-
-
Home » Mukhyaamshalu » Breaking News across the world on 26th August 2025 Siva
-
BREAKING: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు SEC కసరత్తు
ABN , First Publish Date - Aug 26 , 2025 | 09:49 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Aug 26, 2025 20:40 IST
తెలంగాణలో పూర్తయిన టీచర్ల ప్రమోషన్ ప్రక్రియ
4,454 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు
880 మంది స్కూల్ అసిస్టెంట్లు, 811 మంది SGTలకు HMలుగా ప్రమోషన్
2,763 మంది SGTలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి
-
Aug 26, 2025 19:57 IST
సాహితీ ఇన్‌ఫ్రా కుంభకోణంలో దూకుడు పెంచిన ED
సాహితీ స్కామ్‌లో డైరెక్టర్ పూర్ణచంద్రరావు అరెస్ట్
ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో కస్టమర్లను మోసగించిన సాహితీ ఇన్‌ఫ్రా
700 మంది నుంచి రూ.8 వేలకోట్లు వసూలు చేసినట్లు గుర్తింపు
విల్లాలు, ప్లాట్ల పేరుతో భారీ మోసానికి తెరలేపిన సాహితీ ఇన్‌ఫ్రా
రూ.120 కోట్లు దారిమళ్లించిన సాహితీ డైరెక్టర్ పూర్ణచంద్రరావు
సాహితీ లక్ష్మీనారాయణతో కలిసి షెల్ సంస్థలకు రూ.216 కోట్లు మళ్లింపు
హవాలా రూపంలో మరో రూ.50 కోట్లు మళ్లించినట్లు గుర్తింపు
రూ.126 కోట్లతో 21 ప్రాపర్టీలను కొనుగోలు చేసిన సాహితీ ఇన్‌ఫ్రా
సాహితీ కేసులో ఇప్పటికే రూ.161 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ED
-
Aug 26, 2025 18:47 IST
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు SEC కసరత్తు
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు ఓటర్ల తుది జాబితా విడుదలకు నోటిఫికేషన్
గ్రామ పంచాయతీల ఫొటో ఓటర్ల జాబితా తయారుచేయాలని పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం
ఎల్లుండి లోపు ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధం చేసి గ్రామ పంచాయతీ, ఎంపీపీ కార్యాలయాల్లో ప్రదర్శించాలని ఆదేశం
ఈనెల 29న మండలస్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు
ఓటర్ల జాబితాపై ఈనెల 30న అభ్యంతరాలు స్వీకరణ
సెప్టెంబర్ 2న వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదల
-
Aug 26, 2025 15:40 IST
తెలంగాణకు కేంద్రం సహకరించడం లేదు: మంత్రి జూపల్లి కృష్ణారావు
తెలంగాణకు 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం.. కానీ.. 5.72 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది: జూపల్లి
యూరియా దొరకదనే అపోహతో రైతులు ఎక్కువ తీసుకెళ్తున్నారు: మంత్రి జూపల్లి
రైతులు ఆందోళన చెందవద్దు: మంత్రి జూపల్లి కృష్ణారావు
యూరియా స్టోర్ చేసినా, అధిక ధరలకు విక్రయించినా కఠినచర్యలు: జూపల్లి
-
Aug 26, 2025 15:40 IST
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
850 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్
250 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ
-
Aug 26, 2025 15:40 IST
బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నిరసన
బీజేపీ నేత చంద్రశేఖర్ తివారీకి ఫుట్‌బాల్ గిఫ్ట్
పార్టీలో కొందరు నేతల వ్యవహారశైలిపై ఆగ్రహం
తనను ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారంటూ విశ్వేశ్వర్‌రెడ్డి మండిపాటు
