-
-
Home » Mukhyaamshalu » Breaking News Live Updates Sunday 19th July 2025 Top news and Major Events Across India Siva
-
Breaking News: లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్
ABN , First Publish Date - Jul 19 , 2025 | 09:13 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Jul 19, 2025 21:04 IST
విశాఖలో తలసేమియా అవగాహన రన్
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో రన్
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వ్యాధిగ్రస్తులకు రక్తం అందిస్తున్నాం: భువనేశ్వరి
తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు: భువనేశ్వరి
తలసేమియా ట్రస్ట్ సెంటర్లు ఏర్పాటుచేస్తాం: భువనేశ్వరి
-
Jul 19, 2025 21:03 IST
అన్నవరం నెయ్యి వ్యవహారంపై దేవాదాయశాఖ సీరియస్
దేవస్థానం పరిధిలోని తొలి పావంచాల కనకదుర్గమ్మ ఆలయంలో నెయ్యి పక్కదారి పట్టిందన్న వ్యవహారంపై విచారణ
దేవస్థానానికి చెందిన 45కిలోల నెయ్యిని బయటకు తరలించారని ఆలయ ఉప ప్రధాన అర్చకుడు హరగోపాల్‌పై ఆరోపణలు
నెయ్యిని హరగోపాల్ పక్కదారి పట్టించారని విచారణలో గుర్తింపు
హరగోపాల్‌కు సహకరించిన ఆలయ పరిచారకుడు కృష్ణకుమార్
హరగోపాల్ సహా కృష్ణకుమార్‌పై చర్యలకు దేవాదాయశాఖ ఆదేశాలు
ఇద్దరిని సస్పెండ్ చేస్తూ అన్నవరం దేవస్థానం ఈవో ఉత్తర్వులు
-
Jul 19, 2025 21:03 IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి RS ప్రవీణ్‌కుమార్‌కు సిట్ నోటీసులు
ఈనెల 14న నోటీసులకు స్పందించకపోవడంతో రెండోసారి నోటీసులు
వారం రోజుల్లో విచారణకు హాజరై స్టేట్‌మెంట్ ఇవ్వాలన్న సిట్
ఎప్పుడు హాజరవుతారో ముందే సమాచారం ఇవ్వాలని కోరిన సిట్
తన ఫోన్ హ్యాక్ చేశారని బీఆర్ఎస్ హయాంలో RS ప్రవీణ్ ఫిర్యాదు
RS ప్రవీణ్ ఫిర్యాదు ఆధారంగా స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్న సెట్
-
Jul 19, 2025 20:24 IST
లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్
మిథున్‌రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన పోలీసులు
అరెస్ట్‌పై కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు
కోర్టులో హాజరుపరిచే అంశంపై కాసేపట్లో నిర్ణయం
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A4గా ఉన్న మిథున్‌రెడ్డి
-
Jul 19, 2025 18:13 IST
ఏపీ లిక్కర్ కేసులో ప్రిలిమినరీ చార్జ్‌షీట్ దాఖలు
300 పేజీలతో చార్జ్‌షీట్ దాఖలు చేసిన సిట్ బృందం
చార్జ్‌షీట్‌లో 100కు పైగా RFSL నివేదికలు
రూ.62కోట్లు సీజ్ చేసినట్టు చార్జ్‌షీట్‌లో పేర్కొన్న సిట్
268 మంది సాక్షులను విచారించినట్టు తెలిపిన సిట్
-
Jul 19, 2025 18:13 IST
విజయవాడ: లిక్కర్ కేసులో ముగిసిన మిథున్‌రెడ్డి విచారణ
5 గంటలుగా ఎంపీ మిథున్‌రెడ్డిని ప్రశ్నించిన సిట్ అధికారులు
డొల్ల కంపెనీల నుంచి అంతిమ లబ్ధిదారునికి ముడుపులు చేర్చడంపై ప్రశ్నలు
మిథున్‌రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న పోలీసులు
లిక్కర్ కేసు ప్రాథమిక చార్జ్‌షీట్లను కోర్టుకు తీసుకెళ్తున్నట్లు సమాచారం
-
Jul 19, 2025 17:25 IST
కేబినెట్ సబ్ కమిటీ భేటీ..
