-
-
Home » Mukhyaamshalu » Breaking News across the globe on 31th August 2025 VR
-
BREAKING: కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై నేడు తెలంగాణ అసెంబ్లీలో చర్చ
ABN , First Publish Date - Aug 31 , 2025 | 06:17 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Aug 31, 2025 16:52 IST
అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తత
జేసీ ప్రభాకర్‌రెడ్డి, కాకర్ల రంగనాథ వర్గీయుల మధ్య ఘర్షణ
వినాయక నిమజ్జనం ఊరేగింపులో రెండు వర్గాల మధ్య గొడవ
రాళ్లురువ్వుకున్న ఇరువర్గాలు, భారీగా మోహరించిన పోలీసులు
-
Aug 31, 2025 16:03 IST
ఉపరితల ఆవర్తనం..
పశ్చిమ బెంగాల్ - ఒడిశా తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం
వాయువ్య బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి సగటున 1.5, 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం
ఎల్లుండి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
ఏపీలో మూడు రోజులపాటు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కరిసే అవకాశం
-
Aug 31, 2025 13:18 IST
రేపు గవర్నర్ దగ్గరకు వెళ్తాం: మంత్రి పొన్నం
అన్ని పార్టీల ప్రతినిధులతో కలిసి గవర్నర్‌ను కలుస్తాం: పొన్నం
రాష్ట్రపతి, ప్రధాని అపాయింట్‌మెంట్ కోరుతున్నాం.. ఇవ్వడం లేదు
గవర్నర్‌ను కలిసి పరిస్థితిని వివరిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
స్థానిక ఎన్నికలపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తాం
న్యాయపరంగా అన్ని విషయాలు తెలుసుకునే ఈ నిర్ణయానికి వచ్చాం
బలహీనవర్గాల మేధావులు మా ప్రయత్నాన్ని గుర్తించాలి: పొన్నం
సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు వెళ్తాం: పొన్నం
-
Aug 31, 2025 13:05 IST
బీసీ రిజర్వేషన్ల కోసం గవర్నర్‌ను కలవాలని ప్రభుత్వ నిర్ణయం
మంత్రి పొన్నం నేతృత్వంలో గవర్నర్‌ను కలువనున్న అఖిలపక్షం
గవర్నర్ అపాయింట్ మెంట్ కోరనున్న ప్రభుత్వం
50 శాతం బీసీ రిజర్వేషన్ల సీలింగ్ ఎత్తేసే..
పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం కోరనున్న సభ్యులు
-
Aug 31, 2025 13:04 IST
హైదరాబాద్: బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత
బీజేపీ కార్యాలయం దగ్గర మహిళా మోర్చా ఆందోళన
మహిళా మోర్చా నేతలను అడ్డుకున్న పోలీసులు
బిహార్‌లో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై నిరసన
అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Aug 31, 2025 13:04 IST
ప.గో: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు
భీమవరం కలెక్టరేట్ నిర్మాణంపై వైసీపీ రాద్ధాంతం చేయడం సరికాదు
కలెక్టరేట్ నిర్మాణ స్థలం ప్రజలకు ఆమోదంగా ఉంటుంది
అన్ని ఆఫీసులు ఒకే దగ్గర ఉండేలా ప్లాన్ చేశాం
వైసీపీ ఆందోళన చేస్తామనడం సరికాదు: రఘురామకృష్ణరాజు
భీమవరంలో స్థలం లేదని జిల్లా ఆఫీసు ఉండిలో కట్టారా: రఘురామ
-
Aug 31, 2025 11:50 IST
ఢిల్లీలో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఢిల్లీ-ఇండోర్ ఎయిరిండియా విమానంలో మంటలు