-
Aug 26, 2025 15:40 IST
హైదరాబాద్: టెక్ మహీంద్రా వర్సిటీలో డ్రగ్స్ కలకలం
కిలోన్నర గంజాయి, 47 గ్రాముల ఓజీ వీడ్ స్వాధీనం
50 మంది విద్యార్థులకు డ్రగ్స్ పాజిటివ్, నలుగురు అరెస్టు
మల్నాడు రెస్టారెంట్ యజమాని ఇచ్చిన సమాచారంతో టెక్ మహీంద్రా వర్సిటీలో నార్కోటిక్స్ బ్యూరో తనిఖీలు
శ్రీ మారుతీ కొరియర్ ద్వారా ఢిల్లీ నుంచి డ్రగ్స్ సరఫరా
గతంలో నైజీరియన్ నిక్ నుంచి MDMA కొనుగోలు చేసి పలు పబ్‌ల్లో పార్టీలు చేసుకున్న విద్యార్థులు
డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు కౌన్సెలింగ్
-
Aug 26, 2025 15:38 IST
గవర్నర్ల అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
గవర్నర్లకు అధికారాలు కట్టబెట్టే ఆర్టికల్ 200పై సుప్రీం సుదీర్ఘ విచారణ
ఆర్టికల్ 200 ప్రకారం బిల్లులను ఆపే అధికారం గవర్నర్‌కు ఉంటే మనీ బిల్లులను ఆపే అధికారం కూడా గవర్నర్‌కు ఉంటుంది: సుప్రీంకోర్టు
ఈ అంశం కొంత సమస్యాత్మకమే: సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం
బిల్లులకు గవర్నర్లు ఆమోదం ఇవ్వకుండా వీటో చేస్తే వారు మనీ బిల్లులను కూడా అడ్డుకోవచ్చు: సుప్రీం ధర్మాసనం
సుప్రీం ధర్మాసనం అభిప్రాయాన్ని అంగీకరించిన సీనియర్ కౌన్సిల్ హరీష్ సాల్వే
బిల్లుల ఆమోదం అంశంలో గవర్నర్లు, రాష్ట్రపతికి కాలపరిమితి విధించడంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ
బిల్లులను 3 నెలల గడువులోగా గవర్నర్లు, రాష్ట్రపతి ఆమోదించాలంటూ గతంలో జస్టిస్ పార్థీవాలా ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై దుమారం
రాష్ట్రపతి లేవనెత్తిన 12 సందేహాలపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారణ
రాజ్యాంగంలో లేని అధికారాలపై సుప్రీంకోర్టు తీర్పులు ఎలా ఇవ్వగలదని అపెక్స్ కోర్టుకు 12 ప్రశ్నలతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేఖ
-
Aug 26, 2025 13:52 IST
ACB కోర్టులో లొంగిపోయిన IPS సంజయ్
సెప్టెంబర్ 9 వరకు రిమాండ్ విధించిన విజయవాడ ACB కోర్టు
మధ్యంతర బెయిల్ కోసం IPS సంజయ్ పిటిషన్
అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరిన సంజయ్.
-
Aug 26, 2025 13:45 IST
రాజమండ్రి: ఓ హాస్టల్‌లో దారుణం
సీసీ కెమెరా తొలగింపు అంశంలో విద్యార్థి ప్రసాద్‌పై సహ విద్యార్థుల పైశాచికత్వం.
ఐరన్ బాక్స్‌తో పొట్ట, చేతులపై వాతలు పెట్టిన సహ విద్యార్థులు.
ఈనెల 18న హాస్టల్‌లో ఘటన .
-
Aug 26, 2025 12:50 IST
తిరుపతి: TDR బాండ్ల అంశంలో ఓ అధికారిణిపై భూమన వ్యాఖ్యలు
అవినీతిలో అనకొండలాంటి అధికారిణి: భూమన కరుణాకర్‌రెడ్డి
మంత్రులను పూచికపుల్లల్లా చూసే అధికారిణి: భూమన కరుణాకర్‌రెడ్డి
తిరుపతిలో తాము రోడ్లు వేస్తుంటే..
రూ.వందల కోట్లు కొట్టేయాలని ఆ అధికారిణి చూసింది: భూమన
కాదు అన్నందుకు మాపై ఆరోపణలు చేయించింది: భూమన
-
Aug 26, 2025 12:43 IST
సెప్టెంబర్‌లో బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపిక.
సెప్టెంబర్ 5 నుంచి 7 వరకూ జోధ్‌పూర్‌లో ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వం సమావేశం.
సమావేశంలో పాల్గొననున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే తదితరులు.