హైదరాబాద్: సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ
హాజరైన భట్టి, ఉత్తమ్, శ్రీధర్‌బాబు, జూపల్లి, ఉన్నతాధికారులు
అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు
ORR లోపలున్న కాలుష్యకారక పరిశ్రమలను ORR బయటకు తరలించాలి: డిప్యూటీ సీఎం భట్టి
పరిశ్రమల తరలింపునకు విధివిధానాలు తయారు చేయాలి: భట్టి
హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో బహిరంగ వేలాన్ని పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి: భట్టి
-
Jul 19, 2025 17:25 IST
సైదాబాద్ పీఎస్ దగ్గర చందునాయక్ బంధువుల ఆందోళన
జస్టిస్ ఫర్ చందునాయక్ అంటూ నినాదాలు
అరెస్టయిన నిందితులపై దాడికి చందునాయక్ బంధువులు యత్నం
రవీంద్రచారి, రాయుడు, యాదిరెడ్డి, రాజేష్ ప్రధాన నిందితులని ఆరోపణ
అసలైన దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్
-
Jul 19, 2025 17:24 IST
ఫ్లెక్సీల రగడ..
సంగారెడ్డి: జహీరాబాద్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీల రగడ
సెట్విన్ కార్పొరేషన్ నిర్వహించిన కార్యక్రమం ఫ్లెక్సీలో ఎమ్మెల్యే మాణిక్‌రావు ఫొటో లేదని బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన
ఎమ్మెల్యే ఫొటో లేదని ఫ్లెక్సీని చించేసిన బీఆర్ఎస్ నేతలు
ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఫిర్యాదు
-
Jul 19, 2025 16:41 IST
ఈనెల 24న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం
2రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు
నేడు, రేపు ఏపీలో 12 జిల్లాలకు వర్ష సూచన
పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం
తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షసూచన
హైదరాబాద్ సహా 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
-
Jul 19, 2025 16:30 IST
గత ఐదేళ్లు ప్రజలకు స్వేచ్ఛ లేదు: సీఎం చంద్రబాబు
గత పాలకులు ప్రజల ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయలేదు
ప్రజల భూములను లాక్కోవాలని చూశారు: సీఎం చంద్రబాబు
మేం వచ్చాక ఫ్యాక్షనిజం, మతకలహాలను నివారించాం: చంద్రబాబు
హత్యా రాజకీయాలు చేయాలని చూస్తే ఎవరినీ వదిలి పెట్టాను
హంసా రాజకీయాలు చేస్తే వారి గుండెల్లో నిద్రపోతా: చంద్రబాబు
వైసీపీ నేతలు వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించారు
నారాసుర రక్తచరిత్ర అని నాపై వివేకా హత్య నింద వేశారు: చంద్రబాబు
పక్క రాష్ట్రాల్లో మామిడి రైతులను ఎవరూ పట్టించుకోలేదు
మామిడి రైతులకు టన్నుకు రూ.12వేలు ఇచ్చి ఆదుకున్నాం: చంద్రబాబు
రోడ్డుపై మామిడి కాయలు పారబోసి పులివెందుల రాజకీయం చేశారు: సీఎం
-
Jul 19, 2025 16:23 IST
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్, చంపాపేట, సరూర్‌నగర్‌లో వర్షం
ఉప్పల్, ముషీరాబాద్, బంజారాహిల్స్‌లో వర్షం
ఓయూ, తార్నాక, నాచారం, మల్లాపూర్, హబ్సిగూడలో వర్షం
-
Jul 19, 2025 16:21 IST
తెలంగాణ కేబినెట్ సబ్‌కమిటీ భేటీ
డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన సమావేశం
హాజరైన మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు, పొంగులేటి
తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంపుపై చర్చ
-
Jul 19, 2025 16:18 IST
పర్యావరనాన్ని కాపాడుదాం.. ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం: సీఎం చంద్రబాబు
ప్లాస్టిక్ ఎక్కువగా వాడితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది: సీఎం చంద్రబాబు
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎంతో ప్రమాదకరం: చంద్రబాబు
ప్లాస్టిక్ వద్దు.. ప్లాస్టిక్‌ను తరిమికొడదాం: సీఎం చంద్రబాబు
120 మైగ్రాన్ ఉన్న కవర్లను పూర్తిగా నిలిపేద్దాం: చంద్రబాబు
క్లాత్ బ్యాగ్ వెండింగ్ యంత్రాలను అందుబాటులోకి తెస్తున్నాం
ప్రపంచంలో ఏ వస్తువు నిరుపయోగం కాదు: సీఎం చంద్రబాబు
నిరుపయోగంగా ఉన్న వస్తువు నుంచి సంపద సృష్టించవచ్చు: చంద్రబాబు
-
Jul 19, 2025 16:17 IST
తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలన
ఏపీని స్వచ్ఛాంధ్రగా మారుస్తూ అవార్డులు సాధించాం: చంద్రబాబు
జాతీయ స్థాయిలో ఏపీకి ఐదు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వచ్చాయి
అవార్డులు సాధించినవారందరికీ అభినందనలు: సీఎం చంద్రబాబు
రాష్ట్రాభివృద్ధికి ఒక్కో నెల ఒక్కో కార్యక్రమం చేపట్టాం: చంద్రబాబు
-
Jul 19, 2025 15:38 IST
బండి సంజయ్ ఫోన్లు..
