాలున్నట్టు IB గుర్తింపు
29 ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూపుల్లో నూర్ ఉన్నట్టు గుర్తించిన IB
వాట్సాప్ గ్రూప్ కార్యకలాపాలపై ఆరా తీస్తున్న IB అధికారులు
జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో నూర్ అహ్మద్ కీలక పాత్ర
పాక్‌లో ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూప్‌లో నూర్ యాక్టివ్ మెంబర్
ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు నూర్ మళ్లిస్తున్నట్టు గుర్తించిన IB
నూర్ దగ్గర ఉగ్రవాద సాహిత్యంతో పాటు 16 సిమ్ కార్డులు స్వాధీనం
జైషే మహమ్మద్, ఇతరులతో నూర్ అహ్మద్ ఆన్‌లైన్ కాల్స్
-
Aug 16, 2025 13:10 IST
తెలంగాణలో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్
భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్
ఆదిలాబాద్, కొమురంభీం, జగిత్యాల, మంచిర్యాల,..
కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
వరంగల్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
-
Aug 16, 2025 12:35 IST
జమ్మూకశ్మీర్‌లో ఆకస్మిక వరదలు
కిష్త్వార్ జిల్లాలోని చసోటి గ్రామాన్ని సందర్శించిన సీఎం ఒమర్ అబ్దుల్లా
వరద ప్రాంతాల బాధితులను పరామర్శించిన సీఎం ఒమర్ అబ్దుల్లా
ఆకస్మిక వరదలకు 65 మందికి పైగా మృతి, పలువురు గల్లంతు
-
Aug 16, 2025 12:34 IST
హైదరాబాద్: చందానగర్ ఖజనా జ్యువెలరీ దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
నిందితుల నుంచి నాటు తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం
-
Aug 16, 2025 12:33 IST
ఢిల్లీ: రేపు BJP పార్లమెంటరీ బోర్డు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై సమావేశం
ఆగస్టు 18న అధికారికంగా అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం
ఆగస్టు 19న NDA పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని ప్రసంగం
ఆగస్టు 20న NDA నేతలందరూ ఢిల్లీలో సమావేశం
ఆగస్టు 21న NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్
-
Aug 16, 2025 12:31 IST
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ సూచన
క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని అధికారులు, సిబ్బందికి సీఎం ఆదేశం
ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి
-
Aug 16, 2025 11:52 IST
రేపు భారత్‌కు వ్యోమగామి శుభాంశు శుక్లా
ప్రధాని మోదీతో శుభాంశు శుక్లా భేటీ అయ్యే అవకాశం
-
Aug 16, 2025 11:29 IST
హైదరాబాద్ వాసి వైఎస్ రెడ్డి అరెస్ట్
ముంబై వాసవి విరార్ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డి
ప్రభుత్వ స్థలంలో భవన నిర్మాణాలకు అనుమతులిచ్చిన వైఎస్ రెడ్డి
గతంలో హైదరాబాద్‌లోని వైఎస్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసి..
10 కోట్ల నగదు, రూ.23 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్న ఈడీ
ఇటీవల హైదరాబాద్‌లో వైఎస్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన ఈడీ
-
Aug 16, 2025 11:24 IST
మహారాష్ట్రలో భారీ వర్షాలు, ముంబైకి రెడ్ అలర్ట్
మహారాష్ట్రలో 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
రత్నగిరి, రాయ్‌గడ్, ముంబై సిటీ, సబర్బన్, థానే, పాల్ఘర్ జిల్లాలకు రెడ్ అలర్ట్
ముంబైలో విఖ్రోలి పార్క్‌సైట్‌లోని వర్ష నగర్‌లో..
కొడచరియలు విరిగిపడి ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు
ముంబైలో రైళ్లు, విమాన రాకపోకలకు అంతరాయం
రైల్వే ట్రాకులు, ఎయిర్‌పోర్ట్ రన్‌వేలపై భారీగా నిలిచిన వరద
-
Aug 16, 2025 10:47 IST
పోలవరం ప్రాజెక్ట్‌లో దెబ్బతిన్న ఎగువ కాఫర్ డ్యాంలో కొంత భాగం
10 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతున కాఫర్ డ్యాంకు డ్యామేజ్
ఇప్పటికే 2022 ఆగస్ట్ భారీ వరదలకు ఎగువ కాఫర్ డ్యాంకు సీపేజ్
దిగువన బట్రస్ డ్యాం నిర్మాణం, ఎగువన ఎత్తు, వెడల్పు పెంపు
ఎత్తు పెంచిన చోటే నేడు కొంతమేర దెబ్బతిన్న నిర్మాణం
ఎలాంటి నష్టం లేదంటున్న ఇరిగేషన్ అధికారులు
దెబ్బతిన్న ప్రాంతంలో మరమ్మతులు పూర్తిచేసిన అధికారులు
కాఫర్ డ్యాం నుంచి సీపేజ్ కొనసాగుతుండడంతో..
