-
-
Home » Mukhyaamshalu » Breaking News across the world on 7th september 2025 VREDDY
-
BREAKING: ఆసియా హాకీ కప్ విజేత భారత్
ABN , First Publish Date - Sep 07 , 2025 | 06:20 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Sep 07, 2025 21:27 IST
ఆసియా హాకీ కప్ విజేత భారత్
ఫైనల్‌లో దక్షిణ కొరియాపై 4-1 తేడాతో భారత్ గెలుపు
8 ఏళ్ల తర్వాత భారత్‌కు ఆసియా హాకీ కప్
2026 హాకీ వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన భారత్
రెండు గోల్స్‌తో అదరగొట్టిన దిల్‌ప్రీత్ సింగ్
తొలి నిమిషంలోనే భారత్‌కు గోల్ అందించిన జీత్ సింగ్
-
Sep 07, 2025 20:05 IST
ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
ఢిల్లీ: దేశ హితం కోసం ఎంపీలు ఓటు వేయాలి: ఉపరాష్ట్రపతి అభ్యర్థి, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
ఎంపీలు ఏ నిర్ణయం తీసుకున్నా స్వీకరించేందుకు సిద్ధం: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
ఈ ఎన్నికను కేవలం ఉపరాష్ట్రపతి ఎన్నికగా చూడొద్దు: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
ఇది దేశం కోసం జరిగే ఎన్నికగా భావించాలి: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
-
Sep 07, 2025 20:05 IST
ఢిల్లీ: గత పార్లమెంట్ సమావేశాలు బ్రిటీష్ పాలనను తలపించాయి: ఎంపీ మల్లు రవి
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు సరైన గౌరవం దక్కలేదు: ఎంపీ మల్లు రవి
దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం ఎంపీల బాధ్యత: ఎంపీ మల్లు రవి
ఎంపీలు ఆత్మప్రభోధానుసారం ఓటేయాలి: ఎంపీ మల్లు రవి
-
Sep 07, 2025 17:29 IST
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై విరుచుకుపడ్డ రష్యా
800కు పైగా డ్రోన్లు, మిస్సైల్స్‌తో రష్యా దాడి
ఇద్దరు మృతి, పలు భవనాలు ధ్వంసం
-
Sep 07, 2025 15:19 IST
విశాఖ: HPCLలో భారీ అగ్నిప్రమాదం
పెట్రోలియం ట్యాంక్‌పై పడిన పిడుగు
భారీగా ఎగిసిపడుతున్న మంటలు
మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
POL, పెట్రోకెమికల్స్ కోసం భారీ మొత్తంలో నిల్వ ఉంచిన కంపెనీ
-
Sep 07, 2025 13:51 IST
ఈసారి 40అడుగుల కంటే ఎత్తు ఉన్న విగ్రహాలు పెరిగాయి: సీపీ
విగ్రహాల ఎత్తు పెరగడంతో శోభాయాత్ర ఆలస్యమైంది: సీపీ ఆనంద్
శోభాయాత్రలో జరిగిన గొడవల్లో 5 కేసులు నమోదు: సీపీ సీవీ ఆనంద్
మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 1,070 మందిని పట్టుకున్నాం
గతేడాదితో పోలిస్తే ఈసారి క్రైమ్ రేట్ తగ్గింది: సీపీ సీవీ ఆనంద్
-
Sep 07, 2025 12:57 IST
విజయవాడ అంటే వైబ్రెంట్ నగరం: ఎంపీ కేశినేని చిన్ని
ఇక్కడ నుంచి వెళ్లిన వ్యక్తులు ఉపాధి అవకాశాలు కల్పించారు: ఎంపీ కేశినేని
దసరా ఉత్సవాలకు అదనపు శోభ తెచ్చేందుకు విజయవాడ ఉత్సవ్
దేశమంతా ఈ ఉత్సవాలను చూపించలనే విజయవాడ ఉత్సవ్: ఎంపీ కేశినేని