విమానం ఇంజిన్‌లో మంటలు గుర్తించిన సిబ్బంది
-
Aug 31, 2025 10:55 IST
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ముగిసిన ప్రధాని మోదీ భేటీ
భారత్-చైనా మధ్య ప్రత్యక్ష విమాన రాకపోకలకు అంగీకారం
భారత్-చైనా సరిహద్దు నిర్వహణపై ఇరుదేశాల ప్రతినిధులు అంగీకారం
సరిహద్దులో శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాలు అంగీకారం
-
Aug 31, 2025 08:28 IST
నేడు కేరళకు సీఎం రేవంత్ రెడ్డి
ఉ.10గంటలకు బేగంపేట నుంచి కేరళకు రేవంత్‌రెడ్డి
అసెంబ్లీలో బిల్లులు టేబుల్ చేసిన అనంతరం కేరళకు పయనం
అలిప్పిలో మెరిట్ విద్యార్థులకు అవార్డుల కార్యక్రమం
ముఖ్య అతిథిగా హాజరవుతున్న సీఎం రేవంత్ రెడ్డి
సా.4గంటలకు హైదరాబాదుకు చేరుకుని నేరుగా అసెంబ్లీకి రేవంత్‌రెడ్డి
కాళేశ్వరం కమిషన్ నివేదికపై లఘు చర్చలో ప్రసంగించనున్న సీఎం రేవంత్
-
Aug 31, 2025 07:52 IST
తిరుపతి: ఈస్ట్ పీఎస్ పరిధిలో యువకుల మధ్య ఘర్షణ, ఒకరు మృతి
కొర్లగుంటకు చెందిన చందు(25) మృతి, మరో ఇద్దరికి గాయాలు
ఇద్దరికి గాయాలు, రుయాకు తరలింపు
-
Aug 31, 2025 07:42 IST
నేడు వరద ప్రాంతాల్లో టి.కాంగ్రెస్ బృందం పర్యటన
వరద ప్రభావిత ప్రాంతాలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు
అద్దంకి, విజయశాంతి, బల్మూరి వెంకట్..
శంకర్‌నాయక్‌తో కమిటీ వేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
నేడు కామారెడ్డిలో కాంగ్రెస్ MLCల బృందం పర్యటన
వరద నష్టాన్ని అంచనా వేయనున్న ఎమ్మెల్సీల బృందం
-
Aug 31, 2025 07:41 IST
ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక
175 గేట్లు ఎత్తి 10,01,410 క్యూసెక్కుల నీరు విడుదల
లంక గ్రామాలను అప్రమత్తం చేసిన అధికారులు
-
Aug 31, 2025 07:32 IST
ట్రంప్ ఆరోపణలు ఏ మాత్రం వాస్తవం కాదు: గార్గ్
అమెరికాతో చర్చల నుంచి భారత్ తప్పుకుంది,
ఏకపక్షంగా 50శాతం సుంకాలు విధించారు,
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంతో భారత్ భారీగా లాభం పొందుతుందనడం అర్థరహితం
-
Aug 31, 2025 06:30 IST
ఏపీలో అప్పీల్ చేసుకున్న అందరికీ నేడు పెన్షన్లు
దివ్యాంగులు, హెల్త్ పెన్షన్ల పునఃపరిశీలనకు అప్పీల్ చేసుకున్న అందరికీ పెన్షన్లు
-
Aug 31, 2025 06:30 IST
సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
10 రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం
సెప్టెంబర్ 4న జరిగే కేబినెట్ భేటీలో..
అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం
-
Aug 31, 2025 06:17 IST
చైనా పర్యటలో ప్రధాని మోదీ
నేడు షాంఘై సహకార శిఖరాగ్ర సదస్సుకు హాజరుకానున్న మోదీ
మధ్యాహ్నం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ
అమెరికా టారిఫ్‌ల దృష్ట్యా మోదీ, జిన్ పింగ్ భేటీకి ప్రాధాన్యం
-
Aug 31, 2025 06:17 IST
కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై నేడు తెలంగాణ అసెంబ్లీలో చర్చ
ఉ.9 గంటలకు సభలో రిపోర్ట్ ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్‌రెడ్డి