కరీంనగర్: ఈటల వ్యాఖ్యలపై క్యాడర్‌కు బండి సంజయ్ ఫోన్లు
ఈటల వ్యవహారంపై స్పందించవద్దని క్యాడర్‌కు ఆదేశం
ఈటల వ్యాఖ్యలపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేసే యోచనలో సంజయ్
ఈటల రాజేందర్ వ్యవహారంపై ఆగ్రహంతో ఉన్న బండి సంజయ్
-
Jul 19, 2025 15:38 IST
కాజీపేట రైల్వేకోచ్కు కేంద్రమంత్రి..
కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్
రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పనులు పరిశీలన
-
Jul 19, 2025 15:38 IST
హైదరాబాద్: మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసు
మరో 8 మంది కన్జ్యూమర్లను గుర్తించిన ఈగల్ టీమ్
కేసులో మొత్తం 25 మందిని FIRలో చేర్చిన ఈగల్ టీమ్
ఇప్పటికే ఆరుగురిని 4 రోజుల పాటు ప్రశ్నించిన అధికారులు
మరో ఇద్దరు నిందితుల కోసం కస్టడీ పిటిషన్ దాఖలు
కేసులో నైజీరియన్స్‌పై ఫోకస్ పెట్టిన ఈగల్ టీమ్
-
Jul 19, 2025 14:29 IST
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌లో చేరికలు
పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి పలువురు BRS నేతలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌దే విజయం: టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్
ఇకపై ఏ ఎన్నిక వచ్చినా BRS ఉనికి ఉండదు: టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్
ప్రజలను కేసీఆర్, కేటీఆర్, కవిత మోసం చేశారు: మహేష్‌గౌడ్
బనకచర్ల విషయంలో హరీష్‌రావు అబద్ధాలు ఆడుతున్నారు: మహేష్‌గౌడ్
తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకే పాలన జరుగుతోంది: మహేష్‌గౌడ్
-
Jul 19, 2025 13:33 IST
బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్‌కు గాయాలు

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్‌ను తీవ్రంగా గాయపడ్డారు.
కింగ్ సినిమా షూటింగ్ సమయంలో షారూఖ్ గాయపడినట్లు సమాచారం అందుతోంది.
ఈ సినిమాలో తన కుమార్తె సుహానాతో కలిసి తొలిసారి తెరపై కనిపించనున్నారు.
అయితే, సినిమా షూటింగ్ సందర్భంగా షారూఖ్ గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.
ముంబైలోని గోల్డెన్ టొబాకో స్టూడియోలో యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగిందని, ఆ ఘటనలో షారూఖ్ గాయపడినట్లుగా సమాచారం అందుతోంది.
గాయం కారణంగా షారూఖ్ ఖాన్‌ను నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించినట్లు సమాచారం.
మరోవైపు.. షారూఖ్‌కు పెద్ద గాయమే అయ్యిందని, అత్యవసర వైద్యం కోసం అమెరికాకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.
షారూఖ్ తదుపరి షెడ్యూల్ సెప్టెంబర్, అక్టోబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని చిత్ర బృందం చెబుతోంది.
గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తరువాత షారూఖ్ సెట్స్ మీదకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో వస్తున్న కింగ్ సినిమాలో దీపికా పదుకొణే, రాణి ముఖర్జి, అభిషేక్ బచ్చన్, జైదీప్ అహ్లవత్, అనిల్ కపూర్, అర్షద్ వార్సీ, జాకీ ష్రాఫ్, తదితర నటీనటులు ఉన్నారు.