ఇది ప్రజల సహకారంతో.. ప్రజల కోసం జరిగే కార్యక్రమం: ఎంపీ కేశినేని
-
Sep 07, 2025 12:41 IST
గద్వాల MLA కృష్ణమోహన్‌రెడ్డి వ్యాఖ్యలు
నేనెప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు: MLA కృష్ణమోహన్‌రెడ్డి
నేను BRS పార్టీలోనే ఉన్నా: MLA కృష్ణమోహన్‌రెడ్డి
స్సీకర్ నోటీస్‌కు సమాధానం ఇచ్చా: MLA కృష్ణమోహన్‌రెడ్డి
సీఎంను కలిసిన వివరాలు పొందుపరిచా: MLA కృష్ణమోహన్‌రెడ్డి
నేను ఏ పార్టీ కండువా కప్పుకోలేదు: MLA కృష్ణమోహన్‌రెడ్డి
కేసీఆర్‌ను గౌరవించేవారిలో నేను మొదటి వ్యక్తిని: MLA కృష్ణమోహన్‌రెడ్డి
అభివృద్ధి లేకుండా ప్రజలను ఓట్లు అడగలేం: MLA కృష్ణమోహన్‌రెడ్డి
పార్టీల కన్నా గద్వాల అభివృద్ధే ముఖ్యం: MLA కృష్ణమోహన్‌రెడ్డి
-
Sep 07, 2025 12:40 IST
అమరావతి: 128 గురుకులాల్లో పే ఫోన్లు ఏర్పాటు
రేపు పెనుకొండ MPJలో పే ఫోన్లు ప్రారంభించనున్న మంత్రి సవిత
ఒక్కో గురుకులానికి 6 పేఫోన్లు కేటాయింపు
స్మార్ట్ కార్డుతో తల్లిదండ్రులకు విద్యార్థులు ఫోన్ చేసుకునే అవకాశం
స్మార్ట్ కార్డుకు రీఛార్జ్ చేసుకునే బాధ్యత విద్యార్థులదే
తల్లిదండ్రులు సూచించిన 4 నెంబర్లకు మాత్రమే ఫోన్ చేసుకునే వెసులుబాటు
-
Sep 07, 2025 12:35 IST
ఇంకా 900 విగ్రహాల నిమజ్జనాలు పూర్తికావాల్సి ఉంది: సీపీ ఆనంద్
విగ్రహాలు ఆలస్యంగా బయల్దేరడంతోనే నిమజ్జనంలో జాప్యం
GHMC పరిధిలో ఇప్పటివరకు 1.40 లక్షల విగ్రహాలు నిమజ్జనం: సీపీ ఆనంద్
GHMCలో నిన్న 4,700 విగ్రహాలు నిమజ్జనం: సీపీ ఆనంద్
నేడు ఇప్పటివరకు 3,800 విగ్రహాలు నిమజ్జనం: సీపీ ఆనంద్
భద్రతా కారణాలతో సౌత్ జోన్ విగ్రహాలను ముందుగా నిమజ్జనం చేస్తాం
నిన్న శోభాయాత్రలో జరిగిన గొడవల్లో 5 కేసులు నమోదు: సీపీ ఆనంద్
-
Sep 07, 2025 11:36 IST
ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా BCCI
BCCI ఖాతాలో రూ.20వేల కోట్ల నిధులు
గత ఐదేళ్లలో బోర్డు సంపద 3 రెట్లు పెరిగిన BCCI ఆదాయం
IPLతో పాటు మీడియా హక్కుల నుంచి BCCIకి భారీగా ఆదాయం
-
Sep 07, 2025 10:53 IST
భారత్‌పై నవారో వ్యాఖ్యలు తిప్పికొట్టిన 'ఎక్స్'
భారత్ సుంకాల వల్ల అమెరికా ఉద్యోగాలు దెబ్బతింటున్నాయన్న..
ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో
లాభం కోసమే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుంది: నవారో
ఉక్రెయిన్‌తో మాస్కో చేస్తున్న యుద్ధాన్ని పోషిస్తున్న భారత్: నవారో
నవారో వ్యాఖ్యలను కొట్టిపారేసిన 'ఎక్స్' ఫ్యాక్ట్ చెక్
నవారో వ్యాఖ్యలు కపటమైనవిగా పేర్కొన్న 'ఎక్స్'
'ఎక్స్' అధినేత ఎలాన్ మస్క్‌పై కూడా విరుచుకుపడ్డ నవారో
'ఎక్స్' ఫ్యాక్ట్ చెక్ చెత్తగా అభివర్ణించిన నవారో
-
Sep 07, 2025 10:20 IST
త్వరలో జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్న కేటీఆర్
BRS బలోపేతంపై ఫోకస్ పెట్టాలని కేటీఆర్‌కు కేసీఆర్ సూచన
స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపే లక్ష్యంగా..
