-
-
Home » Mukhyaamshalu » Breaking News across the globe on 3rd september 2025 Siva
-
BREAKING: హరీష్, సంతోష్‌పై కవిత సంచలన ఆరోపణలు..
ABN , First Publish Date - Sep 03 , 2025 | 10:37 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Sep 03, 2025 12:23 IST
నా సస్పెన్షన్ గురించి మీడియా ద్వారా తెలుసుకున్నాను..
గులాబీ పార్టీ కండువా కప్పుకుని పార్టీ తరఫున ప్రజా సమస్యలపై పోరాడడం పార్టీ వ్యతిరేకమా?
నేను మొన్న చెప్పిన ఇద్దరు నేతలు నాపై చెలువలు పలువలుగా ప్రచారం చేశారు.
హరీష్ రావు, సంతోష్ రావు ఇంట్లో ఉన్న బంగారంతో సామాజిక తెలంగాణ అయితదా?
రామ్ అన్నను బుజ్జగించి గడ్డం పట్టుకుని అడుగుతున్నా..
పనిగట్టుకుని నాపై తప్పుడు ప్రచారం చేశారు.
నాపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించరా?
నాపై కుట్రలు జరుగుతుంటే చెల్లిగా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ని నాపై ప్రచారాన్ని ఆపాలని వేడుకున్నా.
103 రోజులైనా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడగరా?
రేపు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచి ఉంది.
నా తండ్రి చిటికెన వేలు పట్టుకుని రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నాను.
కేసీఆర్ నుంచే సామాజిక తెలంగాణ ఎజెండా నేర్చుకున్నా.
-
Sep 03, 2025 11:53 IST
కాసేపట్లో కవిత మీడియా సమావేశం..
సస్పెన్షన్, భవిష్యత్ కార్యాచరణపై స్పందించే అవకాశం
MLC సభ్యత్వం రద్దుపై నిర్ణయం ప్రకటించే అవకాశం
కొత్త పార్టీపై కవిత ప్రకటన చేసే అవకాశం
-
Sep 03, 2025 11:53 IST
అన్నమయ్య: మదనపల్లి YSR కాలనీలో దారుణం..
రమేష్ అనే వ్యక్తికి నిప్పుపెట్టిన ఇద్దరు వ్యక్తులు.
ఇంటి యజమానితో ఖాదర్ బాషా, కాలేషా మధ్య స్థల వివాదం.
ఇంటి యజమానికి రమేష్ మద్దతు ఇచ్చాడని పెట్రోల్ పోసి నిప్పంటించిన ఖాదర్ బాషా, కాలేషా.
రమేశ్ పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
-
Sep 03, 2025 11:44 IST
టీజీ హైకోర్టుకు మాజీ ఇరిగేషన్ సెక్రటరీ శైలేంద్ర పిటిషన్ విచారణ
కాళేశ్వరంపై ఘోష్ నివేదికను రద్దు చేయాలని క్వాష్ పిటిషన్
కమిషన్ నివేదికపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ
విచారణ ఈనెల 10కి వాయిదా వేసిన హైకోర్టు
-
Sep 03, 2025 10:58 IST
లేడీ డాన్ అరుణపై మరో కేసు..
నెల్లూరు: లేడీ డాన్ అరుణ వ్యవహారంలో వెలుగులోకి మరో కేసు.
నవాబుపేట పోలీసు స్టేషన్లో అరుణ పై కేసు నమోదు.
అన్నదమ్ముల స్థల వివాదంలో అన్నకు మద్దతుగా అరుణ.
తమ్ముడిని తుపాకీతో బెదిరించి ఆస్తి తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేసినట్టు పిర్యాదు.
అరుణతోపాటు ఆమె అనుచరులు ముష్తాక్, సుల్తాన్, సుమన్, మరి కొందరిపై కేసులు నమోదు.
-
Sep 03, 2025 10:37 IST
చైనాలో భారీ ఆయుధ ప్రదర్శన..
రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయానికి 80 ఏళ్లు పూర్తి సందర్భంగా వేడుక.
తొలిసారి అధునాతన యుద్ధ విమనాలు, క్షిపణలు, ఎలక్ట్రానిక్ యుద్ధ సామగ్రిని ప్రదర్శించిన చైనా.
తన బలాన్ని చూపించేందుకు హైప్రొఫైల్ ఆయుధాల ప్రదర్శన.
జిన్‌పింగ్, పుతిన్, కిమ్ సహా 26 దేశాల నేతల హాజరు.