-
Jul 19, 2025 13:33 IST
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపరేష్ కుమార్ ప్రమాణ స్వీకారం..
రాజ్‌భవన్‌లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు హాజరయ్యారు.
-
Jul 19, 2025 12:30 IST
సీఎం రేవంత్ రెడ్డి కీలక ట్వీట్..
ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యం తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం కీలక ట్వీట్ చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఓ యువతికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ అయ్యింది. ఇందుకు సంబంధించిన కథనాన్ని ఆంధ్రజ్యోతి పేపర్‌లో ప్రచురించగా.. ఆ క్లిప్‌ను కోట్ చేస్తూ సీఎం ట్వీట్ చేశారు. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అన్న దురాభిప్రాయాన్ని చెరిపివేసి.. బ్లెస్సీ గౌడ్‌కు 24 గంటల్లోపే విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసి పునఃర్జన్మ ప్రసాదించిన ఉస్మానియా వైద్య బృందానికి నా అభినందనలు. ప్రతి ప్రభుత్వ వైద్యుడికి వారు ఆదర్శం కావాలి. బీటెక్ విద్యార్థిని బ్లెస్సీ గౌడ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను.’ అని సీఎం రేవంత్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
-
Jul 19, 2025 12:18 IST
ఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఎంపీ మిధున్ రెడ్డి.
విచారణ నిమిత్తం విజయవాడ సిట్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లిన మిధున్ రెడ్డి.
మద్యం కుంభకోణం పేరుతో వైసిపి నాయకులపై కేసులు పెడుతున్నారు.
నాకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు.
అక్రమ కేసులను న్యాయ పరంగానే ఎదుర్కొంటాం.
-
Jul 19, 2025 12:09 IST
హెచ్‌సీఏ అంబుడ్స్ మన్‌గా జస్టిస్ సురేష్ ఎన్నిక..
ముగిసిన HCA సమావేశం
జగన్మోహన్‌రావును అధ్యక్ష పదవి నుంచి తొలగించిన కార్యవర్గం
అంబుడ్స్‌మన్‌గా జస్టిస్ సురేష్ కుమార్
HCA ఎథిక్స్ ఆఫీసర్‌గా కేసీ భాను
HCA సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకునేందుకు.. తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ యత్నం.
300 కొత్త క్లబ్స్‌కు అవకాశం ఇవ్వాలని TCJAC డిమాండ్
స్టేడియంలోకి వెళ్లేందుకు TCJAC యత్నం, అడ్డుకున్న పోలీసులు.
-
Jul 19, 2025 12:04 IST
హైదరాబాద్: హుజూరాబాద్ కార్యకర్తలతో ఈటల సమావేశం
బీజేపీలో సరైన ప్రాధాన్యం ఇవ్వట్లేదని ఈటల వర్గం అసంతృప్తి
స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ భవిష్యత్‌పై ఈటలతో నేతల చర్చ
శామీర్‌పేట్ నివాసంలో కార్యకర్తలతో చర్చిస్తున్న ఎంపీ ఈటల
-
Jul 19, 2025 10:50 IST
టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులపై వేటు
టీటీడీలో నలుగురు అన్యమత ఉద్యోగులు సస్పెన్షన్
-
Jul 19, 2025 10:48 IST
చెన్నై: కరుణానిధి పెద్ద కుమారుడు ఎం.కె.ముత్తు(77) కన్నుమూత
అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎం.కె.ముత్తు మృతి
-
Jul 19, 2025 09:29 IST
సీఎం రేవంత్‌పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్..
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై 'ఎక్స్'లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పందన.
సీఎం రేవంత్‌రెడ్డి తీరును తప్పుబట్టిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి.
పదేళ్లు నేనే సీఎం అని రేవంత్‌రెడ్డి ప్రకటించడం.. కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం.
కాంగ్రెస్‌లో అధిష్టానం ఆదేశాల మేరకు.. ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం ఎన్నిక ఉంటుంది.
కాంగ్రెస్‌ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను.. నిఖార్సయిన నాయకులు, కార్యకర్తలు సహించరు.
-
Jul 19, 2025 09:13 IST
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం
కారును ఢీకొన్న గుర్తుతెలియని వాహనం
ఆరుగురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
మధురలో యమున ఎక్స్‌ప్రెస్‌వేపై ఘటన
ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్తుండగా ఘటన