పనిచేయాలని BRS నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం
ఈనెల 10న కొత్తగూడెం, 11న భద్రాచలం నియోజకవర్గాల్లో కేటీఆర్ టూర్
13న గద్వాల నియోజకవర్గంలో ర్యాలీ, కేటీఆర్ బహిరంగ సభ
దసరా లోపు వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించాలని భావిస్తోన్న కేటీఆర్
కవిత సస్పెన్షన్‌తో పార్టీ నేతల్లో గందరగోళానికి తెరపడిందని భావిస్తోన్న BRS
-
Sep 07, 2025 10:10 IST
అనంతపురం: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
తాడిపత్రి విడిచి వెళ్లాలని కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసుల ఆదేశం
ఈనెల 10న అనంతపురంలో సీఎం చంద్రబాబు పర్యటన
సీఎం చంద్రబాబు పర్యటన తర్వాత తాడిపత్రి రావాలని కేతిరెడ్డికి పోలీసుల సూచన
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి తాడిపత్రిలో ఉండేందుకు ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు
అనంతపురం ఎస్పీ జగదీస్‌కు మెయిల్ ద్వారా లేఖ పంపిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
సీఎం పర్యటన తర్వాత తాడిపత్రి వస్తానని మెయిల్ ద్వారా పేర్కొన్న కేతిరెడ్డి
24 గంటలకే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కి తాడిపత్రి విడిచి వెళ్లాల్సిన పరిస్థితి
తాడిపత్రి నుంచి స్వగ్రామం తిమ్మంపల్లికి వెళ్లిపోయిన కేతిరెడ్డి
-
Sep 07, 2025 10:09 IST
త్వరలో దక్షిణ కొరియా పర్యటనకు ట్రంప్
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ అయ్యే అవకాశం
అక్టోబర్‌లో APEC సమావేశానికి ఆతిథ్యమివ్వనున్న దక్షిణ కొరియా
దక్షిణ కొరియాలో భేటీ కానున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార వాణిజ్య మంత్రులు
APEC సమావేశానికి హాజరుకానున్న ట్రంప్
-
Sep 07, 2025 09:41 IST
లిక్కర్ స్కామ్ కేసులో ACB కోర్టు బెయిల్‌ను సవాల్ చేస్తూ..
హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసిన సిట్
లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి,..
బాలాజీ గోవిందప్పకు బెయిల్ ఇచ్చిన విజయవాడ ACB కోర్టు
లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని హైకోర్టుకు తెలిపిన సిట్
-
Sep 07, 2025 09:41 IST
విజయవాడ: లిక్కర్ స్కామ్ కేసులో ముగ్గురు నిందితులు విడుదల
జైలు నుంచి విడుదలైన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప
అంతకుముందు సబ్ జైలు ఎదుట వైసీపీ నేతల హైడ్రామా
-
Sep 07, 2025 09:28 IST
తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర క్యూ కట్టిన గణనాథుల విగ్రహాలు
నిర్విరామంగా కొనసాగుతోన్న నిమజ్జన కార్యక్రమం
భక్తులతో నిండిపోయిన తెలుగు తల్లి ఫ్లైఓవర్
నేడు 50 వేల విగ్రహాలు నిమజ్జనం చేసే అవకాశం
క్రేన్లు మొరాయించడంతో తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర నిలిచిన గణనాథులు
-
Sep 07, 2025 09:27 IST
హైదరాబాద్‌లో ఇప్పటివరకు 2.61 లక్షల విగ్రహాల నిమజ్జనం
ఖైరతాబాద్ జోన్‌లో అత్యధికంగా 63వేల విగ్రహాల నిమజ్జనం
కూకట్‌పల్లి జోన్‌లో 62వేల విగ్రహాల నిమజ్జనం
శేరిలింగంపల్లి జోన్‌లో 41వేల విగ్రహాల నిమజ్జనం
LB నగర్ జోన్‌లో 35,994 విగ్రహాల నిమజ్జనం
చార్మినార్ జోన్‌లో 22,304 విగ్రహాల నిమజ్జనం
సికింద్రాబాద్ జోన్‌లో 36వేల విగ్రహాల నిమజ్జనం
-
Sep 07, 2025 08:14 IST
రేపు మరోసారి ఢిల్లీకి మంత్రి నారా లోకేష్
ఉపరాష్ట్రపతి ఎన్నికతో ఢిల్లీకి మంత్రి లోకేష్
-
Sep 07, 2025 08:11 IST
ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ
ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు ఎలాంటి శాంతియుత పరిష్కారానికైనా మద్దతు: మోదీ
భారత్-ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై చర్చ
2026 ఫిబ్రవరిలో AI ఇంపాక్ట్ సదస్సుకు రావాలని మెక్రాన్‌కు మోదీ ఆహ్వానం
-
Sep 07, 2025 07:45 IST
బంగాళాఖాతంలో కొనసాగుతున్న రుతుపవన ద్రోణి
నేడు, రేపు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం
నేడు భద్రాద్రి, భూపాలపల్లి, కొమురంభీం, మంచిర్యాల,.
మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం
-
Sep 07, 2025 07:37 IST
నేడు NEET పీజీ స్కోర్ కార్డుల విడుదల
అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో స్కోర్ కార్డులు
-
Sep 07, 2025 07:06 IST
నేడు కామారెడ్డిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం
పాల్గొననున్న TPCC చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్
హాజరుకానున్న మంత్రులు పొంగులేటి, సీతక్క
ఈ నెల 15న కామారెడ్డి సభ ఏర్పాట్లపై చర్చ
-
Sep 07, 2025 07:05 IST
ఎన్టీఆర్ మార్గ్ , నెక్లెస్ రోడ్డులో కొనసాగుతోన్న గణేష్ నిమజ్జనాలు
నిమజ్జనానికి క్యూ కట్టిన గణనాథులు
మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశం
ఇప్పటివరకు 90 శాతం గణేష్ విగ్రహాల నిమజ్జనం పూర్తి
పీపుల్స్ ప్లాజా మార్గంలో మొరాయిస్తున్న క్రేన్లతో ఆలస్యంగా నిమజ్జనాలు.
-
Sep 07, 2025 07:05 IST
ట్యాంక్‌బండ్ దగ్గర కొనసాగుతున్న వినాయకుడి నిమజ్జనాలు
నిన్నటినుంచి నిర్విరామంగా కొనసాగుతున్న నిమజ్జనాలు
నేటి మధ్యాహ్నంతో ముగియనున్న గణనాథుల నిమజ్జనాలు
ఇప్పటివరకు 90 శాతంపైగా విగ్రహాల నిమజ్జనం పూర్తి
-
Sep 07, 2025 07:04 IST
నేడు యూఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్
వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అల్కారాజ్ Vs సిన
-
Sep 07, 2025 07:04 IST
నేడు ఢిల్లీలో బీజేపీ ఎంపీ వర్క్‌షాప్
ప్రధాని మోదీని సత్కరించనున్న బీజేపీ ఎంపీలు
GST సంస్కరణలపై ప్రధాని మోదీని సత్కరించనున్న ఎంపీలు
-
Sep 07, 2025 07:04 IST
విశాఖ MGM మైదానంలోఫుడ్ ఫెస్టివల్
ప్రముఖ హోటల్స్ ఆధ్వర్యంలో సుమారు 40 స్టాల్స్ ఏర్పాటు
-
Sep 07, 2025 07:01 IST
గ్రహణంతో నేడు మ.3.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
శ్రీశైలం ఆలయం మధ్యాహ్నం ఒంటిగంటకు మూసివేత
-
Sep 07, 2025 06:20 IST
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నేడు మ.12 గంటలకు మూసివేత
రేపు ఆలయాన్ని తెరవనున్న ఆలయ అధికారులు
-
Sep 07, 2025 06:20 IST
నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం
రాత్రి 8:55 గంటల నుంచి చంద్రగ్రహణం
రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12:22 గంటల దాకా సంపూర్ణ గ్రహణం
చంద్ర గ్రహణంతో దేశవ్యాప్తంగా పలు ఆలయాలు మూసివేత