ఎప్పటికప్పుడు డీ వాటరింగ్ చేస్తూ డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు
-
Aug 16, 2025 10:35 IST
తిరుమల: శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లకు భక్తుల నుంచి భారీ డిమాండ్
నేటి దర్శనం టికెట్ల కోసం ముందు రోజే క్యూ లైన్ల దగ్గర వేచి ఉంటున్న భక్తులు
కరెంటు బుకింగ్ ద్వారా 800 టికెట్లు మాత్రమే జారీతో గంట వ్యవధిలోనే కోటా పూర్తి
అధికారికంగా ఉ.10 గంటలకు టికెట్ల జారీ చేస్తామని చెప్పినా..
భక్తుల రద్దీతో నిన్న రాత్రే టికెట్లను జారీ చేసిన టీటీడీ
-
Aug 16, 2025 10:13 IST
సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కలకలం
నూర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో
ధర్మవరం కోట కాలనీలో అదుపులోకి తీసుకున్న IB అధికారులు
ఓ హోటల్లో కుక్‌గా పనిచేస్తున్న నూర్
ఉగ్రవాదులతో నూర్‌కు సంబంధాలపై IB ఆరా
నూర్ ఇంట్లో 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్న IB
నూర్ సోషల్ మీడియా ఖాతాలపై IB అధికారుల దృష్టి
-
Aug 16, 2025 09:15 IST
దేశమే ఫస్ట్ అనే నినాదానికి జీవితాంతం పనిచేసిన మహనీయులు వాజపేయి: చంద్రబాబు
ఏపీ అభివృద్ధికి నాడు ఆయన సహకారం తెలుగు జాతి ఎప్పటికీ మర్చిపోదు: సీఎం చంద్రబాబు
రాజకీయాల్లో హుందాతనానికి నిర్వచనం అటల్ బిహారి వాజపేయి: సీఎం చంద్రబాబు
మహానేత వాజపేయి వర్థంతి సందర్భంగా నివాళులు: సీఎం చంద్రబాబు
-
Aug 16, 2025 09:14 IST
ఒడిశా-ఉత్తరాంధ్ర సమీపంలో కొనసాగుతోన్న అల్పపీడనం
అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ
అల్పపీడన ప్రభావంతో తెలంగాణకు భారీ వర్ష సూచన
నేడు 12 జిల్లాలకు ఆరెంజ్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్‌కు మరో 2 రోజులపాటు వర్ష సూచన
-
Aug 16, 2025 08:21 IST
నేడు మహబూబాబాద్‌లో మంత్రి పొన్నం పర్యటన
సర్ధార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణలో పాల్గొననున్న పొన్నం
-
Aug 16, 2025 07:23 IST
కర్నూలు: తుంగభద్ర డ్యామ్‌కు మరో ముప్పు
మొరాయిస్తున్న 7 క్రస్ట్ గేట్లు
వరద ఉధృతికి కింది భాగంలో వంగిన గేట్లు
ప్రస్తుతం 3 నుంచి 4 అడుగుల ఎత్తులో గేట్లు
-
Aug 16, 2025 06:54 IST
అల్పపీడన ప్రభావంతో తెలంగాణకు భారీ వర్ష సూచన
నేడు 12 జిల్లాలకు ఆరెంజ్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్‌కు మరో 2 రోజులపాటు వర్ష సూచన
-
Aug 16, 2025 06:41 IST
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అభినందనలు: సీఎం చంద్రబాబు ట్వీట్
50 ఏళ్ల అద్భుత సినీ కెరీర్ పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు
తన ఐకానిక్ నటనతో రజనీకాంత్ లక్షలాది మందిని అలరించారు
సామాజిక అవగాహన పెంచేలా తన చిత్రాలను తీశారు: చంద్రబాబు
ఆయన రచనలు సామాజిక సమస్యలను ప్రతిబింబించాయి: చంద్రబాబు
-
Aug 16, 2025 06:14 IST
అమెరికా- రష్యా అధ్యక్షుల సమావేశం
అమెరికాలోని అలాస్కాలో భేటీకానున్న ట్రంప్, పుతిన్
ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ప్రతిపాదనలపై చర్చ
ట్రంప్- పుతిన్ చర్చల ఫలితాల ఆధారంగా భారత్‌పై సుంకాలు
-
Aug 16, 2025 06:14 IST
నేడు జార్ఖండ్కు సీఎం రేవంత్ రెడ్డి
మాజీ సీఎం శిబూ సోరెన్ 11వ రోజు సందర్భంగా..
సంతాపం తెలిపేందుకు వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి