-
-
Home » Mukhyaamshalu » Breaking Viral and trending Telangana Andhra Pradesh news to national and international on 8th nov 2025 vreddy
-
BREAKING: BRS హయాంలో అన్నివర్గాలను ఆదుకున్నాం: కేటీఆర్
ABN , First Publish Date - Nov 08 , 2025 | 06:26 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 08, 2025 21:12 IST
BRS హయాంలో అన్నివర్గాలను ఆదుకున్నాం: కేటీఆర్
హైదరాబాద్‌కు ప్రముఖ సంస్థలను తీసుకొచ్చాం: కేటీఆర్
మేం తెచ్చిన పెట్టుబడుల వల్లే లక్షల ఉద్యోగాలు వచ్చాయి: కేటీఆర్
కాంగ్రెస్ గ్యారెంటీలను అమలుచేయలేదు: కేటీఆర్
అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది: కేటీఆర్
-
Nov 08, 2025 17:44 IST
నేపాల్‌లో కూడా మన ఎర్రచందనం పట్టుబడింది: పవన్
తిరుపతి: మామండూరు అటవీప్రాంతంలో మొక్కలు నాటిన డిప్యూటీ సీఎం పవన్
మంగళంలోని ఎర్రచందనం గోడౌన్లను పరిశీలించిన పవన్ కల్యాణ్
గ్రేడ్ల వారీగా ఎర్రచందనం వివరాలు అడిగితెలుసుకున్న పవన్
ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష
గత ఐదేళ్లు విపరీతంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది: పవన్
ఐదేళ్లలో లక్షా 30 వేల ఎర్రచందనం చెట్లు నరికేశారు: పవన్
గతంలో రూ.5 వేలకోట్ల విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు: పవన్
దేశవ్యాప్తంగా పట్టుబడుతున్న ఎర్రచందనం ఏపీ నుంచే వెళ్తోంది: పవన్
నేపాల్‌లో కూడా మన ఎర్రచందనం పట్టుబడింది: పవన్
స్మగ్లింగ్‌ను అరికట్టాల్సిన బాధ్యత మనపైనే ఉంది: పవన్
ఎర్రచందనం చెట్లను మనమే కాపాడుకోవాలి: పవన్ కల్యాణ్
అధికారంలోకి రాగానే టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశాం: పవన్ కల్యాణ్
స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఏపీ, కర్ణాటక మధ్య ఒప్పందం అవసరం: పవన్ కల్యాణ్
ఏ రాష్ట్రంలో ఎర్రచందనం పట్టుబడినా అప్పగించేలా ఒప్పందం: పవన్
నలుగురు ఎర్రచందనం స్మగ్లింగ్ కింగ్‌పిన్స్‌ను గుర్తించాం: పవన్
ఎర్రచందనం స్మగ్లర్ల ఆస్తులను కూడా సీజ్ చేస్తాం: పవన్
ఎర్రచందనం స్మగ్లర్లకు స్థానికులు సహకరించొద్దు: పవన్
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా ఆపాలి: పవన్
ఇలాగే కొనసాగితే సహించేదిలేదు.. తాటతీస్తాం: పవన్ కల్యాణ్
-
Nov 08, 2025 15:08 IST
వివేకా హత్య కేసులో ట్విస్ట్..
వివేకా హత్య కేసులో ఇద్దరు పోలీస్ అధికారులపై కేసులు నమోదు
ప్రస్తుతం రాజుపాలెం PS ASI రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ASP రాజేశ్వర్‌రెడ్డిపై కేసులు
పులివెందులకు చెందిన కుళాయప్ప ఫిర్యాదుతో కేసు నమోదు
వివేకా హత్య కేసులో గతంలో తప్పుడు కేసులు నమోదు చేశారని ఫిర్యాదు
-
Nov 08, 2025 15:08 IST
తిరుపతి: మామండూరులో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
అడవిలో పలు రకాల చెట్లను పరిశీలించిన పవన్‌కల్యాణ్
నేపియర్ రిజర్వ్ ఫారెస్ట్ వాచ్ టవర్ నుంచి అడవిని పరిశీలించిన పవన్
ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలా నియంత్రిస్తున్నారంటూ పవన్ ఆరా
-
Nov 08, 2025 13:10 IST
డిసెంబర్‌లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ సమావేశాలు
-
Nov 08, 2025 12:23 IST
కడప: లింగాల పీఎస్ ఎదుట రైతులతో కలిసి ఎంపీ అవినాష్ ధర్నా
లింగాల మండలంలోని పలు గ్రామాల్లో పొలాల దగ్గర..