ఈ సమావేశంలోనే బిజెపి కొత్త సారధి పేరును ఖరారు చేసే అవకాశం.
ఆర్ఎస్ఎస్ శతాబ్ధి ఉత్సవాలపైనా భేటీలో చర్చ.
ఉప రాష్ట్రపతి ఎన్నికల తరువాత జరగనున్న నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపిక.
ఈలోగా యుపి, మధ్యప్రదేశ్, కర్నాటక లలో రాష్ట్ర అధ్యక్షుల నియామకం.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే జరగనున్న బీజేపీ నూతన అధ్యక్షుడి నియామకం.
-
Aug 26, 2025 12:39 IST
గర్భిణి స్వాతి హత్యపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్
మీడియా వార్తలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్.
నిందితుడు మహేందర్‌రెడ్డిపై BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని..
తెలంగాణ పోలీసులకు చైర్‌పర్సన్ విజయా రహత్కర్ ఆదేశం.
3 రోజుల్లో నివేదిక సమర్పించాలని తెలంగాణ డీజీపీకి చైర్‌పర్సన్ లేఖ.
-
Aug 26, 2025 11:54 IST
BIG BREAKING: కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల పథకం పనులకు NGT బ్రేక్
తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశం
పర్యావరణ అనుమతులు లేకుండా ఎలా పనులు కొనసాగిస్తారు: NGT
పర్యావరణ అనుమతులు లేకుండా పనులు కొనసాగించడంపై..
NGTని ఆశ్రయించిన రైతు నర్సింహులు, మరో ముగ్గురు
-
Aug 26, 2025 11:10 IST
ఈనెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఐదు రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశం
కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ
-
Aug 26, 2025 10:06 IST
సహస్ర హత్య కేసులో వెలుగులోకి సంచలనం..
కూకట్‌పల్లిలో దారుణ హత్యకు గురైన సహస్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
క్రిమినల్ అవ్వాలని మైనర్ బాలుడు గోల్ పెట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
క్రైమ్ సిరీస్ చూసి చూసి క్రిమినల్ అవ్వాలనుకున్న బాలుడు.
బాలుడి ఫోన్ మొత్తం యూట్యూబ్‌లో CID సిరీస్ ఎపిసోడ్ లే ఉన్నాయి.
రాసుకున్న లెటర్‌కు, సహస్ర హత్యకు సంబంధం లేదు.
రెండు నెలల క్రితం ఏదో ఒక ఇంట్లో చోరీ చేసి ప్లాన్ అమలు చేయాలని లెటర్ రాసుకున్న బాలుడు.
సహస్ర మర్డర్ కేసులో నిందితుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ జోడించనున్న పోలీసులు.
-
Aug 26, 2025 10:00 IST
రాహుల్‌ను సస్పెండ్ చేస్తూ కేరళ కాంగ్రెస్ ప్రకటన.
కాంగ్రెస్ నుంచి పాలక్కడ్ ఎమ్మెల్యే సస్పెన్షన్.
రాహుల్‌ను సస్పెండ్ చేస్తూ కేరళ కాంగ్రెస్ ప్రకటన.
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే రాహుల్.
-
Aug 26, 2025 09:52 IST
హైదరాబాద్: ఫిలింనగర్‌లో తాకట్టు వ్యాపారి మోసం.
తాకట్టు ఆభరణాలు, చిట్టిల నగదుతో పరారైన మాణిక్ చౌదరి.
అధిక వడ్డీల పేరిట పలువురి దగ్గర రూ. కోట్లు వసూలు.
రూ.10 కోట్లకు పైగా మోసం చేసినట్టు గుర్తింపు.
ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు.
కేసు నమోదు చేసిన పోలీసులు.
-
Aug 26, 2025 09:49 IST
మెహిదీపట్నం బస్ స్టాప్ వద్ద బస్సులో మంటలు.
ఇంజన్ భాగంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.
ఇంజన్ లో మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్.
బస్సును పక్కకు నిలిపివేయటంతో బస్సు దిగిపోయిన ప్రయాణికులు.
దగ్దం అవుతున్న బస్సు ముందు భాగం.
ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.