మోటార్ వైర్లను దొంగిలిస్తున్నారని ఎంపీ అవినాష్‌కు గోడు వెళ్లబోసుకున్న రైతులు
పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదని రైతుల ఆవేదన
-
Nov 08, 2025 12:23 IST
హైదరాబాద్: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: కిషన్‌రెడ్డి
ప్రజల దృష్టి మళ్లించేందుకే నాపై, బీజేపీపై దుష్ప్రచారం: కిషన్‌రెడ్డి
బీజేపీ, BRS కలిసిపోయాయని రేవంత్ తప్పుడు ప్రచారం: కిషన్‌రెడ్డి
గతంలోనూ ఎన్నికల సమయంలో రేవంత్ ఆసత్య ప్రచారాలు చేశారు
-
Nov 08, 2025 12:13 IST
బిహార్: సీతామర్హిలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం
ఆర్జేడీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు
బిహార్‌కు తుపాకుల ప్రభుత్వం అక్కర్లేదు: మోదీ
మేం ల్యాప్‌టాప్స్ ఇస్తే.. వాళ్లు రివాల్వర్లు ఇస్తున్నారు: మోదీ
-
Nov 08, 2025 11:48 IST
గ్రామీణ ప్రాంతాల్లో నూతన రోడ్లు వేస్తాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హ్యామ్ ప్రాజెక్ట్‌కు రూ.11,399కోట్లతో త్వరలో టెండర్లు: మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ చరిత్రలో రూ.60,799కోట్లతో రోడ్లు నిర్మించడం రికార్డు
హైదరబాద్-విజయవాడ హైవే 8 లైన్లకు విస్తరణ: మంత్రి కోమటిరెడ్డి
నిధులు మంజూరు చేసిన సీఎం, డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు: మంత్రి కోమటిరెడ్డి
-
Nov 08, 2025 11:47 IST
ATC వ్యవస్థ సమస్యలపై కేంద్రమంత్రి రామ్మోహన్ సమీక్ష
AAI, DGCA, ఎయిర్‌పోర్ట్ అధికారులతో రామ్మోహన్‌నాయుడు భేటీ
సాంకేతిక సమస్యలతో మాల్దీవుల పర్యటన రద్దు చేసుకున్న రామ్మోహన్
-
Nov 08, 2025 10:04 IST
ఏ10 అజయ్‌కుమార్ సుగంధ్‌ను అరెస్టు చేసిన CBI సిట్
భోలేబాబా కంపెనీకి కెమికల్ సరఫరా చేసిన అజయ్‌కుమార్ సుగంధ్
లడ్డూలు తయారుచేసే నెయ్యిలో 90 శాతానికి పైగా పామాయిల్ వినియోగించినట్లు గుర్తింపు
పామాయిల్ తయారీకి కెమికల్స్ వాడిన అజయ్
ఏడేళ్లుగా భోలేబాబాకు పామాయిల్ తయారీకి అజయ్ కెమికల్స్ సరఫరా
నెల్లూరు ACB కోర్టులో అజయ్‌కుమార్ సుగంధ్‌ను హాజరుపర్చిన సిట్
సుగంధ్‌కు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించి నెల్లూరు కోర్టు
-
Nov 08, 2025 10:03 IST
షట్‌డౌన్‌పై డెమోక్రాట్ల కండిషన్లకు నో చెప్పిన రిపబ్లికన్లు
అమెరికాలో 38 రోజులుగా కొనసాగుతున్న ప్రభుత్వ షట్‌డౌన్
ఆఫర్డబుల్ కేర్ యాక్ట్ ట్యాక్స్ క్రెడిట్స్‌ను..
మరో ఏడాది పెంచేందుకు అంగీకరించాలని డెమోక్రాట్ల షరతు
అలాగైతే షట్‌డౌన్ ముగింపునకు ఓటేస్తామన్న ప్రతిపక్షాలు
డెమోక్రాట్ల షరతును తిరస్కరించిన రిపబ్లికన్ నేతలు
40 మిలియన్ మందికి పైగా అమెరికన్లపై షట్‌డౌన్ ప్రభావం
ఆహార సంక్షోభంతో అగ్రరాజ్యంలో డేంజర్ బెల్స్
-
Nov 08, 2025 10:03 IST
జమ్మూకశ్మీర్: కుప్వారాలో ఆపరేషన్ పింపుల్
జవాన్ల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Nov 08, 2025 08:38 IST
విశాఖ: పెందుర్తిలో అనుమానస్పద మృతి కేసులో ట్విస్ట్
కోడలు సినీ ఫక్కీలో పథకం ప్రకారమే ..
అత్త జయంతి కనక మహాలక్ష్మి (66) హత్య చేసినట్లు పోలీసులకు లభించిన ఆధారాలు
ఆట పేరుతో అత్తను తాళ్లతో బంధించి, కళ్లకు గంతలు కట్టిన కోడలు
ఆ తర్వాత అత్తపై పెట్రోల్ పోసి దీపం విసిరి నిప్పంటించిన కోడలు
అనంతరం అగ్ని ప్రమాదం జరిగిందని అందరికీ నమ్మించే ప్రయత్నం చేసిన కోడలు
తనపై అనవసరంగా చిరాకు పెడుతున్నారని కారణంతోనే అతను హతమార్చినట్లు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం
మొదట అగ్ని ప్రమాదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పెందుర్తి పోలీసులు
పోలీసుల దర్యాప్తులో తెలుగులో వచ్చిన వాస్తవాలు
పెందుర్తి అప్పన్నపాలెంలో నివాసముంటున్న భార్యాభర్తలు సుబ్రహ్మణ్య శర్మ, లలిత, మనవడు,మనవరాలు, అత్త జయంతి కనకమాలక్ష్మి
-
Nov 08, 2025 08:26 IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల పడిగాపులు
రా.11గంటలకు వియత్నాం వెళ్లాల్సిన విమానం
ఇప్పటికీ టేకాఫ్ కాకపోవడంతో ప్రయాణికుల ఆందోళన
టేకాఫ్‌పై సరైన సమాధానం ఇవ్వని సిబ్బంది
రాత్రి నుంచి విమానంలోనే 200 మంది ప్రయాణికులు
-
Nov 08, 2025 08:11 IST
సీఎం రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
సీఎం రేవంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప.బెంగాల్ సీఎం మ
-
Nov 08, 2025 08:11 IST
నేడు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో కల్వకుంట్ల కవిత పర్యటన
వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ, తూర్పు, నర్సంపేట, పరకాలలో పర్యటన
రైతులు, నిరుద్యోగులు, స్థానికులతో ఇంట్రాక్ట్ కానున్న కవిత
-
Nov 08, 2025 08:11 IST
తెలంగాణలో నేటి నుంచి యథాతధంగా ప్రైవేట్ కాలేజీలు
ప్రభుత్వంతో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల చర్చలు సఫలం
రూ.900కోట్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం
3 రోజుల్లో రూ.600 కోట్లు విడుదలకు హామీ
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై త్వరలో కమిటీ ఏర్పాటు
-
Nov 08, 2025 08:05 IST
కల్యాణదుర్గంలో మంత్రి లోకేష్ పర్యటన
నేడు ప్రభుత్వం ఆధ్వర్యంలో కనకదాసు జయంతి ఉత్సవాలు
జయంతి ఉత్సవాలకు హాజరుకానున్న మంత్రి లోకేష్
-
Nov 08, 2025 08:04 IST
నేడు పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్న PPA బృందం
డ్యామ్, డయాఫ్రం వాల్ పనులు పరిశీలించనున్న..
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ CEO అతుల్ జైన్
-
Nov 08, 2025 07:09 IST
నేడు ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లో ప్రధాని మోదీ పర్యటన
వారణాసిలో వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని
వారణాసి నుంచి బిహార్‌లో దర్బంగాకు వెళ్లనున్న మోదీ
బిహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
Nov 08, 2025 06:26 IST
అమరావతి: నేడు తిరుపతిలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
మామండూరు మంగళంలోని ఎర్రచందనం గోడౌన్లు పరిశీలన
అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహణ
-
Nov 08, 2025 06:26 IST
పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకంపై ఏపీ ప్రభుత్వం పునరాలోచన
రూ.81,900 కోట్ల అంచనాతో మూడు దశల్లో చేపట్టాలని ముందుగా నిర్ణయం
పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలతో ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులకు అవకాశం
పోలవరం నుంచి వరద జలాల తరలింపును బనకచర్ల వరకు కాకుండా...
మధ్యలో నల్లమల సాగర్ వరకే పరిమితం చేసేలా యోచన
రూ.49,550 కోట్ల అంచనా వ్యయంతో 2 దశల్లో ప్రాజెక్టు చేపట్టేలా కార్యాచరణ
సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి మరోసారి టెండర్లు పిలవాలని నిర్ణయం
-
Nov 08, 2025 06:26 IST
మరణించిన న్యాయవాదుల కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు
1150 మంది న్యాయవాదుల కుటుంబాలకు ఆర్ధిక సాయం కోసం నిధులు విడుదల
రూ.46 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్‌గా విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
మరణించిన న్యాయవాది కుటుంబానికి రూ.4లక్షల చొప్పున ఆర్ధిక సాయం
ఎపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ మ్యాచింగ్ గ్రాంట్ పేరుతో చెక్కు జారీకి ఆదేశాలు
-
Nov 08, 2025 06:26 IST
తెలంగాణ ప్రభుత్వంతో ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య చర్చలు సఫలం
నేటి నుంచి తెరుచుకోనున్న ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డితో విద్యాసంస్థల సమాఖ్య చర్చలు
-
Nov 08, 2025 06:26 IST
నేడు 4 వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
బెనారస్-ఖజురాహో, లక్నో-సహరాన్‌పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ,..
ఎర్నాకుళం-బెంగళూరు వందేభారత్ రైళ్లు ప్రారంభించనున్న మోదీ
-
Nov 08, 2025 06:26 IST
అమరావతి: నేడు టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌కు సీఎం చంద్రబాబు
ఉ.11 నుంచి సా.5 గంటల వరకు ప్రజల నుంచి ఆర్టీలు స్వీకరణ
పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులు, కమిటీలు ప్రకటించే అవకాశం
ఇప్పటికే కమిటీలపై కసరత్తు పూర్తి చేశామని తెలిపిన సీఎం చంద్రబాబు
తిరువూరు పంచాయతీపై క్రమశిక్షణ కమిటీ నివేదిక పరిశీలించే అవకాశం